AP Cabinet Ministers

16:52 - July 16, 2018
19:23 - May 31, 2018

అమరావతి : ఏపీలో విద్యుత్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25 శాతం ఫిట్‌మెంట్‌తో ఉద్యోగ సంఘాలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనివలన ప్రభుత్వంపై ఏటా 860 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. పదిహేనేళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు, అంతకు ఎక్కువ సర్వీను ఉన్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో 31,543 మంది ద్యోగులు, 26,493 మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని విద్యుత్‌ శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు చెప్పారు. 

16:04 - May 11, 2018

అమరావతి : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు 24వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. అమరావతిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు... రాష్ట్రాన్ని విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా నిలిపామన్నారు. భవిష్యత్‌లో విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ఆయన స్పష్టం చేశారు.

09:24 - May 11, 2018

విజయవాడ : ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉంది. కానీ అప్పుడే ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల వాతావరణంలోకి వచ్చేశాయి. అందులో భాగంగా టిడిపి రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తోంది. వివిధ జిల్లాలో సభలు..సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో శుక్రవారం టిడిపి విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల పార్టీల అధ్యక్షులు హాజరు కానున్నారు. ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. మహానాడు నిర్వాహణ, ధర్మపోరాటల సభలపైనా చర్చించనున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించి ప్రజప్రతినిధుల అభిప్రాయాలను బాబు తెలుసుకోనున్నారు. 

13:47 - April 19, 2018

గుంటూరు : మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు నిర్వహించబోయే ధర్మ దీక్షపై చర్చిస్తున్నారు.  రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలపైనా చర్చింనట్టు తెలుస్తోంది.  

 

15:11 - April 17, 2018

ఢిల్లీ : వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. విభజన చట్టం అమలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర వైఖరిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఎంపీలు వివరించారు. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను కేంద్రం ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ రాష్ట్రపతికి వైసీపీ ఎంపీలు వినతి పత్రం సమర్పించారు.

 

07:33 - April 17, 2018

అమరావతి : పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన వ్యయంలో కేంద్రం చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగిచ్చేలా కేంద్ర మంత్రులకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పోలవరం సహా 53 ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పోలవరంకు సంబంధించి 52 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. కుడి ప్రధాన కాలువ పనులు 89 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 58 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. లక్ష్యానికి మించి పోలవరం పనులు సాగుతుండడంతో సీఎం చంద్రబాబు అధికారులను అభినందించారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవీనేని ఉమామహేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు పలు శాఖల సెక్రటరీలు పాల్గొన్నారు. 

07:31 - April 17, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ పాలసీకి ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో... విశాఖలో 40 ఎకరాల్లో యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ సిటీకి, ఆక్వా పాలసీకి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పట్టణాల్లో సీఎంఏవై కింద నిర్మించే ఇళ్లకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

07:28 - April 17, 2018

అమరావతి : హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి ఉద్యమాలు.. ఆందోళన కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ దీక్షను చేసే అవకాశముంది. హస్తినలో చేయబోయే దీక్షే కేంద్రంపై చివరి అస్త్రంగా ఉండాలని చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనెల 21 నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని టీడీపీ సమన్వయ కమిటీలో చంద్రబాబు నిర్ణయించారు.

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు..
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు హాజరయ్యారు. హోదా సాధించేదిశగా కేంద్రం ఒత్తిడి ఏలా తీసుకురావాలనేదానిపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 20న చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ సామూహిక దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు పాల్గొనాలన్నారు. 13 జిల్లాల్లో జరిగే జిల్లా స్థాయి దీక్షల్లో 13 మంది మంత్రులు పాల్గొనాలని.. మిగిలిన మంత్రులు చంద్రబాబు దీక్షలో పాల్గొనాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ఈనెల 20న జరగాల్సిన దళిత తేజం ముగింపు సభను వాయిదా వేశారు. వచ్చేనెల పదో తేదీలోగా దాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పదిహేను నుంచి 20 రోజులపాటు అన్ని గ్రామాల్లో టీడీపీ సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ ఏడాదంతా నేతలంతా ప్రజల మధ్యనే ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి చెడ్డపేరు ఎవరు తీసుకొచ్చినా సహించేది లేదన్నారు.
వైసీపీ ఓ ఫేక్‌ పార్టీ : చంద్రబాబు
టీడీపీ సమన్వయ సమావేశంలో వైసీపీపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ఓ ఫేక్‌ పార్టీ అని.. ఆ పార్టీ రాజకీయమే ఓ ఫేక్‌ అని ధ్వజమెత్తారు. బీజేపీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. అహంభావం ఎంతటివారినైనా పతనంవైపు నడిపిస్తుందని పరోక్షంగా మోదీనుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా బీజేపీకి తిరుగులేదని అనుకున్నారని.. ఇప్పుడు రాజకీయ మొత్తం మారిపోయిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవలేదనే ముద్రపడిందని.. పదవి వినయం పెంచాలేతప్ప అహం పెంచితే ఎవరికైనా పతనం తప్పదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ లక్ష్యమని... ఐదుకోట్ల ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలన్నారు. త్తానికి ఏప్రిల్‌ నెలంతా వివిధ రూపాల్లో కేంద్రానికి నిరసన తెలియజేయాలని చంద్రబాబు సంకల్పించారు. మరి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్‌ను తెలుగు తమ్ముళ్లు ఎంతవరకు ఫాలో అవుతారో చూడాలి.

09:51 - March 15, 2018

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ టిడిపిలో సునామీ సృష్టిస్తోంది. పవన్ వ్యాఖ్యలను ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నేతలు ఆగ్రహంగా ఉన్నారు. నారా లోకేష్..సీఎం చంద్రబాబు నాయుడు..ఇతర అంశాలపై పవన్ గుంటూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

పవన్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. టిడిపి ఎంపీలు, మంత్రులతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన తనయుడు నారా లోకేష్ పై విమర్శలు..ఆరోపణలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అన్నీ వదులకుని ప్రజా సేవ చేసేందుకు నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని, సంపాదించేందుకు లోకేష్ కు చాలా వ్యాపారులున్నాయన్నారు. అన్యాయం చేసిన వారిని అనడానికి పవన్ కు నోరు రాలేదని కేవలం టిడిపిని తిట్టడానికే గుంటూరులో పవన్ సభ పెట్టినట్లుగా ఉందని తెలిపారు. పవన్ ను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరో గ్రహించాలని, పవన్ ఆరోపణలకు ప్రతి సమాధానమే ఇవ్వాలి కానీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లవద్దని బాబు సూచించారు. కేంద్రాన్ని ఒక్కమాట వినకుండా పోరాడుతుంటే ఇంకా మాటలు ఎందుకు అంటారని బాబు ప్రశ్నించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - AP Cabinet Ministers