bodiga shobha

16:28 - October 11, 2018

కరీంనగర్ : చొప్పదండి టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్న శోభ ఆశలు నెరవేరడం లేదా ? ఆమెకు టికెట్ దక్కదా ? ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. తనకు టిక్కెట్ ఇవ్వకుండా పెండింగ్‌‌లో ఉంచడంతో బొడిగే శోభ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా అపదర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువడానికి బొడిగె శోభ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం సిరిసిల్లలో కేటీఆర్‌ను కలువడానికి ప్రయత్నించినా అంతగా సమయం ఇవ్వలేదని ప్రచారం జరిగింది. 
ఈ నేపథ్యంలో గురువారం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ రాకకోసం శోభ గంటపాటు ఎదురు చూశారు. వేములవాడకు చేరుకున్న కేటీఆర్..చెన్నమనేని రమేష్ నివాసంలో భోజనం చేశారు. ఈ భోజనానికి వారితో పాటు శోభ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య చొప్పదండి టికెట్ పెండింగ్ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కానీ మంత్రి కేటీఆర్ ఎలాంటి స్పష్టమైన హామీనివ్వకపోడంతో భోజనం మధ్యలో నుండే శోభ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేకపోవడంతో ఆమె తుదినిర్ణయానికి తీసుకొనే అవకాశం ఉందని, బీజేపీలో చేరుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

20:18 - January 17, 2017

'ట్విట్టర్ పిట్టె మన అంబర్ పేట అన్మంతన్నను పర్శాను జేస్తున్నదట..? అంతర్జాతీయ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారుకే వస్తయనుకున్నం ఏశాలు గట్టుడుగని..? చంద్రాలు సారూ గూడ నిన్నియాళ్ల సుర్వు జేశిండుగదా..? పాలకొల్లు ఎమ్మెల్యేను అక్కడి అధికారులు దేకుతలేరట...వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే సారు.. చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడం ఇద్దరు హద్దుల పంచాదికాడ అభివృద్ధిని ఆగం జేస్తున్నరట.. సర్కారుకు మంచి పేరు రావాల్నంటే ఏం జెయ్యాలే..? కింది స్థాయిల పనిజేశే అధికారులు మంచిగ నిజాయితీగ పనిజేయాలే అంతేనా..? ఈ సెల్ఫీలు ఎవ్వడు గనిపెట్టిండోగని..? అరరరరే జనం పాణాలు వోతున్నా పట్టించుకుంటలేరు..ఒక్క ఊరికి ఎంత మంది సర్పంజులుంటరు..? కుప్పం నియోజకవర్గంలనే జల్లికట్టు ఆటవెడ్తె.. ఆయింత ఎద్దుకు కోపమొచ్చి ఎంత పని జేశిందో' గిసొంటి మస్త్ మస్త్ ముచ్చట్లను మల్లన్న ఎలా చెప్పిండో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:13 - January 17, 2017

ట్విట్టర్ పిట్టె మన అంబర్ పేట అన్మంతన్నను పర్శాను జేస్తున్నదట..? అగో గా పిట్టెకు అన్మంతన్నకు ఏంది సంబంధం అంటరా..? నాకు గూడ తెల్వదిగని..? ఆ ట్విట్టర్ అంటెనే మస్తు గరమైతున్నడు.. ఆ ట్విట్టర్ పిట్టె దొర్కితె పీక విస్కి సంపెటంత కోపంతోని ఉన్నడు.. మరి అన్మంతన్నను పిట్టె కర్శిందా కొర్కిందా..? ఎందుకంత కోపమంటె ఇగో వీడియో క్లిక్ చేయండి..

13:12 - August 30, 2016

కరీంనగర్‌ : జిల్లా చొప్పదండి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొడిగె శోభను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ.. కాంగ్రెస్‌ మహిళా నేత రమ్య గన్‌పార్క్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 2013లో కరీంనగర్‌లో ఉన్న తన ఫంక్షన్‌హాల్‌పై బొడిగె శోభ, కొంతమంది మహిళా నేతలతో కలిసి దాడి చేశారని ఆరోపించారు. తక్షణమే ఎమ్మెల్యే శోభను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుండడంతో ఆందోళన చేపట్టవద్దని పోలీసులు ఆమెకు సూచించారు. రమ్య వినిపించుకోకపోవడంతో.. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Don't Miss

Subscribe to RSS - bodiga shobha