bhimavaram

20:28 - January 11, 2017
13:39 - January 6, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమరవంలో సోనో విజన్ షో రూమ్‌ ప్రారంభమైంది. సోనో విజన్‌కు ఇది 31 బ్రాంచి. భీమవరం జేపీ రోడ్‌లో నటరాజ్‌ థియేటర్‌ దగ్గర ఏర్పాటు చేసిన షో రూమ్‌ను ఏపీ మహిళ సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, నరసాపురం పార్లమెంటు సభ్యుడు గోకరాజు రంగరాజు కలిసి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల విక్రయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద షాపు. 1969లో పొట్లూరి జనార్దనమూర్తి ప్రారంభిచిన సోనో విజన్‌ క్రమక్రమంగా విస్తరించి, దక్షిణ భారతదేశంలో ఐదవ పెద్ద గొలుసుకట్టు సంస్థగా గా ఎదిగింది. 2016లో 3.20 లక్షల మంది కొలుగోలు ద్వారా 850 కోట్ల టర్నోవర్‌ సాధించింది. వివిధ కంపెనీలకు చెందిన ఏసీలు, ఎల్ ఈడీ టీవీలు, వాషింగ్‌ మిషన్లు, గృహోపకరణాలు తక్కువ ధరలకు విక్రయిస్తున్న సోనో విజన్‌ యాజమ్యాన్ని ప్రముఖులు అభినందించారు. 

18:47 - December 26, 2016

పశ్చిమగోదావరి : భీమవరంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడిన వారిని కనపడినట్టే కరిచింది. దీంతో 13 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు పిచ్చికుక్కను పట్టుకునేందుకు మున్సిపల్‌ సిబ్బంది గాలిస్తున్నారు.

07:03 - October 28, 2016

పశ్చిమగోదావరి : భీమవరంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. రౌడీషీటర్‌ బైసాని రామకృష్ణను ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. మాంసం కొట్టే కత్తితో దుండగులు రామకృష్ణను పైశాచికంగా నరికి చంపారు. అర్ధరాత్రి సుంకర బుద్ధయ్య వీధిలో జరిగిన ఈ ఘటన జరిగింది. దీంతో భీమవరం వన్‌టౌన్‌లో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి..హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. గత 10 సంవత్సరాల క్రితం జరిగిన ఓ కేసులో రామకృష్ణ ప్రధాన నిందితుడుగా వున్నాడు. దీనికి తోడు లు పీఎస్ లలో రామకృష్ణపై పలు కేసులున్నాయి. కాగా రామకృష్ణ వడ్డీ వ్యాపారం చేస్తూంటాడు. ఈ క్రమంలో వ్యాపార లావీదీవేల్లో గానీ, లేదంటే పాత కక్షలతో గానీ ప్రత్యర్థులు ఈ దారుణానికి పాల్పడి వుండే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కత్తితో దాడిచేసి ఆపై చేతిపంపు రాడ్ తో కూడా దాడి హత్య చేసినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. అర్థరాత్రి టూవీలర్ పై రామకృష్ణ ఇంటికి వెళ్తుండా ప్రత్యర్ధులు దాడి చేసి హత్యచేశారు. కాగా కత్తిపట్టిన వాడు కత్తితోనే కడతేరుతాడు అనే పెద్దల నానుడి మరోసారి నిరూపింతమైనట్లుగా ఈ హత్య ఉదతంతో తెలుస్తోంది. 

17:51 - October 20, 2016

తూర్పుగోదావరి : అక్కడ సామాన్యులు పోరుబాట పట్టారు. అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో కాదు.. తమ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా కాపాడుకోవడానికి ఒక సాధారణ మహిళ..పెట్టుబడిదారుల ఆగడాలకు అడ్డం తిరిగితే నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారు. గ్రామస్తులకు అండగా ఉన్నందుకు కుమారుడిని కూడా జైలు పాలుచేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ నెల రోజులుగా జైలులో మగ్గిపోతుంటే..క్యాన్సర్ రోగి అయిన భర్త ఏ దిక్కు లేక నానా కష్టాలు పడుతున్నాడు. ఈ దయనీయ ఘటనపై 10 టీవీ ప్రత్యేక కథనం..!

రణరంగంగా మారిన తుందుర్రు గ్రామం
పశ్చిమగోదావరి జిల్లాలోని తుందుర్రు గ్రామమిది. ప్రశాంతమైన వాతావరణం..పచ్చని పంట పొలాలతో హాయిగా జీవిస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు. ఈ ప్రశాంతమైన వాతావరణమే ఇప్పుడు రణరంగంగా మారిపోయింది.

అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం
తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటు వద్దంటూ 33 గ్రామాల ప్రజలు రెండున్నర ఏళ్లుగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు తెలియజేస్తున్నారు. అయినా ఇక్కడి వారి గోడును ప్రభుత్వం పట్టించుకోకపోగా..వీరిపై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తోంది. ఆక్వాఫుడ్‌ పార్క్‌పై ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టేస్తున్నారు పోలీసులు.

తుందుర్రుకు చెందిన ఆరేటి సత్యవతి ఒక సాధారణ మహిళ
పార్క్ ఏర్పాటు చేస్తే తమ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని మొరపెట్టుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పోరాటంలో సామాన్యులు చితికిపోతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఒక కుటుంబాన్ని చీకటి మయం చేసేసింది ప్రభుత్వం. తుందుర్రుకు చెందిన ఆరేటి సత్యవతి ఒక సాధారణ మహిళ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. గతంలో ఉద్యమాలు చేసిన చరిత్ర లేదు. కానీ, తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం చేపట్టడం వల్ల తమ సమీప గ్రామాలన్నీ కాలుష్యమయవుతాయని యాజమాన్యంపై తిరగబడింది. 33 గ్రామాల తరుపున పోరాటంలో చురుగ్గా పాల్గొంది. అంతే..ఆమెతో పాటు సత్యవతి కుటుంబం ఈ రోజు నరకయాతన అనుభవిస్తోంది. ఆక్వాఫుడ్‌ పార్క్‌ వద్దంటూ ఆందోళన చేస్తున్న ఆరేటి సత్యవతిని నెలరోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తల్లి సత్యవతి బాటలోనే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కుమారుడు వాసును కూడా జైల్లో పెట్టారు. దీంతో సత్యవతి కుటుంబంలో చీకటి అలుముకుంది.
ఇబ్బందులు పడుతున్న సత్యవతి భర్త సత్యనారాయణ
సత్యవతి భర్త సత్యనారాయణ క్యాన్సర్ రోగి. భార్య, కొడుకు ఇద్దరు జైలులో ఉండటంతో చూసేవాళ్లు లేక నానా కష్టాలు పడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి.. మందులు కూడా తీసుకొచ్చే వాళ్లు లేక ఇబ్బంది పడుతున్నాడు.

బాధితుల పక్షాన అండగా నిలుస్తోన్న సీపీఎం
ఆక్వా ఫుడ్ పార్క్ వద్దంటూ ఆందోళన చేస్తున్న బాధితుల పక్షాన సీపీఎం అండగా నిలుస్తోంది. వారి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటోంది. బాధితుల్లో భరోసాను, ధైర్యాన్ని నింపుతోంది. బాధితుల పక్షాన పోరాటం చేస్తున్న సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పీ. మధుతో పాటు ఇతర నేతలను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ మధ్య సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందకారత్‌ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి.. బాధితుల గొడును తెలుసుకున్నారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. ఇటు జైల్లో ఉన్న సత్యవతిని కూడా బృందకారత్‌ బృందం పరామర్శించింది.

ఉద్యమాన్ని అణచేందుకు ప్రభుత్వం యత్నం
ఉధృతంగా సాగుతున్న పోరాటాన్ని అణిచివేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నినా.. దాన్ని ఐక్యమత్యంగా తిప్పికొడుతామంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసి.. జైల్లో పెట్టినా.. భయపడేది లేదంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణం చేపట్టవద్దంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

 

13:41 - October 20, 2016
07:07 - October 3, 2016

పచ్చటి పొలాలతో కళకళలాడే ఉభయ గోదావరి జిల్లాలు ప్రజా ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ పార్క్ కి వ్యతిరేకంగానూ, తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ లాబొరేటరీస్ కి వ్యతిరేకంగానూ గ్రామాలకు గ్రామాలకు ఉద్యమిస్తున్నాయి. తమ ప్రాంతంలో నెలకొల్పుతున్న ఈ పరిశ్రమలను స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ పోరాటాలకు రైతు సంఘాలు, వామపక్షాలు ఎందుకు మద్దతిస్తున్నాయి? ఈ పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత నరసింహారావు విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

07:01 - October 3, 2016

తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయంటే ఎవరైనా సంతోషిస్తారు. అయితే, ఆ పరిశ్రమల కారణంగా తమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని, జీవన ప్రమాణాలు పెరగాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే, ఒక్కొక్కసారి కొన్నికొన్ని పరిశ్రమలు ఉపాధి అవకాశాలు పెంచకపోగా, స్థానికంగా వున్న ఉపాధినే పోగొట్టే ప్రమాదం వుంటుంది. అలాంటి ప్రమాదం వున్నప్పుడు, ఆ పరిశ్రమ వల్ల జరిగే మేలు కంటే కీడు ఎక్కువైన్నప్పుడు సహజంగానే స్థానికులు వాటిని వ్యతిరేకిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇదే జరుగుతోంది. పర్యావరణ విధ్వంసం సృష్టించి, ఉన్న ఉపాధిని చెదరగొట్టే పరిశ్రమలు వద్దంటే వద్దంటూ అనేక గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్న దృశ్యం ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపిస్తోంది.

కాకినాడ తీరంలో..
కాకినాడ తీరంలో దివీస్ లాబరేటరీస్ వ్యతిరేక పోరాటం, తుందుర్రు పరిసరాల్లో ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం మహోధృతంగా సాగుతున్నాయి. ఈ రెండు పోరాటాల పట్ల ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. ఈ రెండు పరిశ్రమల కారణంగా స్థానికంగా కొన్ని వేల మంది ఉపాధి కోల్పోవడమే కాకుండా, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, మహిళా సంఘాల నేతలతో పాటు సిపిఎం అగ్రనేతలు ఆ ప్రాంతంలో పర్యటించి, బాధితులకు అండగా నిలుస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా ? 
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోంది. సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఆ ప్రాంత పర్యటనకు వచ్చిన్నప్పుడల్లా పోలీసులు అడగడుగునా అడ్డుకుంటున్న దృశ్యాలు టీవీలలో చూస్తూనే వున్నాం. ఈ నేపథ్యంలో మొన్న ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మధు పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత వివాదస్పదమైంది. పొట్టలో తన్నుతూ, రోడ్డుపై ఈడ్చుకుంటూ వ్యాన్ లో విసిరేసి పోలీసు స్టేషన్ కు తరలించిన తీరు మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా? అన్న అనుమానాన్ని కలిగిస్తోంది. ఆయనేమీ తీవ్రవాది కాదు. అభివృద్ధి నిరోధకుడూ కాదు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధికి బాటలు వేసే ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్న నేత. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో ప్రజా గొంతుక వినిపించిన నాయకుడు. అలాంటి అగ్రనేత పట్ల పోలీసులు ఇలా కక్ష కట్టినట్టు వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదు. అది ప్రజాస్వామిక విలువలకే మాయని మచ్చ. అందుకే, మధుపై దాడిని నిరసిస్తూ అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

శాంతియుతంగా..
కాకినాడ తీరంలోని తొండంగి మండలంలో స్థాపిస్తున్న దివీస్ లేబొరేటరీస్ ఉత్పత్తి కేంద్రం వల్ల ఆ ప్రాంతం కాలుష్య కాసారంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల 300 హేచరీలకు ముప్పు వాటిల్లడమే కాకుండా, పాతిక వేలమంది ఉపాధి ప్రశ్నార్ధకంగా మారుతుందన్న భయం స్థానికుల్లో వుంది. దీంతో పచ్చని పొలాల మధ్య మందుల పరిశ్రమ పెట్టొద్దంటూ స్థానికులు ఉద్యమిస్తున్నారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో మరో ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమాల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

మెగా ఆక్వాఫుడ్..
పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ప్రాంతంలో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల కూడా పర్యావరణ సమస్యలు తెలెత్తుతాయన్నది స్థానికుల ఫిర్యాదు. ఈ మెగా ఫుడ్ పార్క్ కారణంగా 33 గ్రామాల ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నది స్థానికుల ఆవేదన. ఈ ఆక్వాఫుడ్ పార్క్ నిర్మిస్తే, తుందుర్రుతో పాటు చుట్టు పక్కల 32 గ్రామాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. అదంతా కాలుష్య ప్రాంతంగా మారిపోతుంది. తాగే నీళ్లు కలుషితమవుతాయి. పచ్చని పంట పొలాలు నాశనమవుతాయి. భూములన్నీ చౌడుబారిపోతాయి. ఈ ఫుడ్ పార్క్ లో వాడే కెమికల్స్ వల్ల గర్భవతులకు అనారోగ్య సమస్యలొస్తాయి. పుట్టే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. ప్రజలు వ్యక్తం చేస్తున్న ఈ అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోకుండా, పోలీసుల సహకారంతో ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న తీరే తీవ్ర అభ్యంతరకరం.

16:44 - September 21, 2016

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరంలో డిసెంబర్‌ 21నుంచి 23వరకూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి.. విద్యారంగ సమస్యలపై ఇందులో చర్చిస్తామని... ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి తెలిపారు.. ఈ కార్యక్రమానికి కేరళ విద్యాశాఖామంత్రితోపాటు, పలువురు హాజరవుతారని తెలిపారు..

18:05 - September 13, 2016

పశ్చిమగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇరుక్కపోయారా ? ఏమైంది ? అని అడుగుతున్నారా ? ఏమీ కాలేదు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. అక్కడ పోలవరం స్పిల్ వే పనులను ఆయన పరిశీలించారు. ఈ పర్యటన రెండు గంటల్లో ముగియాల్సి ఉంది. కానీ పర్యటన ఆలస్యమైంది. పనులను పరిశీలించిన అనంతరం స్పిల్ వే వద్ద అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ తరుణంలో భారీ వర్షం కురిసింది. దీనితో బాబు తిరుగ ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. వర్షంలో బాబు ఇరుక్కపోయారు. హెలికాప్టర్ ప్రయాణం వీలు కాకపోవడంతో రోడ్డు మార్గాన వెళ్లాలని చంద్రబాబు అనుకున్నారు. పోలవరం పనులు జరుగుతున్న ప్రాంతం మొత్తం ఎత్తు పళ్లాలతో కూడుకుని ఉంటుంది. కాన్వాయ్ వెళ్లడానికి వీలు ఉండదని..ఇక్కడే ఉండాలని అధికారులు సూచించడంతో బాబు ఇక్కడే ఉండిపోయారు. విజయవాడ..రాజమండ్రి వెళ్లాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - bhimavaram