Anupama Parameshwaran Latest Movie

19:47 - July 6, 2018

హ్యట్రిక్స్ హిట్స్ తో కెరీర్ మొదలు పెట్టి, ఆ తరువాత దారితప్పి డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ అంచున నిలిచిన మెగా మేనల్లుడు తేజ్ ఎలాగైనా హిట్ అందుకోవాలని, రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేసిన సినిమా తేజ్ ఐ లవ్ యు. మాస్ మూస నుండి బయట పడటానికి లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరణ్ డైరక్షన్ లో ఈ సినిమా చేశాడు.. సీనియర్ అండ్ గుడ్ జడ్జిమెంట్ ఉన్న కె.ఎస్ రామారావు ఈ సినిమా నిర్మించడం.. ప్రొమోస్ అండ్ సాంగ్ టీజర్స్ గ్రాండీయర్ గా కనిపించడంతో తేజ్ ఐలవ్ యు పై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి.. ప్రస్తుతానికి హిట్ అత్యవసరంగా మారిన టీంకు వాళ్ళు  అందరూ కలిసి చేసిన తేజ్ ఐ లవ్ యు ప్రేక్షకుల చేత ఐ లవ్ యు అనిపించుకుందా.లేక ఐ హేట్ యు అని రిజక్ట్ చేయబడిందా అనేది ఇప్పుడు చూద్దాం.. 
కథ.. 
 కథ విషయానికి వస్తే.. లండన్ నుండి ఇండియాకు వచ్చిన నందినిని చూసిన వెంటనే ఇష్టపడతాడు తేజ్.. అయితే ముందు తేజ్ ను ఆటపట్టించిన నందిని, అతని కేరింగ్ ను, సిన్ సియారిటీని చూసి లవ్ చేస్తుంది...  ఆ విషయం తేజ్ కి చెప్పడానికి వెళ్ళిన టైంలో.. యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోతుంది.. అసలు నందిని ఎవరు, ఆమె ఇండియాకు ఎందుకు వచ్చింది, మళ్ళీ ఆమెకు గతం గుర్తుకు వచ్చిందా లేదా.. తేజ్ లవ్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగతా కథ.
నటీనటులు.. 
నటీనటుల విషయానికి వస్తే.. మొదటి నుండి మాస్ అని పరిగెత్తిన తేజుకు.. దానివల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయి అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది.. అందుకే మార్పు అనివార్యం అని గ్రహించి, ఇమేజ్ చేంజ్ ఓవర్ కోసం ఫ్యూర్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు.. అతని క్యారక్టర్ వరకు బాడీలాంగ్వేజ్ నుండి యాక్టింగ్ వరకు బాగానే డిజైన్ చేశాడు డైరక్టర్. తేజూ కూడా ఆ పాత్రను పండించడానికి సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు.. అయితే సినిమా మొత్తాన్ని టేకోవర్ చేసి నటిపించింది అనుపమా పరమేశ్వరన్.. క్యాట్ లుక్స్ కి తోడు, కాస్త బబ్లీ యాక్టింగ్ తో స్క్రీన్ పై మెరిసింది.. తేజ్ ఐ లవ్ యు కి మేజర్ ప్లస్ పాయింట్ అనుపమా పరమేశ్వరన్. లవ్ ఫీల్ ను కూడా 100% ఎక్స్ ప్రెసీవ్ గా పండించింది ఇన్నాళ్ళు ఉన్న ట్రెడిషన్ లుక్స్ కి.. కాస్త గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. ఇక హీరో ఫ్రెండ్ గ్యాంగ్ తమ ఇంట్లో లేడీస్ గ్యాంగ్ కాస్త కామెడీ పండించగలిగారు.. హీరోయిన్ తండ్రిగా అనీష్ కురువెళ్ళ, హీరో పెదనాన్నగా జయప్రకాశ్, సాదా సీదా పాత్రల్లో కనిపించారు.. హీరో బాబాయి పాత్రలో  పృథ్వీ, అతని భార్య పాత్రలో సురేఖావాణి.. ఎంటర్ టైన్మెంట్ తో  కాస్త నవ్వులు పూయించారు.. మిగతా వాళ్లు అంతా పాత్రల పరిది మేర అలా అలా నటించారు.. 
టెక్నీషియన్స్..  
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. తొలిప్రేమ, డార్లింగ్ అనే రెండు హిట్స్ తో వరుసగా సినిమాలు చేస్తున్న కరుణాకరణ్ ఆ రెండు సినిమాల్లో ఉన్న ఫీల్ లో పదోవంతుకూడా ఈ సినిమాలో పండించలేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. కథ లేని లవ్ ట్రాక్స్ ని కూడా అరెస్టింగ్ గా చెప్పగల కరుణాకరణ్ ఈ సినిమాలో మాత్రం మొదటి నుండి అవుట్ అవ్ ట్రాక్ లో నడిచాడు.. హీరో హీరోయిన్ కలిస్తే బావుండు అని ఆడియన్స్ ఫీలయ్యేలా ఒక్క సీన్ కూడా రాసుకోలేకపోయాడు.. అతి పలుచని కథ, కరుణాకరణ్ స్క్రీన్ ప్లేతో ఇంకా వీక్ గా తయారయ్యింది.. డార్లింగ్ స్వామి మాటలు కూడా, కథకు తగ్గట్టే సొ.. సోగా ఉన్నాయి.. ఈ సినిమాకు సంగీతం అందించిన గోపీ సుందర్ కాస్త మనసు పెట్టి ఆర్ ఆర్ ఇచ్చాడు అనిపిస్తుంది. పాటలు కూడా మెస్మరైజింగ్ గా లేకపోయిన. పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఆండ్రూ సినిమాటోగ్రాఫీ  సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.. లిమిటెడ్ బడ్జెట్ లో కూడా క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. 
ఓవర్ ఆల్ గా.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలిఅంటే కరుణాకరణ్ కసిగా, కెఎస్ రామారావు పకట్బందీగా, తేజ్ సిన్సియర్ గా చేసినా.. ఈ సినిమాలో ఉండాల్సిన ఫీల్ మిస్ అయ్యింది.. మిగిలిన అంశాలు.. హైలెట్ అయ్యాయి.. అసలే అయిదు ప్లాప్ లతో చాలా డల్ గా ఉన్న తేజు మార్కెట్ ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర సేవ్ చేయడం కాస్త కష్టమే. .. అటు యూత్ కి, ఇటు మల్టీప్లక్స్ ఆడియన్స్ కి మరో వైపు మాస్ ఆడియన్స్ కి ఎవరికీ కనెక్ట్ అయ్యే అంశాలు లేకుండా వచ్చిన తేజ్ ఐ లవ్ యు ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు నిలబడుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.. 
 
ప్లస్ పాయింట్స్
అనుపమ లుక్స్, నటన
మ్యూజిక్
సినిమాటోగ్రఫి
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్
వీక్ కథ
రొటీన్ స్ర్కీన్ ప్లే
ఫీల్ లేని లవ్ ట్రాక్
డ్రమటిక్ క్లైమాక్స్

రేటింగ్
1. 2.5 /  5

Don't Miss

Subscribe to RSS - Anupama Parameshwaran Latest Movie