anushka sharma

12:16 - June 13, 2018

కొందరు హీరోలు కేవలం రీల్ లో మాత్రమే హీరోలు..రియల్ లైఫ్ లో వారు జీరోలే కాదు..విలన్ ల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. సినిమా డైలాగుల్లో సూక్తులు చెబుతుంటారు. నిజజీవితంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు అనే దానికి ఈ హీరోనే నిదర్శనం.

ఆర్మాన్ కోహ్లీ అరెస్ట్..
తన భార్య, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసిన శాంతాక్రజ్ పోలీసులు, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు.

నీరు తలను నేలకేసి బాదిన కోహ్లీ..
ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నీరూ రంధావాకు బలమైన గాయాలు కాగా, కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నీరూ వ్యాఖ్యానించారు. కాగా, నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

21:53 - December 11, 2017

ఇటలీ : అవును టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లి బాలీవుడ్ నటి అనుష్కతో పెళ్లి జరిగినట్టు అనుష్క ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. విరాట్, అనుష్కల ఈ రోజే జరిగినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య ఈరోజు అనగా సోమవారం ఇటలీ దేశంలోని టస్కలీలో జరిగింది. ప్రపంచలో అత్యంత ఖరీదైన హాలిగే స్పాట్ లో విరాట్, అనుష్కల పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి బీసీసీఐ పెద్దలు, సచిన్, యువరాజ్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ అను ఆహ్వానించారు.

18:16 - December 10, 2017

ఢిల్లీ : ఎన్నాళ్లో వేచిన కల నెరవేరబోతుంది. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంట ఒక్కటి ఈ నెల 12న ఒకటి కాబోతున్నారు. విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిపై ఎంతో కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నా.. తాజాగా వారిద్దరు ఈ వారంలో ఒకటి కాబోతున్నారు.. కల్యాణ ఘడియలు దగ్గర పడుతుండటంతో.. కోహ్లీ, అనుష్కతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులంతా ఇటలీలోని మిలాన్‌కు పయనమయ్యారు. 

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల వివాహ సందడి ప్రారంభమైంది. ఈనెల 12న వీరి వివాహం ఇటలీలోని మిలన్‌లో జరుగనుంది. ఈ ప్రేమ జంట ఇప్పటికే ఇటలీలోని మిలాన్‌కు చేరుకున్నారు. వీరి వివాహం అక్కడి ప్రఖ్యాత వైన్‌యార్డులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

విరాట్‌, అనుష్కలు వేర్వేరుగా తమ సన్నిహితులను కూడా వెంట పెట్టుకుని మిలన్‌కి చేరుకున్నారు. ఇక సెలెబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ  అనుష్క వివాహ దుస్తులను డిజైన్‌ చేయగా,.. మేకప్‌ ఆర్టిస్టులు, వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్లను కూడా మిలాన్‌కు తీసుకెళ్లారు. అనుష్క కుటుంబ పూజారి  మహరాజ్‌ అనంత బాబా కూడా వీరితో పాటు... మిలాన్‌ వెళ్లారు. 

విరాట్‌..అనుష్క జంట కొంతమందికే ఆహ్వానించినట్లు తెలిసింది. అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్న కోహ్లీ, అనుష్కల వివాహానికి అతిథులు ఎవరనేదా నిపై స్పష్టత లేకపోయినా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌, యువరాజ్‌ సింగ్‌లకు ఆహ్వానం దక్కినట్టు సమాచారం. మరోవైపు అనుష్క తన తొలి హీరో షారుఖ్‌తో పాటు ఆమిర్‌, డైరెక్టర్లు ఆదిత్య చోప్రా, మనీశ్‌ శర్మను కూడా ఆహ్వానించింది.

అనుష్క శర్మ నివాసముండే అపార్ట్‌మెంట్‌ వాసులకు కూడా పెళ్లి ఆహ్వానం అందింది. కానీ వీరిలో కొందరికే ఇటలీ వెళ్లే అవకాశముందట. కోహ్లీతో తన కూతురు వివాహం జరుగుతుందని, ముంబైలో జరిగే రిసెప్షన్‌కు అంతా రావాలంటూ అనుష్క తండ్రి స్వయంగా ఆహ్వానించారని అపార్ట్‌మెంట్‌ వాసులు సంతోషంతో తెలిపారు. 

ఇటలీలోని టస్కనీ ప్రాంతంలోని ఓ ఎస్టేట్‌లో శనివారం నుండి పెళ్లికి ముందు జరిగే ఇతర వేడుకలు జరుగుతున్నాయి. ఎటుచూసినా పచ్చని మైదానాలతో పాటు చక్కటి ల్యాండ్‌స్కేప్‌లకు ఈ ప్రాంతం పెట్టిన పేరు. అయితే పెళ్లి మాత్రం మిలాన్‌లోని ఖరీదైన హోటల్‌లో జరిగే అవకాశముంది. మరోవైపు వీరిద్దరి వివాహం ఈనెల 12న కాదు 15న జరుగుతుందని కొందరు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నో రోజులుగా కోహ్లీ-అనుష్కలు పెళ్లి చేసుకుంటున్నారన్న ప్రచారానికి ఈ వారంలో తెరపడనుంది. ఇండియాలో కాకుండా ఇటలీలో వారిద్దరూ ఒకటి కాబోతున్నారు. 

12:31 - April 10, 2017

బాలీవుడ్ హీరోయిన్ 'అనుష్క శర్మకు' బీఎంసీ నోటీసులు జారీ చేసింది. అక్రమంగా నిర్మాణంపై ఈ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అనుష్క ముంబై లోని వర్సోవా ప్రాంతంలోని బద్రినాథ్ టవర్స్ నివాసం ఉంటోంది. ఈ టవర్ లోని 20 అంతస్తులో 'అనుష్క' కు మూడు ప్లాట్లున్నాయి. ఎవరి అనుమతి లేకుండానే ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ పెట్టించుకున్నారంటూ టవర్ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి బీఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బీఎంసీ వెంటనే జంక్షన్ బాక్స్ తొలగించి వివరణ ఇవ్వాలంటూ 'అనుష్క'కు నోటీసులు జారీ చేసింది. అన్ని అనుమతులు తీసుకున్నాకే జంక్షన్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని 'అనుష్క' మేనేజర్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

10:58 - April 10, 2017

బాలీవుడ్ హీరోయిన్ 'అనుష్క శర్మ' మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' తో 'అనుష్క' మరోసారి నటించనున్నట్లు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ' ది రింగ్' చిత్రంలో 'షారూఖ్'తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో షారూఖ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. మొదటగా 'కత్రీనా కైఫ్' ను ఎంపిక చేయగా మరో హీరోయిన్ ను 'దీపికా పదుకొనే'ను ఎంపిక చేశారు. కానీ 'దీపికా'తో నటించేందుకు 'కత్రీనా' విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీనితో 'దీపిక' స్థానంలో 'అనుష్క' బెటర్ ని చిత్ర యూనిట్ భావించిందని, అనుష్క విషయంలో కత్రీనా సానుకూలంగా ఉండడంతో ఆమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. షారూఖ్ తో మరోసారి నటించేందుకు అవకాశం రావడం పట్ల 'అనుష్క' సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం సంజయ్ దత్ జీవితం ఆధారంగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న బయోపిక్ 'దత్' చిత్రంలో 'అనుష్క శర్మ' అతిథి పాత్ర పోషిస్తోంది.

12:05 - October 22, 2016

ముంబై : వివాదాస్పదమైన ఏ దిల్‌ హై ముష్కిల్‌ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. భ‌విష్యత్‌లో పాకిస్థాన్ న‌టుల‌తో ప‌నిచేయ‌బోమ‌ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ముఖేశ్ భ‌ట్ తెలిపారు. పాక్ న‌టుల‌ను త‌మ సినిమాల్లో వాడుకోబోమ‌ని నిర్మాత‌ల మండ‌లి మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్నవీస్‌కు హామీ ఇచ్చిన‌ట్లు ముఖేశ్ భ‌ట్ స్పష్టం చేశారు. హే దిల్ హై ముష్కిల్ సినిమా విడుద‌ల‌ను అడ్డుకోనున్నట్లు మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన హెచ్చరించడంతో బాలీవుడ్ ప్రముఖులు మ‌హారాష్ట్ర సీఎంను కలిశారు. 

13:19 - July 22, 2016

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటించిన తాజా చిత్రం 'సుల్తాన్' రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సల్లూ భాయ్ కు జోడిగా 'అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క మల్లయోధురాలిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంటోంది. కానీ సల్లూ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారంట.
'సుల్తాన్' హిట్ సందర్భంగా ఆ చిత్ర హీరోలు..హీరోయిన్లను పలువురు ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఈ కోవలో అనుష్క ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు తెలియచేసింది. సల్మాన్ ఖాన్ అంటే ఎవరో తనకు తెలియదని పేర్కొన్నదంట. సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం వరకే పరిచయమని, షూటింగ్ మధ్యలో సైతం సెట్‌లో సినిమా గురించే మాట్లాడుకున్నాం తప్ప ఎక్కువుగా మాట్లాడుకునే వాళ్లం కాదంటూ చెప్పేసిందంట. ఈ విషయం తెలుసుకున్న సల్లూ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఒక చిత్రంలో పనిచేసి ఆయన గురించి తెల్వకపోవడం ఏ మాత్రం బాగా లేదని మండిపడుతున్నారని సమాచారం.

10:48 - July 12, 2016

బాలీవుడ్ నటి అనుష్క శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన 'సుల్తాన్' ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క శర్మ మల్లయోధురాలిగా నటించింది. సుల్మాన్ కు ధీటుగా కుస్తీ సన్నివేశాల్లో నటించిందనే ప్రశంసలు కురుస్తున్నాయి. సుల్తాన్ సినిమాలో అనుష్క తప్ప ఇతరులెవరూ న్యాయం చేయలేరని, అత్యద్బుతమైన ప్రతిభ దాగి ఉన్న సహజ నటి అని దర్శకుడు అబ్బాస్ జాఫర్ పేర్కొన్నారు. ప్రతిభా వంతులైన నటులతో నటించడం చాలా ఆనందంగా ఉంటుందని సల్మాన్ కితాబిచ్చాడు. సినీ ప్రముఖలతో పాటు నెటిజన్లు సైతం అనుష్కపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హర్యాణ మల్లయోధుడు సుల్తాన్‌ ఆలీఖాన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రూపొందింది. మరోవైపు 'సుల్తాన్' రికార్డులు సృష్టిస్తున్నాడు. జులై 6న విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 142.6 కోట్ల రూపాయల్ని కలెక్ట్‌ చేసింది.

11:14 - June 28, 2016

ముంబై : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, అనుష్క శర్మ జంటగా నటించిన 'సుల్తాన్‌' చిత్రం టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రం జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం హ-ర్యాణకు చెందిన మల్లయోధుడు సుల్తాన్‌ అలీ ఖాన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. సుల్తాన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, జయాపజయాల నేపథ్యంలో సినిమా సాగుతుంది.

 

08:21 - December 30, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ అనుష్కా శర్మ.. వీళ్లిద్దరినీ 2015 సంవత్సరానికి గాను హాటెస్ట్ వెజిటేరియన్లగా పెటా ఎంపిక చేసింది. అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్, ఆర్. మాధవన్, ధనుష్.. ఇలా ఎంతోమంది ఈ టైటిల్ కోసం పోటీపడినా, వాళ్లందరినీ తోసిరాజని ఆమిర్, అనుష్క గెలుచుకున్నారు. పెటాఇండియా.కామ్ వెబ్‌సైట్ చూసేవాళ్లందరినీ తమకు బాగా నచ్చిన వెజిటేరియన్లకు ఓట్లు వేయాల్సిందిగా కోరారు. తాను పూర్తి 'వెగన్'గా మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే ప్రకటించాడు. అంటే పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, తేనె, తోలు, ఫర్, పట్టు, ఊలు, కాస్మొటిక్స్, పశు ఉత్పత్తుల నుంచి తయారుచేసిన సోపులు కూడా వాడరన్నమాట. వెగన్స్ అంటే నాన్ వెజిటేరియన్లు, వెజిటేరియన్ల కంటే కూడా ఎక్కువని తాను కన్విన్స్ అయినట్లు ఆమిర్ చెప్పాడు. అలాగే.. మనం ఏం తింటున్నామన్నది చాలా ముఖ్యమని, తగినన్ని కాయగూరలు తినడం, తగినంత నీళ్లు తాగడం అవసరమని, తాను ఎప్పుడూ అలాగే చేస్తానని అనుష్కాశర్మ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆమిర్.. అనుష్క.. వీళ్లిద్దరూ వెజిటేరియన్లకు సరైన ఉదాహరణ అని పెటా ఇండియా మేనేజర్ సచిన్ బంగెరా అన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - anushka sharma