chandrababu naidu

13:49 - November 20, 2018

అమరావతి : అన్నింటికీ ఒక్కటే ఆధారం అదే ‘ఆధార్’ కార్డ్. ఏ పథకమైన ఆధారే ఆధారం. అది లేకుంటే ఏదీ లేదు ఆధారం అన్నట్లుగా వుంది. అన్నింటికి ఆధార్ ను అనుసంధానం చేస్తు దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న విధానాలతో ఆధార్ కార్డు అందరికీ ఆధారం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూసేవ కార్యకలాపాలను అమరావతిలో భూధార్ వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భూ లావాదేవీల్లో మోసాలను అరికట్టడానికి భూధార్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశామని, మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇకపై వేలిముద్రల ఆధారంగానే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు.

ఆధార్ మాదిరే భూధార్ లో భూములకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. భార్య పేరిట ఉన్న భూమిని భర్త మోసం చేయడం కూడా ఇకపై కుదరదని చెప్పారు. ఒక వ్యక్తికి ఉన్న వేలిముద్రలు, కనురెప్పలు మరొకరికి ఉండవని... అందువల్ల మోసం చేయలేరని అన్నారు. ప్రతి భూమికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని తెలిపారు. భూధార్ తో రెవెన్యూ శాఖకు మంచి పేరు రాబోతోందని చెప్పారు. చుక్కల భూములపై 8వేల కేసులు ఉన్నాయని... నెలరోజుల్లో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. అవినీతి రహిత పాలనను అందించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భూధార్ తీసుకురావడం ఒక చరిత్ర అని అన్నారు.

15:00 - November 19, 2018

సిద్ధిపేట: టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అదే సమయంలో విపక్షాలపై మాటల దాడిని పెంచారు. గజ్వేల్‌లో టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా టీఆర్ఎస్‌కు కంచుకోట అని అన్నారు. జిల్లాలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని, రాష్ట్రంలో కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని జోస్యం చెప్పారాయన. చంద్రబాబుతో చేతులు కలిపిన వారి పరిస్థితి అంతే అని చెప్పారు. కూటమిలో కోదండరామ్‌కే సీటు లేకుండా చేశారని హరీష్ విమర్శించారు. కూటమిలో ఎవరికీ ఎవరిపై నమ్మకం లేదన్నారు.

11:13 - November 19, 2018

విజయవాడ : బీజీయేతర పార్టీలను ఏకం చేయడానికి..జాతీయ స్థాయంలో మరోసారి చక్రం తిప్పేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే పలువురు జాతీయ పార్టీలతో భేటీ అయిన ఆయన కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..ఏపీ రాష్ట్రంపై కేంద్రం వివక్ష..ఇతరత్రా అంశాలను ఆయా నేతలకు వివరిస్తూ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసందే. విరోధిగా ఉన్న కాంగ్రెస్‌ పెద్దలతో కూడా బాబు భేటీ అయ్యారు కూడా. అందులో భాగంగా నవంబర్ 19వ తేదీ సోమవారం కోల్‌కతాకు బాబు బృందం వెళ్లనుంది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సీబీఐకి నో ఎంట్రీపై ఏపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని మమత స్వాగతించారు. 
బీజేపీయేతర కూటమిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతో చర్చించనున్నారు. మధ్యాహ్నం జరిగే భేటీలో మమత పేర్కొనే పలు సందేహాలు..ఇతరత్రా అంశాలపై బాబు సుదీర్ఘంగా వివరించనన్నట్లు టాక్. కాంగ్రెస్‌ను కలుపకపోవడం మమతకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఎలాగైనా మమతను నచ్చచెప్పాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్ లో బీజేయేతర పార్టీల ప్రాధాన్యం ఉంటుందని..బీజేయేతర కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని బాబు స్పష్టంగా చెప్పనున్నారని తెలుస్తోంది. అంతేగాకుండా మమత బెనర్జీ...కమ్యూనిస్టు పార్టీల మధ్య నెలకొన్న విబేధాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. నవంబర్ 22వ తేదీన ఢిల్లీలో బీజేయేర పార్టీల మీటింగ్ జరుగనుంది.  మమత..బాబు భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరుగనుందో కాసేపట్లో తెలియనుంది. 

 

10:30 - November 19, 2018

హైదరాబాద్ : నామినేషన్లకు నవంబర్ 19వ తేదీ సోమవారం చివరి రోజు..ఇప్పటికే గులాబీ దళం అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు గులాబీ బాస్ అభ్యర్థులను ప్రకటించేసి...ఆయన స్వయంగా ప్రచార రంగంలోకి దిగనున్నారు. మహాకూటమిలో ఉన్న టీడీపీలో మాత్రం ఇంకా సస్సెన్ష్ కొనసాగుతోంది. కూటమిలోని టీడీపీకి కాంగ్రెస్ 14 స్థానాలు కేటాయించింది. 13 స్థానాలకు మాత్రం టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మరొక్కస్థానంపై ఉత్కంఠ నెలకొంటోంది. పటన్ చెరు స్థానంపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. పటన్‌చెరు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థికి బీ ఫాం ఇచ్చింది. నియోజకవర్గంలో టీడీపీ ఏమీ చేస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గం నుండి ఇద్దరు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం..నేతలకు..టీడీపీ పార్టీలో అయోమయం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఒక్క స్థానంపై ఉత్కంఠ వీడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

08:31 - November 19, 2018

అమరావతి: తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఏపీ మంత్రి కళా వెంకట్రావు పవన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో యలమంచిలి రవి ఇంట్లో జగన్‌తో రహస్యంగా సమావేశం కావడం, 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగన్‌ని 40 సీట్లు డిమాండ్ చేయడం నిజం కాదా అని పవన్‌ను ప్రశ్నించారు మంత్రి కళా వెంకట్రావు. 2009 ఎన్నికల్లో తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని గెలిపించుకోలేని పవన్, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారాయన. 
ఏపీ ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల నిరంకుశ పాలనకు పవన్ వంత పాడుతున్నారని  మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో పవన్ చేసిన వ్యవహారాలపై సైతం ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు పవన్‌కు మంత్రి కళా వెంకట్రావు 19 ప్రశ్నలతో బహిరంగ లేఖను సంధించారు. 
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ ఏనాడూ నిజాయతీ, నిబద్ధతతో పనిచేయలేదని కళా వెంకట్రావు విమర్శించారు. బీజేపీ హిందుత్వ పార్టీ కాదని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని లేఖలో మంత్రి తప్పుపట్టారు. ఏపీకి రూ.75వేల కోట్లు రావాలన్న నిజనిర్ధారణ కమిటీ నివేదికపై పవన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.  కల్యాణ్ రహస్యంగా సమావేశం అయ్యారని ఆరోపించారు. జనసేన పోరాటయాత్ర పేరుతో ఏసీ బోగీల్లో కూర్చున్న పవన్ సామాన్యులను ఎలా కలవగలిగారో చెప్పాలన్నారు.
బాక్సైట్ సహా ఇతర గనులకు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అనుమతులు వచ్చాయని తెలిసినా పవన్ మౌనం వహించారని విమర్శించారు. ప్రసంగాల్లో పరుష పదజాలం వాడుతూ యువతకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, సీబీఐతో వేధింపులు, ఐటీ దాడులపై పవన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలా కలిశారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు వ్యవహారంలో, గవర్నర్‌ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తే బాగుంటుందని బహిరంగ లేఖలో పవన్‌కు మంత్రి కళా వెంకట్రావు సూచించారు. రాష్ట్రంలోని యువత, బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం చంద్రబాబుపై పవన్ విమర్శలు చేయడం దారుణమని కళా వెంకట్రావు అన్నారు.

19:11 - November 16, 2018

హైదరాబాద్ : కుకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా సడెన్  ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ కుమార్తె సుహాసిని మాట్లాడారు. నామినేషన్ పత్రాలు అందుకున్న ఆమె మాట్లాడుతు..తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశమిచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన తండ్రి నందమూరి హరికృష్ణను ఆమె గుర్తుచేసుకుంటు ‘‘టీడీపీకి ఆయన ఎంతో సేవ చేశారని.. చిన్నప్పటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టమని..తాతగారు  నందమూరి ఎన్టీ రామారావు, తండ్రి హరికృష్ణ, మామయ్య చంద్రబాబునాయుడు తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చార’ని’అన్నారు. ‘‘తన మామ మాజీ ఎంపీ అని, ఆయన స్ఫూర్తి కూడా తనపై ఉందని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తన తాతయ్య ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఇది ప్రజల పార్టీ స్థాపించారని..తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ప్రజల కోసం అనునిత్యం కష్టపడి పని చేస్తానని’’ అన్నారు. అందరి ఆశీర్వాదాలు తనకు కావాలని, రేపు నామినేషన్ వేసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని సుహాసిని స్పష్టం చేశారు. 
 

15:32 - November 16, 2018

అమరావతి : రాజకీయాలలో అపర చాణుక్యుడిగా పేరొందిని ఏపీ సీఎం చంద్రబాబు సీబీఐని ఏపీలో నిషేధిస్తున్న తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా నిలిచింది. రాజకీయ విశ్లేషకుల నుండి న్యాయ విశ్లేషకుల వరకూ ఈ అంశంపైనే చర్చిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు వ్యూహం ఏమిటా? అని విశ్లేషకులు సైతం ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి చంద్రబాబు వ్యూహం ఏమిటీ? 

Image result for CHANDRABABU ON CBI NO ENTRYఉప్పు, నిప్పుగా వున్న కేంద్ర ప్రభుత్వం ఏపీపై విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. వేల కోట్ల అవినీతి ఏపీలో జరుగుతోందని బీజేపీ నేత జీవిఎల్ లాంటి వారు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై సీపీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. దీంతో ఇటీవల విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు హైకోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దాడులు జరగవచ్చన్న అనుమానం చంద్రబాబుకు చాలా కాలంగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు సీబీఐ రాష్ట్రంలో దాడులకు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సీబీఐని ఏపీలోకి రాకుండా నిషేధించినట్టు ప్రచారం జరుగుతోంది..

Image result for CHANDRABABU and mamata banerjeeజగన్ పై హత్యాయత్నం జరిగాక చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. నిందితుడు శ్రీనివాస్ వెనుక ఎవరున్నారన్నది కనిపెట్టలేదు. అయినా సిట్ బాబు కనుసన్నల్లోనే నడిచి కేసు నీరుగారుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ పై హత్యాయత్నం కేసు హైకోర్టు కెక్కడం.. సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు సర్కారు సీబీఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. కాగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించే దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు యత్నిస్తున్నామని తెలపటం విశేషంగా చెప్పుకోవచ్చు. 

దీంతో జగన్ పై దాడి కేసు నుండి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు అలెర్ట్ అయ్యి సీబీఐ ఏపీలోకి రాకూడదంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క కానీ న్యాయనిపుణులు మాత్రం చంద్రబాబు వేసిన ఎత్తులు కోర్టుల ముందు నిలబడే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం ఫలించేనా? ఏపీలో సీబీఐ దాడులు ఆగేనా? కోడి కత్తి వ్యవహారం తేలేనా? అనే విషయాలు తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
 

14:53 - November 16, 2018

పశ్చిమబెంగాల్ : ఇటీవల కాలంలో ఏపీలో పలు ప్రాంతాలలో సీబీఐ హఠాత్తుగా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రవేశాన్ని కట్టడి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు బాటలోనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. సీబీఐ చట్టాన్ని తాము కూడా పరిశీలిస్తున్నామని... తదుపరి చర్యలను త్వరలోనే తీసుకుంటామని మమతా  స్పష్టం చేశారు. రాష్ట్రాల పరిధిలో కేంద్రం తప్పుడు వైఖరిని అనుసరిస్తోందని ఆమె మండిపడ్డారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని.. సీబీఐ, ఈడీ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని కేంద్రం భావిస్తోందనీ..ఈ క్రమంలోనే కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె విమర్శించారు. బీజేపీ కుతంత్రాల వల్ల దేశానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ మాదిరే తమ రాష్ట్రంలో కూడా సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు యత్నిస్తున్నామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కాగా ఏపీలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
 

 

10:27 - November 16, 2018

అమరావతి:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దర్యాప్తు సంస్థపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో సీబీఐ ఎటువంటి సోదాలు కానీ, దర్యాప్తు కానీ చేసే అధికారాన్ని కోల్పోయినట్టే. సీబీఐకు అనుమతించిన కన్సెంట్‌ను విరమించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. 
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఏదేని రాష్ట్రంలో విచారణ చేయలన్నా, కేసులు చేపట్టాలన్నా ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో దేశ  రాజధాని ఢిల్లీకి మినహాయింపు ఉంది. ఈ ఆదేశాల ఫలితంగా రాష్ట్రంలో సీబీఐ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కానీ ఇతర కేంద్ర పబ్లిక్ సెక్టార్ సంస్థలలోకాని ఎటువంటి విచారణ చేయటానికి అర్హత లేదు. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల సీబీఐ దాడులు నిర్వహించి వ్యాపారస్థుల, రాజకీయనాయకుల వెన్నుల్లో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. దీనికితోడు రాష్ట్ర సర్కారు కేంద్రంతో అమీతుమీకి దిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేంద్రానికి చురకలాంటిదని భావించవచ్చు.   

 

 

09:40 - November 16, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో టీడీపీని సమూలంగా రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ దగ్గర తాకట్టు పెట్టేసి...పాలనలో అవినీతి పెచ్చుమీరేలా చేసిన తెలుగుదేశం పార్టీని సమూలంగా రాష్ట్రం నుండి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  • ఢిల్లీ కోటలు బద్దలు కావాలి..కాంగ్రెస్ కోటకు బీటలు వారాలి.
  • జగన్, చంద్రబాబు మనకు వద్దు..లోకేష్ అసలే వద్దు
  • వీళ్లంతా అవినీతిని అలవాటుగా మార్చేస్తున్నారు.
  • జనసేన ప్రభుత్వంలో 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తాం

ఏపీకి అన్యాయం చేస్తున్న ఢిల్లీ కోటను బద్ధలు కొట్టాలని..కాంగ్రెస్ కోటలకు బీటలు వారేలా చేయాలని సూచించారు. ఇప్పుడున్న నాయకులు మాత్రం అవినీతిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోతున్నారని, గతంలో రూ. 100 కోట్ల అవినీతి అంటే చాలా పెద్ద విషయమని, దేశాన్ని కుదిపేసిన భోపార్స్ కుంభకోణం అలాంటిదేనని పవన్ రాజానగరంలో నిర్వహించిన బహిరంగ సభలో తెలిపారు. ప్రజా జీవితాల్లో వెలుగులు నింపేలా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్ధామని తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - chandrababu naidu