chiranjeevi

06:35 - March 16, 2017

హైదరాబాద్ : మన మధ్య లేని వారిని స్మరించుకుంటూ.. ఉన్న వారిని గౌరవిస్తుండడమే సంస్కారానికి గీటురాయి అని రాజ్యసభ సభ్యులు, సీనినటులు చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాల కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పురస్కార స్వీకర్త దాసరి నారాయణరావు ఆస్పత్రిలో ఉండడంతో ఆయన తరపున అల్లు అరవింద్‌, సారిపల్లి కొండలరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థను చిరంజీవి ప్రారంభించారు.

09:46 - February 28, 2017

'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి'గా చిరు..మెగాస్టార్ 'చిరంజీవి' తన 151వ సినిమాపై దృష్టి పెట్టారు. చాలాకాలం తరువాత 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ద్వారా 'చిరు' రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద విజయం సాధించింది. అనంతరం తదుపరి చిత్రం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 151 సినిమాను సురేందర్ రెడ్డితో తీయనున్నట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 'చిరు' చిత్రంపై హీరో 'శ్రీకాంత్' పలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ టీవీ ఛానల్ వారు నిర్వహించిన కార్యక్రమంలో 'శ్రీకాంత్' పలు విషయాలు తెలియచేశారు. 'చిరంజీవి' 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' ఉంటుందని స్పష్టం చేశారు. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ పక్కా స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నారు. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటీషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి'. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బ్రిటిషు ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు. మరి ఈ వీరుడి పాత్రలో 'చిరు' ఎలా నటిస్తాడో చూడాలి. దీనిపై మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

19:56 - February 24, 2017

భాను చందర్..అలనాటి హీరో..ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా అనేక సినిమాల్లో నటించిన భానుచందర్ ఆ తర్వాత తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. హీరో..హీరోయిన్ల తండ్రి పాత్రల్లోనూ, ప్రత్యేక హోదా కలిగిన పాత్రల్లోనూ అయన నటిస్తున్నారు. 'మిక్చర్ పొట్లాం' అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. ఈసందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. త్వరలోనే తన డైరెక్షన్ లో ఓ చిత్రం రూపొందుతోందని వెల్లడించారు. మరి ఆయన ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.

20:30 - February 23, 2017

విశాఖ : మెగా హీరోల మల్టీస్టారర్ మూవీపై సుబ్బిరామిరెడ్డి మరోసారి స్పందించారు. మల్టీస్టారర్‌ మూవీ కోసం చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఒప్పుకున్నారని.. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారన్నారు. కథ సిద్ధం కాగానే.. షూటింగ్‌ ప్రారంభిస్తామని సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. 

13:32 - February 20, 2017

టాలీవుడ్ అప్డేట్స్, ఫిల్మ్య్ వరల్డ్ గాసిప్స్, స్పెషల్ స్టోరీస్ ..టోటల్ గ తెలుగు సినిమా న్యూస్ అండ్ ఈవెంట్స్ తో మీ ముందుకి వచ్చింది టుడే టెన్ మాక్స్ ...ఆ వివరానలు ఇప్పుడు చూద్దాం... పెద్ద సినిమాలంటే పెద్ద బడ్జెట్ సినిమాలు. ఈ పెద్ద బడ్జెట్ సినిమాలకి పెద్ద స్టార్స్ కలిస్తే ఇక బడ్జెట్ కి అడ్డు అదుపు ఉండదు. కథను నమ్మి బడ్జెట్ పెట్టె ప్రొడ్యూసర్స్ , తాను నమ్మిన కధని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించగలిగే డైరెక్టర్ వీరి కాంబినేషన్ లో వస్తున్న ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమా విశేషాలు ఏంటో చూద్దాం 
ప్రిన్స్ మెస్మరైజ్ 
మహేష్ బాబు న్యూ మూవీలో మెనీ స్పెషల్స్ ఉండబోతున్నాయి. ప్రిన్స్ ఇలాంటి స్పెషల్స్ తో మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కి రెడీ అవుతోంది.ఈ సినిమా ట్రైలర్ చాల స్పెషల్ గా ఉండబోతుందట ..మరి ఆ స్పెషల్ ఏంటో మనమూ చూద్దాం . 
ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. డైరెక్టర్స్ విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే ఎన్ టి ఆర్ ఈ సినిమా కి బాబీ ని డెరెక్టర్ గా సెలెక్ట్ చేసుకోడం ఆసక్తిని కలిగిస్తుంది .సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకి డైరెక్టర్ గా చేసిన బాబీ తన నెక్స్ట్ స్టెప్ చాలా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకున్నాడు .ఆ కథేన్తో ఇప్పుడు చూద్దాం.
విజయ్ ఆంటోని తెలుగులోమంచి మార్కెట్ ఫామ్ 
తమిళ నటుడు విజయ్ ఆంటోని తెలుగులో కూడా మంచి మార్కెట్ ఫామ్ చేసుకున్నాడు. తాను నటించిన బిచ్చ గాడు సినిమా మంచి రెస్పాన్స్ తో హిట్ టాక్ తెచ్చుకుంది. తరువాత వచ్చిన సినిమా కమర్షియల్ గా అడ్డాగా పోయిన విజయ్ ఆంటోని డిఫరెంట్ స్టోరీస్ ని టచ్ చేస్తాడు అనే ఫీల్ ఇచ్చింది. ఇప్పుడు అదే ఫ్లో లో వస్తుంది యమన్ అనే సినిమా. ఫస్ట్ లుక్, పోస్టర్, ట్రైలర్ తో ఈ యమన్ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. 
బాలీవుడ్ లో హర్రర్ కామెడీ తో సినిమా 
బాలీవుడ్ లో హర్రర్ కామెడీ తో ఒక సినిమా రాబోతుంది. ఫిలోరి అనే టైటిల్ తో అనుష్క శర్మ మెయిన్ లీడ్ గ రాబోతున్న ఈ సినిమా లో ఒక లవ్ స్టోరీని కూడా ఇన్సెర్ట్ చేసాడు డైరెక్టర్ అన్షై లాల్ .ప్రేమ విఫలమై చనిపోయిన తరువాత ఆత్మగా మారిన ఒక వెరైటీ కధని చూపించే ప్రయత్నమే ఈ ఫిలోరి సినిమా .ఈ మధ్య రిలీజ్ ఐన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

 

09:21 - February 17, 2017

మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తరువాత వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చారు. 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'తో కనిపించి కనువిందు చేశారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయవంతం అయ్యింది. అదే జోష్ తో మరో సినిమాకు కూడా లైన్ క్లియర్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు కూడా 'చిరు' తనయుడు 'రామ్ చరణ్ తేజ' నిర్మాతగా వ్యవహరించనున్నారు. దర్శకుడిగా సురేందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఏప్రిల్ లో సినిమా లాంచింగ్ చేయనన్నారని, ఒక వేడుకగా దీనిని నిర్వహించాలని భావిస్తున్నారంట. మే నుండి షూటింగ్ ప్రారంభిస్తారని టాక్. ఒక చారిత్రక కథాంశంగా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. 'ఉయ్యాల వాడ నరసింహారెడ్డి' పేరిట చిత్రం తెరకెక్కిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం నిర్మాణం కోసమే రూ 80 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం తాను ఎంతోకాలం ఎదురు చూస్తున్నానని చిరు చెప్పడం ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

20:00 - February 4, 2017

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు టీజర్ రిలీజైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో పవన్ సరసన శృతి హసన్ నటిస్తోంది. గోపాలా గోపాలా మూవీ డైరెక్టర్ కిశోర్ కుమార్ పార్థసాని... ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 

21:59 - February 3, 2017
20:01 - February 3, 2017

హైదరాబాద్ : కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దర్శకరత్న దాసరిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాసరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్వాసకోశ సంబంధ సమస్యతో... గత 4 రోజులుగా దాసరి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

13:08 - February 3, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు త్వరలోనే అందరి ముందుకు వస్తారని సినీ నటుడు, ఎంపీ చిరంజీవి పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని చిరంజీవి పరామర్శించారు. చిరుతో పాటు అల్లు అరవింద్, వి.వి.వినాయక్ లు కూడా ఉన్నారు. పరామర్శించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. హుషారైన దాసరిని చూస్తున్నామని, చాలా సంతోషంగా ఉందన్నారు. దాసరి ఆసుపత్రిలో చేరిన అనంతరం జరిగిన పరిణామాలపై భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. దాసరి మానసిక స్థైర్యం ఒక ఎత్తు అని, మందులు మరొక ఎత్తు అని వైద్యులు పేర్కొన్నారని తెలిపారు. వైద్యులు చేస్తున్న వైద్యం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. తాను నటించిన సినిమా 'ఖైదీ నెంబర్ 150’ కలెక్షన్ల వివరాలు చెప్పడం జరిగిందని, త్వరలో ఓ సభను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు దాసరికి తెలపడం జరిగిందన్నారు. ఇందుకు ఖచ్చితంగా రావాలని కోరడం జరిగిందని, ఇందుకు ఖచ్చితంగా వస్తానని లెటర్ పై రాయడం జరిగిందన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - chiranjeevi