Asifa bano

16:46 - April 19, 2018

తమ కుటుంబం తమ సౌలభ్యం అనుకునేవారు ఎంతోమంది. తమతోపాటు సమాజం కూడా బాగుండాలనుకునేవారు కొంతమంది. కానీ సమాజంలో కోసం, మాతృదేశానికి సేవల చేయాలని, కష్టాలలో వున్న వారికి అండగా నిలబడాలని అనుకునేవారు మాత్రం అతి కొద్దిమందే వుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. అయినా లెక్కచేయక..బెదిరింపులకు బెదరక..నమ్మిన ఆశయం కోసం నిలబడే ధీరలు అతి కొద్ది మంది మాత్రమే వుంటారు. అటువంటి ధీర దీపికా సింగ్ రజావత్.

సమాజాన్ని కదిలించిన అసిఫా ఘటన..
కొన్ని ఘటనలో సమాజాన్ని కదిలిస్తాయి. మరికొన్ని సంఘటనలో సమాజానికి చైతన్యాన్ని కలిగిస్తాయి. అటువంటి ఘటన నిర్భయ ఘటన..ప్రస్తుం ఇప్పుడు చిన్నారి అసిఫా ఘటన కూడా ఇంచుమించు అటువంటిదే. ముక్కుపచ్చలారని అసిఫాను అత్యంత పాశవికంగా చంపివేసిన ఘటనతో యావత్ భారతం మరోసారి ఉలిక్కిపడింది. దేశం మొత్తం అసిఫా బానో కోసం విలపిస్తోంది. ఆ పసికందు లేతదేహంపై కామ పిశాచాలు, కక్షల దెయ్యాలు.. దేవుడి గుడి సాక్షిగా చేసిన గాయాలు మనసున్న ప్రతి మనిషినీ కదిలిస్తున్నాయి. ఎనిమిదేళ్ల అసిఫాపై హిందువుల గుడిలో వారం పాటు సాగిన సామూహిక అత్యాచారం, మాటల్లో చెప్పలేని విధంగా జరిగిన ఘటనకు మాటలు చాలవు. డ్రగ్స్ ఇచ్చి వారంరోజులపాటు జరిగిన ఆ హింసాకాండకు చిన్నారి ఛిద్రమైపోయింది. ఆ తల్లి గుండె పగిలిపోయాయి. తండ్రి ఆవేదనకు అంతులేకుండా పోయింది. దీనికంతటికీ కారణం మనోన్మాదం అంటే అంతకంటే సిగ్గుపడే విషయం మరొకటి వుంటుందా? ముస్లింలపై కక్ష సాధించేందుకు ఓ చిన్నారిని ఛిద్రం చేసిన పశుసంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తోంది. కానీ బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు అండగా నిలబడింది ఓ మానవ మాతృమూర్తి..

యావత్‌దేశాన్ని కదిలించింది ఘటన కథువా ఘటన..
యావత్‌దేశాన్ని కదిలించింది కథువా ఘటన. నిర్భయ ఘటనను మరోసారి గుర్తు చేసింది. అసీఫా ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ల కుటుంబంతోపాటు పోరాడుతోంది మహిళా న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌. ఈ కేసును వదిలేయమని జమ్మూ కశ్మీర్‌ బార్‌ అసోసియేషన్‌ నుంచి బెదిరింపులూ, అవమానాలు ఎదురైనా ఆమె ఏ మాత్రం జంకకుండా నిందితులకి శిక్ష పడే వరకూ పోరాటం చేయాలనే నిర్ణయించుకుంది. ఓ సాధారణ న్యాయవాది అయిన దీపిక ఈ సంచలన కేసును తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా...జమ్మూ కశ్మీర్‌కి చెందిన దీపిక న్యాయవాది మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా. సైన్యంలో పనిచేసిన భర్త ప్రస్తుతం బెహ్రెయిన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను బెహ్రెయిన్‌ వచ్చేయమని అడిగినా మాతృదేశానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఐదేళ్ల కూతురితో కలిసి జమ్మూకశ్మీర్‌లోనే వుండిపోయింది దీపిక.

స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన దీపికా..అసిఫా తల్లిదండ్రులకు అండగా నిలిచిన దీపిక..
దీపిక మహిళలూ, చిన్నారులకు పలు రకాలుగా సాయపడటానికి ఓ స్వచ్ఛంద సంస్థనూ ప్రారంభించింది. దీంతో ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా పలు రకాలుగా సాయమందిస్తుంటుంది. దీపికకు అసీఫా గురించి తెలియగానే ఆ పాప తండ్రిని సంప్రదించింది. ఆ కేసును తానే వాదిస్తానని చెప్పింది.

దీపికాపై దాడులు చేసిన బార్ అసోషియేషన్..
ఎప్పటికప్పుడు పోలీసుల చర్యలూ.. క్రైంబ్రాంచీ వారి నేర పరిశోధన గురించి తెలుసుకుంటూనే ఉండేది. అయితే ‘ఒకానొక దశలో పాప శవం మీద ఉన్న దుస్తుల్ని కొందరు తెలియకుండా తీసి ఉతికి పెట్టారు. ఆ సమయంలో నేరస్తులు దొరకరేమోనని చాలా ఆందోళన పడింది. కానీ కాస్త ఆలస్యమైనా... నిజం నిలకడ మీద తెలిసింది’ అంటుంది దీపిక. ఈ కేసు విషయంలో దీపిక మీద బార్‌ అసోషియేషన్‌లోని న్యాయవాదులు దాడులు చేయడమే కాదు.. కేసు ఉపసంహరించుకోకపోతే ప్రాణం తీస్తామని బెదిరించారు. అయినా ఆమె పట్టించుకోలేదు. పోలీసుల రక్షణ కోరింది. వారి సహకారంతోనే ప్రస్తుతం ముందడుగు వేస్తోంది.

నిస్సహాయులకు అండగా నిలిస్తున్న న్యాయవాది దీపిక..
అయితే ఆమె మాత్రం అసీఫా తల్లిదండ్రులకోసం ఎంతో బాధపడుతోంది. కూతురి మరణం జీర్ణించుకోలేక.. రాజకీయ నాయకుల బెదిరింపులు తట్టుకోలేక అనుక్షణం బిక్కుబిక్కుమంటున్న ఆ నిస్సహాయులకు తీర్పుతోనైనా సాంత్వన అందించాలని పట్టుదలగా ఉంది దీపిక. గంటకు ఇంత అనే పేపెంట్ కోసం దేశంపై దాడి చేసిన ఉగ్రవాదుల తరపున కూడా వాదించే న్యాయవాదులున్నారు. అసలు వారిని న్యాయవాదులు అనుకోవాలా. న్యాయాన్ని అమ్ముకునే వాదులు అనటం సరైన పదమే నయం. ఇదే భారతంలో దీపికవంటి అసలైన న్యాయవాదులు అంటే న్యాయం కోసం నిలబడి న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు వుండటం మంచి పరిణామం. దీపిక వంటి న్యాయవాదులకు ప్రతీ ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవుసరం వుంది. అప్పుడే సామాన్యులకు న్యాయం జరిగే అవకాశం వుంటుంది. అందుకే దీపికా ధీరకాకమ మేరేమిటి? అసిఫా జీవితాన్ని మొగ్గలోనే చిదిమేసిన పశువులకు కఠిన శిక్ష పడాలనీ..దీపిక చేస్తున్న న్యాయం పోరాటం ఫలించాలని ఆశిద్దాం..

10:39 - April 19, 2018

మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు దుర్మార్గమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత క్రిషాన్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు పెరిగాయని అన్నారు. రేపిస్టులకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:24 - April 19, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం, హత్య దుర్మార్గమని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:49 - April 18, 2018

జమ్మూ కాశ్మీర్ : కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచారంపై భారతీయులందరూ సిగ్గు పడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌ కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా కోవింద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన సమాజం ఎటువైపు పోతోందో ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్రపతి తెలిపారు. ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికం చూపడం అత్యంత దారుణమైన చర్యగా పేర్కొన్నారు. 

08:10 - April 18, 2018

విజయవాడ : జమ్మూకశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫా పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కథువా హంతకులను కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.   
విజయవాడలో
ఆసిఫాపై జరిగిన ఆత్యాచార ఘటనను నిరసిస్తూ విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుల దిష్టిబొమ్మలకు బాణాలు  ఎక్కుబెట్టారు. దిష్టిబొమ్మ దగ్ధం చేసి కొవ్వొత్తుల ప్రదర్శనతో  అసిఫాకు నివాళి అర్పించారు.
కడపలో 
కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథువా ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైదని విమర్శించారు. బేటీ బచావో అంటే ఇదేనా అని ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు ఊడ్చడం కాదని బీజేపీలోని కేంద్ర మంత్రులు ఏంపీలు కూడా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. 
రాజమండ్రిలో
రాజమండ్రిలోనూ ఆసిఫా హంతకులని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేస్తూ మహిళలు కదం తొక్కరు. ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించలేని మోదీ ప్రభుత్వం తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ నేతలూ పాల్గొన్నారు. 
అనంతపురంలో 
చిన్నపిల్లల పై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ అనంతపురంలో ఎస్ కేయూ విద్యార్థులు నిరసన చేపట్టారు. అసిఫా హంతకులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిందితులని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  
మేడ్చల్ లో
మేడ్చల్ జిల్లా జర్నలిస్టు సంఘాల  ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్ ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ అసమర్థత వల్లే ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని జర్నలిస్టులు విమర్శించారు. 
తూర్పుగోదావరిలో 
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోనూ..  అసిఫా హత్యోదంతాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి దుశ్చర్యలకు ఇంకెవ్వరూ పాల్పడకుండా హంతకులను ఉరితీయాలని డిమాండ్‌ చేశారు.  

 

15:44 - April 17, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై మానవి వేదిక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు హైమావతి, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య పాల్గొని, మాట్లాడారు. కథువా ఘటన చాలా దారుణమైన ఘటన అన్నారు. ఈ ఘటన మానవ సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:42 - April 16, 2018

కథువా ఘటన ఏం సూచిస్తుంది ? మతోన్మాదానికి ఇంత వికృత రూపం ఉంటుందా ? రేపిస్ట్ మనవాడైతే మహిళలు కూడా మద్దతు పలకొచ్చా ? మతోన్మాదం వెర్రితలలు.. అనే అంశంపై వీక్షణం...వేణుగోపాల్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'అత్యాచారం, హత్య క్రూరమైన నేరం. మనుషులున్నా దేశమేనా అన్న అనుమానం కల్గుతుంది. మతోన్మాదం అథమస్థాయికి దిగజారింది. హిందూ మతోన్మాదం క్రూరమైంది. చట్టాల కంటే సామాజిక అవగాహన జరగాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:44 - April 16, 2018

ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌ లోని కథువాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను చంపిన వారిని ఉరి తీయాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు.

మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని బాధిత కుటుంబం పేర్కొంటోంది. ఆసిఫా అత్యాచారం, హత్య కేసును కథువా కిందిస్థాయి కోర్టు స్వీకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ నుండి చండీగడ్ కు ఈ కేసును తరలించాలంటూ బాలిక తండ్రి సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసుపై మధ్యాహ్నం సుప్రీం విచారించనుంది. కేసును తరలిస్తారా ? లేదా ? అనేది చూడాలి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:30 - April 14, 2018

ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావ్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో బిజెపి ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ను సిబిఐ అదుపులోకి తీసుకుంది. లక్నోలోని సిబిఐ కార్యాలయంలో సెంగార్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం ఆయనను సిబిఐ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. బాలికపై అత్యాచారం, ఆమె తండ్రి కస్టడీలో మరణించడం లాంటి మూడు కేసులు సెంగార్‌పై నమోదు చేశారు. ఎమ్మెల్యే సెంగార్‌న్‌ కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది. ఈ కేసుకు సంబంధించి సెంగార్‌ను అరెస్ట్‌ చేయాల్సిందేనని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రేప్‌ కేసులో సిబిఐ విచారణ చేపట్టడాన్ని ఎమ్మెల్యే స్వాగతించారు. తాను మెడికల్‌ టెస్టుకు కూడా సిద్ధమేనని...దీంతో నిజాలు వెలుగు చూస్తాయని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. అవినీతి, అత్యాచారాల విషయంలో తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్‌ నీతినే అవలంబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అత్యాచారం కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను సిబిఐ ఇప్పటికే అరెస్ట్‌ చేసిందని తెలిపారు. ఈ కేసు వెలుగులోకి రాగానే సిట్‌ వేసి దర్యాప్తు ప్రారంభించామని, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసును సిబిఐకి అప్పగించామని యోగి తెలిపారు.

09:25 - April 14, 2018

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కథువా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండనే సరైన శిక్షగా పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మేనకాగాంధీ తెలిపారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతుండడంతో బాధితురాలి కుటుంబం గ్రామం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

Pages

Don't Miss

Subscribe to RSS - Asifa bano