caste politics

06:48 - January 19, 2018

ఒకటా రెండా.. నిత్యం ఎన్నో దాడులు.. ఎన్నో ఆకృత్యాలు.. మరెన్నో దారుణాలు. దేశమంతటా గాయాల పచ్చివాసన. గ్రామాల్లో, పట్టణాల్లో నిత్యం దళితులపై జరుగుతున్న దాడుల్లో వార్తల్లోకెక్కేవెన్ని? న్యాయం జరిగేవెన్ని? ఒకడు చేయి చేసుకుంటాడు. ఒక గుంపు ప్రాణాలు తీస్తుంది. ఒక గుంపు బరిసెలతో, గొడ్డళ్లతో తరిమి తరిమి చంపుతుంది. మరొకడు లేత యువకుణ్ని నిలువునా కాల్చి చంపుతాడు. మరొకడు పశువులా లైంగిక అత్యాచారాలకు పాల్పడతాడు. ఇంకొక ప్రజాప్రతినిధి.... స్థాయిని కూడా మరచి నోరు పారేసుకుంటాడు.. అన్ని చోట్లా బాధితులు దళితులే.. అమానవీయంగా, అన్యాయంగా ఎందరినో కుల దురహంకారం బలిగొంటోంది. ఏళ్లకేళ్లు న్యాయం జరగక, దళితులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాక్ష్యాలు చూపటంలో సర్కార్లు విఫలమవుతూనే ఉన్నాయి. మరి దీనికి ముగింపు ఎప్పుడు? పరిష్కారం ఏంటి? ఈ అంశంపై టెన్ టివి జనపధంలో మాల్యాద్రి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:04 - February 17, 2017

ఖమ్మం: కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమ్మినేని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎత్తేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం పూనుకుంటోందని, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, డబ్బున్న అధికారులే రాష్ట్రాన్ని మేసేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. అందరికి సమాన అవకాశాలు కావాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర ఉద్దేశమని తమ్మినేని అన్నారు. కులవివక్షకు గురైన రోహిత్‌ వేముల కుటుంబానికి న్యాయం చేయకుండా...కేంద్ర మంత్రులను కాపాడేందుకే.. అతని కులాన్ని వివాదస్పదం చేస్తున్నారని తమ్మినేని అన్నారు. రోహిత్‌ వేముల కులాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. ..

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. అభివృద్ధి సాధ్యమవుతోందని, కానీ..కేసీఆర్‌ సర్కార్‌ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు పూనుకుందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో విద్యా రంగాన్ని కాపాడేందుకు సీపీఎం పోరాటం చేస్తోందని తమ్మినేని తెలిపారు. సంస్కరణల్లో భాగంగానే మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం కోసం అప్పులు చేసి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని పాదయాత్ర కోఆర్డినేటర్‌ వెంకట్‌ ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న కోదండరామ్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు అక్కసు వెళ్లగక్కుతోందని ఆయన ప్రశ్నించారు.

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన...

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 123వ రోజుకు చేరుకున్న పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లాలోని రాయనపేట, ఆళ్లపాడు, బోనకల్లు, ముష్టికుంట్ల, నాగులవంచలో పాదయాత్ర బృందం పర్యటించింది. ముష్టికుంట్ల గ్రామంలో రెండు కిలోమీటర్ల పొడవునా తమ్మినేని బృందానికి పూలవర్షంతో స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు పాదయాత్ర బృంద సభ్యులకు సాదరంగా ఆహ్వానిస్తూ.. యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలను తమ్మినేని బృందానికి విన్నవిస్తున్నారు. ఇప్పటికే 3వేల 300 కిలోమీటర్ల మేర యాత్రను పూర్తిచేశారు.

11:33 - February 15, 2017

విజయవాడ: రోహిత్‌ వేముల బీసీ అంటూ గుంటూరు కలెక్టర్‌ ధృవీకరణపత్రం ఇవ్వడం దారుణమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ఎస్సీ ధృవీకరణ పత్రంతోనే రోహిత్‌ హెచ్‌సీయూలో చేరారని గుర్తు చేశారు. రోహిత్‌ వేముల దళితుడని అందరికీ తెలుసన్నారు. బీజేపీ, టీడీపీ ఒత్తిడిలోనయ్యే కలెక్టర్‌ బీసీ సర్టిఫికెట్‌ ఇచ్చారన్నారు. తక్షణమే రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకొచ్చి.. కుల వివక్షను రూపుమాపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

09:09 - February 15, 2017

హైదరాబాద్: గత ఏడాది హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల కుల వివాదం మరో మలుపు తిరిగింది. రోహిత్‌ దళితుడు కాదని, అతను బీసీ వర్గానికి చెందినవాడని ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధరించింది. అయితే.. కేసును తప్పుదోవ పట్టించడానికే రోహిత్‌ కులంపై కేంద్రం కుట్ర చేస్తోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ సిగా ఆధారాలుంటే 15 రోజుల్లో చూపాలి, లేదంటే అన్ని కులధ్రువీకరణ పత్రాలు రద్దు, గుంటూరు కలెక్టర్ షోకాజ్ నోటీసు, రోహిత్ మృతికి కారకులను రక్షించేందుకు కుట్ర జరుగుతోందా? ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ 'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిపిసిసి అధికార ప్రతి శోభన, బిజెపి నేత ఎస్ కుమార్, కేవిపిఎస్ నేత నటరాజన్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

08:16 - February 12, 2017

విజయవాడ : మహా గొప్పగా మహిళా పార్లమెంట్‌ సదస్సు నిర్వహిస్తున్నామని బీరాలు పోతున్న ఏపీ ప్రభుత్వం.. మహిళా ఎమ్మెల్యే రోజాను అవమానించింది. సదస్సుకు వెళ్తుండగా.. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆమెను నిర్బంధించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును వైసీపీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళలను చంద్రబాబు ప్రభుత్వం అవమానిస్తోందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 
రోజాను అడ్డుకున్న పోలీసులు 
విజయవాడలో మూడు రోజుల పాటు జరుగుతున్న మహిళా పార్లమెంట్‌ సదస్సుకు అందరి మాదిరిగానే వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో సదస్సుకు వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రోజాను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దలైలామా వస్తున్నారన్న కారణంతో రోజాను ఒక గదిలో నిర్బంధించారు. ఆహ్వానం మేరకే తాను సదస్సుకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరును రోజా తీవ్రంగా తప్పుపట్టారు. ఆ తరువాత పోలీసులు రోజాను తమ వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. వాహనంలోనే.. రోజా తన మొబైల్.. జరిగిన ఘటనను వివరించారు.
ఊహాగానాలతో ఎలా అదుపులోకి తీసుకుంటారన్న వైసీపీ ఎమ్మెల్యేలు 
రోజాను అదుపులోకి తీసుకున్నారని విషయం తెలియగానే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, నాయకులు... డీజీపీ కార్యాలయం వరకూ ప్రదర్శనగా వెళ్లారు. డీజీపీని కలిసి వినతి పత్రం అందించారు. మహిళా పార్లమెంట్‌ సదస్సుకు వెళ్తున్న రోజాను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పాలని వైసీపీ ప్రజాప్రతినిధులు డీజీపీని కోరారు. సదస్సులో ఆందోళన చేస్తారన్న వచ్చిన  సమాచారంతోనే రోజా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని, సోషల్ మీడియాలో కూడా మెసేజ్‌లు వచ్చాయని వైసీపీ నేతలకు డీజీపీ వివరించారు. ఊహాగానాలతో మహిళా ప్రజాప్రతినిధిని ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యేలు. సదస్సుకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం... రోజాను అవమానించిందని వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రోజా అరెస్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌ కోడెల బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

20:39 - February 11, 2017

గన్నవరం :విజయవాడలో ఎమ్మెల్యే రోజాకు జరిగిన అవమానంపై ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సదస్సుకు వెళ్తున్న మహిళా ప్రజాప్రతినిధిని ఎలా అడ్డుకుంటారని వైసీపీ నేతలతో సహా విపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రోజాకు జరిగిన అవమానంపై సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెల బాధ్యత వహించాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు.

19:07 - February 11, 2017

హైదరాబాద్: అమరావతిలో ‘జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు నన్ను ఆహ్వానించారు. ఆహ్వానం పంపించి మరీ, నన్ను అదుపులోకి తీసుకున్నారు. అస్సలు నేను చేసిన తప్పేంటని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. కన్నీటి పర్యతం అయ్యారు. 'చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు నాపై దాడి చేశారు. చంద్రబాబు నాయుడు మహిళల వ్యతిరేకి. ఒక శాసన సభయురాలికి ఏపీలో రక్షణ లేదు రాష్ట్ర డీజీపీ మాటలు సిగ్గుచేటు, సదస్సు ఎందుకు పెట్టారయ్యా? బ్రహ్మణి, వెంకయ్య కూతర్ల పబ్లిసిటీ కోసమా? ప్రజలు పన్ను కట్టిన డబ్బును వినియోగించి మహిళాసాధికారత ఎలా సాధించాలి అనే అంశంపై చర్చిస్తారనుకుంటే మీటింగ్‌ కు రానీకుండా అరెస్టు చేయించారు. 

మహిళా సమస్యలపై అవగాహన ఉన్న బృందాకారత్‌, మేధాపాట్కర్‌ వంటి నేతలను జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సుకు ఎందుకు ఆహ్వానించలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి, వెంకయ్యనాయుడు కూతురుని సదస్సుకు ఆహ్వానించిన ప్రభుత్వం... ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మహిళా నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. అమరావతిలో అసెంబ్లీ నిర్వహిస్తే.. ప్రతిపక్ష సభ్యుల ప్రాణాలకు రక్షణ ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీ అడుగుపెట్టినప్పటి నుంచీ తనపై కక్ష్య కట్టారని రోజా కన్నీళ్ల పర్యంతమయ్యారు.

సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెలకు నేనంటే ఎందుకంత భయం. ప్రతిపక్షం ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అసెంబ్లీలో మీ జీవితం మొత్తం నన్ను సస్పెండ్‌ చేయడానికే సరిపోయింది. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై రెండు రోజులు మాట్లాడితే ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. మహిళల పట్ల స్పీకర్ కు ఎంత చిన్నచూపు ఉందో ఈ మాటలు చాలు’ అని రోజా మండిపడ్డారు. అమరావతిలో అసెంబ్లీ జరిగితే ప్రతిపక్ష నేతలకు హాని వుంది.

13:30 - January 18, 2016

హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హెచ్‌సీయూలోని ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో సరిగ్గా 15 రోజుల క్రితం ఐదుగురు దళిత విద్యార్థులను వీసీ అప్పారావు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్‌ అయిన విద్యార్థుల్లో దొంత ప్రశాంత్‌, వేల్పుల సుంకన్న, శేషయ్య, విజయ్‌కుమార్ లతో పాటు వేముల రోహిత్‌ సైతం ఉన్నారు. పొలిటికల్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్న రోహిత్ ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో హెచ్ సీయూలో విషాదం నెలకొంది. రోహిత్ మృతదేహాన్ని తీసుకోపోనీయకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రోహిత్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. రోహిత్ మృతిపై జాక్ ఓ ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి వాతావరణం ఉండాలి ? వీసీని సస్పెండ్ చేయాలి..అలాగే కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతరులపై చర్యలు తీసుకోవాలి..కేసులు ఎత్తివేయాలి..సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలి. అప్పుడే తమ సమస్యలు పరిష్కారమౌతాయని జాట్ ఆ ప్రకటనలో పేర్కొంది.

11 మందిని చంపేశారు...
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు టెన్ టివితో మాట్లాడారు. తాము రేపు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం రోహిత్ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకెళుతామని, తమకు న్యాయం చేయాలని కోరితే లాఠీచార్జీ చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా నడుస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ వేముల లెటర్ ఏమి రాశాడో చూడాలని, 11 మందిని చంపేశారని పేర్కొన్నారు. ఉరి తాళ్లు, విషం ఇవ్వండి అంటూ రోహిత్ లెటర్ లో పేర్కొనడం ఎంత ఆవేదన చెందాడో అర్థమౌతుందన్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణలు ఉండడం సహజమేనని, ఇలాంటివి పరిష్కారం చేయాల్సిన బాధ్యత వర్సిటీదేనన్నారు. అంబేద్కర్ భావజాలంతో ఉండడం తప్పా ? చదువుకొందామని వర్సిటీకి వస్తే ఇలా చేయడం కరెక్టేనా ? బీజేపీకి చెంచాగిరి ఎందుకు చేస్తున్నావంటూ సూటిగా ప్రశ్నించారు. రోహిత్ కు ఎన్ని శిక్షలు వేయాలో అన్ని వేశారని, దళిత ప్రొపెసర్లు స్పందించడం లేదన్నారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలుగా వర్సిటీని దళితుల శవాల కుప్పలుగా తయారు చేస్తున్నారని, సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని మరో విద్యార్థి డిమాండ్ చేశారు. 

12:20 - January 18, 2016

హైదరాబాద్ : యూనివర్శిటీ పెద్ద వల్లే దళిత విద్యార్థులు చనిపోతున్నారని రోహిత్ స్నేహితులు ఆరోపించారు. వారు టెన్ టివితో మాట్లాడుతూ...రోహిత్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని… రోహిత్ ఆత్మహత్య కు వీసీ ప్రేరేపించారని మండి పడ్డారు. యూనివర్శిటీలో ఎలాంటి గొడవ జరగకపోయినా కేంద్ర మంత్రి దత్తాత్రేయ లేఖ వల్ల 5గురు విద్యార్థులను వీసీ సోషల్ బాయ్ కట్ చేశారని మండి పడ్డారు. వీసీ ఇర్రెస్సాన్స్ బుల్ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు. యూనివర్శిటీలో ఎలాంటి గొడవా జరగలేదు. గొడవ జరిగిందని… ఒక కమిటీ వేశారు. అస్సలు ఆ కమిటీలో ఎవరు వున్నారు… ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పటికైనా వీసీని రీకాల్ చేయాలని, కేంద్ర మంత్రిని దత్తాత్రేయని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిలో ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులు చనిపోయారని… వారిలో 12వ వ్యక్తి రోహిత్ అని తెలిపారు. మృతి చెందిన వారిలో 10 మంది దళితులు ఉన్నారని ఇప్పటికైనా దళిత విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని, యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వల్ల చనిపోతున్నారని ఆరోపించారు.

12:00 - January 18, 2016

హైదరబాద్ : హెచ్ సియూ లో పిహెచ్ డీ స్కాలర్ దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకుడైన ఏబీవీపీ విద్యార్థి సుశీల్ కుమార్ ను వెంటనే యూనివర్శిటీ నుండి సస్పెండ్ చేయలని హెచ్ సియూ విద్యార్థి వెంకటేశష్ డిమాండ్ చేశారు. ఆయన 'టెన్ టివి' తో మాట్లాడుతూ...హైదరాబాద్ సెట్రల్ యూనివర్శిలో ఇప్పటి వరకు 11 మంది దళిత విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ యూనివర్శిటీలో కుల మతోన్మాదం రాజ్యమేలుతోంది. హైందవ సమాజంలో బతకడమే నిరసగా బతుకుతున్నామని విద్యార్థి నేతలు వాపోయారు. ఇప్పుడుడిపుడే యూనివర్శిటీకి వచ్చి చదువుకుంటున్న దళిత, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు వాళ్ళ హక్కులు, కరప్షన్ గురించి ప్రశ్నిస్తే ఈ యూనివర్శిటీలో వారిని బతకనివ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. చంపకుండా ప్రత్యక్ష నరకం చూపి చచ్చిపోయేలా ప్రేరేపిస్తారని ఘాటుగా విమర్శించారు. రోహిత్ హత్య ముమ్మాటికి అడ్మినిస్ట్రేషన్ చేసిన హత్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ జోక్యం చేసుకుని మమ్మల్ని యూనివర్శిటీ నుండి బహిష్కరించారని… వెంటనే దత్తాత్రేను భర్తరఫ్ చేయాలని, సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - caste politics