bus bhavan

07:58 - April 21, 2017

హైదరాబాద్ : ఆర్టీసీలో పొదుపు చర్యలు కార్మికుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కార్యకలాపాల పరంగా వేర్వేరుగా ఉన్నా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టు అధికారికంగా ఇంకా విడిపోలేదు. కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్ డబ్బులకు మంగళం పాడే ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఏపిఎస్‌ఆర్టీసి అధికారులు. తాజాగా అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల్లో పదిహేను వేల వరకు పెన్షనబుల్‌ వేతనం ఉన్న కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే సంస్థ పీఎఫ్ జమచేస్తుంది. బేసిక్ పే, డీఏ కలిపి 15 వేలు దాటితే తన వాటా పీఎఫ్‌ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసి పీఎఫ్‌ బోర్డు సమావేశానికి తెలంగాణ ఆర్టీసి యాజమాన్యం ఓ లేఖ రాసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
పూర్తికాని ఆర్టీసీ విభజన...
ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. ఇందులో యాజమాన్యం, కార్మిక సంఘాల నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పిఎఫ్ కోత విధించడం వల్ల రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసిలకు ఆరువందల కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

10:34 - February 20, 2017

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారించాలని టిఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందే అంశంపై నిర్వమించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో బస్ భవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. రేపు  చేపట్టే చలో  బస్ భవన్ కార్యక్రమం గురించి ఇప్పటికే ఈయూ నేతలు విభిన్న రూపాల్లో ప్రచారం నిర్వహించారు. రేపు చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు అన్ని డివిజనల్ మేనేజర్స్  కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపట్టేందుకు ఈయు నాయకులు సిద్ధమవుతున్నారు. రేపు చలో బస్ భవన్ నిర్వహించడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం ముందు ఎంప్లాయీస్ యూనియన్ పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:07 - February 6, 2017

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. జనవరి 19, 29, 30 తేదీలలో వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఆర్టీసీ కార్మికులు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాదీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు పాల్గొనబోతున్నారు. కేంద్రం విడుదల చేసిన టాక్సీ పాలసీ, ఎంవి యాక్ట్ సవరణ బిల్లు, రాష్ట్ర బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయల గ్రాంటుతో పాటు కార్మికుల ఎదుర్కొంటున్న మరికొన్ని ప్రధాన సమస్యలే ఎజెండా మహాదీక్ష చేపడుతున్న ఎస్ డబ్ల్యుఎఫ్ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులు మహాదీక్ష చేపట్టడానికి దారితీసిన కారణాలు, ప్రభుత్వాలు, యాజమాన్యాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు ఎస్ డబ్ల్యుఎఫ్ నేత విఎస్ రావు గారు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ప్రేక్షకులు అడిగన సందేహాలకు ఆయన సమాధానాలు, పరిష్కార మార్గాలు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూడాలి.

08:04 - August 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో తెచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. కొత్తగా రెండువేల బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. 

Don't Miss

Subscribe to RSS - bus bhavan