AP Bandhu

20:39 - July 26, 2018

ఈ నెల 20వ తేదీనుండి ప్రారంభమైన లారీ బంద్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించటంలేదు. దీంతో బంద్ ను తీవ్రతరం చేయాలని లారీ యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. దీంతో అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే అవకాశముంది. అసలు లారీ యజమానుల సమస్యలేమటి? బంద్ కు గల కారణాలేమిటి? లారీ యజమానులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఏమయ్యాయి? అనే అంశంపై చర్చ. ఈ చర్చలో ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ రావు తెలిపే విషయాలతో చర్చ..

19:29 - July 22, 2018

చిత్తూరు : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని డిప్యూటి సీఎం కేఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సబ్ రిజిష్ట్రార్ల కార్యాలయాల్లో పనిచేస్తున్న జూ.అసిస్టెంట్ లకు పదోన్నతి కల్పించడంలో అవకాశం కల్పించిన కేఈ కృష్ణమూర్తి సబ్ రిజిష్ట్రార్ల సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటు అసెంబ్లీ..అటు పార్లమెంట్ లలో పారిపోయిన వైసీపీని ప్రజలు నమ్మరని తెలిపారు. చట్టసభల్లో డిమాండ్ చేయకుండా బజార్లలోకి వచ్చి బంద్ కు పిలుపునివ్వడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

17:27 - July 21, 2018

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై లోక్ సభలో నిన్న చర్చ జరిగింది. అవిశ్వాసం వీగిపోయింది. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. పైచేయి మాదంటే మాదని పార్టీలు పోటీపడుతున్నాయి. కేంద్రం మళ్లీ పాత పాటే పాడిందని సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లుగా హామీల కోసం ప్రధాని మోదీని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. మంగళవారం ఏపీ బంద్ కు వైసీపీ అధినేత జగన్ పిలుపు ఇచ్చారు. అవిశ్వాసంపై చర్చలో ఏ ఒక్కరూ ప్రత్యేకహోదాపై, విభజన హామీలపై మాట్లాడలేదన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు మోసాకారి పార్టీలని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీవిష్ణు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్, జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్, టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, వైసీపీ అధికార ప్రతినిధి మధన్ మోహన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం.. 

20:17 - April 16, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా, విభజనచట్టంలోని హామీల అమలు డిమాండ్‌తో.. విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రభావం.. ఏపీ సచివాలయంపైనా కనిపించింది. ఉద్యోగులు, సందర్శకులు బంద్‌ కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఏపీ బంద్‌ ప్రభావం.. రాష్ట్ర సచివాలయంపైనా పడింది. బంద్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీంతో సచివాలయం సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు బాగా ఇబ్బందులు పడ్డారు. ఆటోలపై కార్యాలయాలకు తరలివచ్చారు. ఇదే అదనుగా ఆటోల డ్రైవర్లు.. 50 రూపాయలున్న చార్జీలను.. ఏకంగా 150 రూపాయలకు పెంచేశారు. పైగా ఆటోల్లో ఎక్కువమందిని కూరి తీసుకువచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. హోదా కోసం తాము ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఎన్నైనా ఎదుర్కొంటామని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. 
సచివాలయానికి తగ్గిన సందర్శకుల తాకిడి 
మరోవైపు బంద్‌ ప్రభావంతో.. సచివాలయానికి సందర్శకుల తాకిడి రోజుకన్నా కూడా కొంత తగ్గింది. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా.. మంత్రులు అధికారులు తరలిరావడంతో.. వారిని కలిసేందుకు వచ్చిన వారు.. కొంతమేర ఇబ్బందులు పడ్డారు. 

 

20:15 - April 16, 2018

విజయవాడ : బంద్‌ సంపూర్ణంగా జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అంటున్నారు. ప్రత్యేక, విభజన హామీలపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా బంద్‌లో పాల్గొని సంపూర్ణం చేశారంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసమే ఆరాట పడుతున్నారంటున్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలకు మోసం చేశాయని విమర్శించారు. భవిష్యత్‌లో ఉద్యమం ఉధృతం చేస్తామంటున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:58 - April 16, 2018

విజయవాడ : బీజేపీ అబద్ధాల ప్యాక్టరీగా తయారైందని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్ రావు విమర్శించారు. 24 పేజీల పుస్తకం కాదు..64 పేజీల పుస్తకం వేసిన బీజేపీ నేతల మాటలు నమ్మరని అన్నారు. ఏపీ ప్రజలు బీజేపీకి సమాధి కడతారని పేర్కొన్నారు. విపక్షాలు చేస్తున్న పోరాటాలపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. బంద్ లో ప్రజలు రాజకీయాలకతీతంగా స్పందించారని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. నిర్బంధాలకు, కేసులకు భయపడబోమని చెప్పారు. నిర్బంధం ప్రయోగిస్తే, అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని.. తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బిజిలీ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
జనపేన నేత  
'కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయొద్దు. 2014 నుంచి బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి. హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ ఇవ్వలేదు. ఐదుకోట్ల ఆంధ్రుల హక్కలను చంద్రబాబు కాపాడలేకపోయారు. ఢిల్లీలో ప్రజలు హక్కు కోల్పోయారు'.

 

18:39 - April 16, 2018

విజయవాడ : ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం దిగిరావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని...పార్లమెంట్ లో చేసిన చట్టాలను అమలు చేయాలని చెప్పారు. 2014 ఏప్రిల్ 20న ఏ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీ నేతలు అర్ధసత్యాలు, అవాకులు, చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. ఏపీ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఆ పార్టీ నేతలు చదువుకోవాలని.. మ్యానిఫెస్టోను అమలు చేయాలన్నారు. లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని, విజయవంతం చేసినందకు అభినందలు తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట..లేకుంటే మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆధ్వాన్నంగా మాటమార్చుతున్నారని చెప్పారు. మాటమార్చుకోవడం మానుకోవాలని హితవుపలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తమను ప్రశ్నిస్తున్న చంద్రబాబు ఏపీలో దీక్ష ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు. మోడీ, చంద్రబాబు పాపాలు చేశారని చెప్పారు. ఈ  పాపంలో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవపట్టించారని... మభ్య పెట్టారని మండిపడ్డారు. ఇద్దరి పాపాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మోడీకి దిమ్మతిరిగే విధంగా బ్లాక్ డే పాటిస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు బిజిలీ బంద్ పాటించాలన్నారు.

 

17:46 - April 16, 2018

విజయవాడ : బంద్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం యత్నించిందని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా బంద్ విజయవంతమైందన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 24న చీకటిరోజుగా పాటించాలన్నారు. భవిష్యత్ లో ప్రత్యేకహోదా కోసం చేసే ఆందోళనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. 'మీరు తెలుగు వారేనని గుర్తుంచుకోవాలి' అని ఏపీ బీజేపీ నేతలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. గుజరాత్ గీతాలను గుజరాత్ వెళ్లి పాడుకోండని సలహా ఇచ్చారు. బీజేపీ నేతల భాష బాగానే ఉంది... భావం ఘెరంగా ఉందని ఎద్దేవా చేశారు. చర్చా వేదికకు రండి అన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. 

16:57 - February 27, 2018

తూర్పుగోదావరి : అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా అవినీతి నిరోధకశాఖ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అప్పుడే రాజకీయ అవినీతి బయటపడుతుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన ఏసీబీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...  ప్రతి జిల్లాలోనూ ఏసీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులు ధనార్జన కోసం కాకుండా.. సేవే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 

 

15:59 - February 26, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పర్యటించారు. కామవరపుకోటలో 42 అడుగుల శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అనుగుణంగా ప్రత్యేక నిధులు ఇస్తేనే బీజేపీతో ఉంటామని తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోందని ఓ మీడియా ప్రతినిధి అడగగా చిన రాజప్ప ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆ పార్టీలో చేరడం లేదని, చిరంజీవి పార్టీ పెడితే వెళ్లలేదన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - AP Bandhu