Bithiri Sathi Comedy News

20:19 - January 12, 2018

మనకు ఏడనన్న అన్యాయం అయితే.. కోర్టుకు వోతం.. ఆడగూడ న్యాయంగాకపోతె..ఫలితాలు రాకముందుకే ఓటమి పాలైంది టీఆర్ఎస్ పార్టీ కరెంటి ముచ్చట్ల..చెర్వుమీద కొంగ అల్గితె.. చెర్వుదెండుతదా.?? కొంగదెండుతదా..? ఆ నాగం జనార్థన్ రెడ్డి గారు గూడ.. బీజేపీ కమలానికి కాటు వెడ్తున్నట్టే ఉన్నడుగదా? ఏయ్ మా కేటీఆర్ను తిడ్తరా మీరు..? కబడ్దార్ కాంగ్రెస్ నేతల్లారా అని టీఆర్ఎస్ పార్టోళ్లు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కత్తి స్టార్ కత్తి మహేష్.. ఇద్దరి పంచాదిలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంటరైపోయింది...తెలంగాణల గొర్ల పంపిణీ పత్కం తెర్లైంది అనెతందుకు మళ్లొక ముచ్చటొచ్చింది.. ఈ తెలంగాణ రాష్ట్రంల ప్రజలది గాని సంపద ఏదున్నా అది ప్రభుత్వానిదే అంతేనా..? భూములైనా.?మన్సులను వోలిన మన్సులు ఏడ్గురుంటరంటరు.. ఆ ఏడుగుర్ని ఎవ్వడు సూడవొయ్యిండో ఏమో నాకు తెల్వదిగని.. గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:19 - January 11, 2018

బహుష కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారే .. ఇప్పుడు చంద్రబాబు రూపంల మళ్ల భూమ్మీదికొచ్చిండా ఏంది..? కాకపోతేంది..మరి బ్రహ్మంగారు భవిష్యత్తుల ఏం జర్గుతదో ముందే ఊహించే చెప్పె మన్షి.. అగో చంద్రాలు గూడ అట్లనే జెప్తున్నడు రేపు ఏం జర్గబోతున్నదో ముందే ఆలోచన జేశి ముందు సూపుతోని ముంగటికి వోతున్నడట.. కావాల్నంటే సారే జెప్తడు వీడియోలో ఇనుండ్రి..

19:54 - January 11, 2018

బహుష కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారే .. ఇప్పుడు చంద్రబాబు రూపంల మళ్ల భూమ్మీదికొచ్చిండా ఏంది..? కాకపోతేంది.. ఇన్నొద్దులు ఉల్వశేన్ల వొడగొట్టుకోని కంది చేన్ల ఎంకులాడుకుంటొచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్ర దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీ అణిముత్యం శ్రీ మాణిక్యాల రావు ఏమంటున్నడంటే.. బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నెంబర్ అని అనెతందుకు లోకేశం ముచ్చట్లు సరిపోయినయ్ ఇయ్యాళటికి.. జబర్దస్త్ షోలళ్ల బిజీగుండే.. రోజమ్మ.. జనం బస్తీల పొంట తిర్గుతున్నది..పోలీసోళ్ల దృష్టిల ప్రజలంటే.. దొంగలు దోపిడి దారులు, అనుమానితులు..వారీ ఈ కులాలు మెడలేస్కోని తిర్గే సన్నాశిగాళ్లారా ఒక్క ముచ్చట జెప్పుండ్రి.. ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటె మూతిమీసాలు గాలినట్టు.. ఊరును ఉద్దరియ్యివా పటేలా అని ఎంపీటీసీగ గెలిపిస్తె..గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:54 - January 10, 2018

అయ్యా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారూ.. మీకేమన్న శీమునెత్తురు ఇజ్జత్ మానం.. శిగ్గుశరం ఉన్నయా సారూ..? మన్షివేనా నువ్వింతకు..? అది నాల్కెనా తాటిమట్టనా..? ఒక ప్రభుత్వ అధికారిని వట్కొని నీ అమ్మమొగనికి ఫోన్ జేస్తున్నావ్ రా అని తిడ్తవా..? లేదు సారు మీ అమ్మకే ఫోన్ జేస్తున్నా అని ఆ అధికారి సమాధానం ఇస్తె ఏమన్న శిగ్గు ఉంటుండెనా నీది..? నీ బల్పు బండకేశి కొట్ట..గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:39 - January 9, 2018

 

పాపం కోమటిరెడ్డి చిన్నరెడ్డి పెద్ద రెడ్డి ఆశల మీద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కుడ్ది గుమ్మరిచ్చింది.. అగో వస్తున్నది మాకే పీసీసీ.. వచ్చే పాయే.. ఏనుగెల్లింది తోకజిక్కింది అని నిన్నమొన్నటిదాక ఎంటుండె దండుకు చెప్పుకుంటొచ్చిన అన్నదమ్ములకు ఇప్పుడు కార్యకర్తల ముంగట మొఖం చిన్నబుచ్చుకున్నట్టైందట.. మరి మళ్లిప్పుడేం జెప్తరో అని అసక్తిగ జూస్తున్నరు అభిమానులు..

ఓదిక్కు ఎవ్వడన్న లంచం అడ్గితె చెప్పుదీస్కోని కొట్టుండ్రి అని ముఖ్యమంత్రి జెప్తడు.. నిజమే గావొచ్చు ఇద్వర్ సంది లంచాలు ఎవ్వలు దీస్కోరేమో అని అమాయకులు ఆఫీసుల పొంటవోతె.. అప్పటికంతె ఇంత ఎక్వనే అడ్గుతున్నరటగని.. తక్వలేదట.. ఒక పేద బిడ్డ.. ఎమ్మార్వోకు, వీఆర్వోకు లంచం ఇయ్యలేకపోతున్న గావట్టి సస్తాని గ్యాస్ నూనే మీద వోస్కున్నడు..

దరిద్ర్యం ఏందంటే మన దేశంల.. ఐదేండ్ల కొకపారి నాయకుడు అనెటోడు మన ఇంటికొస్తడు.. ఇగ తర్వాత ఐదేండ్లు మనం వాని ఇంటి సుట్టు తిర్గాలే.. సారు మమ్ములను ఆదుకోండ్రి అని.. సరే అదెట్లున్నా.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాధితులు ఎమ్మెల్యే షకీలును ఇంటి మీద వడ్డరు.. గెల్చినంక వందరోజులళ్లనే ఫ్యాక్టరీని తెర్పిస్తాని చెప్పిన దేవనపల్లి కవిత తప్పిచ్చుక తిర్గుతున్నది నీ సంగతేందంటున్నరు..?

అబ్బా నిన్నియాళ్ల గవర్నర్ నర్సింహాన్ సారును జూస్తె కంట్లె వెట్టుకుంటున్నరుగదా కాంగ్రెసోళ్లు.. ఆయన ముంగట వొర్రి.. వొర్రీ..ఆయన చెవ్వులను కరావు జేశినట్టుండ్రు.. నిన్న రాత్రి చెవ్వులు నొప్పివెడ్తున్నయని గాంధీ దావఖానకు ఉర్కొచ్చి.. బాగ జేపిచ్చుకున్నడట.. గవర్నర్ సారు చెవ్వుల కరావుకు కారణం కాంగ్రెసోళ్లేనా ఏంది అని అనుమాన పడ్తున్నరు నర్సింహాన్ సారు అభిమానులు..

పోశమ్మ పోగేశి పెడ్తె మైసమ్మ మాయం జేశినట్టు.. సర్కారు గొల్లకుర్మోళ్లు బత్కాలే.. అని సబ్సిడీ గొర్లు ఇచ్చుడువెడ్తె.. నడ్మిట్లున్న దళారీగాళ్ల పాలైతున్నది పత్కం.. అడ్డమైన గొర్లు దీస్కొచ్చి అంటగడ్తున్నరు.. లారీల కెళ్లి దిగకముందుకే సచ్చిపోతున్నయ్.. ఇదెక్కడి దిక్కుమాలిన యవ్వారం అని గొల్లకుర్మోళ్లంత గొర్లతోని ధర్నాకు దిగిండ్రు..

ఒక చేతిల పవిత్రమైన భారత రాజ్యాంగం.. ఇంకో చేతిల అశోకుడి ధర్మ చక్రం.. దేశానికి చిహ్నంగ ఉన్న సింహాలు.. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగ.. సాగుతున్న జంబూద్వీపం మహాకాళినడక.. మహా ఆదిగలను మహారాజులను చేస్తూ.. సాగుతున్న డీఎస్పీ యాత్ర.. నకిరేకల్ దాటింది.. మాదిగల గత సంస్కృతిని యాదిజేస్కుంట భారత రాజ్యాంగాన్ని బోదిస్తున్న ఈ ఉద్యమం.. తెలంగాణల హాట్ టాపిక్ అయిపోయింది..

ఏతుల పుంజు చంద్రాలు.. ఇగో ఇది నీకు తెల్వవల్చిన ముచ్చటనే.. కొయ్యరా కొయ్యరా పొలిగా అంటే.. గుంటూరు మిరియాలు తాటికాయంత దొడ్డన్నట్టు.. మాటలు జెప్తవ్ చేతలుండయా..? నిన్న పోలవరం దిక్కు వొయ్యి.. ఎవ్వలు ఎన్నికుట్రలు జేశినా పోలవరం గట్టితీర్తాని పొంకనాలు గొడ్తివిగదా..? సరే దాన్నంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నయ్ పటేలా..? మరి ఈ వికలాంగుల సంగతేంది..?

కూట్లె రాయిదీయలేనోడు ఏట్లె రాయి ఏరవొయ్యినట్టే అయ్యెతట్టుంది నీళ్లు పంచాది జూస్తుంటే.. మాజీ కరీంనగర్ జిల్లా మంథని అంటే.. మంథనిని ముద్దాడుకుంటనే వోతది.. గోదావరి నది.. ఆ మంథని జనానికే ఈ సలికాలంల నీటి కర్వొచ్చిందంటే.. ఇగ ఆ గోదావరి నీళ్లు తెచ్చి తతిమ జనానికి తాపుడు అయ్యెపనేనా అని అనుమానం రావట్టె జనానికి..

 

21:47 - January 8, 2018

పేపర్ల రాశి జనం మీదికి ఇడ్సిపెట్టెటోడుండాలేగని.. ఈ భూమిని.. దాని మీద మన్సులను నేనే తయ్యారు జేశ్నాని చెప్పుకున్నా చెప్పుకుంటడు.. చంద్రాలు.. ఇప్పుడు జెప్తలేడా..? ప్రపంచంలొస్తున్న ప్రతి మార్పుకు నేనే తల్లిని.. నేనే తండ్రిని అని చెప్కతిర్గవట్టే.. ఇప్పుడు క్రీడారంగం మీద వడ్డడు.. మరి అండ్లేంత గప్పాలు గొడ్తున్నడో సూడుండ్రి..

ఆంధ్రల చంద్రబాబేశిన.. జన్మభూమి కమిటీలు.. తెలంగాణల చంద్రశేఖర్ రావేశిన.. రైతు సమైక్య కమిటీలు.. ఇవ్వి రెండు జనాన్ని ఉద్దరిచ్చె కమిటీలైతె గావు.. ఓట్ల సంఘాలను గట్టి మళ్ల గెల్చెతందుకు నాయకులు ఆడుతున్న నాటకంల పుట్టిన పాత్రలే జన్మభూమి, రైతు సమన్వయ సమితి.. ఇవ్విటిని రద్దు జేయాలె అంటున్నరు సీపీఎం పార్టోళ్లు..

బీసీ నాయకులకు ఇప్పుడిప్పుడు కనువిప్పు అయితున్నట్టుంది.. మరి అధికారం దూరమైనంకొస్తున్న మాటలా ఇవ్విలేకపోతె.. నిజంగనే బీసీలకు అన్యాయం అయ్యింది తెల్గు రాష్ట్రాలళ్ల అన్న సోయా తెల్వదిగని.. మాజీమంత్రి.. చింతా మోహన్ గారు మాత్రం.. మా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు అయితలేడని కొత్త చర్చను సుర్వు జేశిండు..

ఒక ప్రభుత్వ అధికారి చెప్పపెట్టకుంట ఆఫీసుకు సక్కగ రాకపోతె సస్పెండు జేస్తరు.. బడిపోరడు బడికి సక్కగరాకపోతె హాజిరి లేదని ఫెయిల్ జేస్తరు.. మరి ప్రభుత్వ పదవిని అనుభవిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గూడ మార్కెటుకు సక్కగ రాకపోతె ఆయనను సస్పెండ్ జేయాలేగదా..? రైతులకు గనిపియ్యని మార్కెట్ కమిటీ ఛైర్మన్ను ఏం జేస్తరో చేయిండ్రిగ..

మన దేశం ఇంకా దరిద్ర్యంలనే ఉన్నదంటే.. కారణం పూజలు మంత్రాలు తాయితుల మహిమనే.. మనుషులను బాగుజేశే శక్తి తాయితలకు లేదన్నది తెల్సుగని.. దేశాన్ని నాశ్నంజేశే శక్తిమాత్రం ఈ మంత్రాలు, పూజలు పునస్కారాలకు మాత్రం ఉన్నది.. బైటిదేశాలపొంటి లేని మంత్రాలు, తాయితలు, బాబాలు.. మనదేశంలనే ఉండుడు మన దరిద్రానికి పరాకాష్ట అన్నట్టే..

ఉశ్కెలారీలు ఏమన్న సప్పుడు ఎట్లున్నది తెలంగాణల.. ఏమన్న అంటే.. డబుల్ బెడ్రూం ఇండ్లు గట్టెతందుకు ఉశ్కెను తీస్కపోతున్నమని లారీలకు బ్యానర్ గట్టుంటది.. ఈ మూడున్నర నాల్గేండ్లళ్ల ఎత్కపోయిన ఉశ్కె లెక్కలు జూస్తె.. తెలంగాణల ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్లు గట్టుడు పూర్తి గావాలె.. గంత ఉశ్కెవాగులు దాటుతున్నది.. అంటె చెట్టుపేరు జెప్పి కాయలమ్ముకున్నట్టు.. ప్రభుత్వ పథకాల నిర్మాణం పేరుజెప్పి ఉశ్కెదోస్తున్నరు..

నేటి బాలలే రేపటి పౌరులు.. అని ఒక సామెత ఉంటది.. దానంత బట్టెవాయి సామెత ఇంకోటి లేకుండొచ్చు.. నేటి బాలలే రేపటి పౌరులు అని ఉన్నదిగని.. బాలలు రేపటిదాక గూడ ఆగుతలేరు.. నేటి పౌరులుగ మారిపోతున్నరు.. నిజామాబాద్ జిల్లాల మీసాలు రాని పోరల ఏశాలు ఎట్లున్నయో టెన్ టీవీ కెమేరాకు దొర్కింది సూడుండ్రి..

రోడ్డు మీద ప్రయాణం అంటే.. వస్తుంటె పోతుంటే.. మంచైతది.. చెడైతది.. ఆర్టీసీ బస్సు నా కారుకు తాకింది గావట్టి వాడు నా కాళ్లు మొక్కాలే అట్లైతెనే ఇడ్సిపెడ్తాని ఎల్బీనగర్ దిక్కు ఒక కారు పార్టాయిన కయ్యం దీస్తె.. పోలీసోళ్లు, లీడర్లు అంత దగ్గరుండి ఆ డ్రైవర్ తోని కాళ్లు మొక్కవెట్టిండ్రు.. ఇది అధికార మదం అనకపోతె ఇంకేమంటరు అనేది మీరే జెప్పాలే సూశి..

వారెవ్వ సన్మానం అంటే ఇట్లుండాలే.. డప్పు సప్పుళ్లతోని.. బాజా బజంత్రీలతోని ఊరువాడ తిర్గుకుంట.. బాబు నాకే ఓటేయుండ్రి అంటే.. జనం పులదండలు దీస్కొచ్చి మెడలేస్తరనుకున్నడో ఏమో.. ఒక బీజేపీ లీడరు.. ఓట్ల ప్రచారం కోసం ఒకతాన తిర్గుతుంటే.. వాని మీద మంటతోని ఒక పెద్దాయన ఎంత పనిజేశిండో సూడుండ్రి.. ఆ లీడర్కు ఏమాత్రం ఇజ్జత్ మానం ఉన్నా..? మళ్ల అటెంకాళ్ల గనిపియ్యొద్దు...

Don't Miss

Subscribe to RSS - Bithiri Sathi Comedy News