bithiri sathi

20:25 - February 20, 2018

తెలంగాణ ప్రజలారా.?? మీరంత మళ్లొకపారి తలా ఒక పువ్వు దెంపుకోని తయ్యారు వెట్టుకోండ్రి..పేదల కష్టాలను నా భుజస్కందాల మీద ఏస్కోని మోయడానికి నేను సిద్దంగా ఉన్నాను అంటున్నడు నారా చంద్రాలు సారు.. తెలంగాణ రాష్ట్రమొస్తె మన నీళ్లు మనకొస్తయనుకున్నం.. వచ్చేశ్నయ్.. ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటే మూతి మీసాలు గాలినట్టు.. అయ్యో పాపం ముఖ్యమంత్రిగారికి అల్లుడు.. గదా అని ఓట్లేశి గెలిపిచ్చుకుంటే.. రైతులు నోరుమూస్కోవాలె తప్ప.. నా పంటకు మద్దతు ధర ఏది అని మాత్రం అడ్గొద్దు.. ప్రజలు కోరుకునేది ఒకటైతె పోలీసోళ్లు ఇస్తున్నది ఇంకోటి.. తెలంగాణల శాంతి భద్రతలు ఎట్లున్నయే నాయిని నర్సన్నా అని పొరపాటున అడ్గితె.. దేవునికాడ శక్తులే ఉంటే.. గుడికి తాళాలేసుడు ఎందుకు..? గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి.....

20:19 - February 19, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల రాజకీయాలు జూస్తుంటే ఏమనిపిస్తున్నది..? అబ్బా లీడర్లకు కమిట్మెంట్ అంటె ఇట్లుండాలే.. ప్రజల మీద..? మళ్లొక పారి మనం ఈ లీడర్లనే గెలిపిచ్చుకోని రుణం దీర్చుకోవాలె అనిపిస్తలేదు.. ప్రత్యేక హోదా విషయంల చంద్రబాబు కమిట్మెంట్... జగన్ బాబు.. ఆరాటం.. పవన్ బాబు పాకులాట.. బీజేపీ పనితనం.. కాంగ్రెస్ హెచ్చరికలు... జూస్తుంటే.. ఇట్లనే అనిపిస్తది.. కని అస్సలు కథ గిది..

పోశమ్మ పోగేశి పెడ్తె.. మైసమ్మ మాయం జేశినట్టు పాపం హరీష్ రావు సారేమో.. బైటిపార్టోళ్లను కండువాలు మార్చి కారెక్కిస్తుంటే.. ఇంకోదిక్కుకెళ్లి కార్లకెళ్లి దిగి ఎల్లిపోతున్నరు అసలైన నేతలే.. కరీంనగర్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్ల తయ్యారైందంటే.. ఇప్పటికి ఇప్పుడు ఓట్లొస్తె.. ప్రతిపక్షాల కంటె వేగంగ సొంతపార్టోళ్లే కారుపని జేశెతట్టున్నరు..

సేమ్ గొర్ల పత్కం ఎట్ల తెర్లు తెర్లైందో.. డబుల్ బెడ్రూం ఇండ్ల కథ గూడ.. గోవింత నామస్మరణల మున్గిపోయినట్టే అనిపిస్తున్నది.. ఈ శాతగాని మాటలు ఎందుకు జెప్పాలే జనానికి ఎందుకు ఆశవెట్టాలే.. ఉన్నదేదో ఇయ్యక.. అల్లుడొస్తె ఏడవండాలే.. కోడిపిల్లను ఏడగమ్మాలే అని జేజమ్మ ముచ్చట్లన్ని జెప్తె.. యాడాదికి అంగుళం చొప్పున శరవేగంగ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణమైతున్నది..

బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ, పేదలందర్ని ఒక్కతాన గల్పి.. బహుజనుల రాజ్యం తయ్యారు జేశితీర్తమని తెలంగాణ సామాజిక పోరాట సమితోళ్లు అనుకొచ్చిండ్రు.. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంల అధికారం చేజిక్కిచ్చుకుంటం.. ఎక్వమందున్న బహుజనులను పరిపాలకులను జేస్తమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పుసంతోష్ జెప్పిండు.. కోదండరాం, చెర్కు సుధాకర్ గూడ గట్టిగనే మాట్లాడిండు..

అలవాట్ల పొర్పాటున బూతుమాట అన్న.. క్షమించుమంటున్నడు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. మీడియాతోని మాట్లాడుకుంట మాట్లాడుకుంట జగన్ మోహన్ రెడ్డి మీద నాల్కె జారిండు.. ఎంటనే సరిజేస్కోని సారీ అని చెప్పిండు.. అయినా జేసీ దివాకర్ రెడ్డి అసొంటి ఉత్తమ పురుషులు బూతులు మాట్లాడకపోతె ఆశ్చర్యంగని.. మాట్లాడితె ఏం ఆశ్చర్యం అంతేనా..?

గప్పట్ల ఒకపారి ఓఎన్జీసీ గ్యాస్ పైపులు లీకై.. ఊరికి ఊరే మంటలు లేశెగదా..? అగో అసొంటి కథనే అయితుండే జర్రైతె మళ్లొకపారి.. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలం గొల్లెపాలెం మీదికెళ్లి ఓఎన్జీసీ కంపినోడు పైపులు వర్సుకుంట గ్యాస్ దీస్కపోతున్నడు.. పుసుక్కున ఆ పైపు వల్గినట్టున్నది.. మొత్తం గ్యాస్ మీదికి చిత్తుతున్నది.. గింత నిప్పుగూడ తల్గెనాంటే ఒడ్సెర సుమతే..

నల్లగొండ జిల్లా ఎలికట్టె ఊర్లెకెళ్లి ఒక పిలగాడు నాకు వాట్సప్ల వీడియో వంపిండు.. ఆ ఊర్లె జనానికి ఈగెలకు దోస్తీ గల్చింది.. మన్సులను జూడంగనే ఉర్కొచ్చి ఆల్తయట ఈగెలు.. ఇగ తాళ్లళ్ల గూడ గండోళ్ల మీద అభిమానం వెంచుకోని పొమ్మంటె గూడ వోతలేవట.. వాడెవ్వడో పుణ్యాత్ముడు జేశిన ఉద్దార్కానికి ఈగెల మోత మోగుతున్నది..

యాడంగ దాపురమైందో ఏం పాడో.. చిర్తపులి రోజు రాత్రి పూట రాను.. బర్రెనో గొర్రొనో కొర్కి సంప.. ఎన్నొద్దులు సూస్తరు చెప్పుండ్రి రైతులు.. ఉత్తపుణ్యానికే పసులు సచ్చిపోవట్టే.. అడ్వి అధికారులకు చెప్తె వాళ్ల చెవ్వుమీద పేనువారినట్టు గూడ ఉండదాయే.. ఇగ లాభం లేదని.. ఒక రైతు.. ఏకంగ చిర్తపులిని పోస్టు మర్టానికి వంపిండు.. తను దావఖానకు వొయ్యిండు..

అరరరే పాపం గుండు అన్మంతరావు సచ్చిపోయిండటగదా..? మస్తు జోకులు జేస్తుండే సీన్మలళ్ల..ఇయ్యాళ తెల్లారంగనే ఈ ముచ్చట తెల్సింది.. పాపం మంచిమన్షుండే.. అయితే పాణం గూడ బాగలేదట చాలొద్దుల సంది.. వాళ్లు వీళ్లు జర్రంత పైస సాయం జేశిండ్రటగని.. పైస సాయం జేసుడు తప్ప మనం ప్రాణ సాయం జేయలేముగదా..? పాపం...

 

20:20 - February 12, 2018

రెండు వేల పదిహేడు వర్కళ్ల.. తెలంగాణ రాష్ట్రంల ఏ ఆడబిడ్డనన్న నీళ్ల బిందె వట్కోని రోడ్ల పొంట గనిపిస్తె నేను ఊకునె మన్షిని గాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిన కొత్తల గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జెప్పిన ముచ్చట.. ఇగ సారువారి ముచ్చట్లు ఎట్లుంటయో ఎర్కేగదా..? రెండువేల పదిహేడు వొయ్యింది.. ఇప్పుడు పద్దెన్మిది.. పాండ్రి ఊర్లపొంటి పరిస్థితి జూద్దాం..గీ ముచ్చట జూడాలంటే వీడియో సూడుండ్రి...

20:13 - February 12, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజలారా..? ఈ తెల్గుదేశం పార్టీ ఎంపీలను పొరపాటున గూడ నమ్మేరు సుమా..? చంద్రబాబు రాశిన నాట్కమే ప్రదర్శిస్తున్నరు..అమ్మరే కొడ్క నిన్న పొద్దుందాముల.. తెలంగాణ జేఏసోళ్లకు జర్రంతల గుండాగినంత పనైంది.. ఒకప్పుడు యుద్దాలు ఒక గ్రౌండుల అయ్యేటియి.. సైనికులు గుర్రాలు ఏస్కోని కత్తులు వట్కోని పొడ్సుకుందురు...రైతుకు మద్దతు ధర దొర్కితె.. రైతులే సర్కారుకు ఉల్టా నాల్గువేలు ఇస్తరుగదా..? రెండువేల పదిహేడు వొయ్యింది.. ఇప్పుడు పద్దెన్మిది.. పాండ్రి ఊర్లపొంటి పరిస్థితి జూద్దాం..నల్లగొండ ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి.. ఆయన ప్రజలకు సేవ జేయవల్సింది ఇడ్సిపెట్టి ప్రజలతోని చెప్పులు మోపిచ్చుకుంటున్నడు..పక్వానికి రాని అర్టిపండ్లను దీస్కొచ్చి అవ్వి ఎర్రగ అయ్యెతందుకు ఏమేం పనులు జేస్తున్నరో సూడుండ్రి.. ఇవ్వి మనకు తెల్వయ్ గదా..? ముద్దుగున్నయని డజన్ డజన్ కొని తింటా ఉంటం..గిసొంటి ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

20:33 - January 23, 2018
21:13 - January 22, 2018

తెలంగాణ గవర్నర్ యవ్వారం గలీజుగున్నదంటున్న కాంగ్రెస్ పార్టీళ్లు, పవన్ కళ్యాణ్ సారు పర్యటనలు సుర్వు చేస్తున్నడు, పవన్ కళ్యాణ్ కేసీఆర్ ట్రాపుల పడ్డాడా?  చంద్రబాబుకు అసలు భయముండదా ?, మమ్మలను ఎవ్వలేం జేయలేరు అంటున్నడు ఇంటి మంత్రి నాయిని నర్సన్న, తెలంగాణల ఇంకో పార్టీ వచ్చేశింది ?, జబర్దస్త్ రోజమ్మ ఇంట్లకెళ్లి బంగారం దోస్కున్నరట, తెలంగాణ రోడ్డు మా ఆంధ్రల ఎట్లేస్తరని పంచాది లేశింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

 

21:30 - January 20, 2018

విశారధన్ మహారాజ్..మహాకాలినడక, చంద్రబాబు విదేశీ పర్యటనలు.. రాష్ట్రానికి ఒరింగిందేమి..? ఆయేషా హత్య కేసు...అమాయకునికి జైలు శిక్ష, టీసర్కార్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఎక్కడ ? దళితులు ప్రవేశిస్తే గుడి మైలవడ్తదంట, రహదారి విస్తరణ...రోడ్డున పడ్డ పేదల బతుకులు, 
మహిళను తోటి మహిళలే బట్టలిప్పేసి కొట్టారు, ఆవుపాలు తాగిన పందిపిల్ల.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

20:59 - January 19, 2018
20:17 - January 18, 2018

అత్యంత విశ్వనీస సమాచారం మనకు తెల్సిపోయింది.. కోదండరాం సారు కొత్త పార్టీ వెడ్తున్నడా..? లేదా..? ఏ గాయినెందుకు వెడ్తడు..? ఆయనకు రాజకీయమంటెనే ఇష్టంలేదని కొందరు.. ప్రశ్నించుడు కాడనే ఉంటడు సారు.. పరిపాలనదాక వోడు అని కొందరు.. ఇట్ల ఎవ్వలి మాట వాళ్లు మాట్లాడుకుంటున్నరు.. కని మనం జేఏసీల కీలకమైన నేతతోని మాట్లాడినం.. సారు పార్టీ వెడ్తున్నడా లేదా సూడుండ్రిగ..

అబ్బా ఎన్టీరామారావు సారు స్వర్గానికి వొయ్యి ఇర్వై రెండేండ్లైందిగని.. ఆయన ఆత్మకు శాంతి ఎట్లగల్గుతదని.. అటు నందమూరి ఫ్యామిలీ పరందామయ్యలు కనుక్కోలేకపోయిండ్రు.. ఆయన ప్రియమైన అల్లుడు చంద్రాలు గూడ తెల్సుకోలేకపోయిండ్రు.. కాబోయే కళల గవర్నర్.. గౌరవ శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారు మాత్రమే రామారావు ఆత్మకు శాంతి మార్గం గనిపెట్టిండు..

మనుండంగ మంచినీళ్లు వొయ్యనోళ్లు.. సావుకు మాత్రం ముందుగాళ్ల నిలవడ్డరట.. ఎన్టీరామారావు ముచ్చట్ల నందమూరి ఫ్యామిలీ డ్రామాలు జూస్తుంటె అట్లనే అనిపిస్తున్నది.. ఒకల్ని వట్టక ఒకలు ఎగవడి ఎగవడి పూలు జల్లి సమాధికి సన్మానాలు జేస్తున్నరు.. పాపం ఎన్టీరామారావు సారు ఎంత గోసెళ్ల వోశిండు.. ఆఖరికి గడియలళ్ల.. ఆయనను గోసవెట్టినోళ్లే ఇయ్యాళ ఆనందబాష్పాలు గార్చి.. బైటగూడ నటిస్తున్నరు..

అడుక్క తినెటోనికి హక్కులెందుకు చెప్పుండ్రి..? వానికి హక్కులు ఉంటేంది...? లేకుంటేంది..? వాని బత్కే అడుక్కతినుడాయే.. ఇంత పెద్ద మాట ఎందుకంటె..? చేతులు గాలినంక ఆకులు వట్కున్నట్టు.. సింగరేణి కార్మికులు ఇప్పుడు లొల్లికి దిగుతున్నరు.ఎన్నిలప్పుడు మాకిచ్చిన హామీలు నెరవేర్చుతాన్నముఖ్యమంత్రిగారు ఏమాయే అంటున్నరు.. ఈ సోయి ఎన్నికలప్పుడే ఉంటే ఎంత బాగుండే..?అనేది ముచ్చట..?
సకల జనుల సమగ్ర కుటుంబ సర్వేలెక్క.. సకల నేరస్తుల సర్వే జేపిస్తడట తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిగారు.. ఆ దొంగలకు జియో ట్యాగింగు వెట్టి.. వాళ్లు ఏడ తిర్గుతున్నరు..? ఏం జేస్తున్నరు..? అనేది ఎప్పటికప్పుడు తెల్సుకుంటరట.. తెల్సుకోవాల్సిందే నేరాల నివారణ కోసంగని.. మరి డీజీపీ గారు మేము గూడ కొన్ని సూచనలు జేస్తం పనికొస్తె పరిగణలోకి దీస్కోండ్రి..

ఏ ప్రభుత్వ అధికారన్న లంచం అడ్గితె చెప్పుతోని గొట్టుమని తెలంగాణ ముఖ్యమంత్రి జెప్పిండుగదా..? అది అమలైతున్నదో లేదో తెల్వదిగని.. నేను మాత్రం ఒక్క ముచ్చట జెప్తున్న..ఎవ్వడన్న మీడియా పేరు జెప్పి.. డబ్బులు అడ్గిండే అనుకో ఆడనే తోలు చెప్పుదీస్కోని కొట్టుండ్రి.. ఏంగాదు..? మీ అక్రమాలు బైటవెట్టొద్దంటే మాకు పైసలియ్యాలే అంటరా..? ఇదేనా జర్నలిజం అంటే..?

మొన్న మరదలిని ఇద్దరు బావలు గల్చి బొర్లిచ్చి కొట్టిండ్రు.. ఇయ్యాళ తిరుపతి దిక్కు సాటి మహిళ అని సూడకుంట.. పెయ్యిమీది బట్టలన్ని గుంజేశి.. నడి బాజట్ల గొట్టిండ్రంటే.. అయ్యో ఎంతైనా మన అసొంటి మహిళనే గదా... బరివాతల జేశి కొడ్తె ఇజ్జత్ మానం బోతదన్న శిగ్గుండొద్దా..? మన్సుల వాళ్లు పశువులా మీరే జెప్పాలె ఇగ..

యావత్ క్రికెట్ అభిమానులారా..? దక్షిణాఫ్రికాతోని కిర్ కెట్ మ్యాచ్ ఆడుతున్న ఇండియా పోరగాళ్ల ఆట సరిగలేదుగదా..? పొయ్యినోడు పొయ్యినట్టే ఔటైతున్నడు వస్తున్నడు.. ఇండియా ఇజ్జత్ కచ్రా జేశిండ్రు అని బాధపడ్తున్నరా..? ఇద్వర్ సంది ఇగ మీకు అసొంటి బాధలుండయ్.. నల్గురు ఆణిముత్యాలసొంటి క్రికెట్ ఆటగాళ్లు మన హైద్రావాద్ ఎల్బీస్టేడియంల కసరత్తు జేస్తున్నరు పాండ్రి పరిచయం జేస్త..

20:35 - January 17, 2018

తెలంగాణల పుట్టుడే పాపమైందా ఎట్ల నీ అరెస్టులు పాడుగాను.. మీ చేతులకు జెట్టలు వుట్ట.. అరే అడ్గితె అరెస్టులా..? ప్రజలకు అడ్గే హక్కుగూడ లేదా ఎట్ల..? అద్దంకి దయాకర్ అరెస్టు.. ఓయూ విద్యార్థులు అరెస్టు.. మందక్రిష్ణ మాదిగ అరెస్టు.. వంటేరు ప్రతాపరెడ్డి అరెస్టు.. ఇట్ల ఎంతమందిని అరెస్టు జేస్తరు ముఖ్యమంత్రిగారూ..? ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా ?

జిగ్నేష్ మేవానీ.. గుజరాత్ రాష్ట్రంల మొన్న అయ్యిన ఎన్నికలళ్ల.. నరేంద్రమోడీనీ.. బీజేపీని చుచ్చువోపిచ్చినంత పనిజేశిన దళిత బహుజన బిడ్డ.. ఇండిపెండెంట్గ పోటీ జేశి అఖండ విజయాన్ని అందుకున్న మేవానీ.. హైద్రావాద్ చంచల్ గూడ జైలుకొచ్చిండు.. ప్రశ్నించినందుకు అరెస్టుకు గురైన మందక్రిష్ణ మాదిగను పరామర్శించిండు..

పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. తెలంగాణ మొత్తం కుతకుత ఉడ్కుతున్న ముచ్చట ఇది.. తెలంగాణ ప్రభుత్వం వచ్చెనెలల ఈ చట్టాన్ని సవరించే బిల్లును అసెంబ్లీల వెట్టి.. అదే నెలల సర్పంజి ఎలచ్చన్లకు వోవాలె అనేది ఇగురం.. ఈ చట్టం అమలైతె తెలంగాణల ఏం మార్పురావోతున్నది..? దీనితోని ఏ పార్టీకి లాభం..? నష్టపోయేది ఎవ్వలు..? పాండ్రి సూద్దాం..

మందిని ముంచెతందుకు పోలీసు అవుతారం ఒక్కటే బెటరనుకున్నడో ఏమో.. ఒకడు ఉన్నతాధికారి ఏశంగట్టి.. నిజమైన పోలీసోళ్లతాననే పైకం వసూలు జేశిండు.. అచ్చం నిజమైన పోలీసు బాసులు కింది స్థాయి సిబ్బందిని ఎట్ల ఏడిపిస్తుంటరో.. అట్లనే ఏడిపిచ్చిండు.. కాకపోతె క్యారెక్టర్ల మున్గిపోయి కాకీలు ఎంటవడ్తున్న సంగతి మర్శిపోయిండు..

మొత్తం మీద హైద్రావాదుల పోలీసోళ్లు ఓడిపోయిండ్రు.. దొంగలు గెల్చిండ్రు.. ఒక్కటి గాదు రెండు గాదు.. సంకురాత్రి పర్వదినం పేరుమీద ఇర్వై ఐదిండ్లు లూటి వొయ్యినయ్.. తాళాలేశి ఊర్లకు వొయ్యిన జనం ఇండ్లను.. దొంగలు దత్తతకు దీస్కోని.. ఆలనా పాలన జూస్కున్నరు.. ఇగ మన ఫ్రెండ్లీ పోలీసోళ్లంటరా..? ఎంతెంత వొయ్యింది సొమ్ము అని లెక్కలు రాస్కునెతందుకు దప్పితె దేనికి పన్కొస్తరు..?

ఈ దొంగలళ్ల గూడ తెల్వితక్వ సన్నాసులుంటరు.. అరే చేస్తె ఎట్ల జేయాలే..? రాజకీయ నాయకులు కోట్ల కుంభకోణాలు జేశి జనం సొమ్ము ఎట్ల కొల్లగొడ్తరు.. ఉంటే గట్లుండాలే.. ఈ తులం మాసం ఎత్కపోతె ఏం మిగుల్తదిరా వారీ.. కూలిపైకం బడది.. మీదికెళ్లి దొంగతనం జేశి ప్రజలకు దొర్కితె ఎట్లుంటది..? సూడుండ్రిగో ఇట్లుంటది..

వాళ్ల కాలినిగాదు.. వాళ్లకు సంబంధం లేదు.. ఎక్కడెక్కడి సోడిగాళ్లంతొచ్చి.. ఒక గల్లిల గొట్టుకుంటా ఉన్నరు.. కాలినోళ్లకు ఏమైతున్నదో తెల్వది.. అప్పటికి రెండు గ్యాంగులు దిమ్మడ దమ్మడ గుద్దుకుంటున్నయ్.. రౌడీ షీటర్లు గూడ ఎంటరైపోయిండ్రట.. ఏదే నాయిని నర్సన్నా హైద్రావాదుల శాంతి భద్రతల పావురం ఏడెగురుతున్నట్టు..?

 

Pages

Don't Miss

Subscribe to RSS - bithiri sathi