bonthu rammohan

18:04 - October 19, 2017

హైదరాబాద్ : ఎన్నికలు ఏవైనా ఓట‌ర్ల జాబితా రూపొందించడమంటే అధికారులకు కత్తిమీద సామే. ఏటా మార్పులు చేర్పుల ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఓట్లు గల్లంతయితే వివాదస్పదమవుతోంది. విపక్షాలు విరుచుకుపడతాయి. దీంతో ఓటర్ల జాబితా తయారుచేయడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. దీంతో ఈ సమస్యలకు ఆధునిక సాంకేతికతో చెక్‌పెట్టేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐదేళ్లకు చేయాల్సిన స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితా తొలిసారి గ్రేట‌ర్ ప‌రిదిలో ఆన్‌లైన్‌లో రూపొందిస్తున్నారు. ఎలాంటి లోపాలు లేకుండా అర్హులైన వారికి ఓటు హక్కు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నారు. హైద‌రాబాద్ మహానగరంలో 41.32 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు. 3879 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓట‌ర్ల సంఖ్య ఆధారంగా ముందుగానే ప్రాంతాలను విభజించారు.

రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో క‌మిష‌న‌ర్ సమావేశం
ప్రతి బిఎల్‌ఒకు ప్రత్యేక ట్యాబ్‌ను స‌మ‌కుర్చారు. ఇప్పటి వర‌కు హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలో 40 లక్షల 17 వేల 951 ఓట‌ర్లు ఎన్యూమ‌రేట్ చేశారు. వీటిలో కొత్తగా 20 లక్షల 4 వేల 90 మంది ఓటర్లు నమోదు కాగా.. చిరునామా మారిన వారు 14 లక్షల 95 వేల 808 మంది ఉన్నారు. అదే అడ్రస్‌లో ఉన్న వారు 17 వేల 64 వేల 77 మంది ఓట‌ర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌కవ‌ర్గంలో అత్యధికంగా 81 వేలు..,గోషామ‌హ‌ల్‌లో 79వేలు..., ఖైర‌తాబాద్‌లో 58వేలు, కంటొన్మెంట్‌లో 55వేలు, అంబ‌ర్ పేట్‌లో 54వేలు, స‌న‌త్ న‌గ‌ర్‌లో 51వేల ఓట్లును తొలగించనున్నారు. బల్దియా చర్యలపై పలు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాల‌యంలో రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో క‌మిష‌న‌ర్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో జ‌రుగుతున్న ఎన్నికల జాబితా ప‌నితీరును వివ‌రించారు. త్వరలోనే స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితాను ప్రక‌టిస్తామ‌న్నారు. గ్రేటర్‌లో ఎన్నికల జాబితాను ఆన్‌లైన్‌లో రూపొందించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

13:10 - September 5, 2017

హైదరాబాద్ : గణేష్ నిమజ్జన ఊరేగింపులో వినూత్న వినాయకులు కనిపించాయి. వినాయక ఊరేగింపులో కొంతమంది పండ్లతో..పూలు..ఇలా ఎన్నో వైరైటీ గణనాథులు చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. పాతబస్తీలో రమేష్ అనే వ్యక్తి వినూత్నంగా ఆలోచించారు. మట్టి గణేష్ ను ఏర్పాటు చేశారు. గణేషుడి చేతి కింద కాయిన్స్ తో ఏర్పాటు చేశారు. శివలింగాన్ని పూర్తిగా కాయిన్స్ తో ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో ఏకాణ..దోవానా..తీనానాలాంటి కాయిన్స్ ఉన్నాయి. నిజాం కాలం నాటి కాయిన్ కూడా ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా దీనిని ఏర్పాటు చేసిన రమేష్ తో టెన్ టివి ముచ్చటించింది. ఒక్క పైసా నుండి దోవానా..తీనానా...ఇలాంటి కాయిన్స్ ను తాను సేకరించడం జరిగిందన్నారు. ప్రతి వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా తాను ఇలాంటివి తయారు చేస్తానన్నారు. నీళ్లు చల్లి మళ్లీ ఇంటికి తీసుకొస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:30 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలో నిమజ్జన కోలాహాలం కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన విగ్రహాలు..నిమజ్జనం చూసేందుకు వచ్చే భక్తులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నగరంలోని వివిధ కూడళ్లలో ప్రతిష్టించిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ వైపుఏ బయలుదేరుతున్నారు. వినాయకులను అందంగా అలకరించి నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా యువతీ యువకులు..డ్యాన్స్ లతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా యువతులు..మహిళలు చేస్తున్న తీన్ మార్ డ్యాన్స్ ఆకట్టుకుంది. మీరు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:25 - September 5, 2017
12:23 - September 5, 2017

హైదరాబాద్ : గణేష్ పండుగ అంటేనే..రకరకాల భంగిమలతో విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. వినూత్నంగా అలంకరిస్తుంటారు. ఇక నిమజ్జనం అయితే సరే సరి..ఆకర్షణీయంగా అలంకరిస్తూ ఊరేగింపు నిర్వహిస్తుంటారు. పాతబస్తీలోని

చక్కర్ నగర్ పిట్టల బస్తీలో ఏర్పాటు చేసే వినాయకుడు అందర్నీ ఆకర్షిరిస్తుంటాడు. ఎందుకంటే మొత్తం పండ్లతో అలకరించి ఊరేగింపు నిర్వహిస్తుంటారు. పూర్తిగా పండ్లతో గణేష్ ను అలంకరిస్తుంటారు. యాపిల్..అంగూర్..పైనాపిల్..ఇతర పండ్లతో వెళుతున్న ఈ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. ఈ సందర్భంగా టెన్ టివితో నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడారు. తాము పండ్ల వ్యాపారం చేస్తుంటామని, నిమజ్జనం అనంతరం పండ్లను ప్రజలకు పంచుతామన్నారు. పూర్తి వివరాలకు..పండ్ల గణేష్ ను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

12:21 - September 5, 2017

హైదరాబాద్ : అన్ని విభాగాలు..సమన్వయం..సహకారం చేసుకొంటే ఏదేనా కార్యక్రమం విజయవంతమౌతుంది. అలాగే గణేష్ నిమజ్జనంలో ఇదే జరిగింది. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే ఒక ప్రహాసనంగా మారేది. నిమజ్జనం కంటే జరిగే ఊరేగింపులో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఊరేగింపు జరిగి..ట్యాంక్ బండ్ కు చేరుకునే సరికి సాయంత్రం అయ్యేది.. నిమజ్జనం అర్ధరాత్రి..లేదా మరుసటి రోజు జరిగేది. నిమజ్జనం జరిగేంత వరకు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉండేవి. దీనితో నిమజ్జనం వీక్షించడానికి వచ్చిన ప్రజలు..ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఈ సంవత్సరం మాత్రం అలాంటిది జరగలేదు. ప్రభుత్వం..ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు..ఇతర విభాగాల అధికారుల సహకారంతో అనుకున్న సమయానికే ట్యాంక్ బండ్ వద్దకు భారీ గణనాథుడు చేరుకున్నాడు. మంత్రి తలసాని..మేయర్ బొంతు రామ్మోహన్ స్వయంగా పర్యవేక్షించారు. మేయర్ బొంతు రామ్మోహన్ హుస్సేన్ సాగర్ లో బోటులో ప్రయాణిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:01 - September 5, 2017

హైదరాబాద్ : మట్టి గణేష్ విగ్రహాల ఏర్పాటులో ఈ సారి 50 శాతం సక్సెస్ అయ్యామని, వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని మంత్రి తలసాని వెల్లడించారు. నగరంలో వినాయక నిమజ్జనం కోలాహాలంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ కమిటీ మెంబర్ సభ్యుల సహకారంతో భారీ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం జరుగుతోందని, తొందరగా తీయాలని అనే ఉద్ధేశ్యం లేదన్నారు. పండుగల విషయంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తోందని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేసేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. నయాపూల్, గోషమహాల్ ప్రాంతాల్లో వాలంటీర్లు ముందుకొచ్చి సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. 

11:53 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమాల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర కాసేపటి క్రితం ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. శోభయాత్ర..నిమజ్జనాన్ని వీక్షిచేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. గత సంవత్సరాల కంటే భిన్నంగా ఈ సంవత్సరం నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది. ఉదయాన్నే జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించాలని భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:22 - September 5, 2017

హైదరాబాద్ : గణనాథుల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. గతసారి కంటే ఈసారి నిమజ్జన కార్యక్రమం వేగంగా జరుగుతోంది. మలక్ పేట, చాంద్రాయణ గుట్ట, చార్మినార్ ప్రాంతం గుండా వచ్చే వాహనాలు ఎంజె మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు వేయి విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. ఇక బాలాపూర్ గణనాథుడు ఎంజె మార్కెట్ కు చేరుకోవడానికి ఎంజే మధ్యాహ్నం రెండు అవుతుందని తెలుస్తోంది. సొంత వాహనాలు..చిన్న ఆటోలు..ద్విచక్ర వాహనాల్లో వినాయకులను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. 

10:41 - September 5, 2017

హైదరాబాద్ : ఖైరతాబాద్ భారీ గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర మూడు గంటల్లోనే ట్యాంక్ బండ్ కు చేరుకుంది. గత సంవత్సరం కంటే భిన్నంగా ఈసారి ముందుగానే నిమజ్జనం జరుగనుంది. ఇందుకు ప్రభుత్వం..ఉత్సాహక నిర్వాకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ 4 వద్దకు విగ్రహం చేరుకుంది. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ టెన్ టివితో మాట్లాడారు. నాలుగు గంటల్లోనే శోభయాత్ర ట్యాంక్ బండ్ కు చేరుకుంది. సకాలంలో లక్షలాది మంది ప్రజలు వీక్షించేందుకు ఈ ఏర్పాట్లను చేయడం జరిగిందని, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల సహకారం..అన్ని విభాగాల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు.

ఎంజే మార్కెట్..
వేలం పాట పూర్తి కావడంతో ట్యాంక్ బండ్ కు బాలాపూర్ గణేషుడు బయలుదేరాడు. ఎంజే మార్కెట్ గుండా ఒక్కో విగ్రహం హుస్సేన్ సాగర్ వైపుకు తరలి వెళుతున్నాయి. ఎప్పుడు మండపం నుండి బయలుదేరుతుంది ? తదితర వివరాలను జియో ట్యాగ్ ద్వారా తెలుసుకోనున్నారు. పూర్తిస్థాయిలో విగ్రహాలు రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - bonthu rammohan