baahubali-2

13:15 - April 13, 2018

ఢిల్లీ : ప్రతిష్టాత్మక 65వ జాతీయ అవార్డుల ప్రకటన కాసేపటి క్రితం వెలువడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 2017లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వచ్చిన చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డులను ప్రకటిస్తున్నారు.

 • ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్)
 • ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజీ
 • ఉత్తమ హిందీ చిత్రం : న్యూటన్
 • ఉత్తమ మలయాళీ చిత్రం : టేకాఫ్
 • ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్
 • ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ
 • ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క
 • ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి
 • ఉత్తమ యాక్షన్ చిత్రం : బాహుబలి 2
 • ఉత్తమ సంగీత దర్శకుడు : ఏ.ఆర్.రెహమాన్ (మామ్), (కాట్రు వెలియిదామ్)
 • ఉత్తమ కొరియాగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయ్ లెట్, ఏక్ ప్రేమ్ కథా)
 • ఉత్తమ దర్శకుడు : జయరాజ్ (మలయాళ చిత్రం భయానకం)
 • ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
 • బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 
11:16 - June 12, 2017

'బాహుబలి-2’ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. రూ. 1500 కోట్లు కొల్లగొట్టి రూ. 2000 వేల కోట్ల క్లబ్ లోకి దూసుకెళుతోంది. విదేశాల్లో సైతం 'బాహుబలి2’ ప్రభంజనం కొనసాగడం విశేషం. దర్శకుడు రాజమౌళి సినిమాను తీర్చిదిద్దిన విధానం..గ్రాఫిక్స్ అబ్బుర పరిచాయి. ప్రభాస్..ఇతర నటీ నటుల యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వీడియో సాంగ్స్ ఒక్కోటి యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. తాజాగా టైటిల్ ట్రాక్ 'ఒక ప్రాణం' అనే సాంగ్ ని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని వీడియో సాంగ్స్ విడుదల చేస్తారని తెలుస్తోంది.

10:41 - May 26, 2017

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు 'రాజమౌళి' తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై రికార్డుల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు..విమర్శకులు..రాజకీయ నేతలు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్..రానా..ఇతర నటుల ప్రతిభను మెచ్చుకున్నారు. కానీ బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా పేరొందిన 'అమీర్ ఖాన్' ఈ సినిమాను ఇంకా చూడలేదంట. కానీ 'బాహుబలి 2' సినిమాపై 'అమీర్' పలు వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన 'దంగల్' సినిమాతో పోల్చవద్దని సూచించారు. 'సచిన్..ది బిలియన్ డ్రీమ్స్' ప్రత్యేక షొకు ఆయన హాజరై మీడియాతో మాట్లాడారు. 'దంగల్'..'బాహుబలి 2' సినిమాలు బాక్సాపీసు వద్ద వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 'దంగల్' రూ. 1,565 కోట్లు రాబడితే ఇప్పటికే చైనాలో ఏకంగా రూ. 778 కోట్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో 'బాహుబలి 2' సినిమా 'దంగల్' ను బీట్ చేస్తుందా అని మీడియా 'అమీర్'ను ప్రశ్నించింది. రెండూ మంచి చిత్రాలని..దేశం గర్వపడేలా చేశాయన్నారు. ఇప్పటి వరకు 'బాహుబలి 2' సినిమాను చూడలేదని, చిత్రం గురించి గొప్పగా మాట్లాడడం విన్నానని తెలిపారు.

14:38 - May 20, 2017

హైదరాబాద్: బాహుబలి-2 సినిమాను పైరసి చేసేందుకు ప్రయత్నించిన పైరసి నిందితులను అరెస్టు చేసినందుకు సీసీఎస్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకులు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ. బాహుబలి-2 చిత్రాన్ని పైరసి చేస్తామని ఆర్కే మీడియాను బెదిరించి 15 లక్షలు డిమాండ్ చేశారని సైబర్‌ క్రైం పోలీసులకు రాజమౌళి తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఎంతో కష్టపడి పైరసి నిందితులను పట్టుకున్నారని వారిని అభినందించారు. నిందితులు తొలుత హిందీ ప్రొడ్యూసర్‌ కరన్‌ జోహర్‌ను డబ్బులు డిమాండ్ చేసి ఆ తర్వాత ఆర్కే ఆఫీసుకు ఫోన్‌ చేశారని రాజమౌళి తెలిపారు. బీహార్‌ రాజధాని పాట్నా పక్కన ఉన్న గ్రామంలో ఉన్న థియేటర్‌ సర్వర్‌ ద్వారా సినిమాను డౌన్‌లోడ్‌ చేసి పైరసికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసి పైరసికి అడ్డుకట్ట వేశారని వారిని రాజమౌళి అభినందించారు.

 

08:07 - May 20, 2017

హైదరాబాద్ : బాహుబలి... ది కంక్లూజన్ వసూళ్ల మోత మోగిస్తూనే ఉంది. కేవలం 10 రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు పదిహేను వందల కోట్ల మార్క్‌నూ సునాయాసంగా దాటేసింది. వెయ్యికోట్ల క్లబ్‌లోకి చేరిన దంగల్‌.. ఓ దశలో బాహుబలికి పోటీ అవుతుందని భావించారు. అయితే, బాహుబలి -2, కలెక్షన్లలో అన్ని రికార్డులనూ బద్దలు కొట్టడమే కాదు.. సరికొత్త హిస్టరీ క్రియేట్‌ చేసింది. బాహుబలి-2 కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతోంది. వసూళ్లలో ప్రభంజనం సాగిస్తూ సత్తా చాటుతోంది. బాహుబలి..ది కన్‌క్లూజన్‌ సునామీకి బాక్సాఫీసు షేక్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి పదిరోజుల్లోనే వెయ్యి కోట్లు సాధించిన ఈ మూవీ 22 రోజుల్లో రూ.1500 కోట్ల మార్కును చేరుకుంది. భారత్‌లో బాహుబలి... ది కన్‌క్లూజన్‌ విడుదలైన అన్ని భాషల్లో రూ.1,227 కోట్లు, విదేశాల్లో రూ.275 కోట్లు కలిపి మొత్తం రూ.1502 కోట్లు వసూలు చేసింది. హిందీలో తొలి మూడురోజులకు రూ.128 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. దంగల్ వసూలు చేసిన 1,275 కోట్లు, పీకే కలెక్షన్లు రూ.792 కోట్ల రికార్డుల్ని బాహుబలి-2 దాటేసింది. బాహుబలి-2 రూ. 1500 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. ఈ సందర్భంగా దేవసేన, శివగామి పాత్రలతో ఉన్న పోస్టర్ ను బాహుబలి టీం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

భారతదేశ సినీ చరిత్రలో రికార్డు..
భారతదేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ 1,227 కోట్లే అత్యధిక వసూళ్లు. ఈ రికార్డును బాహుబలి-2 బ్రేక్ చేసింది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే 505 కోట్లు కొల్లగొట్టింది. అటు అమెరికా బాక్సాఫీసులో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఓపెనింగ్ వీకెండ్‌లో 65.65 కోట్లు కొల్లగొట్టింది. హిందీలోనే తొలి మూడు రోజుల్లో 120 కోట్ల రూపాయలు నెట్ వసూలుచేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది బాహుబలి-2. మార్కెట్ అనలిస్టుల అంచనాలకు మించి 1500 కోట్ల మార్కును అందుకుంది బాహుబలి-2. బాహుబలి-2 వసూళ్లను చూస్తుంటే త్వరలోనే మరిన్ని రికార్డులను నెలకొల్పే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా రికార్డుని సమీప భవిష్యత్తులో మరే మూవీ అందుకోలేదన్న భావన వ్యక్తమవుతోంది. 

14:00 - May 19, 2017

‘బాహుబలి-2’ మరో రికార్డును సొంతం చేసుకుంది. 'బాహుబలి’ సినిమాతో తెరకెక్కించిన రాజమౌళి టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. మొదటి పార్ట్ లో పలు సందేహాలను 'బాహుబలి -2’ సినిమాలో నివృత్తి చేశాడు రాజమౌళి. మూడు వారాల కింద ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈసినిమా రికార్డులు సృష్టించింది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే వేయి కోట్ల మైలు రాయిని దాటి కొత్త రికార్డును నెలకొల్పింది. బాలీవుడ్ ఇటీవలే విడుదలైన ప్రముఖ హీరోల చిత్రాలను సైతం 'బాహుబలి-2’ సినిమా దాటి వేసింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ..ప్రభాస్..రానా..అనుష్క..నాజర్..రమ్యకృష్ణ నటనపై ఎంతో మంది ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ సినిమా కలెక్షన్లు రూ. 1500 కోట్లను దాటాయని ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఇండియాలో రూ. 1,227 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 275 కోట్లను వసూలు చేసిందని మొత్తం రూ. 1,502 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని ఆయన వెల్లడించారు, వేసవి సెలవులు కొనసాగుతూ ఉండటంతో ఇక రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని టాలీవుడ్ విశ్లేషకుల అంచనా.

15:11 - May 13, 2017

హైదరాబాద్ : బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళి తర్వాత సినిమా ఎవరితో చేస్తారని ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. యువ హీరోలతో చిన్న ప్రాజెక్టు చేస్తారని... బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫక్ట్ ఆమిర్ హీరోగా సినిమా చేయబోతున్నారని...ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతాన్ని తెరకెక్కిరస్తాడని ఇలా రకరకాలుగా వార్తాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి లండన్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సమాచారం ప్రకారం జక్కన్న తన తర్వాత చిత్రాన్ని మహేష్ హీరోగా చేయాలని భావిస్తున్నాడట...చాలా రోజుల కింద మహేష్ బాబు హీరోగా కెయల్ నారాయణ నిర్మాణంలో సినిమా చేసేందుకుకు రాజమౌళి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం చిత్రాన్ని చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ స్ఫైడర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మహేష్ సినిమా చేయనున్నాడు.

మరి రాజమౌళి తో మహేష్ తో సినిమా చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ...లేక కొరటాలతో సినిమా పక్కన పెట్టి రాజమౌళితో సినిమా చేస్తాడా...? లేక మహేష్ కొరటాల సినిమా పూర్తయ్యే వరకు అగుతాడా చూడాలి మరి....!

12:43 - May 12, 2017

ప్రెజెంట్ ఉన్న పరిస్థితులను చూస్తే టాలీవుడ్ ట్రెండ్ మారుతుందా అని డౌట్ రాక మానదు. ఇంతకు ముందు వరకు ఉన్న రెగ్యులర్ స్టోరీస్ పక్కన పెట్టేస్తున్నట్టు ఉన్నారు ఫిలిం మేకర్స్. 'బాహుబలి' సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కి షాక్ అయ్యారు. ఇదే తరహా కధలకు ఇంపార్టెంట్ ఇస్తూ పురాణ ఇతిహాసాల మీద ఫోకస్ పెట్టారు ఫిలిం మేకర్స్. వెండితెర మీద 'రామాయణం' వంటి మహా కావ్యాలను చూపించాలంటే ఒక ఛాలెంజ్. అలాగే 'మహాభారతం' కూడా అంతే. ఇప్పటివరకు ఇలాంటి కావ్యాలను టివి సీరియల్స్ రూపంలో చూశామే తప్పించి.. వెండితెరపై అద్భుతమైన గ్రాఫిక్స్ పరిజ్ఞానంతో ఒక హాలీవుడ్ సినిమా తరహాలో చూడలేదు. అందుకే ఇప్పుడు 'అల్లు అరవింద్' 'రామాయణ' మహాకావ్యాన్ని తెరకెక్కించడానికి కంకణం కట్టుకున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ కి కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టాలని మాత్రమే ప్రస్తుతానికి ఫిక్సయ్యారు. ఓ రెండు భాగాలుగా 'సంపూర్ణ రామాయణాన్ని' సినిమాగా తీయాలని అల్లు అరవింద్.. మధు మంతెన.. నమిత్ మల్హోత్రా నిర్ణయించుకున్నారట. స్వయంగా అరవిందే ఈ విషయాన్ని ఒక ముంబయ్ మీడియా వారికి ప్రకటించారు. అయితే ఇది మేజర్ గా హిందీ సినిమా అని.. లోకల్ భాషల్లోకి డబ్ చేస్తారని కొందరు అంటుంటే.. తన కొడుకు 'అల్లు అర్జున్' తో వీరాంజనేయుడి వేషం వేయించే ఛాన్సుందని ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కథలో కథనం అండ్ విజువల్స్ చాలా ముఖ్యం. అసలు డైరక్టర్ ఎవరు.. హీరో ఎవరు.. క్యాస్టింగ్ ఎవరెవరు.. అనే విషయాలు తెలిస్తేనే ఈ ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వచ్చేది.

10:43 - May 12, 2017

బాహుబలి-2 సినిమా కనకవర్షం కురిపిస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' సినిమా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రికార్డులు సృష్టిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే వేయి కోట్ల క్లబ్ లో చేరిపోయి అందనంత ఎత్తులో నిలిచింది. 12 రోజుల్లో రూ. 1200 కోట్లు కలెక్ట్ చేసి రూ. 1500 కోట్ల దిశగా ముందుకెళుతోంది. హిందీలో ఈ సినిమా హక్కులను దర్శక, నిర్మాత కరణ్ జోహార్ రూ. 80కోట్లకు కొనుగోలు చేసి..సినిమా ప్రచారానికి రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రూ. 375.37 కోట్లు కలెక్షన్లు చేసినట్లు తెలుస్తోంది. పెట్టింది రూ. 90 కోట్లు అయితే లాభాలు రూ. 285.37 కోట్లు వచ్చినట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్, కరణ్ జోహార్ అధికారికంగా వెల్లడిస్తేగానే పూర్తి వివరాలు తెలియదు.

09:26 - May 11, 2017

బాహుబలి -2 సినిమా రికార్డుల సృష్టిస్తూ దూసుకపోతోంది. కలెక్షన్ల పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తోంది. విడుదలైన కొద్ది రోజులకే హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' తో టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ చిత్రంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ ప్రశ్నలకు 'బాహుబలి-2' దొరకుతుందని చెప్పడంతో మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. సంవత్సరాల తరబడి షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. రాజమౌళి దర్శక ప్రతిభకు..ప్రభాస్..ఇతర నటీ నటుల ఫెర్మామెన్స్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు. విడుదలైన 12 రోజుల్లోనే ఈ సినిమాకు 12వందల కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మొన్నటికి మొన్న వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. కేవలం 3 రోజుల్లోనే మరో 2వందల కోట్ల రూపాయల్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. విదేశాల్లో సైతం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరో ఐదు రోజుల్లో 15 వందల కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుకోవడం సులువేనని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - baahubali-2