attacks against Dalits

13:56 - August 24, 2018

విజయవాడ : కౌన్సిలర్‌గా గెలవలేని బీజేపీ నేతలు కూడా మాట్లాడ్డం దురదృష్టకరమన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. తగులబెట్టి మీదవేసి.. తుడిచుకోండి అన్నచందంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకే బీజేపీ నేతలు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారంటున్న మంత్రి నక్కా ఆనందబాబుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:44 - December 7, 2017

హైదరాబాద్ : దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం  న‌త్తకు న‌డ‌క‌ నేర్పుతోంది.  కార్యక్రమం  ప్రారంభం నుంచి  మూడు అడుగుల ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నచందంగా తయారైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత  మూడేళ్లలో కేవలం 3741 మందికే భూ పంపిణీ జరిగిందంటే... ఈ పథకం అమలు తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో నత్తనడకన సాగుతున్న భూ పంపిణీ పథకంపై 10 టీవీ ప్రత్యేక కథనం... 

దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్‌ చెబుతూ వస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పంపిణీ పథకాన్ని టీఆర్‌ఎస్‌ అమల్లోకి తెచ్చింది. కానీ ఆరంభించిననాటి నుంచి కూడా ఈ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఉద్యమంలో భూ పంపిణీ పథకంపై టీఆర్‌ఎస్‌ చేసిన హడావుడికి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న తీరుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రభుత్వ భూమిలేకపోతే కొనైనా ఇస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఆ తర్వాత విషయాన్ని విస్మరించారన్న విమర్శలున్నాయి. మూడేళ్లలో కేవలం 3,741 మందికే భూమి ఇచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 807మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరికి 50 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో  10వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఎస్సీ ఆర్థిక  సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నా...  ఇంతవరకు 93.80 కోట్ల రూపాయల వ్యయంతో 2005 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. జగిత్యాల, జనగాం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి భువనరిగి జిల్లాల్లో ఒక ఎకరా భూమి కూడా పంపిణీ చేయలేదు. ఖమ్మంలో 9మందికి, కుమ్రం భీం జిల్లాల్లో నలుగురికి మాత్రమే భూ పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌లో 199 మందికి, జోగులాంబ-గద్వాల జిల్లాలో 77, సిద్దిపేట జిల్లాలో 71, వనపర్తిలో 75 మందికి పంపిణీ చేశారు. మిగతా జిల్లాల్లో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.

ఈ పథకం సక్రమంగా అమలు జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎకరం భూమి కొనుగోలుకు 7 లక్షల రూపాయలకు మించరాదన్న నిబంధన విధించారు.  ఈ ధరకు భూమి లభించే అవకాశాలున్నా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల జోక్యం ఎక్కువవుతోందన్న విమర్శలున్నాయి.  ప్రజా ప్రతినిధులు చూపించిన భూమినే  కొనుగోలు చేయాలన్న నిబంధనతో  నిధులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. వీరి జోక్యంతో  నాలుగైదు లక్షల  రూపాయలకు  లభించే భూమిని  7 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా చాలా మంది ఎమ్మెల్యేలు భూ పంపిణీ పథకంపై ఆసక్తి చూపకపోవడం కూడా నత్తనడకన సాగడానికి కారణమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా  నాలుగున్నర నెలలే మిగిలివుంది. ఈ కొద్ది వ్యవధిలో  8వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి, పంపణీ చేయడం  సాధ్యమయ్యే పనేనా.... అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

17:26 - December 1, 2017

నిజామాబాద్ : దళితులపై దాడులు జరిగితే..వివక్ష జరిపితే సంబంధిత కారకులైన వారిపై చర్యలు తీసుకోరా ? దళితులకు న్యాయం జరిగేదెన్నడూ..? నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన జరిగి రోజులవుతోంది. కానీ సర్కార్..ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఆందోళనలు..నిరసనలు కొనసాగుతున్నాయి.

అభంగపట్నంలో ఇద్దరు దళితులపై స్థానిక బీజేపీ నేత భరత్ రెడ్డి చేసిన దాష్టీకం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారకుడైన భరత్ రెడ్డిని అరెస్టు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏదో ఒక రూపంలో ఆందోళనలు..నిరసనలు చేస్తూనే ఉన్నామని...25 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అబ్బన్న అనే వ్యక్తి టెన్ టివికి తెలిపారు. మరి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి. 

15:25 - November 15, 2017

కాకినాడ : కలెక్టరేట్ ఆఫీసు వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ ఆఫీసులోకి చొచ్చుకపోవడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పలువురు కిందపడిపోయి సృహ తప్పిపడిపోయారు. ప్రభుత్వానికి...వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని..ఈ నేపథ్యంలో ఆందోళనల కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. 

13:46 - July 31, 2017

విజయవాడ : దళితులపై జరుగుతున్న దాడులను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వామపక్షాలు విమర్శించాయి. ఈ దాడులు, కుల వివక్షను నిరసిస్తూ విజయవాడలోని ఎంబీ భవన్‌లో జరిగిన సదస్సుకు సీపీఎం, సీపీఐ సహా పది వామపక్షాల నేతలు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు, ప్రకాశం జిల్లా దేవరపల్లి, చిత్తూరు జిల్లా మహాభారతంలో దళితులపై జరిగిన దాడులను వామపక్ష నేతలు ఖండించారు. దాడులు ఆపకపోతే  ప్రజలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలను కలుపుకుని  ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 

Don't Miss

Subscribe to RSS - attacks against Dalits