Chi La Sow Movie Review and Rating

20:57 - August 3, 2018

హీరో అయిన రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మారుతున్నాడు, సుశాంత్ తో సినిమా తీస్తున్నాడు అని అనగానే .. అంతా ఇదో వేస్ట్ ప్రయత్నం అనుకున్నారు. కానీ సడెన్ గా సమంతా, నాగచైతన్య , నాగార్జున్ లైవ్ లోకి వచ్చి సినిమాకి కావల్సినంత బూస్ట్ ఇవ్వడంతో ఇధో విషయం ఉన్న సినిమా అని  క్లారిటీ వచ్చింది. ఇక అన్నపూర్జ  స్టూడియెస్, మనం ఎంటర్ టైన్ మెంట్స్ ప్రజెంటేషన్ అనగానే ఫుల్ అటెన్షన్ తెచ్చుకుంది చిలసౌ. అలా భారీ ప్రీ  రిలీజ్ హైప్ తో ధియేటర్ లోకి వచ్చిన  ఈ డిఫరెంట్ అటెంప్ట్ ఎలా ఉ:దో ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికొస్తే..    
కథ విషయానికొస్తే..అర్జున్   తనకంటూ కొన్ని గోల్స్ పెట్టుకుని  పెళ్లి అనగానే 5 ఇయర్స్ పోస్ట్ పోన్ అనే స్టాండ్ మీద ఉంటాడు.  అనుకోని విధంగా  అంజలితో పెళ్లి చూపులకు రెడీ అవుతాడు. ఆ సమయంలో జరిగిన అనూహ్య పరిణామాలు, వాటి పర్యావసానాల పరంగా అంజలి  తనకు పర్ పెక్ట్ లైఫ్ పార్టనర్ అని ఫిక్స్ అయ్యి ఆమెని పెళ్లాడతాడు. పెళ్లే వద్దనుకున్న అర్జున్ ని అంతగా ఇంప్రెస్ చేసిన అంజలి క్వాలిటీస్ ఏంటి..? వాళ్లిద్దరి మధ్య  ఎలాంటి ట్రావెల్ జరిగింది.. అనేది సినిమా కథ.
నటీనటుల విషయానికొస్తే
నటీనటుల విషయానికొస్తే.. ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా పరిణతి కనిపించని సుశాంత్.. ఈ సినిమాలో మాత్రం నటించలేదు.. అర్జున్ అనే  ఒక యువకుడి క్యారెక్టర్ ని అర్దం చేసకుని  అందులో ఒదిగిపోయి అతను సుశాంత్ కాదు.. అర్జున్ అనేంతలా ఇంప్రెస్ చేశాడు.  మొట్టమొదటి సారిగా సెటిల్ ఎక్స్ ప్రెషన్స్ పలికిస్తూ..ఎమోషనల్ సీన్స్ లో సైతం  ఆకట్టుకున్నాడు. స్క్రీన్ ప్రజెన్స్ లో కూడా చాలా వేరియేషన్ ఉంది. సినిమా చూశాక అర్జున్ క్యారెక్టర్ కి సుశాంత్  100 పర్సెంట్ న్యాయం చేశాడు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ రుహానీ శర్మ..ట్రైలర్స్ లో జస్ట్ యావరేట్ అనిపించే లుక్స్ లో సినిమాకి మైనస్ ఏమో అనే  ఫీలింగ్ కలిగించింది. కానీ సినిమాకి  మెయిన్ ఎసెట్ ఆమె నటనే. అంజలి క్యారెక్టర్ ఆమె క్యారీ చేసిన తీరుకి హాట్సాఫ్ చెప్పాలి. ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ కి అంత ఎక్స్ ప్రెసివ్ ఫేస్ ఉన్న హీరోయిన్ ఎవరూ రాలేదనే చెప్పాలి. చిన్న చిన్న ఎమెషన్స్ ని ఆమె  కన్వే చేసిన విధానం సింప్లీ సూపర్బ్.  అందం పరంగా యావరేజ్ మార్క్స్ స్కోర్ చేసినా.. నటన పరంగా మాత్రం డిస్టింక్షన్ లో పాస్ అయ్యింది. సినిమా పూర్తయ్యే సరికి అంజలి లాంటి అమ్మాయి లైఫ్ పార్టనర్ గా ఉంటే బావుండు అని చాలా మంది బ్యాచిలర్స్ అనుకుంటారు అంటే...అతిశయోక్తి కాదు. ఒక చిన్న డైలాగ్ ఇచ్చానా.. సింపుల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా..విపరీతంగా ఎలివేట్ చేసి నవ్వించే వెన్నెల కిషోర్ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఈ మధ్య కాలంలో సరైన  క్యారెక్టర్ దొరకక వెయిట్ చేస్తున్న వెన్నెల కిషోర్ ఈసినిమాలో మాత్రం ఛాన్స్ ఉన్న ప్రతిచోటా..  చెలరేగిపోయాడు. 2 సీన్స్ అయితే.. ధియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు. ఒక రాహుల్ రామకృష్ణ గెస్ట్ క్యారెక్టర్ లా జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడు, విధ్యుల్లేఖ, రోహిణి, సంజయ్  ఇలా నోన్ ఫేసెస్ అన్నీ.,. సినిమా రీచ్ కి బాగానే ఉపయోగపడ్డాయి.
టెక్నీషియన్స్ విషయానికొస్తే..  
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. యాక్టర్ లా ఉన్న రాహుల్.. డైరెక్టర్ లా మారి..ఏం చెయ్యగలుగుతాడా..? అని అనుకున్నారు అంతా. కానీ అతను డైరెక్టర్ గా ఏం చేశాడ్రా అనిపించుకున్నాడు. మొదటి సినిమాకి  అలాంటి  సెన్సిబుల్ స్క్రిప్ట్ ని రాసుకోవడమే ఒక సాహసం. దాన్ని అతను పక్కా స్క్రీన్ ప్లే తో  ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో  ఎలివేట్ చేసినవిధానానికి మెచ్చుకుని తీరాలి.  మొదటి సినిమాకే డైరెక్టర్ గా  స్క్రిప్ట్ పై అతనికున్న కమాండ్, క్లారిటీ చూశాక  అతని నుంచి ముందుముందు మరిన్ని మంచ సినిమాలు ఖచ్చితంగా ఆశించవచ్చు. డైలాగ్స్ కూడా.. కథను నడిపిస్తూ..ఆహ్లాదంగా సాగిపోయాయి. d.o.p సుకుమార్ డైరెక్టర్ మైండ్ లో ఉన్న విజువల్స్ ని మైండ్ బ్లోయింగ్ గా స్క్రీన్ పైకి ట్రాన్స్ లేట్ చేశాడు. అక్కడక్కడా.. టైట్ ఫ్రేమ్స్ మాత్రం కాస్త్ ఇబ్బంది పెట్టాడు.  కానీ అంత తక్కువ ఖర్చులో  అలాంటి రిచ్ నెస్ తీసుకొచ్చినందుకు అతనికి తప్పకుండా క్రెడిట్ ఇచ్చి తీరాలి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి కూడా డైరెక్టర్ విజన్ ని అర్ధం చేసుకుని అవసరం అయినంతమేరకు  క్వాలిటీ ఉన్న మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా సినిమా సోల్ రివీల్ అయ్యే సీన్స్ లో  విహారి అందించిన మ్యూజిక్ హార్ట్ ను టచ్ చేస్తుంది.  ప్రొడక్షన్ వాల్యూస్..సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ కష్టం  సినిమాలో కనిపిస్తుంది.     
ఓవరాల్ గా చెప్పాలంటే..     
ఓవరాల్ గా చెప్పాలంటే.. సెన్సిబుల్ స్టోరీ లైన్ తో సెన్సిటివ్ నెరేషన్ తో తెరకెక్కిన చిలసౌ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. తమ టేస్ట్ కి మ్యాచ్ అయ్యే  సినిమా లేక ఆవురావురు అంటూ ఎదురుచూస్తున్న A  సెంటర్ ఆడియన్స్ ని చాలా వరకూ శాటిస్ఫై చేస్తుంది చిలసౌ.

ప్లస్..
సెన్సిటివ్ కథ
ఫ్రెష్ స్క్రీన్ ప్లే
డైలాగ్స్, కామెడీ, డైరెక్షన్ 
హీరోయిన్ నటన

మైనస్..
స్లో నెరేషన్
ల్యాగింగ్ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్

రేటింగ్..
2.5

Don't Miss

Subscribe to RSS - Chi La Sow Movie Review and Rating