chandrababu government

16:14 - February 22, 2018

హైదరాబాద్ : ఓ సమావేశంలో సినీ నటుడు శివాజీపై దాడులు చేయడం సరికాదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్, సీపీఐ నేత రామకృష్ణలు పేర్కొన్నారు. నగరంలోని జనసేన కార్యాలయంలో పవన్ తో రామకృష్ణ భేటీ అయ్యారు. అనంతరం వేర్వేరుగా మీడియాతో వారు మాట్లాడారు.

బిజెపి దాడి చేయడం ఖండిస్తున్నట్లు, విద్యుత్ కార్మికుల సమ్మెపై సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారమయ్యే విధంగా చూడాలని సీపీఐ నేత రామకృష్ణ కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులను ఆదుకోవాలన్నారు. మార్చి 1వ తేదీన గుంటూరులో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని తాను పవన్ కోరడం జరిగిందన్నారు.

పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు వివరాలు తెలుసుకోవడానికి ప్రజలు ఉత్సాహం చూపుతారని, దాడులు చేయడం మంచిది కాదని పవన్ తెలిపారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తెలుసుకుని వారికి మద్దతు తెలపడం జరిగిందని, ఈ సమస్య పరిష్కారానికై చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 1న నిర్వహించే సమావేశానికి హాజరయ్యేది రెండు రోజుల్లో చెబుతానన్నారు. 

08:04 - February 18, 2018

కేంద్రంలోని బీజేపీ ఏపీని అన్ని విధాల మోసం చేసిందని వక్తలు అన్నారు. బీజేపీ, టీడీపీ మైత్రి బంధం చివరిదశకు వచ్చిందా ? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు బాబూరావు, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ, వైసీపీ నేత శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ... రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తూ... నిరంకుశ ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంతో సాగిలపడిపోవడం టీడీపీకి తగదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:21 - February 17, 2018
22:00 - February 16, 2018

హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టంలోని హామీ అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫమయ్యాయని జనసేన ఏర్పాటు చేసిన నిజనిర్ధరణ కమిటీ విమర్శించింది. ప్రజల్లో పెరుగుతున్న అశాంతి, అసహనం... తీవ్రవాదం, వేర్పాటువాదం వంటి విపత్కర పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని జేఎఫ్‌సీ భేటీ ఆందోళన వ్యక్తం చేసింది. హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని నిర్ణయించింది. ఈ మొత్తం ప్రక్రియను కొన్ని వారాల్లోపే పూర్తి చేయాలని ప్రతిపాదించింది.

ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ మొదటి రోజు భేటీ ముగిసింది. పవన్‌ కల్యాణ్‌ ఆహ్వానం మేరకు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులతోపాటు మేధావులు, న్యాయ నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. చట్టంలో పొందుపరిచిన హామీలు, కేంద్రం ఇచ్చిన నిధులపై అధ్యయనం చేసేందుకు ఈ భేటీలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.  కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఏపీ ప్రభుత్వం రిటైర్డ్‌ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మహారాష్ట్ర కేడర్‌ వీఆర్‌ఎస్‌ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.  

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఎదురవుతున్న పరిణామాలపై జేఎఫ్‌సీ భేటీలో ఆందోళన వ్యక్తమైంది. ప్రజల్లో నెలకొన్న అశాంతి, అసహనం తీవ్రవాద సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని జనసేనాని ఆవేదన వెలిబుచ్చారు. 

విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమల్లో కేంద్రం అవలంభిస్తున్న వైఖరి జేఎఫ్‌సీ తప్పుపట్టింది. హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ అంశంపై రెండు ప్రభుత్వాలను కలిసి చర్చించాలని జేఎఫ్‌సీ నిర్ణయించింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వ వెయ్యి కోట్లతో రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ సూచించారు. విభజన హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విలమయ్యాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి మరింత పెంచేందుకు భారీ ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. 

విభజన చట్టంలోని హామీల అమలుపై  చంద్రబాబు అవలంభించిన మెతక వైఖరితో రాష్ట్ర నష్టపోయిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఏంపీలందరూ పార్లమెంటులో పోరాడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూచించారు. శనివారం జరిగే జేఎఫ్‌సీ సమావేశంలో నిధుల అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించారు. 

21:55 - February 16, 2018

జేఎఫ్ సీ కమిటీ భేటీపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్, సీపీఐ సీనియర్ నేత గఫూర్ పాల్గొని, మాట్లాడారు. స్వార్థప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు. ఇది రాజకీయ సమస్యకాదు..ప్రజా సమస్య అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:46 - February 16, 2018

జేఎఫ్ సీ తేల్చబోయే నిజాలేంటీ ? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విభజన చట్టం హామీలు, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర్ రావు, టీడీపీ నేత మాణిక్యవరప్రసాద్, వైసీపీ కొణిజేటీ రోశయ్య పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:41 - February 16, 2018

హైదరాబాద్ : జెఎఫ్ సీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ ముగిసిన అనంతరం సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కేంద్రం విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు.
పవన్ కళ్యాణ్ ..
రాష్ట్ర విభజన విధానం సక్రమంగా లేదని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. పాలకులు అయోమయంలో ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విరుద్ధమైన ప్రకటనలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. జేఎఫ్ సీ సబ్ కమిటీలు ఉంటాయన్నారు. 
జయప్రకాశ్ నారాయణ.. 
ఫెడరల్ వ్యవస్థకు భంగం కలగకుండా పోరాడాలని జయప్రకాశ్ నారాయణ అన్నారు. కమిటీ నిర్ణయాలను తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు...అమలు, ప్రధాని లోక్ సభలో గంభీరమైన ప్రసంగం, ఫెడరల్ వ్యవస్థలో చట్టబద్ధంగా పార్లమెంట్ హక్కులు, ఆ భాషను కమిటీ తిరస్కరిస్తుంది, హామీల అమలు, చట్టం అమలు, రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన సమాచారం...అధికారిక ప్రకటన, పద్మనాభయ్య, ఐవైఆర్ కృష్ణారావు, చంద్రశేఖర్ బృందంతో కమిటీ తోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. కమిటీలో పౌర సమాజానికి, అన్ని పార్టీల పాత్ర ఉండాలన్నారు. అందరూ ఒకే గొంతుతో పోరాడాలని సూచించారు. రేపు 11 అంశాలపై చర్చ ఉంటుందని తెలపారు. ద్రవ్యలోటు, ఓడరేవుల నిర్మాణం, రైల్వే జోన్, ప్రత్యేక ప్రత్తిపత్తితోపాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. 

21:29 - February 16, 2018

హైదరాబాద్ : రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధుల కోరడంలోని ఔచత్యాన్ని కేంద్రం ప్రశ్నిస్తోందని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య చెప్పారు. భవనాల నిర్మాణానికే 42 వేల కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిన లెక్కలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని జేఎఫ్‌సీ సమావేశంలో ప్రస్తావించారు. 

 

 

20:50 - February 16, 2018

హైదరాబాద్ : రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను శిక్షించారని అన్నారు. రాజకీయ నాయకులు బాగానే ఉన్నారని తెలిపారు. న్యాయం జరగనప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు కోపం వస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే ప్రజల్లో అసహనం పెరుగుతుందని...తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న భావన కలుగుతుందన్నారు. 

 

20:38 - February 16, 2018

హైదరాబాద్ : ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే దేశ సమగ్రతకు భంగం కల్గుతుందని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలపై ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది మనుషుల సమస్య అని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో జరిగిన అన్యాయంపైనే జేఎఫ్ సీ ఏర్పాటు అయిందని తెలిపారు. తనకు చలించే హృదయం ఉందన్నారు. పాలకులు చేసిన తప్పుకు పేద ప్రజలు బాధలు అనుభవిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 'నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడినా' అన్న భావన కలుగుతుందన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకపోతే వేర్పాటు వాదానికి బలమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోనప్పుడు చట్టాలను ఎందుకు గౌరవించాలనే ధోరణి పౌరుల్లో వస్తుందన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - chandrababu government