celebrations
వరంగల్ : జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోతననగర్ లోని భగవన్ శ్రీ మురళీ కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి 111 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
సిరిసిల్ల : ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులతో పాటు శ్రావణ మాసం నాల్గో సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శశించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి రుద్రాభిషేకం చేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా ఆర్జితసేవలు రద్దుచేశారు.
ఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఇండిపెండెన్స్ డే వేడుకలపై ఉగ్రవాదులు గురి పెట్టారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ జాతీయ పతాకం ఆవిష్కరించే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో 150 సీసీ టీవీ కెమెరాలతో నిఘా విస్తృతం చేశారు. ఢిల్లీలో నాలుగువేల సీసీ టీవీ కెమెరాలతో నిఘా ఉంచారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మసీదుల్లో భక్తి, శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రవక్తలు..భక్తులకు ఉపదేశాలు ఇచ్చారు. ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
వాడవాడలా రంజాన్ పండుగ వైభవంగా జరిగింది. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే సౌదీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే ఇతర దేశాలలోనూ రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మన దేశంలో చెన్నైలో రంజాన్ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు.
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని
పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు ప్రత్యేక నమాజ్‌లను నిర్వహించారు. హైదరాబాద్ నల్లగుట్ట మసీద్‌లో జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీ అసదొద్దీన్ ఓవైసీ రంజాన్ శుభాకాంక్షలు
బహదూర్ పురాలోని మీరాలం ఈద్గాలో లక్షల సంఖ్యలోముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అసదొద్దీన్ ఓవైసీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు
అలాగే సిద్ధిపేట జిల్లాలో రంజాన్ వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొని.. ముస్లిం ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నిజామాబాద్‌లో జరిగిన ప్రార్థనల్లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఖమ్మంలోని గొల్లగూడెం దర్గా, స్థానిక రైల్వే స్టేషన్ దగ్గరిలోని ఈద్గా వద్ద ముస్లిం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో జరిగిన వేడుకల్లో ఉపసభాపతి పద్మాదేవేందుర్రెడ్డి, జిల్లా ఎస్పీ చందనా దీప్తి పాల్గొని... పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గద్వాలలో
రంజాన్ సందర్భంగా...జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోనూ ఈద్గాలలో..వారి పెద్దల సమాదులు దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక శాసన సభ్యురాలు డీకే అరుణ, బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయులు గౌడ్ తదితరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఉత్సాహంగా రంజాన్
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో...యాదాద్రి భువనగిరి జిల్లాలో.. కామారెడ్డి జిల్లాలలో రంజాన్ పండుగ ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఏపీలో
రంజాన్ పర్వదినంతో... ఏపీలో పలు ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నెల్లూరు జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి.. నగరంలోని దర్గామిట్టలో ఉన్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కర్నూలులో
కర్నూలులో ఉన్న కొత్త, పాత మసీదుల్లో వేలాదిమంది ముస్లింలు అల్లాను స్మరించుకున్నారు. ఈ ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ పాల్గొన్నారు.
కిక్కిరిసిన మసీదులు, ఈద్గాలు
ప్రకాశం జిల్లాలో మసీదులు, ఈద్గాలు ముస్లీం సోదరులతో కిక్కిరిసాయి. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలోనూ రంజాన్ సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, పరిటాల శ్రీరాం పాల్గొన్నారు. అల్లా దయతో అందరూ సంతోషంగా జీవించాలని వారు ఆకాంక్షించారు.
రంజాన్ వేడుకల్లో అపశ్రుతి
కాగా భద్రాద్రి కొత్తగూడెంలోని జరిగిన రంజాన్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రార్థనల సమయంలో పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రార్థనలు జరిగే ప్రాంతంలో నాయకులు ఉండడంపై పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది.
రంగారెడ్డి : పశు సంక్రాంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా పశుసంత కనుల పండువగా జరుగనుంది. జాతీయస్థాయి గేదెల జాతర ఘనంగా జరగనుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అన్ని రాష్ట్రాల పశువుల క్రయవిక్రయాలు
రంగారెడ్డి జిల్లా.. గండిపేట్ మండలం... నార్సింగి గ్రామంలో రేపటి నుంచి పశువుల జాతర పెద్దఎత్తున జరగనుంది. ఈ జాతరను పెద్దఅంగడి... పశు సంక్రాంతి అని కూడా అంటారు.. ఈ జాతరలో దాదాపు అన్ని రాష్ట్రాల గేదెల క్రయవిక్రయాలు జరుగుతాయి. రైతులు తమ దగ్గర ఉన్న ఆవులు, గేదెలు, ఎద్దులను ఇక్కడ విక్రయించడం.. వాటి స్థానంలో కొత్తవి కొనడం చేస్తుంటారు. ఇక్కడ పంట చేతికొచ్చిన ఆదాయంతో కొంతమంది కొత్త పశువులను కొంటారు. నష్టపోయిన రైతులు తమ నష్ట నివారణకు పశువులను విక్రయిస్తారు.
పశువుల జాతర
కులికుతుబ్ షాహీ రాజుల కాలం నుంచి ప్రతి ఏటా సంక్రాంతి పండుగ అనంతరం ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి శుక్రవారం లేదా రెండో శుక్రవారం ఈ సంత జరుగుతుంది. తొలుత కులికుతుబ్ షాహీ రాజులు.. తర్వాత అసన్ జాహీలు, నిజాం ప్రభువులు ఈ ఆచారాన్ని కొనసాగించారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంతను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సంతలో గేదెలు..ఆవులు..ఎద్దుల ప్రదర్శన
పదిహేను రాష్ట్రాలకు చెందిన రైతులు, డైయిరి ఫాం ఓనర్లు , పశువుల వ్యాపారులు వారి గేదెలు, దున్నపోతులు, ఆవులు, ఎడ్లను ఈ మేళాలో ప్రదర్శిస్తారు. గేదెలను బాగా మేపి.. అందంగా తయారుచేసి ఈ సంతకు తెస్తుంటారు. అయితే మార్కెట్‌ను పంజాబ్, హర్యాణ, గుజరాత్ గేదెలే డామినేట్ చేస్తాయి. క్రయవిక్రయాలలో అవే ప్రధాన భూమిక పోషిస్తాయి. ఒక్కో గేదె 50 వేల రూపాయల నుంచి లక్షలకు పైగా పలుకుతుంది. గతేడాది గుజ్జర్ అనే గేదె ఒక లక్ష డెబ్బైవేల రూపాయలకు పైగానే అమ్ముడుపోయింది. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ ఏడాది పశు సంక్రాంతి ఏ విధంగా సాగుతుందో.. అనే ఆందోళన.. ఆసక్తి అందరిలో నెలకొంది. మార్కెట్‌పై నోట్ల రద్దు ప్రభావం ఎంతోకొంత ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ : షురువైన సంకురాత్రి వాసనలు...తెగ ఆడుతున్న తెలుగు ఆడపడుచులు, కోణీదల కోడి.. నందమూరి నాటుకోడి... థియేటర్లలో షురూ అయిన కోడి పందాలు, పిచ్చి లేసే విధానాలు చెప్పిన చంద్రాలు...చెవుల పూలు పెట్టిన కాడికి చాలు, సాయం చేయమంటున్న సాంబ శివుని... బిడ్డె సర్కారే తీసుకోవాలే బుజ్జి లైఫ్ ను, డాక్టర్లను మోసం చేసిన చదువురానోడు... ఎట్టకేలకు పట్టుకొస్తున్న లష్కర్ పోలీసోళ్లు... తాత షహనాయి ఎత్తుకుపోయిన మనుమడు... బిస్మిల్లాఖాన్ కు అసలైన వారసుడు. ఈ అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న తీసుకొచ్చిన వాడి వేడీ న్యూస్. మరి మీరూ ఈ వార్తలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.
Pages
Don't Miss
