auto nagar

11:55 - March 1, 2018

విజయవాడ : క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం కొనసాగుతోంది. అందుకోసం చట్టాలు ఉన్నా విజయవాడలో మాత్రం లెక్కచేయడంలేదు.. కౌన్సిల్‌ లో తీర్మానం చేసినా.. నేటికీ అమలుకు నోచుకోలేదు. ప్రజలు, పశువులు అనారోగ్యాల పాలవుతున్నా అధికారుల్లో చలనం రావడంలేదు. విజయవాడ నగరంలో 1999నుంచి ప్రభుత్వం క్యారీబ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది.వీటి నిషేధానికి గట్టి చర్యలు తీసుకుంటామని పాలకులు, అధికారులు రెండుసార్లు కౌన్సిల్లో తీర్మానాలు కూడా చేశారు. 2018 జనవరి ఒకటి నుంచి కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఐనా... క్యారీ బ్యాగుల వినియోగం యథేచ్ఛగా సాగిపోతోంది.

పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ నిబంధనలు 2011 ప్రకారం 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ టీ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, సీసాలు, తోరణాలు, ప్లెక్సీలు, బ్యానర్లను వినియోగంపై నిషేధం కొనసాగుతోంది. చట్టాలను లెక్క చేయకుండా పాతబస్తీ, ఆటోనగర్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్యారీ బ్యాగుల విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి.

విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు నిషేధిత ప్లాస్టిక్, క్యారీ బ్యాగుల సరఫరా జోరుగా సాగుతోంది. రోజుకు 35 టన్నుల వరకు విక్రయాలు సాగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాసిరకపు క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇక్కడకు దిగుమతి అవుతున్నాయి. అయితే నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలను అడ్డుకోవాల్సిన కార్పొరేషన్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా నిషేధిత క్యారీబ్యాగుల, ప్లాస్టిక్‌ వస్తువులు ఉత్పత్తి, విక్రయాలు చేస్తున్న వ్యాపారులను కట్టడి చేయాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు.

18:25 - March 26, 2017

విజయవాడ :  సోలార్ పై అవగాహన పెంచుకోవాలని సోల్ టెక్ సంస్థ మేనేజర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం ఆటోనగర్ లో సోలార్ పవర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోల్ టెక్ సంస్థ నిర్వాహకులు, రాష్ట్రంలోని ప్రైవేటు ఎలక్ర్టికల్ సభ్యులకు సోలార్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోలార్ పై ప్రజల్లో కొంత అపోహ ఉందని, కరెంటుతో సంబంధం లేకుండా సోలార్ ను వినియోగించుకోవచ్చన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, ప్రతి ఇళ్లు..కంపెనీ..షాపుల్లో సోలార్ ఎంతో అవసరమని, ప్రజలు దీని ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించారు.

19:41 - January 11, 2017

విజయవాడ : 2017 టెన్‌టీవీ నూతన క్యాలెండర్‌ను విజయవాడలోని ఆటోనగర్ స్టోర్స్ దగ్గర వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఆవిష్కరించారు. అన్నివర్గాల ప్రజల ఆశయాలను నెరవేర్చేలా 10టీవీ కృషి చేస్తుందని పలువురు ప్రముఖులు కొనియాడారు. 2016లో వివిధ వర్గాల ప్రజలకు 10టీవీ అండగా నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. 2017లోనూ 10టీవీ మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బి.సత్యనారాయణ, క్రాంతి ఆజాద్, గుడివాడ రామారావు, యార్లగడ్డ సుబ్బారావు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

09:24 - December 1, 2016

పెద్ద నోట్ల రద్దు లారీలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు అన్నారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకుని రాకపోవడంతో రవాణా రంగం అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. సగం లారీలు షెడ్డుల్లోనే వుంటున్నాయి. కరెన్సీ కొరత కారణంగా అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గిపోవడంతో సరకు రవాణా సగానికి సగం పడిపోయింది. దీంతో లారీలకు కిరాయిలు దొరకడం లేదు. ఫలితంగా డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలివ్వలేని పరిస్థితి వచ్చిందంటున్నారు లారీ యజమానులు. మరోవైపు కిరాయిలు తగ్గిపోవడంతో బ్యాంక్ లకు కట్టాల్సిన లోన్ లు, ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుతో ట్రాన్స్ పోర్ట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈశ్వరరావు చర్చంచారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

 

13:36 - November 27, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో ఏపీ రవాణ రాజధాని విజయవాడలో రవాణ రంగం కుదేలైంది. సరకు రవాణ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోయాయి. వంద కాదు, వెయ్యి కాదు.. విజయవాడలో ఉన్న మూడు లక్షల లారీల్లో సగానికి పైగా ఆగిపోయాయి. మిగిలినవి అరకొరగానే తిరుగుతున్నాయి. రవాణ రంగంపై ఆధారపడిన కార్మిక కుటుంబాలు ఆకలితో పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో విజయవాడ రవాణ రంగం ఎదుర్కొంటున్న కష్టాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

09:36 - November 24, 2016
21:10 - September 2, 2016
17:46 - September 2, 2016
16:07 - September 2, 2016

తూర్పుగోదావరి : దేశవ్యాప్త సమ్మె కాకినాడలో ప్రశాంతంగా కొసాగుతుంది. బంద్ ప్రభావంతో కాకినాడ పట్టణంలో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పారిశ్రామిక వాడలన్ని నిర్మానుష్యంగా మారాయి. కాకినాడ సీ పోర్టు వద్ద కార్మికులు సమ్మెకు మద్దతు తెలిపి ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:31 - September 2, 2016

మెదక్ : సంగారెడ్డిలో సార్వత్రిక సమ్మె ప్రశాతంగా కొనసాగుతోంది. అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు టెన్ టివితో మాట్లాడారు. సమ్మె అద్భుతంగా జరుగుతుందన్నారు. ఆటో, రిక్షా, హమాలీలుకార్మికులతో పాటు పలు కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నాయని తెలిపారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక అధ్వర్యంలో ఐక్యత సాధిస్తామన్నారు. క్షేత్రస్థాయి కార్మిక సంఘాల ఆధ్వర్యంలోనే ఐక్యత సాధ్యమని స్పష్టం చేశారు. కార్పొరేట్ సేవలో కేంద్రప్రభుత్వం మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. మోడీ సర్కార్ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - auto nagar