B.Tech Student Mounika

20:23 - October 12, 2017

హైదరాబాద్ : ఇష్టంలేని చదువుతో కొందరు...హాస్టల్‌లో చిన్న సమస్య...చదువుకున్నా ర్యాంకు రాలేదని మరికొందరు...ఇలా ఎందరో స్టూడెంట్స్‌ మనస్తాపంతో..ధైర్యంగా ముందుకు వెళ్లలేక ఒక్క క్షణంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు..తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరాన్ని రేపుతున్నాయి...కొన్ని గంటల్లోనే ముగ్గురు స్టూడెంట్స్‌ బలవన్మరణం చెందడం ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించివేసింది...
చిన్న కారణాలతోనే జీవితాలు ముగింపు..
పెద్ద చదువులు చదువుతున్నా..వారిలో మాత్రం ఆత్మనూన్యతాభావం పోవడం లేదు...పరిసరాలు వారికి గుణపాఠాలు నేర్పడం లేదు...తాము ఎంచుకున్న మార్గమే సరైనదనుకుంటున్న విద్యార్థులు ఆ ఒక్క క్షణంలో తీసుకుంటున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోత మిగుల్చుతుంది..తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజులో కొన్ని గంటల్లోనే ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం చెందారు...
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విషాదం 
నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన సాగిరెడ్డి సూర్యనారాయణ కుమారుడు పూర్ణ లక్ష్మీనరసింహమూర్తి బుధవారం అర్ధరాత్రి హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు...ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు..అయితే పూర్ణకు చదువుపై ఆసక్తి లేకపోవడంతోపాటు...కొందరి ఒత్తిడి వల్లే ఇలాంటి అఘాయిత్యం చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు...
మాదాపూర్‌ హాస్టల్‌లో విద్యార్థిని సూసైడ్..
హైదరాబాద్‌- మాదాపూర్‌ శ్రీచైతన్య కళాశాల ఎంసెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో లాంగ్‌ టర్మ్‌ శిక్షణ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సంయుక్త సూసైడ్‌ నోట్‌ రాసింది. విద్యార్థినిని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని రాంపల్లి గ్రామానికి చెందిన రాజేందర్‌ కుమార్తెగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని బలి...
హైదరాబాద్‌ దుండిగల్‌ సూరారం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. తల్లి మందలించిందని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న మౌనిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మౌనికను స్థానిక నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. మౌనిక తల్లిదండ్రులు రేణుకు, చంద్రం పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చి సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు..మౌనిక కూడా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది...తాను సంతోషంగా ఉండటాన్ని చుట్టుపక్కలవారు చూడలేకపోతున్నా రని, జీవితం దుర్భరంగా మారిందని మెసేజ్‌ పెట్టి...ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి మౌనిక తన తమ్ముడికి మధ్య జరిగిన వాగ్వాదంతో మస్తాపానికి గురైనట్లు తల్లి రేణుక పోలీసుల దృష్టికి తెచ్చారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలు కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది....కారణాలు చిన్నవే..కాని...విద్యార్థులు తీసుకున్న నిర్ణయం ఆయా కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది.

 

Don't Miss

Subscribe to RSS - B.Tech  Student Mounika