AP CPM Madhu

21:03 - February 12, 2018

పశ్చిమగోదావరి : పేద వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే లక్ష్యమని సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహాసభలు స్పష్టం చేశాయి. వామపక్ష, అభ్యుదయ శక్తుల ఐక్యతతో బడుగులకు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా.. కొత్త శకానికి నాంది పలుకుతామని మహాసభలు ప్రతినబూనాయి. మూడు రోజుల పాటు సాగిన మహాసభల చివరిరోజైన నేడు.. పి.మధును రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో జ‌రుగుతున్న సిపిఎం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు సోమవారం ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన సమావేశాల్లో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశాల చివరి రోజైన సోమవారం... పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా.. పి. మ‌ధును మహాసభ రెండోసారి ఎన్నుకుంది. ఆయనతో పాటు.. 14 మంది స‌భ్యుల‌తో కార్యద‌ర్శివ‌ర్గాన్ని, 60 మంది సభ్యుల‌తో రాష్ట్ర కార్యవ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. వీరితోపాటు.. 10 మంది స‌భ్యుల‌తో ఆహ్వానితుల క‌మిటీని ఏర్పాటు చేశారు.

మూడు రోజుల పాటు సాగిన మహాసభల్లో.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత చర్చ సాగింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు, రైల్వే జోన్‌ ఏర్పాటు, ఉక్కు పరిశ్రమ నిర్మాణం వంటి హామీలు నెరవేర్చాలని మహాసభ కేంద్ర, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి నిధులు, బడ్జెట్‌ లోటు భర్తీకి నిధుల విడుదల వంటి హామీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిందని మహాసభ అభిప్రాయపడింది. బిజెపికి మిత్ర పక్షంగా ఉంటూ విభజన హామీలను సాధించడంలో టిడిపి ఘోరంగా విఫలమైందని కూడా మహాసభ అభిప్రాయపడింది.

సామాన్య రైతుల భూములను, అసైన్డ్‌ భూములను బలవంతంగా గుంజుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలకు వత్తాసు పలుకుతోందని.. మహాసభలో నేతలు ఆరోపించారు. పారిశ్రామిక రంగంలో మూసివేతలు పెరుగుతున్నాయని, కార్మిక హక్కులను కాలరాసే చట్టాలు చేస్తున్నారని, విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్లకు అండగా ప్రభుత్వాలు నిలుస్తున్నాయని నేతలు విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన నామమాత్రంగా ఉందని, విద్య, వైద్యం, మానవాభివృద్ధి సూచికలలో రాష్ట్రం బాగా వెనకబడి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి పాలనలో అగ్రకుల దురహంకార దాడులు, దళిత, ఆదివాసీ, బలహీనవర్గాలపై పెరుగుతున్నాయని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక నవరత్నాల పేరుతో ఓట్లకోసం ప్రజాకర్షక వాగ్దానాలను గుప్పించడం తప్ప మౌలిక విధానాలలో వైసిపికీ, ఇతర పాలక పార్టీలకూ తేడా లేదని సీపీఎం మహాసభలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని ఉపయోగించుకుని మతోన్మాద శక్తులు బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి, అభ్యుదయ, లౌకిక విధానాలతో ప్రజలకు ఊరట కలిగించగలిగే ప్రత్యామ్నాయం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అన్నారు. ఈదిశగా.. ఇప్పటిదాకా చేపట్టిన ఉద్యమాలకు మించిన కార్యాచరణను రూపొందిస్తున్నామని పార్టీ కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన మధు వెల్లడించారు. తెలుగు ప్రజల సమైక్యతకోసం నిలిచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉందన్న నేతలు.. అలాంటి ఘన వారసత్వాన్ని కొనసాగించి.. తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల చేతికి అధికారం వచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. 

18:42 - February 12, 2018

పశ్చిమగోదావరి : భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు కాసేపటి క్రితం ముగిశాయి. గత మూడు రోజులుగా జరిగిన ఈ మహాసభల్లో జాతీయ, రాష్ట్రీయ..ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరి రోజైన సోమవారం పార్టీ కార్యదర్శి..ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రెండోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు ఎంపికయ్యారు. 60 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాగా 14 మంది సభ్యులతో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. 10 మంది సభ్యులతో ఆహ్వానితుల కమిటీగా రాష్ట్ర కార్యవర్గం రూపొందింది. 

పశ్చిమగోదావరి : ఏపీ రాష్ట్రంలో రానున్నకాలంలో పోరాటాలు..ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన పెనుమల్లి మధు తెలిపారు. కాసేపటి క్రితం భీమవరంలో జరుగుతున్న ఏపీ సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా మధుతో టెన్ టివి ముచ్చటించింది. ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా..విభజన చట్టం తదితర సమస్యలు ఎన్నో ఉన్నాయని, ఈ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం జరపాల్సినవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై పునరంకితం కావాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. కౌలు రౌతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని..ఎన్నో సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని, ప్రజల పక్షం నిలవాలని మహాసభ పిలుపునివ్వడం జరిగిందన్నారు. 14వ తేదీన ఉదయం వామపక్షాల సమావేశం జరుగుతుందని, ఇప్పటిదాక కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం చాలా కాలంపాటు పోరాటం చేస్తున్నామని..వివిధ జిల్లాల్లో విభజన హామీల కోసం పోరాటం చేస్తామని తమను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటం చేయాలి ? ఎవరెవరిని కలుపుకొని పోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భం కాదని..ప్రజా ఉద్యమాల సందర్భమని..వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తామన్నారు. గతంలో ఎలాంటి పోరాటాలు చేశామో అంతకంటే ఉధృతంగా పోరాటం చేస్తామని, తొందరలో పోరాట కార్యచరణనను ప్రకటిస్తామని మధు తెలిపారు. 

14:07 - February 11, 2018

ప.గో : ఏపికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాని సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్‌ చేశారు. ఇందుకోసం కేంద్రంతో తాము పోరాడుతామన్నారు. బీజేపీ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకున్న టీడీపీ... కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ భవిష్యత్‌ కార్యాచణేంటో ప్రజలకు చెప్పాలంటున్న ఏచూరితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. 

 

13:25 - February 11, 2018

పశ్చిమగోదావరి : విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్న కేంద్రం.. వాటిని విస్మరించిందన్నారు. 

 

20:58 - February 10, 2018

పశ్చిమగోదావరి : బీజేపీ-టీడీపీ మిత్రబంధం వల్ల సాధించిందేమీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. స్పెషల్‌ స్టేటస్‌.. ప్యాకేజీల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను ఈ రెండు పార్టీలూ మోసం చేశాయని విరుచుకుపడ్డారు. భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఏచూరి, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. అల్లూ‌రు సీతారామ‌రాజు న‌గ‌ర్‌ ప్రాంగ‌ణంలో జరిగిన బ‌హిరంగ స‌భలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ-టీడీపీ మిత్రబంధంతో సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌.. ప్యాకేజీ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేద ప్రజలపై మరింత భారాలు మోపుతుందని ఏచూరి మండిపడ్డారు. 73 శాతం ధనం ఒక్క శాతం ప్రజల వద్దే ఉందని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని అన్నారు. ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ప్రభుత్వం అవసరమని ఏచూరి అన్నారు.

రైతాంగం పోరాటాల్లోకి రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు పిలుపునిచ్చారు. బడ్జెట్లో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రైతుల అప్పులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం విభజన హామీలను విస్మరించి ప్రజలను మోసగించిందని రాఘవులు మండిపడ్డారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయాలన్నారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. తుందుర్రు ఆక్వా పరిశ్రమ, యనమదుర్రు డ్రెయిన్‌, గరగపర్రు, పెద్దగొట్టిపాడు దళితులపైదాడుల వంటి సమస్యలపై సీపీఎం ఉద్యమాలు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణచి వేయాలని చూస్తోందని మండిపడ్డారు. రొయ్యల చెరువుల వల్ల కాలుష్యం పెరుగుతుందని ఏయూ ప్రొపెసర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదని మధు మండిపడ్డారు.

రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ మండిపడ్డారు. సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా రానున్నకాలంలో కార్మిక, కర్షక, దళిత, బహుజన, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసే వేదికగా ఈ మహాసభలు జరగనున్నాయ‌ని చెప్పారు. కార్మిక హక్కులను కాలరాస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని గఫూర్‌ హెచ్చరించారు.

రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని.. వారి సమస్యలూ ఒకేలా ఉన్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజలు భూమి కోసం భుక్తి కోసం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. అన్ని పోరాటాల్లోనూ సిపిఎం ప్రజలకు అండగా ఉంటోందన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసేది ఎర్రజెండా మాత్రమే అని తమ్మినేని స్పష్టం చేశారు.

అంతకు ముందు భీమవరం పట్టణంలో సీపీఎం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. దాదాపు 20 వేల మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కామ్రేడ్స్‌ కదం తొక్కడంతో.. భీమవరం వీధులన్నీ అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. సీపీఎం రాష్ట్ర మహాసభలు సోమవారం వరకూ సాగనున్నాయి. 

07:30 - February 9, 2018

బీజేపీ ఎన్నికలకు ముందు వాగ్ధానాలు చేసి తర్వాత మొండిచేయి చూపిస్తుందని నేతలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమలో విశ్లేషకులు, నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, టీడీపీ నేత చందూసాంబశివరావు, బీజేపీ నేత కోటేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. బీజేపీకి మాట తప్పడం సహజ లక్షణం, అలవాటని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా చట్టబద్ధమైన అంశం అని అన్నారు. టీడీపీ కేంద్రంపై పోరాడాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

06:56 - February 9, 2018

విజయవాడ : రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై.. ప్రజా దండు కదిలింది. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసనలతో... ఏపీ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ వామపక్షాలు చేపట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. దీంతో ఏపీలో బంద్‌ విజయవంతమైంది. 
వామపక్షాల బంద్‌  
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు కదంతొక్కారు..! ఏపీకి జరిగిన అన్యాయంపై.. ఒక్కటిగా కదిలారు..! రాష్ట్ర ప్రయోజనాల కోసం.. ఆందోళనకు దిగారు..! వామపక్షాల బంద్‌ పిలుపుకు వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. దీంతో బంద్‌ విజయవంతమైంది. 
ఉత్తరాంధ్రలో 
ఉత్తరాంధ్రలో చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.  విశాఖపట్నంలో  స్కూళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. బస్సుల రాకపోలు నిలిచిపోయాయి. వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా బంద్‌లో పాల్గొని.. ధర్నాలు చేపట్టారు. జాతీయ రహదారిపై వామపక్ష నాయకులు బైఠాయించారు. ఆంధ్ర యువత బీచ్‌రోడ్డులోని భగత్‌సింగ్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. విజయనగరం జిల్లాలోనూ.. సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష పార్టీలతో సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు బస్‌ల రాకపోకలను అడ్డుకున్నారు. ఎస్ ఎఫ్ఐ నాయకులు పట్టణంలోని.. పాఠశాలలను, కళాశాలలను మూసివేయించారు. 
శ్రీకాకుళం జిల్లాలో 
అటు శ్రీకాకుళం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల నేతలు.. ధర్నాలు చేపట్టారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించి.. ఆందోళన చేపట్టారు. ఐదు ఆర్టీసీ డిపోల వద్ద సుమారు 350 బస్సులు నిలిచిపోయాయి. 
ఉభయ గోదావరి జిల్లాల్లో 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ  బంద్‌ ప్రశాంతంగా సాగింది. సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు  ఆందోళనలు చేపట్టారు.  సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని  శ్యామలా సెంటర్ నుంచి కోటిపల్లి  బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి..  మానవహారం చేశారు. తుని ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర సీపీఐ, వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రాపురంలోనూ.. ఆయా పార్టీల నేతలు ధర్నా చేపట్టారు. అనపర్తిలో ఎమ్మెల్యే  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు.  అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలోనూ ప్రశాంతంగా బంద్‌ కొనసాగింది. 
పశ్చిమగోదావరి జిల్లాలో 
పశ్చిమగోదావరి జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఏలూరులో ఆర్టీసీ బస్సులు డిపోలకే  పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.  షాపులన్నీ మూతపడ్డాయి.  పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్‌లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. 
కృష్ణా జిల్లాలో  
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమల కోసం... కృష్ణా జిల్లాలోనూ బంద్‌ కొనసాగింది.  విజయవాడలో సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు  ఒకే తాటిపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
గుంటూరులో 
గుంటూరు నగరంలోని బస్టాండ్ వద్ద నుంచి శంకర్ విలాస్ వరకు వామపక్షాల  నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  శంకర్ విలాస్ సెంటర్ లో రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. నరసరావుపేటో వైసీపీ ఆధ్వర్యంలో  బంద్‌ నిర్వహించగా.. రేపల్లెలో సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. అదే విధంగా.. ఏపీ రాజధాని  అమరావతిలోనూ వామపక్షాల బంద్‌ విజయవంతంగా సాగింది.  స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు మూతబడ్డాయి. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. వామపక్షాల నేతలు రోడ్డుపై ర్యాలీతో పాటు.. ధర్నా చేపట్టారు. కాగా బంద్‌ ప్రభావం వల్ల నిత్యం సందర్శకులతో కళకళలాడే సచివాలయం సందర్శకులు లేక వెలవెలబోయింది. పలు జిల్లాల్లో బంద్‌లో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

21:45 - February 8, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో భాగంగా తెల్లవారుజాము నుంచే అన్ని జిల్లాలలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపైకి వచ్చి.. ఆందోళనలు చేపట్టారు. వినూత్న నిరసనలతో ఏపీకి జరిగిన అన్యాయంపై నినదించారు. బంద్‌లో భాగంగా అన్ని జిల్లాల్లో.. సీపీఎం, సీపీఐ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తించారు. సీపీఎం నేతలు డిపోల్లో బస్సులను అడ్డుకున్నారు. దుకాణాలు, పాఠశాలలు, కాలేజీలు మూయించారు. కేంద్ర తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళనలలో అపశృతులు...
బంద్‌లో భాగంగా.. కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో అపశృతులులు చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా.. ఏలూరులో ర్యాలీ తీయబోతున్న వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. అలాగే అనంతపురం, పెనుకొండలో ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ రసాభాసగా మారి... వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీకాకుళలో జిల్లాలో... ముందస్తుగా.. సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేశారు.అలాగే వైసీపీ అధినేత జగన్‌ నెల్లూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు ఎమ్మెల్యేలు, నాయకులు జిల్లాలలోని బంద్‌లో పాల్గొని.. ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు బంద్‌లో భాగమై... అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లా.. హిందూపురంలో కాంగ్రెస్‌ నేత, పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి కార్యకర్తలతో పాటు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మోదీకి భయపడి ప్రత్యేక హోదాపై మాట్లాడడం లేదని రఘువీరారెడ్డి విమర్శించారు.

మోకాళ్లపై నిలబడి..
అలాగే.. ఏపీకి జరిగిన అన్యాయంపై.. జనసేన పార్టీ నాయకులు తమదైన రీతిలో స్పందించారు. వినూత్న నిరసనలతో.. కేంద్రంపై మండిపడ్డారు. విజయవాడలో మోకాళ్లపై నిలబడి..కేంద్ర వైఖరిని ఎండగట్టగా.. ఏలూరులోని బిర్లా భవన్‌ సెంటర్‌ వద్ద ఆకుకూరలు నములుతూ ఆందోళన చేశారుఏపీ బంద్‌లో తాము సైతం అంటూ జర్నలిస్టులు కదం తొక్కారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఏపీకి కేంద్రం నాలుగేళ్లుగా అన్యాయం చేస్తోందని విమర్శించారు. అలాగే అనంతపురంలో ఐద్వా, కార్మిక సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.  

19:26 - February 8, 2018

ఏపీ బంద్ కు వామపక్షాలు పిలుపునిచ్చాయి, కానీ ఈ బంద్ కు బీజేపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగుతుందని, ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి తము బంద్ కు పిలుపునిచ్చామని సీపీఎం నేత గఫూర్ అన్నారు. రాష్ట్ర బంద్ కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదలు తెలుపుతున్నామని, రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ఇది ఐదో బంద్ అని విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఏమి లేని రాష్ట్రాన్ని నడిపించాలంటే నిధులు కావాలి దాని కోసమే కేంద్రంతో కలిసి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్సీ అర్జున్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

 

17:38 - February 8, 2018

విజయవాడ : విభజన హామీలను తుంగలో తొక్కారంటూ విజయవాడలో కాంగ్రెస్‌ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ వల్లే సాధ్యమవుతుందంటూ నిరసన తెలుపుతున్నారు. పార్టీలకతీతంగా ఢిల్లీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం చేద్దామని తెలిపారు.

ఏలూరులో...
ఏలూరులో బంద్‌ సంపూర్ణంగా జరుగుతోంది. వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తుండటంతో.. షాపులన్నీ మూతపడ్డాయి. ఏలూరులో బంగారం షాపుల మూతపడటంతో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొనడంతో వ్యాపార సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి. ఏలూరులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు.

విశాఖలో...
విశాఖలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. వామపక్షలు పిలుపు మేరుకు వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గోన్నాయి. గాజువాక, చింతపల్లి, అనకపల్లి, పెందుర్తి, ఎజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్నిపార్టీలు బంద్‌ పాటించాయి. ఉదయం నుండి మద్దలపాలెం కూడిలి వద్ద ఏపీకి జరిగిన అన్యాయంపై గళం విప్పారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - AP CPM Madhu