AP MLC Elections

15:40 - June 13, 2017

కర్నూలు : జిల్లా టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సమక్షంలో తన అనుచరవర్గంతో వైసీపీ కండువా కప్పుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్ది ఎంపిక విషయంలో టీడీపీ నాన్చుడు ధోరణి వల్లే విసిగిపోయానని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ పతనం తప్పదని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం శిల్పా మోహన్ రెడ్డితో పాటు నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ దేశం సులోచన, మార్క్ ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, 25 మంది కౌన్సిలర్లు, ఎంపిటీసీలు, సర్పంచులు, జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.

2009లో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా విజయం

2009లో నంద్యాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన శిల్పా మోహన్‌రెడ్డి..రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్‌ వ్యతిరేకత పెరగడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తన కనుసన్నల్లో నడిపించారు. జిల్లాలో అధికార పార్టీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం వల్ల రాజకీయ సమీకరణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 2016 జనవరిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలను పార్టీలోకి చేర్చుకున్నారు. భూమాతో కలిసి సమన్వయంతో పనిచేయాలని శిల్పాకు సీఎం చంద్రబాబు సూచించారు. అయితే భూమా చేరికను వ్యతిరేకిస్తూ వచ్చిన శిల్పా మోహన్‌రెడ్డి..నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఒకే పార్టీలో ఉన్నా ఒకరిపై ఒకరు వాడి విమర్శలు సంధించుకున్నారు. ఆ సమయంలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక జరిగితే అభ్యర్థి ఎవరు..? అనే ప్రశ్న అధికార పార్టీలో తలెత్తింది.

నంద్యాల టికెట్‌ తనకే ఇవ్వాలని పట్టుబట్టిన శిల్పా

నంద్యాల టికెట్‌ తనకే ఇవ్వాలని శిల్పా మొదటి నుంచి అధిష్ఠానానికి ఘాటుగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం శిల్ప సేవా సమితిలో కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నంద్యాల నియోజవర్గంలోని శిల్పా వర్గానికి చెందిన కార్యకర్తలు, వార్డు, గ్రామ స్థాయి టీడీపీ ఇన్‌చార్జిలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డ్‌ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఈ నెలాఖరులో జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వస్తున్న సందర్భంగా తన బలాన్ని చాటి చెప్పేందుకే శిల్పా మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక జూలై, ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు రసవత్తరంగా మారింది.

11:57 - March 23, 2017

తిరుపతి : తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘనం విజయం సాధించారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా తన విజయంలో వామపక్షాల కృషి ఎంతో ఉందని కొనియాడారు. శాసనమండలిలో నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన కోసం కృషి చేస్తానని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాను నిరుద్యోగ పక్షపాతినని తెలిపారు. నిరుద్యోగ భృతి పూర్తి స్థాయిలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

21:27 - March 22, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పాలక తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు ముగ్గురు, వైసీపీ సభ్యుడు ఒకరు విజయకేతనం ఎగురవేశారు. విశాఖ పట్టభద్రుల ఎన్నికలో మాత్రం.. టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు సత్తా చాటారు. రెండు రోజుల ఉత్కంఠ అనంతరం వెలువడిన ఫలితాలు, పాలక పక్షాన్ని ఖంగు తినిపించాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో వామపక్షాలకు ఎదురు లేదని మరోమారు నిరూపితమైంది. చిత్తూరు- నెల్లూరు- ప్రకాశం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను పీడీఎఫ్ అభ్యర్థులను విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసరెడ్డి కైవసం చేసుకున్నారు. వరుసగా మూడోసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రహ్మణ్యం గెలిచారు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనదని పీడీఎప్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కార్పొరేట్ శక్తులను తనపై పోటీకి దింపి మండలిలో తన గొంతు నొక్కేయాలని అధికార పార్టీ చూసిందని.. అయితే ఉపాధ్యాయులు విజ్ఞతతో ఓటు వేసి తనను గెలిపించారన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మంత్రి నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై యండపల్లి శ్రీనివాసరెడ్డి విజయదుందుభి మోగించారు. ఈ విజయం వామపక్షాల విజయమని యండపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ తరపున గోపాల్‌రెడ్డి ఈ ఎన్నికలో గెలుపొందారు. ఈ విజయంతో విద్యావంతులందరూ తమతోనే ఉన్నారని తేలిందన్నారు.. గోపాలరెడ్డి. ఇక ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్నిబీజేపీ సొంతం చేసుకుంది. పీడీఎప్ అభ్యర్థి అజశర్మపై బీజేపీ అభ్యర్థి మాధవ్ విజయం సాధించారు. ఫలితం అనంతరం విశాఖకు రైల్వే జోన్ కోసం కృషిచేస్తానని మాధవ్ తెలిపారు. మొత్తమ్మీద విద్యావంతులు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే... ఏపీలో, పాలక తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ గణనీయంగా తగ్గిందని.. అదే సమయంలో, వామపక్షాల జోరుకు ఎదురేలేదని స్పష్టమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

10:35 - March 22, 2017
08:50 - March 22, 2017

హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిసి ఉన్న  తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. టీడీపీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై 3,500 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులరెడ్డి నెగ్గారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవ్‌  గెలుపొందారు. పీడీఎఫ్ అభ్యర్థి అజాశర్మపై  9,215 ఓట్ల మెజార్టీతో మాధవ్‌ నెగ్గారు. మాధవ్‌కు 48,499 ఓట్లు వచ్చాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలిసివున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి  మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ విజయం దక్కకపోవడంతో రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసివున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని వైసిపి అభ్యర్థి గోపాల్‌రెడ్డి 14,146 ఓట్ల తేడాతో ప్రత్యర్థి కేజేరెడ్డిపై విజయం సాధించారు.  
---

08:02 - March 22, 2017

హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిసి ఉన్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. టీడీపీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై 3,500 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులరెడ్డి నెగ్గారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవ్‌  గెలుపొందారు. పీడీఎఫ్ అభ్యర్థి అజాశర్మపై  9,215 ఓట్ల మెజార్టీతో మాధవ్‌ నెగ్గారు. మాధవ్‌కు 48,499 ఓట్లు వచ్చాయి.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలిసివున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి  మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ విజయం దక్కకపోవడంతో రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసివున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఫలితం వెలువడాల్సి ఉంది. అనంతపురంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ రాయలసీమ  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి  12 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 

18:46 - March 21, 2017
18:33 - March 21, 2017

అమరావతి : వైఎస్ జగన్‌- యనమల మధ్య అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్‌పై అడిగిన ప్రశ్నలకు యనమల సమాధానమిస్తున్న సమయంలో జగన్ బయటకు వెళ్లారు. దీంతో జగన్ బాత్‌రూమ్‌కు వెళ్లారా అని యనమల అడగగా.. బాత్‌రూమ్‌కు కూడా చెప్పి వెళ్లాలా అని జగన్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మాత్రం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే మనవడి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ వెళ్లొచ్చున్నారు. దీనికి సమాధానంగా సీఎం స్పీకర్‌కు చెప్పే వెళ్లారని యనమల చెప్పారు. 

18:31 - March 21, 2017

అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని.. ఇందుకోసం చంద్రబాబు కృషిచేశారని యనమల రామకృష్ణుడు అన్నారు. 2019 కల్లా పోలవరాన్ని పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. 

18:29 - March 21, 2017

అమరావతి: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల 8వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయింది. 5 వేల 45 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ-బీజేపీ అభ్యర్థి పీవీఎస్‌ మాధవ్‌ ఉన్నారు. మాధవ్‌కు 42 వేల 863 ఓట్లు రాగా.. అజ శర్మకు 37 వేల 818 ఓట్లు పోలయ్యాయి. అటు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీడీపీ అభ్యర్థి కేకే రెడ్డిపై 12 వేల 682 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఉన్నారు. అటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో ఏడుగురు అభ్యర్థులను ఎలిమినేట్‌ చేశారు. టీడీపీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డికి 258 ద్వితీయ ప్రాధాన్య ఓట్లు రాగా.. పీడీఎప్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 224 ఓట్లు వచ్చాయి. దీంతో యండపల్లి ఆధిక్యం 3 వేలపైగా చేరుకుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - AP MLC Elections