ap police

13:12 - February 14, 2018

పశ్చిమగోదావరి : శివరాత్రి సందర్భంగా ఆచంటలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక వేడుకలకు హాజరైన మహిళల పట్ల కొంతమంది ఆకతాయి విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించడం..కామెంట్స్ చేశారని కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తీసుకొచ్చి విద్యార్థులను విచారించారు. ఒక్కసారిగా రెచ్చిపోయిన ఓ పోలీసు విద్యార్థులను చితకబాదాడు. అక్కడకు చేరుకున్న మీడియా చితక్కొడుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. దీనిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఉత్సవాల్లో తమ ఎదుటే అసభ్యకరంగా ప్రవర్తించారని...విద్యార్థులు పొంతనలేని సమాధానం చెబుతున్నారని పోలీసులు పేర్కొంటున్నట్లు సమాచారం. 

17:10 - February 12, 2018

కర్నూలు : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. 4వ టౌన్ పోలీస్ స్టేష్ పరిధిలో చోరీలు పెరిగిపోతున్నాయి. వారానికి ఒకసారి దొంగలు హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. కృష్ణా నగర్ లోని ఓ కిరాణా దుకాణంలో ఉన్న రాధా అనే మహిళ మెడలో నుండి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:30 - February 11, 2018

గుంటూరు : అయేషా మీరా హత్య కేసును సిట్ పునర్ విచారిస్తోంది. అందులో భాగంగా సిట్ అధికారులు తెనాలికి వెళ్లారు. అక్కడ నివాసం ఉంటున్న అయేషా మీరా తల్లిదండ్రులను డీఐజీ శ్రీకాంత్ బృందం కలిసింది. సుమారు మూడు గంటల పాటు సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. అనంతరం ఆయేషా మీరా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తమ కూతురి హత్యపై తొలి నుండి జరిగిన విషయాలన్నీ సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారని, హాస్టల్ వార్డెన్ ను విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయని అధికారులకు తెలియచేసినట్లు అయేషా తల్లి తెలిపారు. గతంలోలాగా అమాయకుడిని బలి చేయొద్దని వేడుకున్నట్లు, అధికారులకు నిబద్ధత ఉంటే తమకు న్యాయం చేస్తారన్నారు. గతంలో ఈ కేసులో సత్యంబాబుపై కేసు నమోదు చేయగా ఆయనపై వచ్చిన ఆరోపణలను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

20:10 - February 5, 2018

నెల్లూరు : రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడింది. గౌహతీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఓ ప్రయాణీకుడి నుంచి సుమారు నాలుగు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటీ 43 లక్షలు దాకా ఉంటుందని అధికారుల అంచనా. ఎలక్ర్టిక్‌ స్టవ్‌లో బంగారు అమర్చి... అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ యాక్ట్1962 ప్రకారం కేసునమోదు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. 

 

14:14 - January 27, 2018
21:28 - January 25, 2018

గుంటూరు : జిల్లాలోని నరసరావుపేటలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌, నకిలీ సర్టిఫికెట్ల కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుతో 9 మందికి సంబంధం ఉన్నట్టు  తేల్చారు. వీరిలో నలుగుర్ని అరెస్టు చేశారు.  దుగిరాలకు చెందిన కొడాలి బాబూరావు, నరసరావుపేట వాసులు ఇండ్ల నాగేశ్వరరావు, అర్వపల్లి ఏడుకొండలు, తెనాలికి చెందిన నీలా ప్రసాద్‌బాబు అరెస్టు  అయ్యారు. పారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో నిందితుడు కపిలవాయి విజయ్‌కుమార్‌ పాత్రపై మరింత విచారణ చేపట్టాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కిడ్నీ రాకెట్‌లో పలు ఆస్పత్రుల ప్రమేయం ఉన్నట్టు తేల్చారు. వేదాంత ఆస్పత్రి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రెవెన్యూ సిబ్బంది పాత్రపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

 

18:22 - January 23, 2018
15:07 - January 23, 2018

చిత్తూరు : జిల్లా తిరుపతిలో ప్రియుడి నయవంచనకు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఏడాది కాలంగా ఈ యువతిని ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని ప్రేమికుడు పరారయ్యాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:45 - January 17, 2018

పశ్చిమగోదావరి : జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. పలు వాహనాల్లో వెళ్ళిన పోలీసులు కోడిపందాల శిబిరాన్ని చుట్టుముట్టారు. ఈ అనూహ్య దాడితో నిశ్చేష్టులైన పందెం రాయుళ్ళు పారిపోయారురు. గత నాలుగు రోజులుగా కొప్పాకలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

16:15 - January 12, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - ap police