ap development

18:53 - June 2, 2017

విజయవాడ : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు విజయవాడలోని ఏలూరు రోడ్, బందర్ రోడ్ కారిడార్లకు సివిల్ వర్క్ కోసం టెండర్లు పిలిచి రెండు కంపెనీలను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులకు మెట్రో రైలు ప్రాజెక్టు వివరాలతో కూడిన సమగ్ర నివేదిక పంపారు. ఏఎంఆర్సీ ఎండీ రామకృష్ణారెడ్డి డీఎంఆర్సీ ఎండీ శ్రీధరన్‌కు ప్రాజెక్ట్‌పై కూలంకషంగా వివరించారు. ఇక టెండర్లు ఖరారవుతాయని భావిస్తున్న తరుణంలో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తూ డిఎంఆర్సీ అధికారులు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టెండర్ల రద్దు....
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేయడం ఇది రెండవసారి. ఒకసారి టెండర్లు రద్దయిన తరువాత తిరిగి 2016 నవంబర్ 28న రెండోసారి టెండర్లు పిలిచింది. రెండో దఫా టెండర్లను పిలిచిన వెంటనే డీఎంఆర్సీ సవరింపునకు తెరలేపింది. సవరింపుకు ముందు పలు సంస్థలు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపాయి. సవరింపు తర్వాత కేవలం సింప్లెక్స్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలు మాత్రమే బరిలో నిలిచాయి. ఈ మూడు సంస్థలు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను వేశాయి. అర్హతల ప్రకారం తగిన అనుభవం లేకపోవంతో సింప్లెక్స్ ఇండియాను టెండర్ల ప్రక్రియ నుంచి తప్పించారు. ఇక మిగిలిన రెండు సంస్థలు ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలు ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేశాయి. డీఎంఆర్సీ ప్రతిపాదించిన అంచనా విలువ కంటే అధికమొత్తంలో సదరు రెండు సంస్థలు కోట్ చేయడంతో డీఎంఆర్సీ టెండర్లు రద్దు చేసింది.

తుది అనుమతులు
మరోవైపు క్షేత్రస్థాయిలో విజయవాడ మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్‌కు తుది అనుమతులు రాలేదు. ఏపీ ప్రభుత్వ వాటాగా బ్యాంకుల నుంచి రుణం సర్దుబాటు కావాల్సి ఉంది. విదేశీ సంస్థల నుంచి రుణానికై అగ్రిమెంట్ కూడా జరగాల్సి ఉంది. వీటికితోడు భూ సేకరణపై సస్పెన్స్ నెలకొంది. 2019 నాటికల్లా మెట్రోను ప్రారంభించాలనేది సీఎం చంద్రబాబు భావిస్తున్నా అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తప్ప బెజవాడ మెట్రో సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

 

15:09 - May 7, 2017

కడప : రాయలసీమలో ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు పోరు బాట పట్టనున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో అనంతపురం కలెక్టరేట్ ఎదుట 48 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.నారాయణ, జి.ఓబులేసులు ప్రకటించారు. ఈ దీక్షలకు సీమ వ్యాప్తంగా ఉన్న రైతులు తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.

 

13:26 - May 7, 2017

విజయవాడ : ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. సమన్వయంతో ముందుకు వెళ్తానని తెలిపారు. ఈమేరకు ఆయన 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరి ఆమోదంతోనే భూ సేకరణ చేస్తామని స్పష్టం చేశారు. బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్ నిర్మాణానికి సర్వే జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా తలసరి ఆదాయం పెరిగే విధంగా ప్రణాళికలు తయారు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. 

 

21:33 - May 4, 2017

హైదరాబాద్: జగన్ అక్రమాస్థుల కేసులో ఈడీ మరో ఛార్జ్ షీటు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. జగన్, విజయసాయిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డిలను ఈడీ నిందితులుగా పేర్కొంది. నిందితులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అభియోగం.

15:44 - May 4, 2017

విజయవాడ : రాజధాని ప్రాంతంలో కృష్ణానదిని కబ్జా చేసి ... మధ్యలో కృత్రిమ ద్వీపాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన ప్రాంతాన్ని వైసీపీ నాయకులు పరిశీలించారు. నదిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే.. అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

19:01 - May 3, 2017

కృష్ణా : విజయవాడ శివారు గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను ప్రారంభించారు. ఇందులో అమెరికా, స్పెయిన్‌, జర్మనీకి చెందిన కంపెనీలను దాదాపు 42,681 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగుల రాకతో మేధా టవర్స్‌ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఏడు కంపెనీల్లో 1650 మందికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. రెండు సంవత్సరాల్లో ఏపీలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాలోకేష్‌ ఈ సందర్భంగా అన్నారు. 

22:31 - April 29, 2017
21:42 - April 29, 2017

కర్నూలు : నంద్యాల అసెంబ్లీకి బైపోల్ అభ్యర్థి విషయంలో శిల్పా, భూమా వర్గాలు మెట్టుదిగాయి. ఇరువర్గాలతో ఇవాళ మంత్రి కళా వెంకట్రావు చర్చలు జరిపారు. ఇరువర్గాలు మెట్టు దిగి తుది నిర్ణయం చంద్రబాబుకే వదిలేశారు. ముందు నుంచి నంద్యాల సీటు తమకే కావాలని అటూ భూమా వర్గం, ఇటు శిల్పా వర్గాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సమస్య పరిష్కారం కోసం రంగంలోకి దిగిన కళా వెంకట్రావు.. ఇరువర్గాలను ఒప్పించారు. దీంతో చంద్రబాబు నిర్ణయం మేరకు నడుచుకుంటామని ఇరువర్గాలు ప్రకటించాయి. 

15:47 - April 29, 2017

పశ్చిమ గోదావరి : ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలన్నారు. రాజకీయ నాయకులు నీతివంతమైన పాలనకు కట్టుబడి ఉండాలని సూచించారు. అవినీతి లేని పరిపాలనలో అధికారులంతా భాగస్వామ్యం కావాలని కోరారు. గ్రామాలకు 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. నూటికి నూరుశాతం ప్రతి ఇంటికి వంటగ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ప.గో జిల్లాలో 100శాతం గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. 

15:27 - April 29, 2017

పశ్చిమ గోదావరి : గ్రామాలకు 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నూటికి నూరుశాతం ప్రతి ఇంటికి వంటగ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే జిల్లాలో 100శాతం గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రాజకీయ నాయకులు నీతివంతమైన పాలనకు కట్టుబడాలన్నారు. అవినీతి లేని పరిపాలనలో అధికారులంతా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు వీడియోను చూడండి. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ap development