andhra pradesh government

20:53 - January 18, 2017

కృష్ణా : నందివాడ మండలం ఇలపర్రులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. అక్రమ చేపల చెరువులను ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. గ్రామంలో 165 ఎకరా పేదల భూములను ఆక్రమించి చెరువుల తవ్వుతున్నారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6లోగా ఆగ్రమించిన భూములను పేదలకు అప్పగించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. పేదలకోసం చేస్తున్న పోరాటంలో జనసేన, కాంగ్రెస్‌, వైసీపీపార్టీలు కలిసి రావాలని మధు పిలుపునిచ్చారు. 

 

20:48 - January 18, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నోట్ల రద్దును నిరసిస్తూ విజయవాడలోని ఎస్‌బీఐ జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. నోట్ల రద్దుతో మోదీ సర్కార్ భారీ కుంభకుణానికి పాల్పడిందని.. దీనిపై సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

 

18:58 - January 18, 2017

విశాఖ : జిల్లాలోని మల్కాపురంలో కిడ్నాప్‌ కలకలం చెలరేగింది. 21 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కోరామండల్‌ గేటు దగ్గర యువతిని కిడ్నాప్‌ చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:36 - January 13, 2017

 కోడి పందాలు, తమిళనాడులో జరిగే జల్లికట్టు ఆట విషయంలో రాజకీయ నాయకులు తాత్కాలిక ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమలో సామాజిక విశ్లేషకులు వివిఎస్ రవి కుమార్, తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీడీపీ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. కోడి పందాలు సంప్రదాయం కాదని.. వినోదానం కోసం ఆడారాని తెలపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:18 - January 12, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పాలకులు.. ప్రాజెక్టుల పేరిట భూములను బలవంతంగా లాగేసుకుంటున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి నిమ్జ్‌వరకు,  భోగాపురం నుంచి బందరు పోర్టు వరకు.. రైతుల పొట్టకొడుతూ వారి ఇళ్లూ, ఊళ్లూ ఖాళీ చేయిస్తున్నాయి.  రోడ్డున పడ్డ రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రత్యేక ఆర్థికమండళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా పేరేదైనా.. అన్నదాతలే నిర్వాసితులవుతున్నారు. 
కేసీఆర్‌ సర్కారు మొండి వైఖరి..
ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పంథాలోనే ముందుకు సాగుతోంది. మల్లన్నసాగర్‌ కానీ, నిమ్జ్‌ కానీ ప్రాజెక్టు ఏదైనా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది. సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్న తీరుపై సాగునీటి నిపుణులు, ప్రతిపక్షాలు ఆక్షేపణ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏదో ఓ రకంగా రైతుల భూములను లాక్కోవాలని చూస్తోంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం 14 గ్రామాలకు చెందిన 16వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, జీవో ద్వారా భూములు లాక్కోవాలని చూసింది కేసీఆర్‌ సర్కారు. నిర్వాసితులు ఏకమై  హైకోర్టు గడప తొక్కారు. కేసు విచారించిన న్యాయస్థానం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు తన ఆలోచనలకు చట్టరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్‌ సర్కారు. 
2013 చట్టాన్ని అమలు చేయాలి : భూ నిర్వాసితులు 
భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించుకుని... 2013 చట్టాన్ని అమలు చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. వేములఘాట్‌ వంటి గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత  220 రోజులుగా ఇంకా  రైతుల దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ పేరిట వేల ఎకరాల భూసేకరణ యధేచ్చగా సాగుతోంది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు.  వారిని పోలీస్‌లతో బెదిరిస్తూ భూములను లాక్కునేందుకే ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. ఇక్కడ మార్కెట్‌ రేటుకు.. ప్రభుత్వం ఇచ్చిన ధరకు మధ్య సుమారు పదహారు వందల కోట్ల రూపాయల మేర అంతరం ఉంది. అంటే ఆమేరకు రైతులు, స్థానికులు నష్టపోయారని భూనిర్వాసితుల సంఘాలు చెబుతున్నాయి. 
ఏపీలోనూ బలవంతపు భూసేకరణ
అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం పేరుతో పెద్దపెద్ద సంపన్నులకు తమ భూములు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను  సైతం స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బందరు పోర్టుకు భూసేకరణ అంశమూ వివాదాస్పందంగానే ఉంది. ఇలా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణకు దిగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 

 

14:25 - January 11, 2017

కడప : కృష్ణ జలధార పులివెందులకు ప్రాణాధారం అవుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు క‌డ‌ప‌ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీరు విడుద‌ల చేసిన అనంత‌రం మాట్లాడారు. 2018కి గ్రావిటీతో నీరు ఇవ్వాలని సంకల్పించానని ఈ ఏడాది కృష్ణా కి నీరు రాలేదని... గోదావరి నుంచి 500 టీఎంసీల నీటిని తెచ్చుకోగలగితే రాయలసీమ రతనాల సీమే అవుతుందన్నారు. రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా మార్చ‌డ‌మే త‌న‌ ధ్యేయమ‌ని నాయుడు అన్నారు. రాయ‌ల‌సీమ‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వేగంగా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. పోల‌వ‌రం ముంపున‌కు గుర‌య్యే ఏడు మండ‌లాల‌ను ఏపీలో క‌ల‌పాల‌ని అడిగాన‌ని, లేదంటే తాను ప్ర‌మాణ స్వీకారం చేయ‌నని, త‌న‌కి ఈ ప‌ద‌వి అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వంతో అన్నాన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చివ‌రికి ఆ ఏడుమండ‌లాలను ఏపీలో క‌లిపార‌ని, లేదంటే ఇప్పుడు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ముందుకు సాగక‌పోయేవ‌ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కరవు అనే సమస్యే ఉండబోదని చెప్పారు. కరువు రహిత రాష్ట్రంగా చేయాలని సకల్పించినట్లు స్పష్టం చేశారు. నీరందని సమయంలో రైతన్నలు నిరాశపడకుండా ప్రత్యామ్నాయ పంటలకు వారిని ప్రోత్సహించారు. ఇప్పుడు పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా 41 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌, జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, ముఖ్య అధికారులు తదితరులు హాజరయ్యారు. కాగా పులివెందుల ప్రజల చిరకాల స్వప్నం సాకారం కావడంతో మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి చేపట్టిన జలదీక్షను విరమించారు.

10:23 - December 31, 2016

గుంటూరు : ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఏడాది పాలనలో పురోగతిపై సమీక్ష చేయనున్నారు. భూ కేటాయింపులు, జన చైతన్య యాత్రలపై చర్చించనున్నారు. గండికోట ముంపు బాధితులకు అందించే నష్టపరిహారంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

06:41 - December 29, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యమం తీవ్రమవుతోంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలలో పనిచేస్తున్న అధ్యాపకులను క్రమబద్దీకరించాలంటూ 27 రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా అండగా కదిలారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ కాంట్రాక్ట్ లెక్చరర్లకు మద్దతుగా నిరాహార దీక్ష దిగారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరాహార దీక్షలు చేపట్టడానికి దారితీసిన పరిస్థితులపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేత గాంధీగారు విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఆయన ఏఏ అంశాలను ప్రస్థావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

 

14:17 - December 26, 2016

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వడం శుభపరిణామమని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా.. 2018 కల్లా ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం చేకూర్చేలా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.

13:06 - December 26, 2016

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తిచేసి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు కృషిచేస్తామని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు మొదటి దశ కింద నాబార్డు 1980 కోట్ల రూపాయల రుణాన్ని ఇవాళ అందజేస్తోందని తెలిపారు. ప్రభుత్వంపై నిందలు వేసేందుకే ప్రతిపక్ష నేత జగన్ ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్రాంతికి ముందే పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని ఉమ వెల్లడించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - andhra pradesh government