Chhattisgarh

08:24 - October 17, 2018

ఢిల్లీ : సినీరంగం నుంచి మొదలై వివిధరంగాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న మీటూ ఉద్యమం సెగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తాకింది. మొన్నటికి మొన్న ఎన్డీయేలోని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్  జర్నలిస్టుగా పనిచేసేటప్పుడు మహిళా ఉద్యోగినులను వేధించిన ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. లేటెస్ట్ గా  కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం (ఎన్.ఎస్.యూ.ఐ) జాతీయ అధ్యక్షుడు  ఫైరోజ్ ఖాన్  లైంగిక వేధింపుల కేసులో మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. చత్తీస్ ఘడ్ కు చెందిన ఒక మహిళా కాంగ్రెస్ కార్యకర్త  ఫైరోజ్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని  పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఫైరోజ్ ఖాన్ వల్ల తన ప్రాణాలకు ముప్పు  పొంచి ఉందని  కూడా ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.  ఫైరోజ్ ఖాన్ రాజీనామాను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఫైరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లకూడదనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే మహిళ చేసిన ఆరోపణలపై  నిజానిజాలు విచారించేందుకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. 

12:59 - October 10, 2018

చత్తీస్‌గఢ్‌ : పరిశ్రమల్లో అగ్రిప్రమాదాలు సంభవించి తొమ్మిది మంది మృతి చెందిన ఘటన స్థానికింగా భయాందోళనలకు గురిచేసింది. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో భిలాయ్ ఉక్కు పరిశ్రమలో సంభవించిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్లాంటులోని కోక్ ఓవెన్ సెక్షన్ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు దుర్గ్‌ రేంజ్‌ ఐజీ జీపీ సింగ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 24 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
 

16:10 - September 30, 2018

ఛత్తీస్ గఢ్ :  : తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు ఈ ఉదయం మెరుపుదాడి చేశారు. తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడిన మావోలను నిలువరించడానికి జవాన్లు కూడా ఫైరింగ్ ఓపెన్ చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా క్యాంప్ వేసిన భద్రతా దళాలు, అక్కడి నుంచే అడవుల్లోకి వెళ్లి కూంబింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మావోలు, సీఆర్పీఎఫ్ దళాల మధ్య సుమారు గంట పాటు ఎదురుకాల్పులు సాగినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారని, అదనపు బలగాలను రంగంలోకి దించి, వారికోసం గాలింపును ముమ్మరం చేశామని తెలిపారు.
 

 

12:45 - September 24, 2018

ఛత్తీస్‌గఢ్ : రాష్ట్రంలో మావోయిస్టుల అరాచకాలు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో కూంబింగ్ పోలీసుల దినచర్యగా మారిపోయింది. అడవుల్లో తుపాకుల తూటాల శబ్ధంతో దద్దరిల్లుతో సామాన్యుల జీవనాలను ప్రశ్నార్థకంగా మార్చివేస్తున్న ఘటనలు ఛత్తీస్ గఢ్ లో సాధారణంగా మారిపోతోంది. ఈ క్రమంలో  ప్రజాప్రపతినిథులను టార్గెట్ చేస్తు మావోలు మందుపాతరలు, పైప్ బాంబ్స్ అమర్చారు. పక్కా సమాచారంతో కూబింగ్ చేపఃట్టిన పోలీసులు ఏడుగురు మావోలను అరెస్ట్ చేశారు. భారీగా డంప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

11:29 - August 10, 2018

ఛత్తీస్ ఘడ్ : దంతేవాడలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. లారీ అసోసియేషన్ కార్యాలయంలో నిలిపిన లారీలకు నిప్పుపెట్టారు. 5 లారీలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.

15:55 - August 6, 2018

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందా ? మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు పై చేయి సాధిస్తున్నారా ? అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజం అనిపిస్తోంది. ఇటీవలే కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ ఘటన మరిచిపోకముందే మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా గొల్లపల్లి - కుంట మధ్య పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు తారసపడడం..ఇరువురి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో పోలీసుల కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. మావోయిస్టుల మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

12:32 - August 6, 2018

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులపై కేంద్రం, రాష్ట్రాలు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మరో భారీ ఎన్ కౌంటర్ సోమవారం చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవలే మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గట్టి నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు విశ్వసనీయ సమచారం మేరకు సోమవారం ఉదయం ఓ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ దీనిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. 

12:46 - July 23, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పోలవరం నిర్మాణం వల్ల సమస్యలేంటో చెప్పాలని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. తమ సమస్యలు చెప్పాలని ఎన్నిసార్లు కోరినా... ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి ఏపీ తీసుకువచ్చింది. దీంతో ఈనెల 30లోగా ఏయే అంశాలపై విచారణ చేపట్టాలో చెప్పాలని తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గడ్‌ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది... లేకపోతే ఏయే అంశాలను విచారణకు చేపట్టాలో నిర్ణయిస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. 

 

18:22 - April 9, 2018

ఛత్తీస్ గడ్ : మళ్లీ అడవిలో అలజడి మొదలైంది. ఇటీవలే ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం పై చేయి సాధించేందు మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కూట్రూ సమీపంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:10 - March 6, 2018

హైదరాబాద్ : ఇటీవలే చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ కు ప్రతికారం తీర్చుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని..ప్రతికారం తీర్చుకుంటామని మావోయిస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సుకుమా జిల్లా కుత్తి వద్ద రెండు బస్సులు..ఒక ట్రాక్టర్ కు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఒక బస్సు బైలడిల్లా నుండి హైదరాబాద్ కు వస్తోందని తెలుస్తోంది.

ప్రయాణీకులను కిందకు దించి ఒకరిని కాల్చి చంపేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతను ఇన్ ఫార్మర్ అని మావోయిస్టులు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ, ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Chhattisgarh