chiranjeevi movies

16:11 - July 11, 2017

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరు ? విలన్ ఎవరు ? ఇలా ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే వీటిపై తెగ గాసిప్స్ వచ్చేస్తున్నాయి. దాదాపు దశబ్దకాలం పాటు సినిమాకు దూరంగా ఉన్న 'చిరంజీవి' 'ఖైదీ నెంబర్ 150' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 151వ సినిమాపై దృష్టి నెలకొంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమర యోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో 'చిరంజీవి' పవర్ పుల్ పాత్రలో నటించనున్నారని టాక్. కొణిదెల ప్రొడక్షన్ పై 'రామ్ చరణ్' చిత్రాన్ని నిర్మించనున్నారు. 'చిరు' 151వ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు రామ్ చరణ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే 'చిరంజీవి' సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ నటింప చేయాలని తొలుత అనుకున్నారు. అందులో ప్రముఖ హీరోయిన్ ల పేర్లు వినిపించాయి. టాలీవుడ్ లో అనుష్క..కాజల్..ఇతర హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా 'నయనతార' ఎంపిక చేసినట్లు తాజాగా వినిపిస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

12:05 - March 19, 2017

జూనియర్ ఎన్టీఆర్...వరుస విజయాలతో ముందుకు వెళుతున్నాడు. ఆయన నటించిన 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్‌' మూడు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దీనితో నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న చిత్రంలో 'ఎన్టీఆర్' నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనేక విషయాలు దాగున్నాయి. ఏకంగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ‘రాశీఖన్నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఎన్టీఆర్ సరసన ఆడి..పాడనున్నారు. శక్తివంతమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌.. ఓ పాత్రలో అంధుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేగాకుండా ఓ పాత్ర చాలా ఆసక్తికరంగా మలుస్తున్నట్లు టాక్. సినిమా టైటిల్ విషయంలో క్లారిటీ రావడం లేదు. గతంలో అనుకున్నట్లుగానే 'జై లవకుశ' పేరు చిత్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

11:35 - March 19, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' 151వ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం 'చిరు' 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో 'చిరు' నెక్ట్స్ సినిమాపై దృష్టి సారించారు. తదుపరి చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' ఉంటుందని తెలిసిందే. సురేందర్‌రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఓ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ప్రీలుక్‌గా ఓ సరికొత్త శక్తివంతమైన పోస్టర్‌ను విడుదల చేశారని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అంటున్నాయి. 'యుఎన్‌-ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' అనే ఇంగ్లీష్‌ టైటిల్‌తో, ఆంగ్లేయులతో కొంతమంది పోరాడుతున్న దృశ్యం..చిరంజీవి కంటిచూపు..రక్తం కారుతున్న గొడ్డలితో ఉన్న పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకొంది. ఏప్రిల్‌లో సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ చిరు నెక్ట్స్ సినిమాలోనేదేనా ? కాదా ? అనేది కొద్ది రోజుల్తో తెలియనుంది.

20:30 - February 23, 2017

విశాఖ : మెగా హీరోల మల్టీస్టారర్ మూవీపై సుబ్బిరామిరెడ్డి మరోసారి స్పందించారు. మల్టీస్టారర్‌ మూవీ కోసం చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఒప్పుకున్నారని.. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారన్నారు. కథ సిద్ధం కాగానే.. షూటింగ్‌ ప్రారంభిస్తామని సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. 

20:51 - February 1, 2017

'రామ్ చరణ్' న్యూ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సుకుమార్ డైరెక్షన్ లో మెగా వారసుడు నటించబోతున్న కొత్త చిత్రం గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకుంది. 'చిరంజీవి' క్లాప్ కొట్టిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు దర్శకులు హాజరైయ్యారు. అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ న్యూ ఫీల్మ్ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు మారిపోయాయి. 'రామ్ చరణ్' కూడా రెగ్యులర్ ఫార్మూలా మూవీస్ కి చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. అందుకు 'ధృవ' సినిమాతోనే 'చెర్రీ' కొత్త రూట్ కి వెల్ కమ్ చెప్పాడు. 'ధృవ' సక్సెస్ కొత్త ఎనర్జీ నింపుకున్న 'చరణ్' ఇక మాస్ మాసాలా సినిమాలు కాకుండా సరికొత్త జోనర్ మూవీస్ చేయడానికి సిద్దమైయ్యాడు. అందుకు ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న కొత్త చిత్రం నాంది పలకనుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఏ టైపులో ఉంటుందో కూడా అంచనా వేయలేకుండా ఉందని చెప్పాలి.


సుక్కు మెస్మరైజ్ చేస్తారా ?
చెర్రీ, సుక్కుల కొత్త చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చెర్రీ రెండు బిందలు మోస్తున్న కావడి చూస్తుంటే ఈ మూవీ ఎంత డిఫరెంట్ గా ఉండబోతోందో అర్ధం అవుతోంది. ఏడేళ్ల పదేళ్ల కెరీర్ లో 'చెర్రీ' 'మగధీర’, 'ఆరెంజ్' తరువాత పక్కా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం మెగా వారసుడు లుక్ పరంగా మేకోవర్ చేయడం విశేషం. గుబురు గడ్డెంతో రామ్ చరణ్ లుక్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ ని పక్కా పల్లెటూరి కుర్రాడి గెటప్ లో చూపించబోతున్నాడు. ఇంతకు ముందు చెర్రీ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం పల్లెటూరు నేఫథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రానికి ఈ చిత్రానికి ఎక్కడపోలికలు లేవనేది ఫస్ట్ లుక్ ని బట్టే తెలుస్తోంది. ఆన్ ఆఫిషియల్ టాక్ ప్రకారం ఈ చిత్రం పిరియడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు వినికిడి. మెత్రిమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'సుమంత'ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు డిఎస్పీ సర్వాలు సమాకురుస్తున్నాడు. చూస్తుంటే సుక్కు, చెర్రీ సెల్యూలాడ్ వండర్ కి ప్లాన్ చేసినట్లే కనిపిస్తోంది. మరి సుకుమార్ ఈసారైనా ఆడియన్స్ బ్రైన్ కి పరీక్ష పెట్టకుండా కాన్సెప్ట్ తో మెస్మరైజ్ చేస్తాడేమో చూద్దాం.

13:55 - January 24, 2017

డైరెక్టర్ వివి వినాయక్ తో 10టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమా గురించి వివరించారు. చిరంజీవి 150 వ సినిమాను ఏ డైరెక్టర్ తీసిన ఠాగూర్ లాంటి సినిమా తీయాలని అనుకున్నానని తెలిపారు. ఈ సినిమాకు హీరోయిన్ ను అనుకున్నప్పుడు చిరంజీవికి కాజల్ పర్ ఫెక్ట్ అని భావించానని తెలిపారు. అయితే మొదటి ఆప్షన్ కాజల్, వీలుగాని పక్షంలో రెండో ఆప్షన్ అనుష్క అనుకున్నామని చెప్పారు. సినిమాలో ఐటెం సాంగ్ ఉండాలనే ప్లాన్ తనదే అని చెప్పారు. సినిమాలో తనకు అత్యంతగా నచ్చిన పాట 'మిమి..మిమి'.. అనే సాంగ్ అని తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వీడియోలో చూద్దాం...

22:46 - January 22, 2017
17:27 - January 14, 2017

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ సినీరంగంలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. పదేళ్ల విరామం తర్వాత ఖైదీ నంబర్‌ 150గా బాస్‌ ఈస్‌ బ్యాక్‌... అంటూ వెండితెరపై విన్యాసాలు చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. చిరంజీవి రీఎంట్రీని అభిమానులు స్వాగతిస్తుంటే, రాజకీయాలు స్తబ్ధంగా ఉన్నాయని మళ్లీ సినిమాల్లోకి వచ్చినట్టు చిరంజీవి వ్యాఖ్యానించడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. చిరంజీవి...! తెలుగువారికి పరిచయం అక్కరలేని పేరు. తన డాన్సులు, స్టెప్పులతో క్రేజీ హోరోగా పేరు తెచ్చుకున్నచిరంజీవి అభిమానుల హృదయాల్లో చెరగనిముద్ర వేసుకున్నారు. పున్నమినాగులా బుసలు కొట్టినా, ఖైదీగా తిరగబడినా.... ప్రతి పాత్రలో వైవిధ్యభరితంగా ఒదిగిపోయారు. ఇలా 149 చిత్రాల్లో నటించి ప్రేక్షుల అభిమానాన్నిచూరగొన్నారు.
2008లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి.. సుమారు దశాబ్దకాలపు విరామం తర్వాత.. 150 చిత్రంలో నటించారు. అది కూడా రైతాంగా సమస్యలను ప్రస్తావించే కథాంశాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతానికి చిరంజీవి 150 సినిమా ఖైదీనంబర్‌-150 హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. చిరు అభిమానుల్లో ఎనలేని జోష్‌ను నింపింది. అయితే.. ఇదే సమయంలో రాజకీయ నాయకుడిగా, ప్రజా సమస్యలపై ఆయన చిత్తశుద్ధిని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సినీ జీవితం ఒడిదొడులకులు లేకుండా సాగిపోతున్న తరుణంలోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోగా, కనీసం ప్రతిపక్ష స్థాయికి కూడా రాలేక పోయారు. రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్రంలో మంత్రి అయ్యారు. కాంగ్రెస్‌ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నా... ఆ లక్ష్యం కూడా నెరవేరలేదు.

రాష్ట్ర సమస్యలుపై ప్రశ్నించలేదు..
చిరంజీవి రాజకీయాల్లో రాణించకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయన్నది విశ్లేషకులు అంచనా. ప్రజారాజ్యం అధినేతగా కానీ, కాంగ్రెస్‌ నాయకుడిగా కానీ, చిరంజీవి ప్రజా సమస్యలపై స్పందించిందే లేదు. అడపాదడపా తప్పని తంతులా ధర్నాల్లో పాల్గొనడం తప్ప తీవ్రంగా మాట్లాడిన దాఖలాలే లేవు. రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడడం తప్పిస్తే.. ఆయన నోరు మెదిపిన సందర్భాలే లేవు. ఎంపీగా ఆయన ఒక్కటంటే ఒక్క ప్రశ్న సంధించింది లేదు. 2014 యూపీఏ ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నా... రాష్ట్ర సమస్యలను ఎన్నడూ ప్రశ్నించలేదు. అలాంటి వ్యక్తి రైతాంగ సమస్య ప్రధాన ఇతివృత్తంగా ఖైదీ నెంబర్‌ 150లో నటించారు. నిజజీవితంలో, ఎంపీగా, మంత్రిగా ఉంటూ కూడా ప్రజాసమస్యలను ప్రస్తావించని చిరంజీవి.. సినిమాల ద్వారా ప్రజా సమస్యలను ఎత్తుకోవడం ఏంటన్న విమర్శ వినిపిస్తోంది. చిరంజీవి పలాయన వాదానికిది నిదర్శనమన్నది విమర్శకుల ఆరోపణ. పరిస్థితులు సానుకూలంగా ఉంటే రాజకీయాల్లో కొనసాగడం, ప్రతికూలంగా ఉంటే మళ్లీ సినిమాల్లోకి రావడం అన్నది చిరంజీవి రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏటా రెండు సినిమాలు..
చిరంజీవి అభిమానుల వాదన మాత్రం మరోలా ఉంది. చిత్రసీమపై ఉన్న మక్కువతోనే ఆయన తిరిగొచ్చారని అంటున్నారు. రాజకీయాల్లో పదేళ్ల అవమానాలకు ఈ సినిమాయే సమాధానమని కుటుంబ సభ్యులూ బాహాటంగానే చెబుతున్నారు. సున్నితలమైన చిరంజీవి మనస్తత్వానికి సినీరంగమే సరైన మార్గమని అభిమానులు భావిస్తున్నారు. రాజకీయాల్లో రాణించలేకపోయిన మెగాస్టార్‌ రంగుల ప్రపంచంలోనే కొనసాగాలని కోరుతున్నారు. ఇకపై ఏటా రెండు సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న చిరంజీవి, ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇతివృత్తంతో తాజాగా సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో.. చారిత్రక ఇతివృత్తంతో రూపొందించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాతో 'బాలయ్య' దూసుకు వెళ్లడం కూడా.. చిరంజీవి 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథాంశాన్ని ఎంచుకోవడానికి కారణంగా చెబుతున్నారు. గతంలో కూడా బాలయ్య వరుసగా సీమ ఫ్యాక్షన్‌ సినిమాలు చేస్తున్నప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమా ద్వారా హిట్‌ కొట్టారు. అదే ఒరవడిలో ఇప్పుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చిరంజీవి వరుస సినిమాల ప్రణాళికలను పరిశీలిస్తే.. తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఆయనకు లేదన్న భావన వ్యక్తమవుతోంది.

12:19 - January 11, 2017

హైదరాబాద్ : సంధ్య థియేటర్ బాస్ ఈజ్ బ్యాక్‌ నినాదాలతో మార్మోగుతుంది. అభిమానుల కోలాహలంతో థియేటర్‌ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. టపాసులు పేల్చుతూ, డప్పులు వాయిస్తూ తమ అభిమాన హీరో మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో సంధ్య ధియేటర్లో మూవీ విడుదల కాబోతుంది. డ్యాన్సంటే చిరంజీవే అని అన్నారు. చిరంజీవి.. ఇండియన్ మైకెల్ జాక్సన్ అని అభివర్ణించారు. టపాసులు కాల్చుతూ.. డప్పులు కొడుతూ బాస్ కు వెల్ కం చెబుతున్నారు. ఫ్యాన్స్ చిరంజీవిని వెల్ కం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

10:58 - January 11, 2017

తిరుపతి : ప్రపంచవ్యాప్తంగా ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైంది. థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తిరుపతిలోని అన్ని థియేటర్లలో తెల్లవారుజామున షో వేశారు. సినిమా చూసిన ఫ్యాన్స్ మూవీ బ్లాక్ బ్లస్టర్ అంటున్నారు. డ్యాన్సులు, ఫైటింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయో.. ఇప్పుడ ఇలాగే ఉన్నాయని అంటున్నారు. డ్యాన్సులు ఇరగదీశాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. మెగాస్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడని అంటున్నారు. అదే డ్యాన్స్, అదే క్రేజ్ ఉందంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Pages

Don't Miss

Subscribe to RSS - chiranjeevi movies