Chandrababu Press Meet

08:43 - August 22, 2018

నేడు తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతోంది. పది రోజులుకూడా కాకుండానే తిరిగి సమావేశం అవుతోంది. దీంతో కేబినెట్‌లో ఏం చర్చిస్తారన్న ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, కాంగ్రెస్ నేత రామచంద్రమూర్తి, బీజేపీ నేత ఎస్.కుమార్, టీఆర్ ఎస్ నేత పీఎల్ శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. ముందస్తు ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వమే తెరతీసిందన్నారు. కేరళకు ఆర్ధికసాయంపై రాజకీయాలు చేయడం తగదని హితవుపలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

06:31 - April 28, 2018

విజయవాడ : భవిష్యత్‌లో బీజేపీ - వైసీపీ కలిసి పోటీ చేస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ తోడుందన్న నమ్మకంతోనే కేంద్రం టీడీపీని దూరం చేసుకుందని దుయ్యబట్టారు. కేంద్రంలోని పెద్దలు, వైసీపీ కలిసి రాష్ట్రం మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపట్టి 5ఏళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేపట్టిన వస్తున్నా .. మీకోసం పాదయాత్ర చేపట్టి 5 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా చంద్రబాబు తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అనేక అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రతిపక్షాల తీరును ఎంగట్టడంతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు.

బీజేపీ - వైసీపీలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ - వైసీపీలది మొన్నటి వరకు రహస్య అజెండా అని.. ఇప్పుడు వారి అజెండా బహిర్గతమైందన్నారు. వైసీపీ తోడు ఉంటుందన్న నమ్మకంతోనే కేంద్రం టీడీపీని దూరం చేసుకుందని ధ్వజమెత్తారు. రేపో.. మాపో ఆ రెండు పార్టీలు కలుస్తాయని... వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని దుయ్యబట్టారు.

వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రజలకు ఏ హామీలు ఇచ్చానో.. వాటికంటే ఎక్కువే చేశానని చంద్రబాబు తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన వారికి కర్నాటకలో తెలుగు ఓటర్ల గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరుతున్నానని... అలా అయితేనే ప్రధాని ఎవరనేది మనమే నిర్ణయించే అవకాశం వస్తుందని చంద్రబాబు చెప్పారు.

విభజన హామీల సాధనకుగా తాము ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా మోదీ ఏ స్థలంలో అయితే హామీలు ఇచ్చారో.. అదే స్థలంలో ఏపీకి చేసిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలపై నిలదీస్తామని చెప్పారు. నమ్మక ద్రోహం - కుట్ర రాజకీయాలు పేరిట తిరుపతి సభ నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. సభను విజయంతం చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

21:34 - April 4, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధనకు.. న్యాయపోరాటం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా కాంగ్రెస్‌ అన్యాయం చేస్తే, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీజేపీ దగా చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల న్యాయమైన హక్కులు సాధించే వరకు  కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు ఢిల్లీలో స్పష్టం చేశారు. 
కేజ్రీవాల్‌తో చంద్రబాబు భేటీ 
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రెండో రోజు కూడా బిజీబిజీగా పడిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలులో ఎన్డీయే ప్రభుత్వ వైఖరిని వివరించి,  టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. 
విభజనతో ఏపీకి అన్యాయం  
అనంతరం చంద్రబాబు... విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటులో విభజన చట్టాన్ని హడావుడిగా ఆమోదించింది మొదలు.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రుల రాజీనామా, ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టడం వరకు అన్నిఅంశాలను ప్రస్తావించారు. హోదా ఇస్తారని, విభజన హామీలు అమలు చేస్తారని నాలుగేళ్లపాటు నమ్మకంగా ఎదురు చూస్తే, చివరికి నమ్మక ద్రోహం మిగిలిందన్న ఆవేదనతో ఎన్డీయే నుంచి బయటకొచ్చినట్టు చెప్పారు. 
బీజేపీ నాటకాలు
ప్రధాని మోదీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని చంద్రబాబు మండిపడ్డారు. హోదా ఉన్న రాష్ట్రాలకు దీనిని పొడిగిస్తూ... ఏపీకి ఇవ్వకపోడం ఏంటని ప్రశ్నించారు. అవినీతి మకిలి అంటుకొన్న వైసీపీని అడ్డుంపెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరస్థులకు ప్రధాని కార్యాలయం ఆశ్రయం కల్పించడం ఏంటని చంద్రబాబు నిలదీశారు. బీజేపీతో దూరంగానే ఉంటామని చెప్పిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మరింత విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామన్నారు. 

 

19:55 - April 4, 2018

ఒకరిపైమరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుంటున్న టీడీపీ, వైసీపీ ? అసలు ఎజెండా పక్కన పెట్టి, రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలు, ప్రత్యేకహోదాపై పోరు పక్కదారి పడుతుందా ? రాష్ట్రమా...రాజకీయమా...అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, బీజేపీ నేత ఆర్ డీ విల్సన్, వైసీపీ నేత గోపీరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల మీరా పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం...

16:47 - April 4, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి జాతీయ నేతల మద్దతు కోరేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలకు కలిసిన చంద్రబాబు మీడియాతో ఏపీ సమస్యల గురించి ప్రస్తావించారు. ఏపీకి న్యాయం చేయాలని కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. చిన్న చిన్న అంశాలు మినహా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని...రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలపై శ్వేత పత్రాన్ని విడుదల చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నాలుగేళ్లు ఎదురు చూసినా ఫలితంలేకనే.. ఎన్డీయే నుండి వైదొలిగామని తెలిపారు. ఏపీకి ఇవ్వని హోదాను కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారనీ..ఆఖరి బడ్జెట్ లో కూడా ఏపీ ప్రస్తావనే తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

17:09 - April 3, 2018

ఢిల్లీ : సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా కాంగ్రెస్‌, బీజేపీ యేతర పక్షాల మద్దతు కూడగడుతున్నామని తెలిపారు. 

 

17:01 - April 3, 2018

ఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఉదయం పార్లమెంటుకు చేరుకున్న ఆయన ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నమస్కరించి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు ద్వారానికి నమస్కరించి లోనికి వెళ్లారు. అనంతరం పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్‌లో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.  అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌, ఎన్‌సీపీ నేతలు శరద్‌ పవార్‌, సుప్రియా సూలె, తారిక్‌ అన్వర్‌, టీఎంసీ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, డెరిక్‌ ఒబ్రెయిన్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, తెరాస నేత జితేందర్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 

10:04 - January 30, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టులపై నేడు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు రాష్ట్రప్రభుత్వా నీటి పారుదల అధికారులు హాజరుకానున్నారు. ట్రాన్స్ ట్రాయ్ నుంచి పనులు వడదీసి నవయుగకు అప్పగించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:35 - January 30, 2018

చిత్తూరు : జిల్లా వైసీపీ నేత, మాజీ జడ్పీ ఛైర్మన్‌ సుబ్రమణ్యం రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశంపార్టీలోచేరారు. మునిస్వామిరెడ్డిగారి సుబ్రమణ్యంరెడ్డికి పార్టీ కండువా కప్పి సీఎం సాదరంగా ఆహ్వానించారు. 654 మందితో టీడీపీలోకి వచ్చిన సుబ్రమణ్యంరెడ్డి గతంలో చంద్రబాబుపై మూడు సార్లు పోటీచేశారు. పార్టీలో చేరినవారిందరిని మనస్పూర్తిగా.. సాదరంగా ఆహ్వానిస్తున్నానని సీఎం అన్నారు. తనపై మూడు సార్లు పోటీచేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సుబ్రమణ్యం రెడ్డి మాత్రమే అని చెప్పారు. రాజకీయాల్లో విలువలు పాటిస్తూ... హుందాగా వ్యవహరించే వ్యక్తి పార్టీలో చేరడంపట్ల సీఎం సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను సీఎం ఐతే కుప్పం లోని ప్రతి ఒక్కరూ సీఎం అయినట్లుగా భావిస్తూ... తనను ఆదరించిన కుప్పం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

11:54 - January 29, 2018

టీడీపీ, బీజేపీ నేతల పరస్పర వ్యాఖ్యలపై వక్తలు మాట్లాడారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, బీజేపీ నేత అద్దెపల్లి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై భిన్నవాదనలు వినిపించారు. ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - Chandrababu Press Meet