AP YCP Leaders

08:34 - February 6, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రను సద్వినియోగం చేసుకోవడంలో నేతలు విఫలమవుతున్నారా...? పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చినట్లు కనిపిస్తున్నా... పార్టీ అధిష్టానం ఎందుకు భయపడుతోంది... వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వేలో తేలిందేంటి...?
అధికారమే లక్ష్యంగా సాగుతున్న పాదయాత్ర
సుమారు వెయ్యి కిలోమీటర్లు... ఎనభై రోజులు.. ఆరు జిల్లాలు, 36కు పైగా నియోజకవర్గాలు.. అడుగడుగునా జనంతో కలయిక.. ప్రజా సమస్యలపై ఆరా.. ఇలా కొనసాగుతోంది వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సాగుతోందీ పాదయాత్ర..  ప్రజా సమస్యలను అధ్యాయనం చేస్తూ ముందుకు వెలుతున్నారు జగన్. కానీ.... దానివల్ల వస్తున్న స్పందనను నేతలు  సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. 
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వే 
కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని...  నెల్లూరు రూరల్‌లో కొనసాగిస్తున్నారు. ఇంతవరకూ పాదయాత్ర ముగిసిన ప్రాంతాల్లో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వే చేసింది. పాదయాత్ర సమయంలో ఉన్న జోష్‌ తర్వాత కనిపించడంలేదని ఆ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై స్థానిక కార్యకర్తలు హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
ఎవరికి వారే అన్నచందంగా నేతల తీరు
జగన్ పాదయాత్ర సమయంలో కలిసికట్టుగా కనిపించే నేతలు ఆ తర్వాత ఎవరికి వారే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు.  క్షేత్ర స్థాయిలో జోష్‌ వచ్చిందని సంబరాలు చేసుకున్న నేతలు... దాన్ని కొనసాగించడంలో విఫలమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది.  ఆయా ప్రాంతాల్లో సమన్వయకర్తలే  అభ్యర్థులమని భావిస్తున్నారు. ఈవిషయం  కిషోర్‌ టీమ్‌ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.  దీంతో ఆయా నేతల వ్యవహార శైలిపై అధిష్టానం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇకపై స్థానిక నేతలపై దృష్టి పెట్టకపోతే.. పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వైసీపీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఇకపై అలాంటి నేతలపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

 

18:12 - January 16, 2018

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో సాధించింది ఏమీ లేదని, సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా చంద్రబాబుకు దొరకడం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు చంద్రబాబుకు ఏడాది సమయం పట్టిందన్నారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా తాను రాష్ట్రం కోసం 30సార్లు ఢిల్లీ వెళ్లానని చెబుతుంటారని.. అయితే వాటివల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏ మేలు జరిగిందని బుగ్గన నిలదీశారు.

న్యాయస్థానాల మాటకు విలువ ఎక్కడ - అంబటి...
ఏపీలో న్యాయస్థానాలు చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఏపీలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి.. కోళ్లకు కత్తులు కట్టి.. పందేలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కళ్లముందే ఇంత జరుగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పోలీసుల తీరును తప్పుపట్టారు. ఈ 3 రోజులు పోలీసులకు సెలవులు ఇస్తే బాగుండేదని అంబటి సలహా ఇచ్చారు. 

21:23 - November 15, 2017

కర్నూలు : జగన్‌ 9వరోజు ప్రజా సంకల్ప యాత్ర కర్నూల్‌ జిల్లాలో కొనసాగింది. పాదయాత్రలో చంద్రబాబు తీరుపై జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు తన మానిఫెస్టోని మాయం చేశారని అది ఉంటే ప్రజలు సీఎంను నిలదీస్తారన్నారు. ప్రజల సలహాలను తీసుకుని పాదయాత్ర ముగిసిన అనంతరం 2019మానిఫెస్టోని తయారు చేస్తానని జగన్‌ అన్నారు. చంద్రబాబు మానిఫెస్టోలాగా పేజీల కొద్ది తనది ఉండదని ప్రజలను మోసం చేసే విధంగా ఉండదని అన్నారు. అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తానన్నారు. 2019 మానిఫెస్టోలో పెట్టిన పనులు చేసిన తర్వాతే 2024లో ప్రజల ముందుకు వస్తానని జగన్‌ అన్నారు. 

21:18 - November 14, 2017

కర్నూలు : జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ఎనిమిదోరోజు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగల మర్రి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ జగన్‌ పాదయాత్ర సాగింది. జగన్ యాత్ర ఇవాళ వంద కిలోమీటర్లు దాటింది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి గ్రామస్థులకే ఉద్యోగం కల్పిస్తామన్నారు జగన్. 

18:52 - November 14, 2017

కర్నూలు : జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చాగలమర్రి గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. జిల్లాలోనే జగన్ పాదయాత్ర వంద కిలోమీటర్లు దాటింది. జిల్లాలో పాదయాత్రపై పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:48 - November 14, 2017

విజయవాడ : జగన్ కు ఇంగిత జ్ఞానం ఉందా ? అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌ తీరుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు నీరిచ్చి ఆదుకుంటుంటే.. జగన్‌ పల్నాడుకు నీరు తరలించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి క్షణం సీఎం కుర్చీ గురించే ఆలోచించే జగన్‌ ముఖ్యమంత్రి కాలేడని జేసీ అన్నారు. జగన్‌ రాజకీయాలు వదిలేసి పారిశ్రామిక వేత్తగా స్థిరపడాలని జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. 

13:09 - November 14, 2017

గుంటూరు : ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖలో ప్రతినెలా ఐటీ షో చేస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సిమెన్స్‌,సాప్‌,ఐబీఎమ్ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా 10 వేల మంది యువతీయువకులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

 

12:50 - November 14, 2017

విశాఖ : జిల్లాలోని అనకాపల్లి మండలం మారేడుతుడిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మూడేళ్ల కొడుకుని తంత్రి అతి కిరాతకంగా కత్తితో పొడి చంపేశాడు.

11:23 - November 14, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. ప్రధాన పక్షం లేకుండా సమావేశాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:44 - November 13, 2017

కడప : ప్రజలకు భరోసానిస్తూ జగన్‌ యాత్ర చేపట్టారని రాయచోటి ఎమ్మెల్యే  శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. చంద్రబాబు నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని విమర్శించారు. టీడీపీ పార్టీ.. పచ్చచొక్కాల వారికే సాయం చేస్తుందని ఆరోపించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - AP YCP Leaders