Bhadrachalam

18:36 - April 18, 2018

భద్రాచలం : కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం, స్పీకర్‌లకు తమ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. భద్రాచలంలో సీతారామ స్వామిని దర్శించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న హామీని కేసీఆర్ మరిచిపోయారని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చని తర్వాత కూడా భద్రాచలం అభివృద్ధికి నోచుకోలేదని...గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం వదలటం లేదని ఉత్తమ్ ఆరోపించారు. భద్రాచలం ప్రస్తుతం అక్రమ ఇసుక దందాకు మారు పేరుగా మారుతుందని.. ప్రజల సొమ్ముని, సహజ వనరులను అడ్డంగా దొచుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. 

18:14 - March 27, 2018
16:50 - March 27, 2018

కృష్ణా జిల్లా : ఎ కొండూరులో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రసాదం, పానకాలు కల్తీ కావడంతో సుమారు 200 వందల మందికి పైగా భక్తులు అస్వస్థత గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు భాదితులను హుటా హుటిన మైలవరం ప్రభుత్వాస్పత్రికి , కొందరిని తిరువూరు ఆస్పత్రికి తరలించారు. ప్రసాదం కల్తీ అవ్వడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అస్వస్థతకు గురైన భక్తులకు సీపీయం పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు సాయం అదించారు.

22:18 - March 26, 2018
18:44 - March 26, 2018

భద్రాద్ది : భద్రాద్రిలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సిగ్గులొలికే సీతమ్మ మెడలో అందాల రాముడు మూడుముళ్లు వేశాడు... సీతారాముల కల్యాణ అపురూప ఘట్టాన్ని చూసి భక్తులు పులకించి పోయారు.

భక్తజన సందోహంతో భద్రాచలం..
భద్రాచలం భక్తజన సందోహంతో కళకళలాడింది... మిథిలా మైదానంలో అట్టహాసంగా రాములోరి కల్యాణం జరిగింది.... స్వామివార్లకు ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు కల్యాణ మూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించారు అర్చకులు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్వామివారిని ఊరేగింపుగా మిథిలా మైదానానికి తీసుకువచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీ సీతారాముల కల్యాణ క్రతువు ఘనంగా జరిగింది.

అభిజిత్ లఘ్న సుముహూర్తాన వివాహం
అభిజిత్ లఘ్న సుముహూర్తాన వధూవరుల శిరస్సున జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం రాములోరు సీతమ్మకు మాంగళ్యధారణ చేశారు. తాళి, మెట్టలు , తలంబ్రాల ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు... భారతీయ వివాహ వైభవాన్ని తెలియజేస్తూ కార్యక్రమం పూర్తిచేశారు.. అంతకు మందు అమ్మవారికి చింతాకు పతకధారణ చేశారు. కల్యాణవేడుకలో కీలక ఘట్టమైన తలంబ్రాల వేడుకకూడా ఘనంగా నిర్వహించారు. భక్తులకు కౌంటర్లద్వారా తలంబ్రాలు పంపిణీ చేశారు..

భారీ సంఖ్యలో భక్తులు
రాములవారి కల్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.. సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భద్రగిరి శ్రీరామ స్మరణతో మార్మోగింది. అయితే సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో భద్రాద్రి ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. మంగళవారం రాములవారి పట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది...

13:32 - March 26, 2018
12:39 - March 26, 2018
09:27 - March 26, 2018

సంగారెడ్డి : పాతబస్టాండు సమీపంలో ఉన్న రామాలయంలో శ్రీరాముడి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో జగ్గారెడ్డి మాట్లాడారు. కల్యాణోత్సవం సందర్భంగా ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నట్లు, ఇందుకు వంద కిలోల ముత్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:26 - March 26, 2018

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల భద్రాద్రి పర్యటన రద్దు అయ్యింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాముడికి ప్రభుత్వం తరపున కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించడడం అనవాయితీగా వస్తోంది. కానీ కేసీఆర్ దంపతులు రాకపోతుండడంతో జిల్లా వాసులు, భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాకపోతుండడంతో దేవాదాయ శాఖ మంత్రి, తాను పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశవరరావు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు, ఎంపీ కవిత దంపతులు వస్తారని తెలుస్తోంది.

కేసీఆర్ హాజరు కాకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచల అభివృద్దికి రూ. 100కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించి భద్రాద్రికి పలు వరాలు కురిపిస్తారని జిల్లా వాసులు ఆశించారు. కానీ కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రిపై పెట్టిన దృష్టి భద్రాద్రిపై పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

09:04 - March 26, 2018

ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో శ్రీరాముడు కల్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే విళంబి నామ సంవత్సర ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా భక్తులు భావిస్తున్నారు. శ్రీరాముని జన్మ సంవత్సరం కావడంతో ఈసారి కల్యాణా ఉత్సవాలకు భద్రాద్రి జనసంద్రంగా మారుతోంది. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మిథిలా స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెన్ టివితో మాట్లాడారు. కేసీఆర్ రాకపోవడంతో దేవాదాయ శాఖ మంత్రి, తాను పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తుమ్మల పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Bhadrachalam