apsrtc

08:40 - July 16, 2018

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనబాట పట్టారు. వేతన ఒప్పందం చేయకుండా.. కేవలం కొద్దిపాటి ఐఆర్‌ ఇవ్వడంపై ఆర్టీసీ యాజమాన్యం మీద దాన్ని కుదుర్చుకున్న గుర్తింపు సంఘం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల యాజమాన్యం, ప్రభుత్వం తీరు మారాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:57 - May 26, 2018

విజయవాడ : మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టు తయారైంది ఏపీఎస్‌ ఆర్టీసీ పరిస్థితి. పెరిగిన డీజిల్‌ ధరలతో సంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పొదుపు చర్యలతో నష్టాలను పూడ్చుకోడానికి ఆపసోపాలు పడుతున్న ఆర్టీసీకి పెట్రోధరలు శరాఘాతంగా మారాయి. పరిస్థితి ఇలాగే ఉంటే టికెట్‌ చార్జీలు పెంచక తప్పదని యాజమాన్యం అంటోంది.

పెరుగుతున్న డీజిల్ ధరలతో కుదేలవుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ కుదేలవుతోంది. ఆర్టీసీ అభివృద్ధికి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలకు.. డీజిల్ ధరలు తూట్లు పొడుస్తున్నాయి. గత రెండు మాసాల్లోనే డీజిల్ పై లీటరుకు ఐదు రూపాయలు పెరగడంతో ఆర్టీసీకి పెనుభారంగా మారింది. దీంతో నెలకు పండున్నర కోట్ల మేర ఆర్టీసీపై అదనపు భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాది మొత్తం మీద నూటా యాభై కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

నాలుగు వందలా యాభై కోట్ల మేర నష్టం..
గతేడాది ఆర్టీసీకి సుమారు నాలుగు వందలా యాభై కోట్ల మేర నష్టం రాగా.. ఇందులో యాభై శాతం నష్టాలు డీజిల్ ధరలు పెరగడంతోనే వచ్చాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.. అంతర్గ సామర్థ్యాలు ఎంత పెంచుకున్నా.. విపరీతంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కలేకపోతోందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆర్టీసీపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కార్ ఆర్టీసీ సంస్థకు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు.

డీజిల్ ధరల ఎఫెక్ట్ తో ట్రిప్స్ తగ్గించిన ఆర్టీసీ..
డీజిల్ ధరల భారాన్ని తట్టుకోలేక ఆర్టీసీ పలు రూట్లలో ట్రిప్పులు తగ్గించేసింది. ఈ లెక్కన రోజుకు 40 వేల కిలోమీటర్ల మేర బస్ లు నడపడాన్ని తగ్గించారు. లాభనష్టాలు బేరీజు వేసుకుని రూట్లలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగానే బస్ సర్వీసులను నడుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు రద్దీ సమయాల్లో మాత్రమే బస్సులు నడుపుతున్నారు. ఇలా అరకొరగా నడపడంతో బస్సులు ప్రయాణీకుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. గంటలకొద్దీ బస్టాపుల్లో ప్రయాణీకులు పడిగాపులు పడాల్సి వస్తోంది.

డీజిల్‌ ధరలతో కుదేలవుతోందన్న ఆర్టీసీ..
ఆదాయం అంతంత మాత్రమే ఉన్న ఆర్టీసీ డీజిల్‌ ధరలతో కుదేలవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని బతికించాలంటే... చార్జీలు పెంచక తప్పదని అధికారులు యోచిస్తున్నారు. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి డీజిల్ రేట్ల పుణ్యమా అని ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. 

16:41 - May 3, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై ప్రభుత్వం, యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 6వ తేదీన అన్ని డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టాని ఆర్టీసీ జాక్ కార్మికులకు పిలుపునిచ్చింది. వేతన సవరణతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. వేతనాలు కూడా సకాలంలో చెల్లించాలేని దుస్థితి ఆర్టీసీలో నెలకొందని విమర్శించింది. తాము సమస్యల పరిష్కారానికి పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో ఐక్య పోరాటాల కోసం ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని నేతలు తెలిపారు. జేఏసీలోకి టీఎంయూ, ఎన్ఎంయూ, టీజేఎంయూ రావాలని ఆర్టీసీ జాక్ కోరింది. 

18:29 - May 2, 2018
15:37 - March 3, 2018

మేడ్చల్ : జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. డీసీఎం, నిల్వ ఉంచిన టైర్లు, ఆయిల్ కాలిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఆఫీస్ పక్కనే అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. పెద్దగా ఆస్తినష్టం జరగలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

12:14 - December 31, 2017


హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ ఎప్పుడు జరగనుంది? గత వేతన ఒప్పందం సందర్భంగా సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? వేతన సవరణకు ఆర్టీసి కార్మిక సంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలేంటి? పిఆర్సీ పట్ల ఆర్టీసి యాజమాన్యం వైఖరేంటి? అధికార పార్టీకి చెందిన గుర్తింపు సంఘం ఏమంటోంది? అనే అంశాలపై టెన్ టీవి స్పెషల్ స్టోరీ.. 
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురుచూపులు
తెలంగాణ ఆర్టీసీలో వేతన సవరణ గడువు ముగిసి ఎనిమిది నెలలు గడుస్తోంది. గత ఏప్రిల్‌లో కొత్త పీఆర్సీ ఇవ్వాల్సినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలే జరగడం లేదు. పే రివిజన్‌ కమిటీ వేసినప్పటికీ.. పీఆర్సీపై స్పష్టతే లేదని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. అయితే.. పీఆర్సీ సందర్బంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
పీఆర్సీ ఆలస్యమైన కొద్దీ వేతన బకాయిలు భారం 
ఇక పీఆర్సీ ఆలస్యమైన కొద్దీ వేతన బకాయిల భారం పెరగనుంది. రాష్ట్ర విభజన సమయంలో బకాయిలు చెల్లించడం భారం కావడంతో విడతల వారీగా 50 శాతం... మిగిలిన 50 శాతం బాండ్ల రూపంలో చెల్లించారు. ఈసారి కూడా అదే పరిస్థి నెలకొనే అవకాశముందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. 
వేతన సవరణ ప్రతిపాదనలిచ్చిన ఆర్టీసీ సంఘాలు  
వేతన సవరణ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసిన కమిటీకి... ఆర్టీసీ సంఘాలు వేతన సవరణ ప్రతిపాదనలు ఇచ్చాయి. టీఎంయూ 50 శాతం, ఎంప్లాయిస్‌ యూనియన్‌ 62 శాతం, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 70 శాతం వేతనం పెంచాలని ప్రపోజల్స్‌ ఇచ్చాయి. అయితే ఇప్పటి వరకు కమిటీ మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. అయితే... 50 శాతం ఖచ్చితంగా వేతన సవరణ సాధిస్తామని గుర్తింపు సంఘమైన టీఎంయూ ధీమా వ్యక్తం చేస్తోంది. 
62శాతం వేతన సవరణ జరగాలి : ఈయూ 
ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనం రావాలంటే 62శాతం వేతన సవరణ జరగాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ అంటోంది. 
70శాతం వేతన సవరణ జరగాలన్న ఎస్ డబ్ల్యు ఎఫ్  
కనీస వేతనం 18 వేలు ఉండాలంటే.. 70శాతం వేతన సవరణ జరగాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకత్వమంటోంది. వేతన సవరణే కాకుండా సర్వీసు రూల్స్, రెగ్యూలేషన్స్ కూడా సవరించాలని డిమాండ్‌ చేస్తోంది. పీఆర్సీ విషయంలో యాజమాన్యం తీరు సరిగా లేదనడానికి గుర్తింపు సంఘం నిరసనలు, దీక్షలు చేపట్టడమే దానికి నిదర్శమని వామపక్షయూనియన్‌ నేతలంటున్నారు.  
పీఆర్సీ ఉసేత్తని సీఎం కేసీఆర్ 
గత వేతన ఒప్పందం సందర్భంగా.. వేతన సవరణ గడువుకు ముందే పీఆర్సీ ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. గడువు ముగిసి ఎనిమిది నెలలైనా ఆ ఊసే ఎత్తకపోవడంపై ఆర్టీసీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

17:17 - December 30, 2017
13:22 - December 30, 2017

విజయవాడ : కొత్త ఏడాదిలో బ్యాటరీతో నడిచే బస్సులను ప్రవేశపెడతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ డాక్డర్ ఎం.మాలకొండయ్య అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా ప్రయాణికులకు చాలా మెరుగైన సేవలు అందించామని చెప్పారు. 2017 సం.లో ఏపీఎస్ ఆర్టీసీ సవాళ్లను ఎదుర్కొని నిల్చిందన్నారు. నష్టాలను కొంతవరకు తగ్గించామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:33 - December 12, 2017

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్టాఫ్‌ ఆండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్య్లూఎఫ్‌) నాయకులు వీఎస్‌ రావ్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. పని భారం పెంచుతున్నారు. కార్మిక చట్టాలు అమలు లేదు. పే స్కేల్‌ లేదు. ఇది ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్న మాట. వారి ఆందోళనకి దారి తీసిన పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తదితర అంశాలపై వీఎస్‌ రావ్‌ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

22:07 - October 30, 2017

యాదాద్రి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. యాదగిరిగుట్ట మండలంలోని భువనగిరి..ఆలేరు సమీపంలో బాహుపేట స్టేజి వద్ద ఆర్టీసీ వజ్ర బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆలో డ్రైవర్ సహా ఐదు మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Pages

Don't Miss

Subscribe to RSS - apsrtc