anil ambani

14:01 - October 11, 2018

ఢిల్లీ: రాఫెల్ డీల్ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. రాఫెల్ డీల్ పూర్తి వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందజేయాలని సుప్రీంకోర్టు నిన్న కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అనిల్ అంబానీకి ప్రధాని మోదీ రూ.30,000 కోట్లు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ ప్రధాని మోదీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఈ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో రహస్యంగా ఉంచాల్సిన అంశాల్లో విమానం ధర లేనేలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని, అయినా లొంగనివారిపై ఐటీ దాడులు చేయిస్తోందని రాహుల్ విమర్శించారు. 

దేశానికి కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని మోదీ అవినీతిపరుడిగా తయారయ్యారని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాడతానన్న హామీతోనే మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ వివరాలు ఇవ్వాలని నిన్న కోరగానే రాత్రికిరాత్రి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ కు వెళ్లారని, దీని వెనుక అసలు రహస్యం ఏంటని రాహుల్ ప్రశ్నించారు.

మోదీ అవినీతికి పాల్పడ్డారు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని రాహుల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే, డస్సాల్ట్ కంపెనీలో నంబర్ 2 అధికారి ఇద్దరూ.. మోదీ అవినీతి పరుడనే చెప్పారన్నారు. డస్సాల్ట్ కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి తన అవినీతిని మోదీ దాస్తున్నారని విమర్శించారు. రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోకుండా, వారికి తగిన మొత్తం చెల్లించకుండా కాంట్రాక్టును దక్కించుకోలేరని డస్సాల్ట్ కంపెనీకి కేంద్రం స్పష్టం చేసినట్లు ఇటీవల ఓ డాక్యుమెంట్ లభ్యమయిందని రాహుల్ ఆరోపించారు. ఇదొక్కటే కాదు, గతంలో కేంద్రం చేసుకున్న పలు ఒప్పందాలకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయని రాహుల్ బాంబు పేల్చారు.

10:26 - October 9, 2018

ఢిల్లీ : భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ‘రాఫెల్ యుద్ధ విమానాల’ ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ పై అక్టోబర్ 10న విచారణ జరగనుంది. వినీత్ దండ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ కే ఎం జోసెఫ్ మోండేల బెంచ్ వాదనలు విననుంది. రాఫెల్ ఒప్పందం వివరాలతో పాటుగా, యూపీఏ, ఎన్ డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ ఒప్పందపు విలువలో వున్న వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయవాది తన పిల్ లో కోరారు.
ఇదిలావుండగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎం ఎల్ శర్మ అనే అడ్వకేట్ వేసిన పిటీషన్ కూడా ఈ నెల 10న విచారణకు రానుంది. 36 విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఇరు దేశ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేనందున, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది శర్మ తన పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇదేకోవలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి వివరాలను పార్లమెంటుకు సమర్పించాలని కోరుతూ సుప్రీంలో మార్చి నెలలో మరో పిటీషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ ప్రొసీజర్ అనుమతి కోరలేదని, ఫ్రాన్స్ తో జరిగిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదో కేంద్రం నుంచి తెలుసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత తెహ్ సీన్ ఎస్ పూనావల్లా కూడా ఓ పిటీషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.
రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం. భారత ఎయిర్ ఫోర్స్ ఆయుధాల ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనేదే ఒప్పందం. రెండు ఇంజిన్ల మీడియం మల్టీ రోల్ కంబాట్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ తయారు చేసింది. 126 యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2007 ఆగస్టులో ప్రతిపాదనలు చేసింది.  
 

 

11:11 - October 4, 2018

ఢిల్లీ : దేశంలోనే ప్రముఖ కంపెనీగా పేరొందిన రిలయన్స్‌ సంస్థ పలు రంగాల్లో ప్రవేశిస్తూ కోట్లను ఆర్జిస్తోంది. ఇప్పటికే పలు రంగాలు...ఇతర కంపెనీలను టెకోవర్ చేస్తోంది. టెలికాం రంగంలో కూడా అడుగు పెట్టిన రిలయన్స్‌ తాజాగా మరోదానిపై కన్నేసినట్లు సమాచారం. త్వరలోనే కేబుల్ రంగంలో కూడా అడుగు పెట్టనుందని టాక్. ఆ సంస్థ త్వరలో అందుబాటులోకి తేనున్న గిగా ఫైబర్‌ హైస్పీడ్‌ హోమ్‌బ్రాండ్‌ సేవల కోసం బడా కేబుల్‌ ఆపరేటర్‌ సంస్థలను కొనుగోలు చేసేందుకు చర్చలు సాగిస్తోంది. 

హాత్‌వే సంస్థ ప్రధానంగా బ్రాడ్‌కాస్టర్ల నుంచి సర్వీసులను కొనుగోలు చేసి స్థానిక కేబుల్‌ ఆపరేటర్లకు అందించే వ్యాపారంలో ఉందనే సంగతి తెలిసిందే. దాదాపు 1.10 కోటి డిజిటల్‌ కేబుల్‌ టీవీ వాడకందారుల, 8 లక్షల బ్రాడ్‌బ్యాండ్‌ వాడకం దారుల ప్రస్తుతం హాత్‌వే ద్వారా సేవలను పొందుతున్నారు.

దేశంలో అతిపెద్ద కేబుల్‌ ఆపరేటర్‌ సంస్థ అయిన హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ను కొనుగోలు చేయాలని రిలయన్స్‌ నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ కంపెనీల ప్రతినిధులతో చర్చలు సాగుతున్నాయంట. మొత్తం రూ. 2500 కోట్లకు పైగా ధర పలుకుతోందని తెలుస్తోంది.

16:36 - October 3, 2018

ఢిల్లీ :  సాధారణ స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనే విషయం అందరికి తెలుసు. క్రమేపీ పార్టీలో ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి..అనంతరం ప్రధానమంత్రి అయిన ప్రధాన మోదీని నమ్మిన ప్రజలు ప్రధానికి చేశారు. కానీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన మోదీ డీమానిటేష్ వంటి పథకాలతో అప్పతిష్టను మూటకట్టుకోవటమే కాక..భారతదేశపు ఆర్థిక వ్యవస్థనే ఛిన్నా భిన్నం చేసేసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఎన్నికల ప్రధాన అస్త్రంగా ఎన్డీయే వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతు..నరేంద్ర మోదీని నమ్మిన ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వగా, ఆయన దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని..నమ్మిన ప్రజలను మోదీ మోసం చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనను నమ్మాలని కోరారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మహాత్మాగాంధీ ఎంతో కృషి చేస్తే, ఇప్పటి ప్రధాని విభజించి పాలించాలన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.
"మీరు మోదీకి మద్దతిచ్చారు. ఆయన మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, మహాత్మా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్న కాంగ్రెస్ ను నమ్మండి" అని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ ను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థను వదిలేసి, అంబానీల సంస్థను ఎంచుకోవడం వెనకున్న కారణం ఏంటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.

21:57 - January 23, 2018

దావోస్ : దావోస్‌లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు దృష్టిమాత్రం రాష్ట్రంపైనే ఉంది. రైతులు పండించిన పంటలకు ముఖ్యంగా వరికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. దావోస్‌ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు... అధికారుతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా రైతులకు పుష్కలంగా పంటలు చేతికొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గిట్టుబాటు ధరలు వస్తే రైతులకు మేలు జరుగుతుందని, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రైతులకు నష్టం కలిగితే సహించేదిలేదని హెచ్చరించారు. 

20:07 - October 5, 2017

 

ముంబై : భారత్‌లో ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యంత ధనికుల జాబితాలో ముకేష్‌ అంబానీ మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. 2.5 లక్షల కోట్ల సంపదతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. గత పదేళ్లుగా ముకేష్‌ అంబానీయే టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అంబానీ తర్వాత ఆయన సంపదలో సగం 1.25 లక్షల కోట్లతో రెండో స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ ఉన్నారు. హిందూజా బ్రదర్స్‌ 1.20 లక్షల కోట్లతో మూడో స్థానం, 1.7 లక్షల కోట్లతో లక్ష్మి మిట్టల్ నాలుగవ స్థానం, 1.4 లక్షల కోట్లతో పల్లోంజి మిస్త్రీ ఐదో స్థానంలో నిలిచారు. వందమంది మంది కుబేరులతో కూడిన ఇండియా రిచ్‌ లిస్ట్‌-2017ను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని...వంద మంది కుబేరుల సంపద 26 శాతం పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. గత ఏడాది రెండోస్థానంలో ఉన్న సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ ఈసారి 9వ స్థానంతో సరిపెట్టుకున్నారు. పతంజలి చీఫ్ బాలకృష్ణ 43 వేల కోట్లతో 19 వ స్థానానికి చేరుకున్నారు. పతంజలి గత ఏడాది 48వ స్థానంలో నిలిచింది. ముకేష్ తమ్ముడు అనిల్‌ అంబానీ 20 వేల 5 వందల కోట్లతో 45వ స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణలు సామాన్యుడి జేబులు గుల్ల చేస్తున్నాయి గానీ.. కుబేరుల సంపద మాత్రం భారీగా పెరిగినట్లు ఫోర్బ్స్ తెలిపింది. 

18:57 - July 22, 2017

హైదరాబాద్ : బీఎస్ ఎన్ ఎల్ సరికొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌, నాంపల్లిలోని బీఎస్ ఎన్ ఎల్ ఆఫీసులో తెలంగాణ సీజీఎమ్ అనంతరామ్‌ బీఎస్ ఎన్ ఎల్ ఫీచర్స్‌ను వెల్లడించారు. ఈ మేరకు ఆఫీసులో కొత్త సిక్సర్‌ ప్లాన్‌, సేలియెంట్‌ ఫీచర్స్, డేటా ఎస్ టీవో 444, పోస్ట్‌ పెయిడ్‌ తరిఫ్‌ ప్లాన్‌లను ఆవిష్కరించారు. 

 

22:11 - July 21, 2017
12:30 - July 21, 2017

ముంబై : జియో మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. మార్కెట్ లోకి జియో ఫోను ప్రవేశపెట్టనుంది. జియో ఫోన్ లో ఎన్నా ఫీచర్లు ఉంటాయని తెలిపింది. ఈ ఫోన్ వాయిస్ కమాండ్ ఆప్షన్ తో పనిచేస్తుందని తెలిపారు. ఈ ఆఫర్ జియో కస్టమర్లకు మాత్రమే అని తెలుస్తోంది. నెలకు రూ.153కే అపరిమిత డేటా ఇవ్వనున్నారు. మొదటగా రూ.1500 డిపాజిట్ చేసి ఫోన్ పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. 

21:44 - April 11, 2017

ఢిల్లీ : రిలయన్స్‌ జియో మరో ధనాధన్‌ ఆఫర్‌ను ప్రకటించింది.. 309 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 84రోజులు రోజుకు 1 జీబీ డేటాను వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. 509 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే 84 రోజులపాటు రోజుకు 2జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. ఈ రెండు ప్లాన్స్‌ జియో ప్రైమ్‌ సభ్యులకు వర్తిస్తాయి. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు మూడు నెలలపాటు అపరిమిత కాల్స్‌, డేటా ఉపయోగించుకోవచ్చు. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోని చందాదార్లు 408 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. ఒకవేళ 2జీబీ డేటా కావాలనుకుంటే 608 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. ఈ ఆఫర్‌కు ముందు 303 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే మూడు నెలల పాటు అపరిమిత కాల్స్‌, డేటా వినియోగించుకునేందుకు జియో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా లేదంటూ ఈ ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని టెలికాం నియంత్రణ సంస్థ ఆదేశించింది. దీంతో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ను జియో రద్దు చేసింది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - anil ambani