Children's day

20:25 - November 14, 2017

బాలల దినోత్సవం సందర్భంగా బాలల చలన చిత్రోత్సవాల్లో 'ఎగిసే తారాజువ్వల' చిత్రం ప్రదర్శనకు ఎంపిక చేశారు. నవంబర్ 14 బాలల దినోత్సవాల సందర్భగా చిత్ర యూనిట్ తో ముచ్చటించింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ పాఠాశాలలను, అక్కడి బోధనాభ్యసన పద్ధతులను, వాస్తవ విధానములను చక్కగా ప్రతిబింబించిన చిత్రమని చెప్పచ్చు. ఈ సినిమాలో సమస్య గురించి బాధ పడడం కన్నా చక్కని సులభపరిష్కారాలు చూపడం జరిగిందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. విద్యార్థులు పాఠ్యాంశాలు పుస్తకాలలో వున్నట్లు మక్కీకి మక్కీ కాకుండా ప్రయోగాత్మకంగా, అనుభవ పూర్వకంగా అవగాహన చేసుకొనే ప్రయత్నాలను చూపినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:55 - November 14, 2017

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి జవహార్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు మంత్రి. పిల్లలు ఆరోగ్యకరంగా పుట్టేందుకు గర్భిణీ స్త్రీలకు అన్న అమృత హస్తం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. 

18:11 - November 14, 2017

హైదరాబాద్ : బాలల దినోత్సవం సందర్భంగా రాజ్‌ భవన్‌లో చిల్ర్డన్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలే భావిభారత పౌరులని, దేశాన్ని తీర్చిదిద్దేది పిల్లలేనని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. వ్యవసాయం గురించి పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అగ్రి ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పూలు, పండ్ల విత్తనాలు అందజేశామన్నారు. 

16:28 - November 14, 2017

నల్గొండ : బాలల దినోత్సవం రోజున పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో సంప్ లో పడి విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాల్వలో పడి విద్యార్థి మృతి చెందాడు. అక్కాలాయిగూడెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజయేందర్ చదువుకొంటున్నాడు. స్కూల్ లో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు బాలురకు సౌకర్యం లేదు. దీనితో మంగళవారం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు విజయేందర్ తోటి విద్యార్థి సైదులుతో కాల్వకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విజయేందర్ అందులో పడిపోయాడు. సైదులు ఓ చెట్టును పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

14:41 - November 14, 2017

నేటి బాలలే రేపటి పౌరులు...పిల్లలు ఆనందంగా..ఆరోగ్యంగా జీవించడం వారి హక్కు...సమాజంలో చూస్తే పిల్లలు పుట్టిపుట్టగానే అంతమొందిచే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావాలి ?..నిజంగానే పిల్లలు సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతున్నారా ? నవంబర్ 14 'బాలల దినోత్సవం' సందర్భంగా మానవి 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో జ్యోతి రాజు (ఛైల్డ్ సైకాలజిస్టు), నళిని (పిల్లల వైద్య నిపుణులు) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:47 - November 14, 2017

హైదరాబాద్ : బాలల దినోత్సవం రోజు నగరంలో విషాదం నెలకొంది. మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. విష్ణుపూరి కాలనీలోని బాచ్ పన్ స్కూల్ నీటి సంపులో పడి నర్సరి విద్యార్థి శివరచిత్ మృతి చెందాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:34 - November 14, 2017

బాలలకు రక్షణ కల్పించాలని చైల్డ్‌రైట్స్‌ యాక్టివిస్ట్‌ మురళీ మోహన్‌ అన్నారు. ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా జనపధం ఈ చర్చను చేపట్టింది. చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, వారికి రక్షణ కల్పించి, సరైన అవకాశాలు కల్పించినప్పుడే భావి భారతం బాగుంటుంది. మరి ఈ దేశంలో వారికి సరైన రక్షణ ఉందా? వారికి ఉన్న చట్టాలేంటి? వాటి అమలు తీరు ఎలా ఉంది?' అనే అంశాలపై మురళీమోహన్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:26 - November 14, 2016

Don't Miss

Subscribe to RSS - Children's day