Asifa Father Petition In Supreme Court

10:39 - April 19, 2018

మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు దుర్మార్గమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత క్రిషాన్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు పెరిగాయని అన్నారు. రేపిస్టులకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:24 - April 19, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం, హత్య దుర్మార్గమని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:10 - April 18, 2018

విజయవాడ : జమ్మూకశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫా పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కథువా హంతకులను కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.   
విజయవాడలో
ఆసిఫాపై జరిగిన ఆత్యాచార ఘటనను నిరసిస్తూ విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుల దిష్టిబొమ్మలకు బాణాలు  ఎక్కుబెట్టారు. దిష్టిబొమ్మ దగ్ధం చేసి కొవ్వొత్తుల ప్రదర్శనతో  అసిఫాకు నివాళి అర్పించారు.
కడపలో 
కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథువా ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైదని విమర్శించారు. బేటీ బచావో అంటే ఇదేనా అని ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు ఊడ్చడం కాదని బీజేపీలోని కేంద్ర మంత్రులు ఏంపీలు కూడా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. 
రాజమండ్రిలో
రాజమండ్రిలోనూ ఆసిఫా హంతకులని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేస్తూ మహిళలు కదం తొక్కరు. ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించలేని మోదీ ప్రభుత్వం తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ నేతలూ పాల్గొన్నారు. 
అనంతపురంలో 
చిన్నపిల్లల పై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ అనంతపురంలో ఎస్ కేయూ విద్యార్థులు నిరసన చేపట్టారు. అసిఫా హంతకులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిందితులని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  
మేడ్చల్ లో
మేడ్చల్ జిల్లా జర్నలిస్టు సంఘాల  ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్ ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ అసమర్థత వల్లే ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని జర్నలిస్టులు విమర్శించారు. 
తూర్పుగోదావరిలో 
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోనూ..  అసిఫా హత్యోదంతాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి దుశ్చర్యలకు ఇంకెవ్వరూ పాల్పడకుండా హంతకులను ఉరితీయాలని డిమాండ్‌ చేశారు.  

 

15:44 - April 17, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై మానవి వేదిక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు హైమావతి, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య పాల్గొని, మాట్లాడారు. కథువా ఘటన చాలా దారుణమైన ఘటన అన్నారు. ఈ ఘటన మానవ సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:42 - April 16, 2018

కథువా ఘటన ఏం సూచిస్తుంది ? మతోన్మాదానికి ఇంత వికృత రూపం ఉంటుందా ? రేపిస్ట్ మనవాడైతే మహిళలు కూడా మద్దతు పలకొచ్చా ? మతోన్మాదం వెర్రితలలు.. అనే అంశంపై వీక్షణం...వేణుగోపాల్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'అత్యాచారం, హత్య క్రూరమైన నేరం. మనుషులున్నా దేశమేనా అన్న అనుమానం కల్గుతుంది. మతోన్మాదం అథమస్థాయికి దిగజారింది. హిందూ మతోన్మాదం క్రూరమైంది. చట్టాల కంటే సామాజిక అవగాహన జరగాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:44 - April 16, 2018

ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌ లోని కథువాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను చంపిన వారిని ఉరి తీయాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు.

మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని బాధిత కుటుంబం పేర్కొంటోంది. ఆసిఫా అత్యాచారం, హత్య కేసును కథువా కిందిస్థాయి కోర్టు స్వీకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ నుండి చండీగడ్ కు ఈ కేసును తరలించాలంటూ బాలిక తండ్రి సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసుపై మధ్యాహ్నం సుప్రీం విచారించనుంది. కేసును తరలిస్తారా ? లేదా ? అనేది చూడాలి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss

Subscribe to RSS - Asifa Father Petition In Supreme Court