ap elections

15:07 - October 11, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసినా.. ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపిస్తుంటే.. వైసీపీ నాయకులు అంతే ధీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కలిస్తే మాపై కొత్తగా ఈడీ కేసులు ఎందుకు పెడతారని? వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడిన వైవీ సుబ్బారెడ్డి.. తమ రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయన్నారు. ఇక 2019 ఎన్నికల్లో నేను ఒంగోలు నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై అధినేత జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు.

06:29 - August 6, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. నిరుద్యోగ భృతి ప్రకటనతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోతే... వైసీపీ విద్యార్థి నేతలు మాత్రం విశాఖలో ఆందోళనకు దిగారు. ఎన్నికల వేళ చంద్రబాబు మరోమోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొద్దిమందికి నిరుద్యోగ భృతి ఇవ్వడంకాదు... రాష్ట్రంలోని కోటిమంది నిరుద్యోగులకూ భృతి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విశాఖలో టీడీపీ శ్రేణులయితే సంబరాలు జరుపుకున్నాయి. కేక్‌ కట్‌చేసి హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని 12 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్టు సంతోషం వ్యక్తం చేశాయి. అంతేకాదు.. కొత్త కంపెనీలను ఏర్పాటుచేసి యువతకు చంద్రబాబు ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు.

మరోవైపు చంద్రబాబు ప్రకటించిన నిరుద్యోగ భృతిపై వైసీసీ విద్యార్ధి నేతలు మండిపడుతున్నారు..నిరుద్యోగ భృతి డిగ్రీ, పాలిటెక్నిక్ చదివిన నిరుద్యోగులకు మాత్రమే ఇస్తానని చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి యువతను మోసం చేయడానికే నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని వారు మండిపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చేప్పి.. ఇప్పుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడాన్ని వైసీపీ విద్యార్థినేతలు తప్పుపడుతున్నారు. రాష్ట్రంలోని కోటిమంది నిరుద్యోగులందరికీ రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని లేదంటే... ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

22:39 - August 31, 2017
08:16 - August 24, 2017

తూర్పుగోదావరి : కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు తమ నేతలందర్నీ ఇక్కడే మోహరింపచేశాయి. నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌ పూర్తవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కాకినాడలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
ఏడేళ్ల తర్వాత కేఎంసీ ఎన్నికలు   
కాకినాడ నగరపాలక సంస్థకు ఏడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కేఎంసీలో పాగా వేసేందుకు రెండు పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 
48 డివిజన్లకు ఎన్నికలు 
కాకినాడలోని 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కోస్తా జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ నేతలంతా నగరంలోనే తిష్ఠవేశారు. టీడీపీకి చెందిన పది మంది  మంత్రులు,  40 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు,  వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కాకినాడలోనే మకాంవేసి తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు వీలుగా ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు తీస్తున్నారు. నగర పాలక సంస్థ ఎన్నికలకు జరుగుతున్న ప్రచారం గతంలో కాకినాడ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు కూడా జరగలేదు. రెండు పార్టీల నేతలు వాడీవేడీ విమర్శలు, పరస్పర ఆరోపణలతో ఓటర్లకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు యనమల రామకృష్ణుడు, చిమ్మకాయల చినరాజప్ప దగ్గరుండి టీడీపీ అభ్యర్థుల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నంద్యాల  ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్‌... ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుని కేసు నమోదుకు ఆదేశించిన అంశం ఇప్పుడు టీడీపీ ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. 
టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు మండిపాటు
కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారం చేసే నైతిక హక్కు జగన్‌కు లేదంటున్న టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. కాకినాడకు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో అమలుకు నోచుకోనివాటిని ఎత్తి చూపుతున్నారు. స్మార్ట్‌ సిటీ నిథలు ఖజానాలో మూలుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 
ఎన్నికల్లో పట్టు బిగించేందుకు బీజేపీ ప్రయత్నం
మరోవైపు కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పట్టు బిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీకి తొమ్మిది డివిజన్లు కేటాయించింది. కానీ కమలనాథులకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేయడం బీజేపీకి తలనొప్పిగా మారింది. రెబల్స్‌తో నామినేషన్లు ఉపసంహరింప చేసే విషయంలో టీడీపీ నేతలు ప్రయత్నించకపోవడాన్ని బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు. పొత్త ధర్మానికి ఇది విరుద్ధమని మండిపడుతున్నారు. 35 వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన కమలదళం జిల్లా అధ్యక్షుడు.. ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలికారు. కానీ బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు మాత్రం 35 వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం కమలనాథుల్లో ఉన్న విబేధాలను ఎత్తిచూపుతోంది. 39వ వార్డులో కూడా ఇదేరకమైన తంతు నెలకొంది. 
ఈనెల 29న పోలింగ్‌ 
కాకినాడ నగర పాలక సంస్థకు ఈనెల 29న పోలింగ్‌ జరుగుతుంది. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలివుంది. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ పూర్తవడంతో ఇప్పుడు టీడీపీ, వైసీపీ అగ్రనేతలంతా కాకినాడపైనే దృష్టి పెట్టారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల సమరాంగణంలో ఓటర్లు ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి. 

 

20:41 - April 26, 2017

గుంటూరు : ముందస్తు ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవలే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీనిని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాము సిద్ధమేనని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనగా ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు ఎవరు ఒప్పుకోరని లోకేష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పకుండా గెలుస్తామని, అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పలేదని, ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రమే ఆయన సూచించారని పేర్కొన్నారు. 2004 సంవత్సరంలో బాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లి నష్టపోయారు కనుకే లోకేష్ దీనిని వ్యతిరేకిస్తునట్టు తెలుస్తోంది.

19:03 - April 26, 2017

గుంటూరు :  దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించడంతో పాటు.. ఎన్నికల వ్యూహాల కసరత్తులు ప్రారంభించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అటు అధికార పార్టీ టీడీపీ, ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీలతో పాటు జనసేనా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. దీంతో జనసేన అభిమానుల్లో, కార్యకర్తల్లో ఎన్నికల వేడి మొదలైంది.

ఇంత వరకూ పార్టీ నిర్మాణం
జనసేన పార్టీ పెట్టి మూడేళ్లవుతున్నా.. ఇంత వరకూ పార్టీ నిర్మాణంపై పవన్‌ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో అధికార టీడీపీ మొదటి నుంచి నిర్మాణ పరంగా పటిష్టంగా ఉన్న పార్టీ. దీనికి తోడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారనే భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ముందస్తు ఎన్నికలు వస్తే పార్టీ పరిస్థితేంటి అనే గందరగోళంలో పవన్‌ అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకూ కొన్ని సమస్యలపై మాత్రమే తన ఘళాన్ని వినిపించిన పవన్‌ పూర్తి స్థాయిలో.. ప్రజా సమస్యలపై సమయం కేటాయించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ
వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి స్వార్ధపరులు కాకుండా నిజాయితీ, నిబద్ధత కలిగిన యువకులను నాయకులుగా తయారు చేస్తామని పవన్‌ చెప్పారు. అయితే పవన్‌ కళ్యాణ్‌కు సమయం తక్కువ ఉండటంతో పార్టీలోకి ఎవరిని తీసుకుంటారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుని పార్టీ నిర్మాణం చేపడతారు అనే సందేహాలు జనసేన అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు వస్తే పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలపై జనసేన ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రకటించినా సినిమాలతో బిజీగా ఉన్న పవన్‌.. వాటిని పక్కన పెట్టి పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కళ్యాణ్ తనకున్న ఇమేజ్‌ని మాత్రమే నమ్ముకొని.. ఎన్నికల బరిలోకి దిగితే ఇబ్బందులు తప్పవని విశ్లేషకులంటున్నారు. మరి పవన్‌ ఎలా ముందుకెళ్తారో చూడాలి.

 

21:16 - April 21, 2017

మరావతి: కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్‌ భేటీలో ఉద్యోగుల బదిలీలకు ఆమోద ముద్ర పడింది.. మే 1 నుంచి 31లోపు

ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.. మే 5 లోపు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న అన్నిశాఖల ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారుల్ని ఆదేశించాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు.. అలాగే బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని సీఎం ఆదేశించారు... అలాగే నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గింపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది..

21:35 - April 9, 2017

కృష్ణా : గుడివాడ మున్సిపాల్టీ 19వ వార్డు ఉపఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ కలకలం రేపింది. టీడీపీ, వైసీపీ జోరుగా డబ్బులు పంచారని తెలుస్తోంది. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడ డీఎస్పీ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వర్‌ రావు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

13:55 - February 20, 2017

అనంతపురం : 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం ఖాయమని పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రతి ఇంటి వెళ్లి ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు. మూడేళ్లలో అభివృద్ధి ఏం జరగలేదని.. రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 

Don't Miss

Subscribe to RSS - ap elections