army jawan

15:56 - August 12, 2017

శ్రీనగర్ : పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌లోని మెండర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ కాల్పులు జరిపింది. పాక్‌ ఆర్మీ మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఎల్వోసి వద్ద పాకిస్తాన్‌ సేనకు భారత్‌ తగినరీతిలో జవాబు చెప్పింది. పాకిస్తాన్‌ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 250 సార్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మరోవైపు కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అర్ధరాత్రి దాటాక దూరం నుంచి కాల్పులు జరిపారు. జవాబుగా ఆర్మీ కూడా కాల్పులు జరపడంతో చీకటిని ఆసరగా చేసుకుని ఉగ్రవాదులు పారిపోయారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

20:02 - July 6, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఓ ఆర్మీ జవాను అదృశ్యమయ్యాడు. పుల్వామా ఆర్మీ క్యాంప్‌కు చెందిన జవాను జహుర్‌ ఠాకూర్‌ ఏకే-47 తుపాకీతో సహా అదృశ్యం కావడం ఆర్మీ వర్గాల్లో కలకలం రేపింది. ఉగ్రవాద సంస్థలతో పాలుపంచుకునేందుకే అతడు ఆర్మీ క్యాంప్‌ నుంచి తప్పించుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జహూర్‌ బుధవారం రాత్రి నుంచి కనిపించడం లేదని సమాచారం. ఒకవేళ జహూర్‌ ఉగ్రవాద సంస్థలో చేరితే చాలా ప్రమాదమేనని...ఆర్మీకి చెందిన రహస్యాలు ఉగ్రవాదులకు చేరవేస్తాడన్న భయాందోళన వ్యక్తమవుతోంది. గతనెల కానిస్టేబుల్‌ సయీద్‌ నావీద్‌ ముస్తాక్‌ నాలుగు రైఫిళ్లతో పారిపోయి ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు.

 

12:00 - March 16, 2016

వరంగల్ : ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచార ఘటనను వెలుగులోకి తెచ్చిన టెన్ టివి కథనంపై పోలీసులు స్పందించారు. సీపీ సుధీర్ బాబు ఈ ఘటనపై ఆరా తీశారు. అనుమానితులుగా భావిస్తున్న పసునూరి వెంకటేష్, సాయిరామ్, వెంకటేష్, మహేష్ లను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మసాగర్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.
ధర్మసాగర్ మండలం కరుణాపురంలో దళిత యువతిపై ఓ రాత్రి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో పెట్రోలింగ్ వ్యాన్ రావడం చూసిన యువకులు పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు ముళ్ల పొదల్లో వెతికారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతి కనిపించింది. వెంటనే ఈమెను వైద్య శాలకు తరలించారు. కోలుకున్న అనంతరం సదరు యువతిని ధర్మసాగర్ పీఎస్ కు తరలించి వివరాలు సేకరించారు. అత్యాచారం చేసిన వారిలో ఓ జవాన్ ఉన్నట్లు, రాజకీయ వత్తిళ్ల కారణంగా ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి.

10:22 - March 16, 2016

వరంగల్ : దళితులు..వీరిపై ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఓ 19 సంవత్సరాల దళిత యువతిపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఓ జవాన్ కూడా ఉండడం..పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతి స్నేహితుడే మోసం చేశాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..ధర్మసాగర్ మండలం కరుణాపురంలో దళిత యువతిపై ఓ రాత్రి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో పెట్రోలింగ్ వ్యాన్ రావడం చూసిన యువకులు పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు ముళ్ల పొదల్లో వెతికారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతి కనిపించింది. వెంటనే ఈమెను వైద్య శాలకు తరలించారు. కోలుకున్న అనంతరం సదరు యువతిని ధర్మసాగర్ పీఎస్ కు తరలించి వివరాలు సేకరించారు. కానీ ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి కేసు నమోదు చేయలేదని ధర్మసాగర్ పోలీసులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

07:06 - October 4, 2015

హైదరాబాద్ : నగరంలోని లంగర్‌ హౌజ్‌ ప్రాంతంలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌పై ఆర్మీ జవాను దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు పరస్పరం ఘర్షణ పడగా ఆర్మీ జవాను హెల్మెట్‌తో కానిస్టేబుల్‌ తలపై దాడి చేసినట్లు సమాచారం.

 

Don't Miss

Subscribe to RSS - army jawan