Chalasani srinivas

20:17 - April 16, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా, విభజనచట్టంలోని హామీల అమలు డిమాండ్‌తో.. విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రభావం.. ఏపీ సచివాలయంపైనా కనిపించింది. ఉద్యోగులు, సందర్శకులు బంద్‌ కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఏపీ బంద్‌ ప్రభావం.. రాష్ట్ర సచివాలయంపైనా పడింది. బంద్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీంతో సచివాలయం సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు బాగా ఇబ్బందులు పడ్డారు. ఆటోలపై కార్యాలయాలకు తరలివచ్చారు. ఇదే అదనుగా ఆటోల డ్రైవర్లు.. 50 రూపాయలున్న చార్జీలను.. ఏకంగా 150 రూపాయలకు పెంచేశారు. పైగా ఆటోల్లో ఎక్కువమందిని కూరి తీసుకువచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. హోదా కోసం తాము ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఎన్నైనా ఎదుర్కొంటామని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. 
సచివాలయానికి తగ్గిన సందర్శకుల తాకిడి 
మరోవైపు బంద్‌ ప్రభావంతో.. సచివాలయానికి సందర్శకుల తాకిడి రోజుకన్నా కూడా కొంత తగ్గింది. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా.. మంత్రులు అధికారులు తరలిరావడంతో.. వారిని కలిసేందుకు వచ్చిన వారు.. కొంతమేర ఇబ్బందులు పడ్డారు. 

 

20:15 - April 16, 2018

విజయవాడ : బంద్‌ సంపూర్ణంగా జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అంటున్నారు. ప్రత్యేక, విభజన హామీలపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా బంద్‌లో పాల్గొని సంపూర్ణం చేశారంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసమే ఆరాట పడుతున్నారంటున్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలకు మోసం చేశాయని విమర్శించారు. భవిష్యత్‌లో ఉద్యమం ఉధృతం చేస్తామంటున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:58 - April 16, 2018

విజయవాడ : బీజేపీ అబద్ధాల ప్యాక్టరీగా తయారైందని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్ రావు విమర్శించారు. 24 పేజీల పుస్తకం కాదు..64 పేజీల పుస్తకం వేసిన బీజేపీ నేతల మాటలు నమ్మరని అన్నారు. ఏపీ ప్రజలు బీజేపీకి సమాధి కడతారని పేర్కొన్నారు. విపక్షాలు చేస్తున్న పోరాటాలపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. బంద్ లో ప్రజలు రాజకీయాలకతీతంగా స్పందించారని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. నిర్బంధాలకు, కేసులకు భయపడబోమని చెప్పారు. నిర్బంధం ప్రయోగిస్తే, అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని.. తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బిజిలీ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
జనపేన నేత  
'కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయొద్దు. 2014 నుంచి బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి. హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ ఇవ్వలేదు. ఐదుకోట్ల ఆంధ్రుల హక్కలను చంద్రబాబు కాపాడలేకపోయారు. ఢిల్లీలో ప్రజలు హక్కు కోల్పోయారు'.

 

18:39 - April 16, 2018

విజయవాడ : ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం దిగిరావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని...పార్లమెంట్ లో చేసిన చట్టాలను అమలు చేయాలని చెప్పారు. 2014 ఏప్రిల్ 20న ఏ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీ నేతలు అర్ధసత్యాలు, అవాకులు, చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. ఏపీ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఆ పార్టీ నేతలు చదువుకోవాలని.. మ్యానిఫెస్టోను అమలు చేయాలన్నారు. లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని, విజయవంతం చేసినందకు అభినందలు తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట..లేకుంటే మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆధ్వాన్నంగా మాటమార్చుతున్నారని చెప్పారు. మాటమార్చుకోవడం మానుకోవాలని హితవుపలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తమను ప్రశ్నిస్తున్న చంద్రబాబు ఏపీలో దీక్ష ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు. మోడీ, చంద్రబాబు పాపాలు చేశారని చెప్పారు. ఈ  పాపంలో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవపట్టించారని... మభ్య పెట్టారని మండిపడ్డారు. ఇద్దరి పాపాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మోడీకి దిమ్మతిరిగే విధంగా బ్లాక్ డే పాటిస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు బిజిలీ బంద్ పాటించాలన్నారు.

 

17:46 - April 16, 2018

విజయవాడ : బంద్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం యత్నించిందని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా బంద్ విజయవంతమైందన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 24న చీకటిరోజుగా పాటించాలన్నారు. భవిష్యత్ లో ప్రత్యేకహోదా కోసం చేసే ఆందోళనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. 'మీరు తెలుగు వారేనని గుర్తుంచుకోవాలి' అని ఏపీ బీజేపీ నేతలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. గుజరాత్ గీతాలను గుజరాత్ వెళ్లి పాడుకోండని సలహా ఇచ్చారు. బీజేపీ నేతల భాష బాగానే ఉంది... భావం ఘెరంగా ఉందని ఎద్దేవా చేశారు. చర్చా వేదికకు రండి అన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. 

19:05 - April 13, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా కోసం ఈనెల 16న జరిగే రాష్ట్ర బంద్‌లో ప్రజలందరూ స్వచ్చంధంగా పాల్గొనాలని హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. బంద్‌ బాధాకరమైన తప్పని సరిస్థితుల్లోనే పిలుపు ఇచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో జరిగిన అవినీతిలో టీడీపీ, బీజేపీలకు సమాన బాధ్యత ఉందని చలసాని విమర్శించారు. 

20:27 - April 4, 2018

గుంటూరు : నారాకోడూరులో వైసీపీ అధినేత జగన్ తో ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ సమావేశం అయ్యారు. ప్రత్యేకహోదా ఉమ్మడి ఉద్యమంపై జగన్, చలసాని చర్చించారు. వైసీపీ ఎంపీల నిరాహార దీక్షలకు చలసాని సంఘీభావం ప్రకటించారు. 

11:44 - February 13, 2017
16:42 - January 26, 2017

విశాఖ : ప్రత్యేక హోదా సాధన కోసం ఆర్కేబీచ్‌కు వచ్చిన చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో.. పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కోసమే తాము ఈ ర్యాలీ చేపట్టామని చలసాని తెలిపారు.

07:28 - December 6, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం మళ్లీ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి ఈనెల 7న ఢిల్లీలో మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. హస్తినలో మకాం వేసిన సభ్యులు...విపక్ష పార్టీ నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా పార్టీల నేతలను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఢిల్లీ చేరిన ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మద్దతు కూడగట్టేందుకు సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులను కలిశారు. మహాధర్నాలో పాల్గొనాలని అభ్యర్థించారు.
ఉద్యమాలెన్ని చేసినా కేంద్రం స్పందించడం లేదు-రామకృష్ణ
రాష్ట్రంలో ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేపట్టామని...అయినా కేంద్రం స్పందించలేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అందుకే వేలాది మందితో ఈనెల 7న జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పేవన్ని మాయమాటలని విమర్శించారు. ఈ విషయంలో ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
హోదా లేకపోతే అన్ని కష్టాలే - చలసాని
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల...రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు చలసాని శ్రీనివాస్‌. డీఎస్సీ తప్ప కొత్త నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల నిరుద్యోగులు అల్లాడుతున్నారని వాపోయారాయన. ప్యాకేజీ పేరు చెప్పి కాలం వెల్లదీస్తున్నారని...అది ఎప్పటికి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ, చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అత్యున్నతమైన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 7న రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని కోరారు.
కష్టాలు తీరాలంటే ప్రత్యేకహోదా రావాలి- శివాజీ
ఆంధ్రప్రదేశ్‌ ఆకలిరాజ్యంగా మారకముందే ప్రత్యేక హోదా ప్రకటించాలని కారెం శివాజీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే... ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. పార్లమెంట్‌ సభ్యులు గళమెత్తే సమయం ఆసన్నమైందని..ప్రతి ఒక్కరూ తమతో చేతులు కలపాలన్నారు. రాష్ట్రానికి రాజధాని వచ్చినా...హోదా రాకపోతే ఎలాంటి ఉద్యోగాలు రావని తెలుసుకోవాలన్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు హెచ్చరించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - Chalasani srinivas