bahubali

10:32 - April 26, 2017

బాహుబలి -2 జ్వరం పట్టుకుంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతంది. ప్రపంచ వ్యాప్తంగా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కాకముందే రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనన్న చర్చ ఫిల్మ్ వర్గాల్లో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా 'బాహుబలి -2’ చిత్రాన్ని రూపొందించారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..తదితర సస్పెన్ష్ విషయాలను ఈ చిత్రంతో తొలగిపోనున్నాయి. ఈ చిత్రానికి నటుడు 'ప్రభాస్' ఐదేళ్లు కష్టపడి పనిచేశారు. షూటింగ్ జరిగే సమయంలో ఏ చిత్రానికి 'ప్రభాస్' సంతకం చేయలేదు. ఒక హీరో ఒక ప్రాజెక్టు కోసం ఇన్ని ఏళ్లు కేటాయించడం అరుదుగా చూస్తుంటామని రాజమౌళి పేర్కొన్నారు. అందుకని ప్రభాస్ కు రాజమౌళి ఒక విలువైన బహుమతిని అందచేశారని టాక్. ‘బాహుబలి' చిత్రంలో అమరేంద్ర బాహుబలి ధరించిన విలువైన కవచాన్ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో 'ప్రభాస్', ‘రానా', ‘అనుష్క', ‘తమన్నా'లు కీలక పాత్రల్లో నటించారు.

15:29 - April 24, 2017

హైదరాబాద్ : ఎర్రబుగ్గలను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని జై కొట్టారు. కారుపై ఉన్న ఎర్ర బుగ్గ బల్బును ఆయన స్వయంగా తొలగించారు. ఈ క్షణమే తీసివేస్తానంటూ తన కారుపై ఉన్న బుగ్గ బల్బును తీసివేశారు. ప్రధానమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఓ మంచి సందేశాన్ని ప్రజల్లో తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మంత్రి తలసాని యాదవ్‌ అన్నారు.

15:24 - April 24, 2017

హైదరాబాద్ : బాహుబలి-2 సినిమా నిర్మాతలు ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిశారు. తెలంగాణాలో సినిమా ప్రదర్శనకు సంబంధించి ఆయనతో చర్చించారు. బాహుబలి-2 సినిమా ప్రమోషన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తాదని మంత్రి తలసాని అన్నారు. వారంరోజుల పాటు ఐదు షో లు వేసుకుంటామని వారు అడిగారని దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పామని ఆయన అన్నారు.

13:26 - April 24, 2017

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా నిర్మాతలు ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిశారు. తెలంగాణాలో సినిమా ప్రదర్శనకు సంబంధించి ఆయనతో చర్చించారు. బాహుబలి-2 సినిమా ప్రమోషన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తాదని మంత్రి తలసాని అన్నారు. వారంరోజుల పాటు ఐదు షో లు వేసుకుంటామని వారు అడిగారని ...దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పామని ఆయన అన్నారు.

17:07 - April 23, 2017

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రం 'బాహుబలి -2’. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే 'బాహుబలి' మేనియా వచ్చేసింది. పలు ప్రాంతాల్లో బాహుబలి హోర్డింగ్స్..ప్రభాస్ ఫొటోలతో అభిమానులు సందడి చేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఒకే చిత్రానికి 'ప్రభాస్' పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం తన తదుపరి సినిమాపై దృష్టి సారించారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు 'సాహో' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అప్పుడే సిద్ధం చేశారంట. ‘బాహుబలి -2’ సినిమా విడుదల రోజునే 'సాహో' టీజర్ ను కూడా థియేటర్లలో ప్రదర్శించనున్నారుర. ఒక వైపు 'బాహుబలి-2 మరోవైపు 'సాహో' టీజర్ విడుదలవుతుండడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

09:27 - April 5, 2017

క్యారక్టర్ కి తగ్గట్టు డిమాండ్ మేరకు హీరోలు సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు... ఈ మధ్య ఇది ఓ ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు మూవీ ఓకే అవ్వగానే ఆ మూవీకి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నారు. సినిమా ప్రిప్రొడక్షన్ వర్క్ నడుస్తుండగానే మరో పక్క క్యారక్టర్ డిమాండ్ కు తగ్గట్టు బాడీని డెవలప్ చేసుకుంటున్నారు. జిమ్ముల్లో కుమ్ముతూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కొన్నేళ్లుగా తెలుగు హీరోలు కొత్త ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. ఈమధ్య కాలంలో దాదాపుగా ప్రతి అగ్ర కథానాయకుడూ కొత్త సినిమాల కోసం, కొత్త పాత్రల కోసం అవసరమైన కసరత్తులు చేసిన తరువాతే కెమెరా ముందుకు వెళుతున్నాడు. పాత కొత్త హీరో అని లేకుండా ప్రతి ఒక్క హీరో బాడీ డెవలప్ చేసుకున్న తరువాత సినిమా స్టార్ట్ చేస్తున్నారు. 'బాహుబలి' కోసం ప్రభాస్‌, రానా పడిన కష్టం అంతా ఇంతా కాదు. బాహుబలి, భల్లాల దేవ పాత్రల కోసం ఆ ఇద్దరూ వంద కిలోలకిపైగా బరువు పెరిగారు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ కోసం నెలల తరబడి శిక్షణ తీసుకొన్నారు. ప్రభాస్‌, రానాలే కాకుండా.. హీరోయిన్లుగా చేసిన అనుష్క, తమన్నా వారితో పాటు సత్యరాజ్‌లాంటి నటులు కూడా కత్తియుద్ధాల్లో శిక్షణ తీసుకొన్నారు.

బరువు తగ్గుతున్న ప్రభాస్..రానా..
త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న సుజీత్‌ చిత్రం కోసం ప్రభాస్‌ బరువు తగ్గి నాజూకైన లుక్‌లో కనిపించబోతున్నాడు. అందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ప్రభాస్. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' నుంచి బయటికి రాగానే, ‘ఘాజీ' కోసం ఒక్కసారిగా బరువు తగ్గాడు 'రానా' ప్రస్తుతం సత్య శివ అనే తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీ కోసం 'రానా' ఇంకొంచెం పలచగా మారిపోయి నటిస్తున్నాడు. 'ఈ నాలుగేళ్ల కాలంలో ఆ బాడీతో చాలా ప్రయోగాలు చేశాడు రానా. 'ఘాజీ' కోసం బరువు తగ్గిన తరువాత 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' కోసం మళ్లీ కండలు పెంచాల్సి వచ్చింది. అలవాటైన బాడీ కావడంతో తట్టుకోగలిగింది అంటున్నాడు ఈ హైట్ హీరో..

09:32 - March 11, 2017

రాజమౌళి రూటే వేరు..ఆయన ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ‘బాహుబలి' చిత్రంతో టాలీవుడ్ సత్తా చూపెట్టిన దర్శకధీరుడు. ప్రస్తుతం 'బాహుబలి 2’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టినా చిత్ర టీజర్ మాత్రం విడుదల కాలేదు. టీజర్ ఎప్పుడు విడుదలువుతుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. కానీ త్వరలోనే చిత్ర టీజర్ విడదలవుతుందని లీక్స్ పంపిస్తున్నాయి. తాజాగా 'రాజమౌళి' సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు చేశారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు 'బాహుబలి' ఫేస్ బుక్ పేజీని మిస్ కావద్దని పోస్టు చేశారు. అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచారు. 'బాహుబలి: ది కన్ క్లూజన్'పై లైవ్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ లైవ్ లో స్వయంగా 'రాజమౌళి' పాల్గొంటారా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఇందులోనే చిత్ర టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో..మధ్యాహ్నం 12గంటల తరువాత ఎలాంటి అంశాలు 'రాజమౌళి' ప్రస్తావిస్తారో చూడాలి.

12:54 - March 5, 2017

'బాహుబలి 2’ చిత్రం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. చిత్రానికి సంబంధించిన విషయాలను బయటకు పొక్కకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో ఫొటోలు..ఇతరత్రా విషయాలకు బయటకు రాలేదు. ఇటీవలే చిత్ర షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టిన సంగతి తెలిసిందే. చిత్రాలకు సంబంధించిన విషయాలు..ఫొటోలను అప్పుడప్పుడు చిత్ర యూనిట్ సోషల్ మాధ్యమాల్లో విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఓ వీడియోను ట్విట్టర్ పోస్టు చేసింది. చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ లను వీడియోలో పొందుపరిచారు. అంతేగాకుండా అందులో ఇంటర్వ్యూ కూడా ఉంది. ఇదిలా ఉంటే అన్ని హంగులతో ట్రైలర్ విడుదల చేసేందుకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్నారు. మార్చి 6వ తేదీన 'బాహుబలి 2’ టీజర్ విడుదల కానున్నట్లు వినిపిస్తోంది. ‘బాహుబలి 2’ టీజర్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

13:05 - March 2, 2017

టాలీవుడ్ స్టామినా ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి తీర్చిదిద్దిన 'బాహుబలి' రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్ గా 'బాహుబలి..ది కన్ క్లూజన్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయి పోయింది. కానీ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు మాత్రమే చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది. కానీ టీజర్ మాత్రం రిలీజ్ కాకపోవడం పట్ల అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగిపోతోంది. టీజర్ ఎలా ఉంటుందానే దానిపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ రెడీ అయ్యిందని..ప్రస్తుతం అది తెరపై ఎలా ఉందనే విషయాన్ని పరిక్షీస్తున్నట్లు చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రైలర్ తయారైందని పేర్కొంటూ పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఫొటోను పోస్టు చేశారు. సీవీ రావు, శివకుమార్ లతో కలిసి తెరపై ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని చూడడం జరిగిందని తెలిపారు. దీనితో చిత్ర ట్రైలర్ త్వరలోనే విడుదల కాబోతోందని తెలుస్తోంది. చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందో ? తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వరకు వేచి చూడాల్సిందే.

21:50 - February 17, 2017

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఘాజీ సినిమా ఇవాళా విడుదలైంది. ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్ మరియు పీవీపీ సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - bahubali