baahubali

09:33 - June 28, 2017

ప్రభాస్..ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న నటుడు. ఆయన నటించిన 'బాహుబలి'..’బాహుబలి2’ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎగిరిపోయింది. ఈ సినిమాల కోసం 'ప్రభాస్' సంవత్సరాల తరబడి పనిచేశారు. ఆయన నటనా ప్రతిభకు జాతీస్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన తాజాగా 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు బయటకు రావడం లేదు కానీ ఇతర విషయాలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో 'ప్రభాస్' ను నటింప చేయాలని పలువురు దర్శక..నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు టాక్. తాజాగా తమన్నా..భూమిక..ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఖామోషీ' చిత్రంలో 'ప్రభాస్' ను నటింప చేయాలని అనుకున్నట్లు టాక్. ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. బి టౌన్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమా ? కాదా ? అనేది తెలియాల్సి ఉంది.

20:56 - June 24, 2017

బాహుబలి సింగర్ మోహనతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మోహన పలు విషయాలు తెలిపారు. పలు పాటలను పాడి వినిపించారు. తాను పాడిన అన్నీ పాటలు ఇష్టమని చెప్పారు. కొంతమందితోనే చనువుగా ఉంటానని తెలలిపారు. అందరూ బెస్టు ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. డబ్బింగ్ చెప్పడంపై ఇంట్రస్ట్ ఉంద కానీ.. అది చాలా కష్టటమన్నారు. చిన్మయి వాయిస్ లో డైలాగ్ చెప్పింది. సింగర్ నోయెల్ ఫ్రాంక్ కాల్ చేశారు. అనంతరం మోహన, నోయెల్ కలిసి పాట పాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:22 - June 23, 2017

‘వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్ లో పెడితే..సాయంకాలానికి సీఎం అవుతా'..అంటూ 'దగ్గుబాటి రానా' పలికిన డైలాగ్స్ తో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆయన నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో 'రానా' పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇటీవలే ఆయన పలు విభిన్నమైన పాత్రలు పోషించుకుంటూ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా 'రానా’కు మంచి పేరు వచ్చింది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో 'రానా' సరసన 'కాజల్' నటించింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. సినిమాపై అభిమానుల అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచేసిందని టాక్. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

12:07 - June 13, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్'..టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది ? అటు సల్మాన్..ఇటు ప్రభాస్ అభిమానులకు పండుగే పండుగ కదా. బాక్సాపీస్ వద్ద రికార్డులు నెలకొంటాయి కదా..ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ దర్శక..నిర్మాత కరణ్ జోహార్ కూడా 'ప్రభాస్' తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రభాస్' నటించిన 'బాహుబలి 2' సినిమా ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. తాజాగా 'ప్రభాస్' సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 'సల్మాన్' 'ట్యూబ్ లైట్' చిత్రంలో నటిస్తున్నాడు. రంజాన్ పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. మరి సల్మాన్..ప్రభాస్ లు కలిసి నటిస్తారా ? లేదా ? అనేది త్వరలోనే తెలియనుంది.

16:05 - June 7, 2017

ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ గా మారుతోంది. ఈ హీరో ఎవరు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. తెలిసిన వారు చెబుతున్నారు...తెలియని వారు చెప్పండంటూ పోస్టులు చేస్తున్నారు. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాలు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలకు సంవత్సరాల తరబడి 'ప్రభాస్' కష్టపడి నటించిన సంగతి తెలిసిందే. అనంతరం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రానికి సైన్ చేశాడు. చిత్ర షూటింగ్ ప్రారంభం కాకముందే టీజర్ ను విడుదల చేసి అంచనాలను మరింతగా రేకేత్తించారు. ఇటీవలే ప్రముఖ కేశాలంకరణ నిపుణుడితో ఫొటో బయటకు వచ్చింది. అందులో 'ప్రభాస్' కొద్దిగా స్లిమ్ గా కనిపించాడు. దీనితో 'సాహో' చిత్రంలో ఇలా కనిపిస్తారా ? అని అభిమానులు అనుకున్నారు. కానీ తాజాగా 'ప్రభాస్'కు కు చెందిన ఫొటో వైలర్ అయిపోయింది. 'బాహుబలి'లో పొడవాటి జుట్టు, మెలి తిరిగిన మీసం, గడ్డంతో కనిపించిన 'ప్రభాస్' ఈ ఫోటోలో క్లీన్ షేవ్ లో కనిపిస్తున్నాడు. క్లీన్ షేవ్ లో 'ప్రభాస్' ఇప్పటి వరకు కనిపించ లేదనే సంగతి తెలిసిందే. ఒక్కసారిగా 'ప్రభాస్' ఇలా మారిపోవడానికి కారణం ఏంటబ్బా అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారంట.

11:14 - May 29, 2017

అనంతపురం : 'బాహుబలి' సినిమా చూసేందుకు అనుమతించాలంటూ మందుబాబులు ఓ థియేటర్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. గుత్తిలోని కేపీఎస్ మూవీల్యాండ్ థియేటర్ లో 'బాహుబలి' సినిమా ప్రదర్శితమౌతోంది. గత అర్ధరాత్రి ఐదుగురు యువకులు పూటుగా మద్యం సేవించి థియేటర్ కు వచ్చారు. లోనికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. సినిమా చివరిలో ఉందని..ఇప్పుడు అనుమతించడానికి వీలు లేదంటూ సిబ్బంది పేర్కొన్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మందబాబులు సిబ్బందిపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. దీనితో సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. థియేటర్ యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

14:40 - May 25, 2017

'రానా'కి ఉరిశిక్ష ఏంటీ ? కోర్టు ఏ విషయంలో తీర్పు చెప్పింది అని బెంబేలెత్తిపోకండి...పూర్తిగా చదవండి..టాలీవుడ్ కండల వీరుడు 'రానా'.. వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. ఇటీవలే విడుదలైన 'బాహుబలి -2'తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ చిత్ర విజయం అనంతరం మరో వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో పవర్ పుల్ పాత్రలో పోషిస్తున్నాడంట. చట్టంలో వున్న లొసుగులు..వ్యవస్థలో వున్న డొల్లతనం పేరిట కథ ఉందని, దీనిపై అడ్డంగా ఎదిగే ఓ వ్యక్తి కథని అని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ 'టెంపర్' సినిమాను పోలి ఉంటుందని టాక్. కోర్టు హీరో 'రానా'కి ఉరిశిక్ష విధిస్తుందని, 'టెంపర్' సినిమాలోని కోర్టు సీన్ లా ఇది కూడా అదిరిపోతుందని టాక్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

14:38 - May 20, 2017

హైదరాబాద్: బాహుబలి-2 సినిమాను పైరసి చేసేందుకు ప్రయత్నించిన పైరసి నిందితులను అరెస్టు చేసినందుకు సీసీఎస్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకులు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ. బాహుబలి-2 చిత్రాన్ని పైరసి చేస్తామని ఆర్కే మీడియాను బెదిరించి 15 లక్షలు డిమాండ్ చేశారని సైబర్‌ క్రైం పోలీసులకు రాజమౌళి తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఎంతో కష్టపడి పైరసి నిందితులను పట్టుకున్నారని వారిని అభినందించారు. నిందితులు తొలుత హిందీ ప్రొడ్యూసర్‌ కరన్‌ జోహర్‌ను డబ్బులు డిమాండ్ చేసి ఆ తర్వాత ఆర్కే ఆఫీసుకు ఫోన్‌ చేశారని రాజమౌళి తెలిపారు. బీహార్‌ రాజధాని పాట్నా పక్కన ఉన్న గ్రామంలో ఉన్న థియేటర్‌ సర్వర్‌ ద్వారా సినిమాను డౌన్‌లోడ్‌ చేసి పైరసికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసి పైరసికి అడ్డుకట్ట వేశారని వారిని రాజమౌళి అభినందించారు.

 

15:03 - May 16, 2017

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' రేంజ్ ‘బాహుబలి -2’ సినిమా అనంతరం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచస్థాయిలో ఆయన పేరు మారుమాగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. వేయి కోట్లు వసూలు చేసిన 'బాహుబలి -2’ సినిమా రూ. 1500 కోట్ల వైపుకు పరుగులు తీస్తోంది. ఈ సినిమా అనంతరం సుజీత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాకు 'సాహో' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇటీవలే చిత్ర టీజర్ కు భారీ స్పందన వచ్చింది. కానీ 'ప్రభాస్' సరసన ఏ హీరోయిన్ నటించబోతోందునేది తెలియ రావడం లేదు. రోజుకో హీరోయిన్ పేరు తెరమీదకు వస్తోంది. బాలీవుడ్ నటిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కత్రినా కైఫ్..పూజాహెగ్గే ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. తాజాగా శద్ధకపూర్..దిశా పటానీని పేర్లు వినిపించాయి. వీరు ఎక్కువగా పారితోషకం డిమాండ్ చేస్తుండడంతో టాలీవుడడ్ నటీమణులనే ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని టాక్.

06:37 - May 8, 2017

హైదరాబాద్: బాహుబలి మూవీ ఓ విజువల్‌ వండర్‌. దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పారు. ఇందులో నటించిన నటీనటులకూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వీరికి విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ దొరికారు. అంతేకాదు.. బాహుబలి -2 మూవీ భారత సినీ రికార్డులన్నీ తిరగారాసింది.

సినీ పరిశ్రమలో 1000 కలెక్షన్స్‌ ఎవరూ ఊహించని టార్గెట్‌...

ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ పరిశ్రమలో 1000 కలెక్షన్స్‌ ఎవరూ ఊహించని టార్గెట్‌. అసలు ఆ మార్క్‌ అనేది ఎవరూ అందుకోని బ్రహ్మాండంగానే ఉండిపోయింది. కానీ జక్కన్న చెక్కిన విజువల్‌ వండర్‌కు మాత్రం వెయ్యికోట్ల కలెక్షన్స్‌ మార్క్‌ పెద్ద కష్టమనిపించలేదు. బాహుబలి-2 కలెక్షన్స్ ముందు అతి పెద్ద టార్గెట్‌గా కూడా నిలువలేదు. ఏప్రిల్‌ 28న విడుదలైన బాహుబలి -2 బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. కేవలం ఆరు రోజుల్లోనే 792 కోట్లు సాధించి సత్తా చాటింది. తొలి 9 రోజుల్లో 925 కోట్లు సాధించింది. ఇక పదవ రోజైన ఆదివారం వెయ్యికోట్ల మార్క్‌ను అవలీలగా దాటి భారత సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రంగా అవతరించింది.

పీకే సినిమా 792 కోట్లు ...

అమీర్‌ఖాన్‌ నటించిన పీకే సినిమా 792 కోట్లు సాధించి ఇండియన్‌ సినిమా చరిత్రలో రికార్డుగా నిలిచింది. ఆతర్వాత దంగల్‌ సినిమా 730 కోట్లు సాధించి సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. పీకీ సినిమా రికార్డులను బాహుబలి-2 కేవలం 6 రోజుల్లోనే దాటింది. ఆదే ఊపుతో ఎవరికీ అందనంతగా 1000 కోట్ల మార్క్‌ను దాటిపోయింది.

బాహుబలి -2 వెయ్యికోట్లు సాధించడంతో...

బాహుబలి -2 వెయ్యికోట్లు సాధించడంతో ఆ సినిమా యూనిట్‌ సంబరాల్లో మునిగిపోయింది. హీరో ప్రభాస్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. బాహుబలి-2ను ఇంతగా ఆదరించిన అభిమానులకు ఎప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానన్నారు. ఇక జక్కన కూడా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - baahubali