AP special Package

21:40 - March 27, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టే వారికి రాజకీయాల పార్టీల పట్ల విశ్వాసం లేదని జీవీఎల్ నరసింహరావు అన్నారు. ప్రత్యే హోదా ఒకటే నినాదం కాదని కేంద్రం ఆర్ధికంగా ఆదుకోవాలని విభజన చట్టంలో ఉందని తెలిపారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఏ రాష్ట్రనికి ఇవ్వని నిధులను ఏపీకి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం భయపడుతున్నాయని,.. నరసింహారావు ఎద్దేవా చేశారు.

06:44 - February 13, 2018

విజయవాడ : 'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీ మాకొద్దు' అనే నినాదంతో పోరాటానికి వైసీపీ సిద్దమైంది. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ మార్చి 1న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మార్చి 5న ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రానికి హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని.. అవసరమైతే ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు సిద్దమైంది వైసీపీ.

'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీతో మోసపోవద్దు' అనే నినాదంతో పోరుబాటకు సిద్దమవుతున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించడం.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించకపోవడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయంపై వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది వైసీపీ. వచ్చే నెల 1వ తేదీన 'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీతో మోసపోవద్దు' అనే నినాదంతో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అలాగే మార్చి 5న "ప్రత్యేక హోదా మన హక్కు - ప్యాకేజీ వద్దు' అనే నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, నేతలతో ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. మార్చి 3న జగన్‌ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించబోదన్నారు భూమన. తమ ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే తమ ఎంపీలు ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్నారు భూమన. వైసీపీపై అభాండాలు వేసేందుకు టీడీపీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. టీడీపీ వైఖరిని ప్రజలందరూ చూస్తున్నారని.. దీనికి సరైన సమయంలో సరైన సమాధానం చెబుతుందన్నారు. మొత్తానికి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. మరి వైసీపీ పోరాటంతో కేంద్రం ఏ మేరకు దిగివస్తుందో చూడాలి !

13:56 - November 20, 2017
08:52 - March 17, 2017

కేవలం ఉత్తరప్రదేశ్ లలోని రైతులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ అధికారి ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, బీజేపీ నేత పాదూరి కరుణ పాల్గొని, మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేస్తారు కానీ రైతులకు రుణమాఫీ చేయరని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే దేశానికి మంచిది కాదన్నారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను కేంద్రం చేతిలోకి తీసుకుంటుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:38 - March 16, 2017

అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్షా 56 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి 19 వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ప్రాథమిక విద్యకు 17 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి 12 వేల కోట్లు కేటాయించారు. 9 రంగాల ఆధారంగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని.. విజన్‌ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుందన్నారు యనమల. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో గౌతమ్ రెడ్డి (వైసీపీ), పట్టాభిరామ్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

06:24 - March 16, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడంతో పాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకోనుంది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల టీడీపీ, బీజేపీ నేతలు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరానికి వంద శాతం నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక హోదా వల్ల లభించే ప్రయోజనాలన్నీ విదేశీ రుణాల ప్రాజెక్టులకు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం నేతల హర్షం..
ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా గతేడాది సెప్టెంబర్‌ 8న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించింది. ప్యాకేజీకి చట్టబద్దతపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీకి అన్ని విధాలుగా సాయం చేసేందుకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని... ఇకపై ప్రత్యేక హోదా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు కేంద్రమంత్రి సుజనాచౌదరి. ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలన్నింటిని ప్రత్యేక ప్యాకేజీ కింద ఇవ్వడానికి కేబినెట్ ఆమోదించిందని చంద్రబాబు అన్నారు. తాను ఎప్పుడు కేంద్రంతో రాజీ పడలేదన్నారు. కేంద్రంతో ఘర్షణ పడకుండా రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాలన్నారు. మొత్తమ్మీద ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలపడం పట్ల తెలుగుదేశం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

06:41 - January 22, 2017

విజయవాడ : జల్లికట్టు ఉద్యమం ఏపీలో ప్రత్యేక హోదా నినాదాన్ని నిద్రలేపుతోంది. సుప్రీంకోర్టు కాదన్నా పట్టుబట్టిన తమిళనాడు ప్రజలు.. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ను తెచ్చుకున్నారు. తమిళుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై ఉద్యమించాలని అన్ని పార్టీల నేతలు ముక్కకంఠంతో పిలుపునిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరు సాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తమిళనాడులో జల్లికట్టు తరహాలో.. ఏపీలోనూ హోదాపై సమైక్య పోరాటం సాగించాలని అన్ని పార్టీల నేతలు సూచిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అమలుకు ప్రభుత్వమే ముందుండి పోరాటం సాగించాలని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సుప్రీంకోర్టే జల్లికట్టును వద్దని చెప్పినా.. తమిళులు పట్టుబట్టి మూడ్రోజుల్లో ఆర్డినెన్స్ తెప్పించుకున్నారని కేవీపీ గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మనం ఆ మాత్రం చేయలేమా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు సమిష్టిగా ఉండాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు కూడగట్టాలని లేఖలో చంద్రబాబును కోరారు కేవీపీ.

పవన్ ట్వీట్..
జల్లికట్టు ఉద్యమంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తిదాయకమంటూ ట్వీట్‌ చేశారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. ఈ విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా తాను పడబోనని స్పష్టం చేశారు. జల్లికట్టుపై ఆర్డినెన్సు జారీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు. తమిళనాడులో జల్లికట్టు సాధించడంలో ప్రతిపక్షాలతో పాటు అధికారిక పక్షం కూడా పోరాడిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. అయితే ఏపీలో ప్రత్యేక హోదాపై టిడిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మధు విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు వెనక్కి తగ్గారని అందువల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. ఇప్పటికైనా తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని మధు డిమాండ్ చేశారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ సాధించిన తీరును ఏ రీతిలో పొగుడుతున్నారో.. అదే రీతిలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని రాజకీయాలకు అతీతంగా నేతలు పిలుపునిస్తున్నారు. ఇదే స్పూర్తితో ఏపీ నాయకులు ముందుకు వెళ్తారో లేదో వేచి చూడాలి.

13:39 - January 21, 2017

విజయవాడ :జల్లికట్టు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై ఉద్యమించాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖరాశారు.. రాజ్యసభ సభ్యుడు KVP... జల్లికట్టు అంశం న్యాయస్థానం పరిధిలోఉన్నప్పటికీ... కేంద్రం తప్పించుకునే అవకాశమున్నాకూడా తమిళులు అనుకున్నది సాధించారని గుర్తుచేశారు.. మూడురోజుల్లో తమిళ ప్రజలు జల్లికట్టును సాధించారని.... మూడేళ్లయినా విభజన చట్టం అమలులో ఎందుకు వెనకబడిపోతున్నారని విమర్శించారు.... న్యాయంగా రావాల్సినదానికోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడంలేదని ప్రశ్నించారు.. ఇప్పటికైనా కళ్లుతెరిచి సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు పార్టీలకు అతీతంగా కదులుదామని సూచించారు.. తమిళ సోదరుల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదామని కోరారు.. ఈ పోరాటానికి చంద్రబాబు నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు..

18:43 - December 2, 2016

అనతంపురం : గొడవ పెట్టుకోవడం చాలా సులభం..తెలివిగా వ్యవహరిస్తేనే అభివృద్ధిని సాధిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడంపై ఆయన అనంతపురం సభలో మరోసారి వివరణ ఇచ్చారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే.. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు తెచ్చుకోవచ్చన్నారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రం మరింత నష్టపోతుందన్నారు ఏపీ సీఎం. పట్టిసీమను వ్యతిరేకించినవారి నోళ్లు మూతపడ్డాయిన ఏపీసీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం సభలో ఆయన గోల్లపల్లి రిజర్వాయర్‌ను ను ప్రారంభించారు. పట్టిసీమనుంచి వచ్చేఏడాది 80టీఎంసీలను తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు చంద్రబాబు.   

13:54 - September 19, 2016

ఢిల్లీ : ప్యాకేజీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. ప్యాకేజీ పట్ల ఏపీ ప్రజలు సానూకూలంగానే ఉన్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వ సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సూచన కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం 100 శాతం నిధులు ఇవ్వడం చరిత్రాత్మక విషయమని చెప్పారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తుందని అన్నారు. త్వరలో రైల్వేజోన్‌ విషయంలో  నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - AP special Package