Chandrababu Government Failures

21:26 - July 21, 2018

పార్లమెంట్ల అవిశ్వాసం డ్రామా గెలుపు...ప్రజలను పిచ్చోళ్లను జేశ్న బాబు మోడీ, చంద్రబాబు మీద జేసీ దివాకర్ అవిశ్వాసం..రెండు జాగలళ్ల ఓడిపోయిన చంద్రాలు, ఆటబొమ్మలైతున్న నేరేళ్ల దళిత బాధితులు...కన్నీళ్ల డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ, భావ దారిద్ర్యం బత్కుతున్న బహుజనులు...ఎమ్మెల్యే టికెట్ల కోసం నేతల గులాంగిరి, సర్కారు బడిల మేము సద్వలేము...పడిపోయెతందుకు సిద్దమైన పాఠశాల, మీ పిల్లలంత కానిస్టేబుల్ ఉద్యోగాలకు వోండ్రి..
మా బిడ్డెను మాత్రం ఎమ్మెల్యేను జేస్త... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:41 - July 19, 2018

రాజకీయాలు వేరు.. వేసే ఓటు వేరు..అసలైన రాజకీయం తెల్వకుంటే ఆగమే, తెలంగాణల సత్రోలు అయిన సర్కారు బడి..పేదలకు దూరమైతున్న విద్యా వనరులు, అంగన్ వాడీ కేంద్రాలళ్ల ఉడ్కని బియ్యం...పుర్గులు వట్టిన అన్నం.. అవ్వేకూరలు, తెలంగాణల రెవెన్యూ అధికారుల లంచాలు...రికార్డుల తారుమారుల కోట్ల కొద్ది అవినీతి, అంగారక గ్రహం మీదికి వొయ్యే తొలి మన్షి..మన పిల్లలు కచ్చకాయలు చిత్తుడు బిల్ల, కిల యాటకూర గొంటె టిఫిన్ బాక్సు ఫ్రీ..కోరుట్ల కాడ ఒకాయిన కొత్తరకం దందా..ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:38 - July 17, 2018

కాంగ్రెస్ పార్టీల తన్నులాటొక్కటే తక్వ..గల్లలు కుర్చీలదాకెదిగిన నాయకత్వం, గురిగింజ మాటలు జెప్తున్న గుత్తా రెడ్డి..కాంగ్రెస్ పార్టీల గెల్చి కాంగ్రెసును గిచ్చి, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ అడ్డుకుంటున్నది...మరి ప్రాజెక్టులు అడ్డుకున్నా ఆగుతలేవుగదా ?, ఆకార పుష్టి నైవేద్య నష్టి లెక్కైన ప్రజావాణి..సమస్యలు పరిష్కారం గాక జనం పరేషాన్, బత్కున్న మన్షికి డెత్ సర్టిఫికేట్ మంజూరు...కరీంనగర్ కార్పొరేషన్ అధికారుల తీరు గిది, వేటగాళ్ల ఉచ్చుల వడ్డ చిరుత పులి..కాపాడెతందుకు ప్రత్యేక రెస్క్యూ టీంలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:27 - July 12, 2018

అన్నా క్యాంటీన్లు అని కొత్తయి కొలాయించిండ్రుగదా..? క్యాంటీన్లు గట్టెకాడ కోట్ల రూపాల అవినీతి అయ్యిందట..ఏ ప్రభుత్వమైనా పేదోనికి కనీసం అందించవల్సిన సేవ ఏంది..?తెలంగాణ ప్రజలారా ఇది మీరు బాగ జూడాలే ముచ్చట.. ఏం ప్రభుత్వమండి చంద్రశేఖర్ రావుగారు మీది..? ఇదో ప్రభుత్వమేనా.?.బోధకాలు రోగం లేని మన్షిలేడు ఆ ఊర్లె.. ఈ తెలంగాణ ఆప్కారోళ్లకు బుర్ర పనిజేస్తలేదా ఏంది..? ఏటీఎంల పైసల తీస్కుందానమి వొయ్యని ఒకాయనను ఏటీఎం సతాయించింది.. గుడి కొచ్చిన భక్తులకు శఠగోపం బెట్టో తీర్థం బోశే.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:28 - July 11, 2018

అమ్మయ్య మొత్తం మీద థాయ్ లాండ్ బొయ్యారం కథ సుఖాంతమైంది..జేసీ దివాకర్ రెడ్డి అంటె ఫీలైతవ్ గని.. నీది నాల్కెనా తాటి మట్టనా..? అరే నీయక ఆ పోరని పేరేంది ఆ లోకేశం.. ఆ పోరన్ని ఎవ్వలికన్న మంచి డాక్టరుకు సూపెట్టుండ్రివా ఓ తెల్గుదేశమోళ్లు..అనంతపురం కాడ తెల్గుదేశం ఎంపీలు దీక్ష జేస్తున్నరు ఎందుకు..? ఓయమ్మనే ఈ ముచ్చట మూడు రోజులు ముందు దెలిస్తె చంద్రాలు ఆంధ్రరాష్ట్రమంత పండుగ జేసునో ఏమో..?అయ్యో హైకోర్టు ఎంత పనిజేశే.. ఇంకో నాల్గొద్దులు ఆగినా.. ఎన్నికలు అయిపోవు అప్పుడు ఏం జెప్పినా ఏంగాకపోతుండే..మంత్రి జగదీశ్వర్ రెడ్డిగారు తమరేమో గడ్కోపారి రచ్చగెలుస్తాని..పెద్దల పెద్దరికం పర్వు మర్యాదలు.. అన్ని గల్పి నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తేవెధ ఊర్లె ఒక శవాన్ని తయ్యారు జేశ్నయ్..గీ గరం గరం ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ జేయండి...

21:14 - July 7, 2018

తెల్గుదేశానికి త్వరలో ఆనం గుడ్ బై..జగన్తోని ఎయిర్ పోర్టుల ఏకాంత చర్చ, మీ చెల్లె కవితను గెలిపిచ్చుకో కేటీఆర్.. నేను రాజకీయం జేయంటున్న కోమటి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కోదండరాం..మరి మీ పార్టీల అసమ్మతి సంగతేంది?, ఎంసెట్ పేపర్ల లీకుల శ్రీచైతన్య నారాయణ....రోడ్డెక్కుతున్న విద్యార్థి సంఘాలు, సైనికుని భూమి కబ్జా వెట్టిన కారుకర్తలు.. తహశీల్దార్ ఆఫీసు సుట్టు బాధితులు, ఉద్యమ కారులకు పూలదండ శాలువు...ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు....ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.... 

20:34 - July 6, 2018

చంద్రాలును చెండాడుతున్న పవనాలు..టీడీపీ అవినీతిని గల్లావట్టి అడ్గుతడంట, దేశంల మద్దతు ధరలిచ్చింది మనమే..ఏసీ రూంల సుఖేందర్ రెడ్డి అవద్దాలు, ఓట్లు నాయకులు ఏస్తున్న జనాలు..వానలకోసం దేవుని దిక్కు సూపులు, తెల్గురాష్ట్రాలను ఎక్కిరిస్తున్న వానలు..కరీఫ్ పంటలేశి కలవరపడ్తున్నరైతులు, హోంమంత్రి పర్సనల్ సెక్రేటరీ గారి కబ్జా..మందిని ముంచుతున్న ముకుందరెడ్డి, స్థానిక సంస్థల మీద కేసీఆర్ పగవట్టిండు.. పటేల్ పట్వారీ వ్యవస్థకు జీవంబోస్తుండు... ఈ అంశాలను మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

20:46 - July 5, 2018

మోడీ నమ్మించి మోసం జేశిండన్న చంద్రాలు..మరి నువ్వు మేనిఫెస్టోతోని నమ్మియ్యలేదా..?, మీడియాకు క్లాసులు జెప్తున్న కుందురు జానాలు..ఏవార్తలు ఏయాలే ఏది ఎయ్యొద్దు అనే టాపిక్, కౌన్సిలర్లను బెదిరిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే..కాల్ రికార్డు లీకై.. కంపు కంపైన కారు పార్టీ, లంచం ఇస్తెనే పాసు బుక్కులు ఇస్తరట..
చిట్యాల ఎమ్మార్వో ఆఫీసుల బాగోతాలు, అనారోగ్యం పాలై గ్యారేజీకి జేర్న అంబులెన్సు...డాక్టరుగారికే జరమొచ్చినట్టున్నది కథ, పిల్లలతోని జెడలేపిచ్చుకుంటున్న టీచర్..విద్యాశాఖ మంత్రి జిల్లాల పార్వతి టీచర్... ఈ అంశాలను మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

11:16 - July 3, 2018

2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగం ప్రకారంగా చూస్తే మళ్లీ ఎన్నికలు 2019లో జరిగాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముందస్తు ఎన్నికలకు నాయకులు సిద్ధపడిపోతున్నారు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తుల్లో బిజి బిజీగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. తెలంగాణలో అయిన నవంబర్ నెలలోనే ముందస్తు ఎన్నికలు జరిగే వాతావరణం నెలకొంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల హడావిడిలో కసర్తులు చేసుకుంటున్నారు. అటు ఏపీలో కూడా అధికార పార్టీ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలపై వంచన దీక్షలు చేస్తుంటే..ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో ప్రజలకు ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. మరోపక్క కొత్తపార్టీగా అవతరించిన జనసేన పార్టీ కూడా ఎన్నికల నేపథ్యంలో సభలు, బహిరంగ సభ, మేధావులతో చర్చలతో జనసేనాని పనవ్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు రాష్ట్రాల హక్కులపై దాడి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో టీడీపీ అధికార ప్రతినిథి మన్నెం సుబ్బారావు, జనసేన అధికార ప్రతినిథి పార్థసారథి పాల్గొన్నారు. 

20:30 - June 29, 2018

విజయవాడ : కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం పిలుపు మేరకు నిర్వహించిన జిల్లా బంద్‌ సంపూర్ణంగా జరిగింది. జనమంతా స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొనడంతో ప్రశాంతంగా ముగిసింది. ర్యాలీలు, ధర్నాలతో జిల్లా కడప జిల్లా హోరెత్తింది. వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బస్సులు, ఇతర వాహనాలు తిరగకపోవడంతో జనజీవనం స్తంభించింది. బంద్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌ సందర్భంగా కడప జిల్లాలోని ఎనిమిది ఆర్టీసీ డిపోల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు లేక బస్‌ స్టేషన్లు వెలవెలపోయాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు దుకాణాలను స్వచ్చంధంగా మూసివేశారు. అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లపైకి వచ్చిన వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కడప నగరమంతా నిర్మానుష్యంగా మారింది.

కడపలో జరిగిన బంద్‌లో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవులు ఆధ్వర్యంలో కడపలో బైక్‌ ర్యాలీ జరిగింది. కడపకు స్టీల్‌ ప్లాంట్‌ను వెంటనే ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏపీ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ హెచ్చరించారు. పులివెందులతో సంపూర్ణంగా బంద్‌ జరిగింది. వైసీపీ, వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బద్వేల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమకారులు జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చిన బంద్‌ జరిపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ప్రొద్దూటూరు బంద్‌ సంపూర్ణంగా జరిగింది. జమ్మలమడుగు, రాయచోట, పోరుమామిళ్ల, ముద్దనూరు, రైల్వేకోడూరుతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బంద్‌ నిర్వహించారు.

కడప జిల్లా బంద్‌కు సంఘీభావంగా రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో కూడా వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. తిరుపతిలో నిర్వహించిన ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. కేంద ప్రభుత్వం దిగొచ్చిన కడప ఉక్కు కర్మాగారం ఇవ్వకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వాలన్న నిర్ణయానికి వామపక్షాలు వచ్చాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - Chandrababu Government Failures