Black money

21:31 - October 18, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ క్షమాపణలు ప్రజలకు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తొందరపడి మద్దతు తెలిపినందుకు తనని క్షమించాలని కోరారు. ఈ విషయాన్ని ఆయన ఓ తమిళ మ్యాగజైన్‌కి రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో కమల్‌ హాసన్‌ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. మోదీకి సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో నెలకొన్న సమస్యలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని ఈ నిర్ణయానికి మద్దతిచ్చినందుకు క్షమించండి అని ఆర్టికల్‌లో పేర్కొన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం తొలగిపోతుందని అనుకున్నాను కానీ ధనవంతుల కోసమే ఈ నిర్ణయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో రాజకీయ నేతలే లబ్ధిపొందారని... సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. ఈ విషయంలో తప్పు జరిగిందని మోదీ ఒప్పుకుంటే మరోసారి సలాం కొడతానని పేర్కొన్నారు. కమల్‌ కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నవంబర్‌లో తన కొత్త పార్టీ పేరును ప్రకటిస్తానని ఆయన గతంలో వెల్లడించారు.

07:47 - September 26, 2017

నోట్ల రద్దు తో జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని, కేవలం జీడీపీ కాదు జాతీయ ఆదాయం కూడా తగ్గిందని, మనం ఖర్చు పెడుతున్న విదేశి మారకద్రవ్యం మూడోంతులు చమురు పెట్టాలని కానీ చమురు ధర భారీగా తగ్గినా విదేశి మారకద్రవ్యం ఖర్చు ఇప్పటికి కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని, దేశా ఎకానమిక్ పరిస్థితి బాగాలేదని, దేశ ఆర్థిక పరిస్థితి నోట్ల రద్దు వల్ల దిగజారిందని, జీఎస్టీతో ప్రజలపై భారం తప్ప ఒరిగింది ఏమి లేదని దీ హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

21:09 - September 12, 2017

తొమ్మిదినెలల క్రితం భారీ ప్రకటనలు చేశారు..దేశమంతటికీ క్యూలో నిలబెట్టారు..కారణాలు బహుభారీగా చూపెట్టారు.. కానీ సీన్ రివర్సైంది. ఇప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మాటలతో విషయం స్పష్టంగా అర్ధమౌతోంది. ఏ నిర్ణయాల వెనుక ఏ ఉద్దేశాలున్నాయో? ఇంతా చేసి ఎందుకు నోరు మెదపటం లేదో అర్ధమౌతుంది. డీ మానిటైజేషన్ తెరవెనుక అంశాలేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టొరీ.. 
ఏం చెప్పారు? ఏం జరిగింది? 
ఏం చెప్పారు? ఏం జరిగింది? నోట్లరద్దు దేశానికి ఏం మిగిల్చింది? సామాన్యుడికి ఏ అనుభవాలిచ్చింది? ఎంత నల్లధనం వెలికి తీశారు? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్తున్నాయి? జైట్లీ వాదనల్లో అసంబద్ధత ఎంత? మోడీ సర్కారు డీమానిటైజేషన్ తో తప్పులో కాలేసిందా?   తగ్గిన జీడీపీ గణాంకాలేం చెప్తున్నాయి? ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఏం చెప్తున్నారు ? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:25 - September 1, 2017

రద్దయిన పెద్దనోట్లలో దాదాపు 90 శాతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో చేరాయని ఆర్బీఐ బుధవారం ఆర్బీఐ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. మోది సర్కార్‌ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ఉపయోగపడిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో బి.వెంకట్ (సీపీఎం), కుమార్ (బీజేపీ), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

06:53 - September 1, 2017

ఢిల్లీ : మోది సర్కార్‌ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ఉపయోగపడిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. డిమోనిటైజేషన్‌ మనీలాండరింగ్‌ ఎక్సర్‌సైజ్‌ తప్ప మరోటి కాదన్నారు. అక్రమంగా ఆర్జించిన నోట్లను సక్రమంగా మార్చుకునేందుకు వీలు కల్పించిందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దువల్ల క్యూలైన్లలో నిలబడి 100 మంది ప్రాణాలు కోల్పోయారని ఏచూరి గుర్తు చేశారు. కేవలం బహుళ జాతీయ కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూరిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం, అవినీతిని రూపుమాపడం, దొంగ నోట్లను అరికట్టడం, టెర్రరిస్టులకు నిధులు అందకుండా చేయాలన్న ప్రధాని లక్ష్యం ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు లక్షా 50 వేల కోట్ల నష్టం జరిగిందని దీన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో తలెత్తిన పరిణామాలకు ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. 

21:57 - August 30, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. మొత్తం 15.44 ల‌క్షల కోట్ల విలువైన వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు రద్దు కాగా... 15.28 ల‌క్షల కోట్ల రూపాయలు తిరిగి వ‌చ్చాయ‌ని ఆర్బీఐ త‌న వార్షిక నివేదిక‌లో వెల్లడించింది. ర‌ద్దైన కరెన్సీలో 8,900 కోట్ల రూపాయల విలువైన వెయ్యి నోట్లు తిరిగి రాలేద‌ని రిజర్వు బ్యాంకు ప్రకటించింది.  ఇక ప్రస్తుతం చెలామణిలో ఉన్న కొత్త నోట్లలో  2000 నోట్లు యాభై శాతం పైగా ఉన్నాయి.  గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్కెట్లో క‌రెన్సీ చెలామ‌ణి  20 శాతం త‌గ్గింద‌ని కూడా ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది.  

 

18:31 - July 5, 2017

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ముమ్మాటికి ధోషి అని... జైల్లో ఊసలు లెక్కబెడతారని వైసీపీ నేత రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తనకు బ్లాక్ మనీ, వైట్ మనీకి తేడా తెలుసని.... జయంతికి, వర్థంతికి తేడా ఎంటో నారా లోకేష్ తెలుసుకోవాలని హితవుపలికారు. 'ధైర్య ఉంటే నా ఆస్తులు, నీ ఆస్తులపై సీబీఐ విచారణ చేయండి' అని సవాల్ విసిరారు. న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

15:54 - June 30, 2017

కామారెడ్డి : లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు, బంపర్ ఆఫర్లు అంటూ జనాలకు.. ఈజీగా కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు. స్కీంల పేరుతో కోట్ల రూపాయలు కట్టించుకొని మోసం చేస్తోన్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తోన్నా.. మళ్లీ జనం దగా పడుతూనే ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో బంపర్‌ డ్రా పేరుతో ఓ ముఠా స్కీం వ్యాపారం నడిపిస్తోంది. స్కీమ్‌కు పర్మిషన్‌ లేకున్నా.. కొందరు పోలీసులు, ప్రజా ప్రతినిధుల అండతో దందాను నడిపిస్తున్నారు.

1250 రూపాయలు కట్టండి..
నెలకు కేవలం 1250 రూపాయలు కట్టండి.. ఆకర్షణీయమైన బహుమతులను పొందండి. లక్ష్మీ గణపతి ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో.. కొందరు వ్యక్తులు ఈ దందాను నడిపిస్తున్నారు. నెలకు 1250 చొప్పున 12 నెలలు కట్టాలి. మొత్తం 3, 300 మంది ఈ స్కీంలో సభ్యులుగా చేరారు. కామారెడ్డి నగర శివారులోని ఫంక్షన్‌ హాలులో ప్రతి నెలా ఈ భాగోతాన్ని నడిపిస్తున్నారు. 41 లక్షల 25 వేలు ప్రతీ నెలా వసూలు చేస్తారు. ఏడాదికి చూస్తే 4 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఇందులో ప్రతీ నెల బంపర్ డ్రా తీస్తారు. 12 నెలలు ప్రతీ నెలా కొన్ని బహుమతుల బంపర్‌ డ్రా ఉంటుంది. ఓ నెల నాలుగు ఎల్‌ఈడీ టీవీలు ఉంటే మరో నెల నాలుగు ఎల్‌ఈడీ టీవీలతో పాటు బైక్‌లు ఉంటాయి. మరో నెల కారు ఉంటుంది. ఇలా 12 నెలలు ఆకర్షణీయమైన బహుమతులంటూ జనాలను మభ్యపెడుతున్నారు. ఈ స్కాం గురించి ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. ఎంక్వైరీ కూడా చేయలేదు. ప్రజా ప్రతినిధుల అండ.. పోలీసులు కూడా బంపర్‌ డ్రాలో అభ్యర్థులుగా ఉండటం వల్లే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కీం సభ్యులు మినహా ఎవరూ రాకుండా సెక్యూరిటీని నియమిస్తారు. ఈ స్కీంలో ముందు అర చేతిలో వైకుంఠం చూపించి.. వారు సభ్యులుగా చేరాక శరతులు వర్తిస్తాయని చెబుతారు. స్కీంలో బైక్‌ వస్తే.. దానికి అయ్యే భీమా, రోడ్ ట్యాక్స్, ఎంట్రీ ఫీజు ఇలా చట్ట ప్రకారం కట్టాల్సిన డబ్బులు.. డ్రా పొందిన సభ్యుడే కట్టాలి. సభ్యుడు రెండు నెలలు డబ్బులు కట్టకపోతే సభ్యత్వం తీసేస్తారు. అంతకు ముందు కట్టిన డబ్బులు కూడా ఇవ్వరు.

ఎల్‌ఈడీ టీవీలు అమ్మడానికి మాత్రమే
ఈ పథకం కేవలం ఎల్‌ఈడీ టీవీలు అమ్మడానికి మాత్రమే అని పెట్టి.. ఇందులో కార్లు, బైక్‌లు బంపర్‌ డ్రాలో పెడతారు. టీవీలు, బైక్‌లు, కార్లు షోరూం పెట్టి లైసెన్స్‌లు పెట్టి అమ్మాలి. టీవీలు, కార్లు, బైక్‌లు ఇలా ఏదైనా ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించకుండా బంపర్‌ డ్రాలో వెళ్లినవారికి ఇచ్చేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం.

స్కీం పేరుతో 4 కోట్ల 94 లక్షలు వసూలు
12 నెలల్లో మొత్తం స్కీం పేరుతో 4 కోట్ల 94 లక్షలు వసూలు చేస్తారు. ఏడాదిలో 3, 300 మంది సభ్యుల్లో 2 వేల మంది ఎల్‌ఈడీ టీవీలు పొందుతారు. మిగతా వెయ్యి మంది కట్టే కోటీ 25 లక్షలు స్కీం సభ్యులకు మిగులుతాయి. ఒక్క ఎల్‌ఈడీని 9 వేలకు ఇప్పిస్తున్నారు. మిగతా 6 వేలు స్కీం నడిపిస్తున్న వారి ఖాతాలోకి వెళ్తాయంటే.. ఏ రేంజ్‌లో స్కాం చేస్తున్నారో అర్థమవుతుంది. బ్రాండెడ్‌ ఎల్‌ఈడీ టీవీలు అని చెప్పి చివరకు.. అసంబుల్డ్‌ ఎల్‌ఈడీ టీవీలు అంటగడుతున్నారు. నిర్వహకులు స్కీం ఎత్తేస్తే.. కోట్ల రూపాయలు జనాలకు కుచ్చుటోపీ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా.. జనం ఈ మాయదారి స్కీంలను నమ్ముతూ మోసపోతూనే ఉన్నారు.  

14:57 - May 7, 2017

హైదరాబాద్ :  ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పేదలను కోలుకోలేని దెబ్బతీసింది. అసంఘటిత కార్మికులకు పనిదొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాక.. ఫ్యాక్టరీలలో పని చేస్తున్న 2 లక్షల మంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. మరో 46 వేల మంది పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలకు కోత పడింది. 2016 అక్టోబర్‌ నుంచి 2017 జనవరి మధ్య కార్మికులు.. ఉపాధి కోల్పోయినట్టు ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత తీవ్ర నగదు కొరత ఏర్పడింది. ఈ ప్రభావం చిన్న తరహా పరిశ్రమలపై పడిందని నివేదికలో బయటపడింది. వ్యవసాయేతర రంగాలైన తయారీ, నిర్మాణ, కార్మిక, రవాణా, వసతి, రెస్టారెంట్లు, ఐటీ, బీపీఓ, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి వివరాలు సేకరించారు. నిర్మాణ రంగంలో సుమారు 1.10 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ కాలంలో పార్ట్‌టైమ్‌కు సంబంధించి 46 వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. నోట్ల రద్దు ప్రభావంతో కార్మికుల జీతాల్లో భారీగా కోతలు పెట్టాల్సి వచ్చినట్టు తేలింది. ఐటీ, బీపీఓల్లో కూడా ప్రభావం కనిపించింది.

పార్ట్‌ టైమ్‌ అధిక ప్రభావం
నోట్ల రద్దు ప్రభావం నిర్మాణ రంగంలో పని చేస్తున్న పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలపై అధిక ప్రభావం పడింది. 2017లో నిర్మాణ, రవాణా, బీపీఓ, విద్య, ఆరోగ్య విషయాల్లో పురోగమన మార్పులు వచ్చాయని గుర్తించింది. అయితే వసతి, రెస్టారెంట్లలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇందులో కార్మికుల సంఖ్య 1.39 లక్షలు కాగా, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య 1.24 లక్షలుగా నమోదైంది. ప్రతీ యేటా 2.5 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో మోదీ వాగ్దానం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతీ యేటా 1.2 కోట్ల మంది కార్మికులు కొత్తగా చేరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసంఘటిత రంగంతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి దొరకటం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నోట్ల రద్దు ప్రభావంతో కోట్లాది సంఖ్యలో కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు.. పలు రంగాలకు చెందినవారు ఉపాధిని కోల్పోయారని ప్రజా ఉద్యోగ పంఘాలు ఆరోపిస్తున్నాయి. 

19:54 - April 29, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - Black money