Bollywood

13:04 - September 5, 2018

టాలీవుడ్ లో విలన్ పాత్రకు ఒక మార్పు తెచ్చిన నటుడు ఎవరు అంటే ఠక్కున 'జగపతి బాబు' అని చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన టాలీవుడ్ లో మోస్ట్ విలన్ గా మారారు. హీరో 'బాలకృష్ణ' నటించిన 'లెజెండ్' మూవీలో నటించిన 'జగపతిబాబు'కు మంచి మార్కులు పడ్డాయి. ప్రతి నాయకుడిగా జగపతి బాబు ఫుల్ బిజీ అయిపోయాడు. విలన్ గా నటిస్తూనే క్యారెక్టర్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ లో కూడా తన విలనిజాన్ని చూపేందుకు రెడీ అయ్యాడు.

బాలీవుడ్ హీరో 'అజయ్ దేవ్ గన్' నటిస్తున్న 'తానాజీ' మూవీలో 'జగపతి బాబు' నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. 'జగపతి బాబు'కు సంబంధించిన లుక్‌ను సోషల్ మీడియాలో లీకైంది. తానాజీ జీవిత కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఓం రావత్ దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం జగపతి బాబుకు సంబంధించిన ఈ లుక్ వైరల్ అవుతోంది. మరి మీరు ఈ లుక్ పై లుక్కేయండి. 

12:16 - June 13, 2018

కొందరు హీరోలు కేవలం రీల్ లో మాత్రమే హీరోలు..రియల్ లైఫ్ లో వారు జీరోలే కాదు..విలన్ ల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. సినిమా డైలాగుల్లో సూక్తులు చెబుతుంటారు. నిజజీవితంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు అనే దానికి ఈ హీరోనే నిదర్శనం.

ఆర్మాన్ కోహ్లీ అరెస్ట్..
తన భార్య, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసిన శాంతాక్రజ్ పోలీసులు, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు.

నీరు తలను నేలకేసి బాదిన కోహ్లీ..
ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నీరూ రంధావాకు బలమైన గాయాలు కాగా, కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నీరూ వ్యాఖ్యానించారు. కాగా, నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

21:57 - February 28, 2018

ముంబై : శ్రీదేవి.. అంటే అతిలోక సుందరి.. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య.. అభిమానులకు అంతవరకే పరిచయం.. శ్రీదేవి జీవితంలో అభిమానులకు తెలియని ఎన్నో కోణాలున్నాయి. మోసాలు, బాధలు, కన్నీళ్లు ఎన్నో చవి చూసిన మహానటి శ్రీదేవి. ఆమె జీవితంలోని అనేక కోణాల్ని ఓ లేఖలో ఆవిష్కరించారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. నటిగా శ్రీదేవి ఎదిగిన విషయాల నుంచి బోనీ కపూర్‌తో వివాహం వరకు తనకు తెలిసిన వివరాలన్నీ ఆ లేఖలో రాశారు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 
మరో సంచలనానికి తెరలేపిన వర్మ 
వర్మ.. వివాదాలకు పెట్టింది పేరు. ఆయన ఏం చేసినా సంచలనమే..ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న వర్మ.. తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. తను ఎంతగానో అభిమానించి.. ఆరాధించే నటి శ్రీదేవి జీవితంలో ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లను..అగాథాలను వివరిస్తూ ఓ లేఖ రాశారు. ట్విట్టర్‌లో ఆ లేఖను పోస్ట్ చేశారు. వర్మ పోస్ట్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
పంజరంలో చిక్కుకున్న పక్షిలా మారిపోయిందన్న వర్మ 
దేశంలోనే అతి పెద్ద సూపర్ స్టార్‌గా 20 ఏళ్లపాటు వెండితెరను ఏలిన శ్రీదేవి నిజ జీవితం మాత్రం పంజరంలో చిక్కుకున్న పక్షిలా మారిపోయిందని వర్మ లేఖలో ప్రస్తావించారు. తన కుటుంబం కోసం అహర్నిశలు పాటుపడుతూ తనను తాను మర్చిపోయిందని రాసుకొచ్చారు. అత్తింటి వారు అవమానించినా.. అన్నీ భరించి తన జీవితంలో చాలా కాలాన్ని దుఃఖంతో గడిపిన మహిళ శ్రీదేవి అంటూ వర్మ లేఖలో రాశారు. చివరి వరకూ తన గురించి ఆలోచించుకోకుండా జీవితాన్ని కోల్పోయిన శ్రీదేవి వచ్చే జన్మలో అయినా తన గురించి ఆలోచించుకోవాలని వర్మ లేఖలో కోరుకున్నారు. 
వర్మ లేఖపై టీవీ నటి కవితా కౌశిక్‌ మండిపాటు 
వర్మ లేఖపై ఓవైపు సినీ వర్గాలు.. అభిమానుల్లో చర్చ జరుగుతుంటే.. టీవీ నటి కవితా కౌశిక్‌ మండిపడ్డారు. శ్రీదేవి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ వర్మకు రీట్వీట్ చేశారు కవిత. వర్మ  బయటపెట్టిన అంశాలపై స్పందించి నోరు మూయించడానికి శ్రీదేవి భౌతికంగా లేరని.. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండంటూ వర్మకు ట్వీట్‌లో వార్నింగ్ ఇచ్చారామె.
తీవ్ర విషాదంలో మునిగిపోయిన వర్మ  
మరోవైపు శ్రీదేవి మరణించినప్పటి నుంచి వర్మ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె సినిమాలు చూస్తూ.. కాలక్షేపం చేస్తున్నారు. శ్రీదేవి అంతిమయాత్రలో ఫోటోను పోస్టు చేస్తూ 'సినీ దేవతకు తుది వీడ్కోలు' అని వర్మ ట్వీట్ చేశారు. మొత్తానికి వర్మ రాసిన లేఖలు.. ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనం రేపుతూనే ఉన్నాయి. తాజాగా వర్మ రాసిన లేఖపై ఇంకెంతమంది స్పందిస్తారో చూడాలి. 

19:37 - February 28, 2018

ముంబై : అతిలోకసుందరి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దివి నుంచి భువికి దిగి వచ్చి వెండితెరను రాణిలా ఏలిన అందాలనటి మళ్లీ దివికేగింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె... మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది. శ్రీదేవి అంతిమయాత్రలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 
శ్రీదేవి భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళులు 
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. తమ అభిమాన నటి కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా భారీ ఎత్తున పాల్గొని.. శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు అంతిమయాత్రకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 
ఎరుపురంగు చీర కంచిపట్టు చీరతో శ్రీదేవి అలంకరణ 
అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకు అలవాటు. దీంతో చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే ముస్తాబు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించిన వాహనాన్ని.. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. అంతిమయాత్ర వాహనంలో శ్రీదేవి భౌతికకాయంతో పాటు ఆమె కుటుంబీకులు ఉన్నారు. 
శ్రీదేవి కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు 
అనంతలోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవి చివరిచూపు కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పోటెత్తారు. హేమామాలిని, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురి దీక్షిత్, అక్షయ్‌ కుమార్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, అర్జున్ కపూర్, సంజయ్‌ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్‌ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్‌ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అలాగే రజనీకాంత్, కమల్‌ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అర్జున్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు.  
ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు  
ఇక సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. కడసారి శ్రీదేవిని చూసేందుకు ముంబై తరలివచ్చిన అభిమానులంతా బాధాతప్త హృదయాలతో వెనుదిరిగారు. 
శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలు రద్దు 
ఇక శ్రీదేవి మృతికి సంతాపంగా ఆమె నివసించిన లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని గ్రీన్‌ ఏకర్స్‌ సొసైటీ హోళీ వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించింది. తన నటనతో యావత్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్న శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలను రద్దు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. 

 

10:17 - February 28, 2018

ముంబై : అందాల తార శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలించారు. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆమెను వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె కన్నుమూశారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైలోని ఆమె నివాసానికి తరలించారు. ఉదయం పలువురు సినీ ప్రముఖులు ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

9గంటల ప్రాంతంలో సెలబ్రేష్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలించారు. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు పలు ఆంక్షలను విధించారు. మీడియాకు కేవలం కొంత వరకు మాత్రమే పరిమితం చేశారు. ఆమె భౌతికకాయాన్ని ఉంచిన ప్రదేశం వరకు మీడియాకు అనుమతినివ్వడం లేదు.

 

11:58 - November 9, 2017

స్టార్ హీరోలు సినిమాలు మొదలు పెట్టారు. షూటింగ్ జరుగుతుంది అని అప్ డేట్స్ ఇస్తున్నారు అలానే ఇప్పుడు ట్రైలర్స్ టీజర్స్ విషయంలో కాంపిటీషన్ కూడా చూపుతున్నారు. సోషల్ మీడియా లో వస్తున్న రెస్పాన్స్ కి ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ సినిమా అంటే అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్ కి రెడీ అయిపోతారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమా తో హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ పవన్ తో సినిమా చేస్తూ ఎక్స్ పెక్టషన్స్ పెంచుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా తన ప్రీవియస్ ఫిలిం 'సర్దార్ గబ్బర్ సింగ్‘, 'కాటంరాయుడు'తో అభిమానులను ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇంట్రస్ట్ ని పెంచింది. పవన్ త్రివిక్రమ్ సినిమా అంటే ఒక క్రేజ్ మాత్రమే కాదు పీక్స్ లో ఉన్న క్రేజ్ అని నిరూపించారు ఫాన్స్. ఈ చిత్రానికి ప్రస్తుతానికి అజ్ఞాతవాసి టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కోసం ట్యూన్ చేసి బయటకొచ్చి చూస్తే పాటను బయటకొదిలాడు. ఈ పాట పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే 1 మిలియన్ హిట్స్ వచ్చాయంటే అభిమానులు ఎంత ఆసక్తిగా విన్నారో అర్ధమైపోతుంది.

'ధ్రువ' సినిమా 'రామ్ చరణ్' ని మార్చేసింది అని చెప్పాలి. రామ్ చరణ్ లుక్ తో పాటు యాక్టింగ్ లో కూడా డిఫెరెంట్ చూపిస్తూ తన కెరీర్ ని పక్క ప్లానింగ్ లో పెట్టుకున్నాడు. తనలో యాక్టింగ్ స్కిల్స్ ని చూపించే మంచి అవకాశాన్ని ధ్రువ సినిమా ద్వారా యూస్ చేసుకున్నాడు. రామ్ చరణ్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం 1985’.రంగస్థలం మూవీ కాన్సెప్ట్ ను రివీల్ చేయకుండానే.. అద్భుతమైన టీజర్ ఇవ్వాలని.. ఆ తర్వాతే థియేట్రికల్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట సుకుమార్.

ఇదే కోవలో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతున్నారు బన్నీ అండ్ మహేష్ బాబు. డి జె సినిమా తో కొంచెం వెనుకబడిన అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాని చాల ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో చాల కేర్ తీసుకుంటున్నాడట. అలానే మహేష్ బాబు కూడా స్పైడర్ సినిమా టాక్ తో కొంచెం అలెర్ట్ అయ్యి కొరటాల శివ సినిమా విషయంలో ఫస్ట్ లుక్ నుండే జాగర్త పడుతున్నాడట. స్పైడర్ సినిమా లో మహేష్ నటనకి మంచి మార్క్స్ పడ్డాయి.

17:45 - November 7, 2017

టైగర్ జిందా హై మూవీ ట్రైలర్ విడుదల అయింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 22న సినిమా విడుదల కానుంది.

 

19:20 - November 5, 2017

తల్లిదండ్రులు మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉండడం వల్లే తాను సంగీతంపై మక్కువ పెంచుకోవడం జరిగిందని..తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని షణ్ముఖ ప్రియ పేర్కొంది. పాటలతో దేశాన్ని ఈ తెలుగు అమ్మాయి కిరాక్ చేస్తోంది. లిటిల్ ఛాంప్స్ లో..ఇతర షోల్లో ఆమె పాల్గొని అద్భుత ప్రతిభను కనబర్చింది. ఈ సందర్భంగా టెన్ టివి షణ్ముఖ ప్రియతో ముచ్చటించింది. సంగతం పట్ల మక్కువ..ఇతరత్రా విషయాలను వెల్లడించింది. తల్లిదండ్రులు నిర్వహించే కచేరీని చిన్నప్పటి నుండి చూడడం జరిగిందని, ఈ రంగంలో తనకు పేరెంట్స్ చాలా ప్రోత్సాహం ఇస్తున్నారని పేర్కొంది. ఏ.ఆర్.రెహామాన్ పాడిన పాటను తాను పాడడం జరిగిందని, ఇందుకు ప్రశంసలు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ.ఆర్.రెహామన్ ముందు పాట పాడడం చాలా గొప్పగా భావిస్తున్నట్లు తెలిపింది. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:40 - November 2, 2017

సినిమా : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పై నెటిజన్లు తిట్ల వర్షం కురిపించారు. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా ప్రియాంక తన ఇన్ స్ట్రాగ్రామ్ ఓ ఫోటో పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు దుమెత్తిపోశారు. ప్రియాంక తన కుటుంబ సభ్యులు ఇందిరా గాంధీతో కలిసి దిగిన ఫోటోను ఆమె పోస్టు చేయడం ఈ తిట్లకు కారణం. సిక్కులను ఉచకోత కోయించిన ఇందిరా గాంధీ ఫోటో పెడతావా అంటూ బుతులను కామెంట్ గా పెట్టారు నెటిజన్లు. ప్రియాంక ఈ తిట్లను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.  

21:25 - November 1, 2017

లక్నో : బాలీవుడ్‌ క్వీన్‌, రాజ్యసభ సభ్యురాలు రేఖ రాయబరేలీలో అభివృద్ధి పనుల కోసం తన ఎంపీ ఫండ్‌ నుంచి రెండున్నర కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో సోలార్‌ లైట్లు, ఇంటర్‌ లింకింగ్‌ రోడ్లు, హ్యాండ్‌ పంప్‌లు, సిసిరోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. రాయబరేలీకి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అనంతరం రేఖ ఈ ఏడాది జనవరిలో కోటి 44 లక్షల నిధులు కేటాయించారు. అక్టోబర్‌ 2017 మరో కోటి 42 లక్షలు రెండో విడతగా నిధులు మంజూరు చేశారు. రాయబరేలీలో ఇప్పటికే కోటి రూపాయల పనులు పూర్తయ్యాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - Bollywood