assembly elections

21:10 - November 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వల్లే పోటీపై సందిగ్ధం ఏర్పడిందన్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు వస్తే.. తెలంగాణలో 25 అసెంబ్లీ స్థానాల్లో, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై..రెండు, మూడు రోజుల్లో పార్టీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు సన్నదత లేకపోవడంతో పోటీ గురించి సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు కొంతమంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోతున్నామని.. తమకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారని తెలిపారు.

 

15:11 - November 8, 2018

దంతేవాడ: నవంబర్ 12 ఎన్నికల జరగనున్న చత్తీస్ ఘడ్  రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం చత్తీస్ ఘడ్ లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక రోజు ముందు మావోయిస్టులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. చత్తీస్ ఘడ్  రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని బచేలి సమీపంలో గురువారం మావోయిస్టులు ఒక బస్సుపై  దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తో సహా ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
గడచిన 2 వారాల్లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులకు పాల్పడటం ఇది మూడోసారి.  అక్టోబర్ 30 న ఎన్నికల వార్తల కవరేజ్ కు  వెళ్లిన దూరదర్శన్ టీంపై పైదాడి చేయగా దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానందన్ మరణించారు.  వారికి రక్షణగా వెళ్లిన  మరో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 27న  ఆవపల్లి వద్ద జరిగిన మరో దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు  మరణించారు.
90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చత్తీస్ ఘడ్ లో తొలిదశ పోలింగ్  నవంబర్ 12న జరుగుతుంది.  తొలిదశలో  మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న 8 జిల్లాల్లోని 18 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, మిగిలిన  72 నియోజకవర్గాలలో నవంబర్  20న పోలింగ్ జరుగుతుంది. 

07:54 - October 31, 2018

ఢిల్లీ: ఎన్నికల ప్రచార వార్తలు కవర్ చేయటానికి వెళ్లి  ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టుల దాడిలో మరణించిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద సాహు కుటుంబాన్నిఆదుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ చెప్పారు. నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌ఘడ్ లోని దంతేవాడ జిల్లా ఆరాన్పూర్ లో ఎన్నికల ప్రచారవార్తలు కవర్ చేయటానికి వెళ్లిన  దూరదర్శన్ మీడియా సిబ్బందిపై మంగళవారం మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈఘటనలో కెమెరామెన్ సాహూతోపాటు ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు పోలీసులను దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని,అదే సమయంలో దాడి జరిగిందని ఎస్పీ అభిషేక్ పల్లవ్ చెప్పారు.

07:11 - October 24, 2018

ఉత్తరప్రదేశ్ : ఓ సీఎం కాళ్లపై మరో సీఎం కాళ్లమీద పడి నమస్కరించిన ఘటన చోటుచేసుకుంది. పాదాభివందనం చేస్తేనే రాజకీయాల్లో ఎదగగలం అనే ఉద్ధేశంతోనే ఏమో మరి ఓ సీఎం తనకంటే దాదాపు 20 సంవత్సరాల వయసు వున్న మరో సీఎం కాళ్లమీద పడి ఆశీస్సులు తీసుకున్న ఘటనతో రాజకీయాల్లో ఎదుగుదల కోసం నేతలు ఎంతటి స్థాయికన్నా దిగజారతారనే విషయం మరోసారి తేటతెల్లమయ్యింది. మరి కాళ్ల మీద పడిన సీఎం ఎవరు? ఏ సీఎం కాళ్లమీద పడ్డారో తెలుసుకుందాం..

Image result for yogi adityanath and raman singhఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి  చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ నమస్కరించారు. చత్తీస్ గఢ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజ్ నంద్ గావ్ నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన వేళ సీఎం రమణ్ సింగ్ యోగి కాళ్ళకు నమస్కరించారు. తనకన్నా దాదాపు 20 సంవత్సరాలు చిన్నవాడైన ఆదిత్యనాథ్ కు రమణ్ సింగ్ పాదాభివందనం చేయడం గమనార్హం. 

19:36 - October 19, 2018

ఆదిలాబాద్‌: ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. నోటుతో ఓటు కొనేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కసరత్తులు మొదలుపెట్టింది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు నిఘా పెంచింది. ఈ నిఘాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. 

తాజాగా ఆదిలాబాద్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ.10కోట్ల నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. జైనథ్ మండలం పిప్పర్వాడ చెక్‌పోస్టులో తనిఖీలు చేస్తుండగా.. ఓ కారులో తరలిస్తున్న నగదుని పోలీసులు గుర్తించారు. నగదుని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దానిపై ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కారులో నగదుని హైదరాబాద్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల్లో ఖర్చుచేసేందుకు డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

22:00 - May 9, 2018

బెంగళూరు : కర్నాటకలో ప్రచారం చరమాంకానికి చేరింది. ప్రతిష్టాత్మక బాగేపల్లి నియోజకవర్గంలో.. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అయితే.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి.. సాయికుమార్‌ సినీ గ్లామర్‌ను దీటుగా ఎదుర్కొంటున్నారు. 
అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నిక  
కర్నాటక రాష్ట్రం.. చిక్కబళాపూర్‌ జిల్లాలోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ ద్విభాషానటుడు సాయికుమార్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయన ప్రత్యర్థిగా.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి బరిలో నిలిచారు. ప్రచారం చరమాంకానికి చేరడంతో ఇద్దరు అభ్యర్థులూ.. వీలైనంత మంది ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
బాగేపల్లి నియోజకవర్గం.. కమ్యూనిస్టులకు కంచుకోట
బాగేపల్లి నియోజకవర్గం.. 1978 నుంచీ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది. తొలిదశ నుంచీ బీజేపీకి ఇక్కడ పెద్దగా కేడర్‌ లేదు. నియోజకవర్గంలో ఓ స్థానిక సంస్థలో కూడా పార్టీ ప్రాతినిథ్యం లేదు. అయితే.. అమ్మగారి ఊరు అంటూ సాయికుమార్‌ ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సెంటిమెంట్లు బాగేపల్లిలో పనిచేయవని.. ప్రజలు తమ కోసం అహర్నిశలు కష్టపడే శ్రీరామరెడ్డికే పట్టం కడతారని సీపీఎం నాయకులు ధీమాగా ఉన్నారు. 
2008లో పోటీ చేసి సాయికుమార్‌ పరాజయం 
బీజేపీ అభ్యర్థి సాయికుమార్‌..  2008లో కూడా బాగేపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తయినా చూడలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల వేళ ఓట్ల కోసం రావడాన్ని స్థానిక ఓటర్లు ఎద్దేవా చేస్తున్నారు. 
శ్రీరామరెడ్డిని గెలిపించుకుంటాం.. 
బాగేపల్లి నియోజకవర్గంలో.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో.. ఓటర్లు అభివృద్ధి కాముకులకే పట్టం కడతామంటున్నారు. ప్రజల కోసం కష్టపడే శ్రీరామరెడ్డిని గెలిపించుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే, బీజేపీ శిబిరం మాత్రం తమకు ఓటర్లు అవకాశం ఇస్తారన్న ఆశతోనే ఉన్నారు. గెలిస్తే నియోజకవర్గానికి ఏమేమి చేయాలని భావిస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 
శ్రీరామరెడ్డి వైపే... అత్యధిక ఓటర్లు మొగ్గు 
గెలుపోటములతో నిమిత్తం లేకుండా.. నిత్యం ప్రజల మధ్యే ఉండే శ్రీరామరెడ్డి వైపే... అత్యధిక ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు ఎన్నికల్లో శ్రీరామరెడ్డిని ఓడించడం వల్ల.. నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని.. ఈసారి ఆ పొరపాటు చేయరాదన్న భావన ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. 

 

15:03 - May 9, 2018

బెంగళూరు : కర్నాటక ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అనంతపురం జిల్లాకు బార్డర్‌లో ఉన్న చిక్‌ బళాపూర్‌ జిల్లా బాగేపల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ సీపీఎం ... మాజీ ఎమ్మెల్యే శ్రీరాంరెడ్డిని బరిలో నిలిపింది. సీపీఎం అభ్యర్థి శ్రీరాంరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి సీపీఎం అభ్యర్థి శ్రీరాంరెడ్డి గట్టిపోటీ నిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని చెప్తోన్న శ్రీరాంరెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని శ్రీరాంరెడ్డి అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:31 - May 9, 2018

ఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం ఊపందుకుంది. విజయపురి ఎన్నికల సభలో ప్రసంగించిన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ- మోదీ పాలనపై ధ్వజమెత్తారు. మోదీకి 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' భూతం పట్టుకుందని విమర్శించారు. మోదినీ మంచి వక్తగా పేర్కొన్న సోనియా...ఉపన్యాసాలు కడుపు నింపవన్నారు. ఉపన్యాసాలతో కడుపులు నిండుతాయనుకుంటే మోది మరిన్ని ఉపన్యాసాలివ్వవచ్చని సూచించారు. మోది హయాంలో ధరలు ఆకాశాన్నంటాయని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోతుండడంపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేసిందని చెప్పారు. సోనియాగాంధీ రెండేళ్ల తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 

07:30 - May 9, 2018

కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గురువారం నాటితో ప్రచారానికి సమాప్త కానుంది. ఈ నేపథ్యంలో అధికార..ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తారని ప్రధాని నరేంద్రమోది అనగా.. విజయపురి ఎన్నికల సభలో ప్రసంగించిన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ - మోదీ పాలనపై ధ్వజమెత్తారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ఎన్ వి సుభాష్ (బిజెపి), రామ శర్మ (ఏపీ కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:04 - March 3, 2018

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ను భారీ భద్రత నడుమ ప్రారంభమైంది. ప్రధానంగా త్రిపురపైనే అందరి దృష్టి నెలకొంది. గత 25 ఏళ్లుగా అక్కడ సీపీఎం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కాషాయం జత కట్టి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించింది. అందులో భాగంగా త్రిపురలో ఇండిజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపురతో జతకట్టింది. విభజన రాజకీయాలకు తెరలేపడం..రాష్ట్రంలో చిచ్చు రేపడానికి ప్రయత్నించిందని సీపీఎం నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రం విభజించాలని కోరుతున్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కారణమని తెలుస్తోంది.

గత మూడు సంవత్సరాలుగా ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సంఘ్ పరివార్ శక్తులు కొన్ని ప్రయత్నాలు చేసినా వామపక్ష భావాలు బలంగా ఉండడం ఆ ప్రయత్నాలు అంతగా పారలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పశ్చిమబెంగాల్ జరుగుతున్న పరిణామాలు, సమీకరణాలు త్రిపుర ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మేఘాలయాలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా నాగాలాండ్ లో మాత్రం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - assembly elections