cm

09:44 - December 17, 2018

రాజస్థాన్ : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు కాంగ్రెస్ దక్కించుకుంది. దీంతో డిసెంబర్ 17న ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లట్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని  ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఆహ్వానం పంపించింది. దీంతో గెహ్లాట్ ప్రమాణానకి  చంద్రబాబు జైపూర్ లో జరగనున్న గెహ్లాట్ ప్రమాణస్వీకారా కార్యక్రమానాకి చంద్రబాబు హాజరుకానున్నారు.అలాగే అలాగే, మధ్యప్రదేశ్ వెళ్లి భోపాల్‌లో కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా పాల్గొననున్నారు. చంద్రబాబు పాటు మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు కూడా వెళ్లనున్నారు. 
కాగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనే ఎజెండాతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పొత్తుకున్న క్రమంలో తెలంగాణ ఎన్నికల్లోను కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఓటమిపాలయ్యారు. కానీ  థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కొనసాగించే క్రమంలో కాంగ్రెస్ సీఎంలు చేయనున్న ప్రమాణస్వీకార కార్యక్రమాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. 
 

14:31 - December 15, 2018

ఐజ్వాల్ : ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మిజోరం ఒకటి. ఈ రాష్ట్రంలో మీజో నేష‌న‌ల్ ఫ్రంట్  అధికారంలోకి వచ్చింది. దీంతో మీజోనేషనల్ ఫ్రంట్  నేత జోరంతంగా సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కే రాజ‌శేఖ‌ర‌న్ ఆయ‌న జోరంతంగాతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా..తాజాగా జరిగిన              అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎంఎన్ఎఫ్ పార్టీ మొత్తం 26 స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ నుదాటి అధికారిన్ని దక్కించుకుంది. అనంతరం రెండు రోజుల క్రితం జోరంతంగా.. శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నిక‌య్యారు. కాగా ఎంఎన్ఎఫ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఇది మూడ‌వ సారి కాగా దాదాపు 10 ఏళ్ల విరామం త‌ర్వాత ఆ పార్టీ మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

12:43 - December 15, 2018

అమరావతి : ఏపీని తుఫానులు వెన్నాడుతున్నాయి. మొన్న హుద్ హుద్, నిన్న తిత్లీ తుఫానులు మిగిల్చి విషాదం నుండి తేరుకుని, తట్టుకుని నిలబడిన ప్రజలకు మరో తుఫాను హెచ్చరికలతో అల్లాడిపోతున్నారు.దీంతో ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేందుకు సిద్దంగా వుండాలని సూచించారు.  
‘హుద్‌ హుద్‌, తిత్లీ తుఫాన్‌ అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని ఫెథాయ్‌ తుపాన్‌ కారణంగా ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనీ.. అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఫెథాయ్‌ కారణంగా కోస్తా తీరానికి తీవ్ర ముప్పు పొంచిఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో శనివారం ఆయన ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ముందస్తు సన్నద్ధతపై ఆర్టీజీఎస్‌ నుంచి వివరాలు తెలుసుకున్నారు. తీవ్ర వాయుగుండం ఈ మధ్యాహ్నానికి తుపాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు వివరించడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనిల్‌చంద్రపునేఠాకు సూచించారు. ప్రాణనష్టం లేకుండా అన్నిచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1100 కాల్‌ సెంటర్‌ నుంచి తుపాన్‌ జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వారి పడవలను తీరంలోనే నిలిపివేయాలని ఆదేశించారు. తుపాన్‌ కారణంగా రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచాలని అధికారులను ఆదేశించారు.
 

11:10 - December 15, 2018

అమరావతి :  ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2016లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్‌ వచ్చింది. సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో  డిసెంబర్‌ 16 న రాత పరీక్ష నిర్వహించనున్న క్రమంలో ఫస్ట్ పేపర్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుండగా..రెండో పేపర్ మ.2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వుంటుంది. అయితే పరీక్షకు అభ్యర్థులు ఒక్క నిమిషం నిబంధనను మాత్రం అమలుకానుంది. దీంతో నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. 
సివిల్‌ ఎస్సై, ఏఆర్, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం మొత్తం 1,35,414 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక రాత పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 240 కేంద్రాలు ఏర్పాటు చేసింది. పరీక్షకు గంట ముందు నుంచే ఎగ్జామ్ సెంటర్ లోపలికి అభ్యర్థులను అనుమతిస్తారు. 

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2016లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్‌ తో 468 పోస్టులకుగానూ 1,23,937 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.ఒక్కో పోస్టుకు 264 మంది ఉండగా..వున్న పోస్టులు మాత్రం చాలా తక్కువగా వున్నాయి. 334 పోస్టులకు నోటిఫికేషన్‌ రాగా..గతంతో పోల్చితే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు దాదాపు 404 మంది పోటీ పడగా..గతం కంటే ఈసారి కటాఫ్ మార్కులు సైతం పెంచే అవకాశం ఉంది.
 

16:11 - December 14, 2018

ఒడిశా : వారి ఉద్యమాన్ని వదిలిపెట్టి జనజీవన స్రవంతి కలిసిపోయిన నక్సల్స్, మావోయిస్టులు మామూలు జీవితాన్ని స్వతంత్ర్యంగా, స్వేచ్ఛగా జీవించగలుగుతారా? వారిని ఇటు సమాజం.. అటు ప్రభుత్వాలు స్వేచ్ఛగా జీవించే అనుకూతను కలిగిస్తాయా? అంటే కాస్త ఆలోచించాల్సిన విషయం కదా.. కానీ ప్రభుత్వం ముందు లొంగిపోయిన నక్సలైట్లకు, మావోయిస్టులకు అటువంటి భావాలు కలిగించేందుకు..వారిలో వున్న ఆత్మనూన్యతను తొలగించేందుకు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. బహుశా ఇది దేశ చరిత్రలోనే అరుదైన ఘటనగా భావించవచ్చు. 
సాధారణంగా లొంగిపోయిన నక్సల్స్, మావోయిస్టులకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయడంతో పాటు పునరావాసం కల్పిస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాకగ ఈ కొత్త జీవితానికి అలవాటు పడేందుకు ఇబ్బంది పడుతుంటారు. మాజీ మావోయిస్టుల్లో గూడు కట్టుకున్న అటువంటి ఆత్మన్యూనతా భావాన్ని తొలగించడానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం వేదికగా చేసుకున్నారు. ఈ స్టేడియంలో జరిగే భారత్-నెదర్లాండ్స్ జట్ల మధ్య హాకీ మ్యాచ్ ను 30 మంది మాజీ నక్సల్స్ ను పక్కన కూర్చోపెట్టుకుని మ్యాచ్ ను తిలకించేలా ఏర్పాట్లను చేశారు సీఎం నవీన్ పట్నాయక్. ఈ 30మంది నక్సల్స్ లో 16 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు.
ఇటీవల ప్రభుత్వం ముందు లొంగిపోయిన నక్సల్స్‌ తమకు హాకీ మ్యాచ్‌ చూడాలని ఉందని మల్కాన్‌గిరి ఎస్పీకి చెప్పారు. ఈ విషయాన్ని సీఎం పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లారు పోలీస్ అధికారులు. దీనిపై స్పందింని సీఎం తనతో కలిసి హాకీ మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేయమని ఆదేశించటంతో రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం వేదికగా సీఎం పక్కన దర్జాగా కూర్చుని మాజీ నక్సల్స్ అంతా హాకీ మ్యాచ్ ను ఆనందంగా తిలకించారు. 
కాగా తాము హాకీ మ్యాచ్ చూస్తామని తెలుసు కానీ సీఎంతో కలిసి..ఆయన పక్కనే కూర్చుని చూస్తామనే విషయం తెలసిన వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సందర్భంగా ఓ నక్సల్ ఆనందాన్ని వ్యక్తంచేస్తు మాట్లాడిన మాటలివి..‘ఈ రోజు మేము నిజంగా జనజీవన స్రవంతిలో కలిశామని భావిస్తున్నాం. లొంగిపోయిన నక్సల్స్‌కు ఒడిశా  ప్రభుత్వం చాలా తోడ్పాటు అందిస్తోంది’ అని తెలిపారు.

15:36 - December 14, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సిరిసిల్ల ఎమ్మెల్యే తారకరామారావు నియామకం కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకూ పార్టీ నడిపించిన విధానం..ఉద్యమ సమయంలోను..రాష్ట్ర విభజన అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్దిలో కీలకగా వ్యవహరించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ బాధ్యతలను అంతే సమర్థవంతంగా కొనసాగిస్తాడనే నమ్మకంతో  కుమారుడు కేటీఆర్ కు అప్పగించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తు.చ తప్పకుండా అమలుచేయడంతోపాటు..పెండింగ్ లో వున్న ప్రారంభించిన ఆయా ప్రాజెక్టులను కొనసాగించాల్సిన బాధ్యత నెరవేరుస్తాడనే నమ్మకంతో సమర్థుడైన కేటీఆర్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మరోవైపు కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంతోనే పార్టీ శ్రేణులు ప్రగతి భవన్‌కు క్యూకట్టాయి.
పలువురు ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ కు మేనమామ..సిద్దిపేట ఎమ్మెల్యే అయిన హరీశ్ రావు కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులు ఇద్దరం కలిసి పనిచేస్తామని హరీశ్ రావ్ అన్నారు. ఎన్నికల సమయంలో కేటీఆర్‌ పడ్డ కష్టాన్ని కేసీఆర్‌ గుర్తించారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్‌ నిర్ణయంపై ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించినందుకు సీఎం కేసీఆర్ కు సంతోష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తామని, పార్టీ బలోపేతం అవుతుందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఇలా పలువురి ప్రముఖుల నుండి కేటీఆర్ కు అభినందనలు వెల్లువెత్తాయి.

13:49 - December 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గులాబీ పార్టీ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్లీ పగ్గాలు చేపట్టారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్.. కేసీఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు హాజరయ్యారు.
టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్‌..  
డిసెంబర్ 12వ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కేసీఆర్ పేరును ప్రతిపాదించగా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేలంతా ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ లేఖను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ కు అందించగా ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నట్లు లేఖను గవర్నర్ కు అందించారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన కేసీఆర్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది రోజుల్లో కేబినెట్ ను విస్తరించనున్నారు. 
88 స్థానాలు టీఆర్ఎస్ కైవసం..
సెప్టెంబర్ 6న కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి, ముందుస్తు ఎన్నికలకు వెళ్లారు. డిసెంబర్ 7న మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 88 స్థానాలను టీఆర్ఎస్ కైవసం కేసుకుని విజయదుందుభి మోగించింది. కేసీఆర్ మరోసారి సత్తా చాటారు. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 60 కాగా అదనంగా 28 స్థానాలను సాధించింది. దీంతో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ మార్గంసుగమం అయింది. టీఆర్ఎస్ బంఫర్ మెజారిటీ సాధించి, రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 

 

12:04 - December 13, 2018

విశాఖపట్నం : ఏపీకి రాజధాని అమరావతి అయితే ఆర్థిక రాజధానిగా విశాఖ నగరాన్ని  భావిస్తుంది ఏపీ ప్రభుత్వం. ప్రకృతి అందాలే కాక పారిశ్రామికాభిదద్ధిపరంగాను విశాఖ అభివృద్ధి చెందింది. అటువంటి విశాఖ నగరంలో తొలి వైద్య ఉపకరణాల ఉత్పాదక కేంద్రం మెడ్‌ టెక్‌ పార్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిసెంబర్ 13న  ప్రారంభించనున్నారు. 
నగరంలోని పారిశ్రామిక ప్రాంతం గాజువాక దరి పెదగంట్యాడ మండలం పెదమదీనా పరిధిలోని దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడ్ టెక్ పార్క్‌ ఏర్పాటు సందర్భంగా మూడు రోజుల పాటు పలు అంశాలపై సదస్సులు జరగనున్నాయి. డిసెంబర్ 13 ఉదయం 10.45 గంటలకు సీఎం పెదమదీనా చేరుకుని  పార్క్‌ను ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం 1.45 గంటల వరకు పార్క్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన అబ్దుల్‌కలాం కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ప్రత్యేక సదస్సులో పాల్గొంటారు. 
సీఎం విశాఖ షెడ్యూల్..
2.40 గంటలకు కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు భీమిలి చేరుకుని అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చిట్టివలస జూట్‌ మిల్లు మైదానంలో ఐ హబ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జీవీఎంసీకి చెందిన పలు అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనతరం సాయంత్రం ఐదున్నర గంటలకు విమానంలో విజయవాడకు బయలుదేరతారు సీఎం చంద్రబాబు నాయుడు. 
 

09:38 - December 13, 2018

అమరావతి : తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్యభౌముడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు భారీ విగ్రహ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నటనలోను..రాజకీయాలలోను ఆయనకు సాటి వచ్చేవారు లేరు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అచ్చ తెలుగు పార్టీని స్థాపించి ఇటు సినీమా రంగంలోను..అటు రాజకీయరంగంలోను మేరు నగర ధీరుడుగా ఖ్యాతిగాంచిన తెలుగు ముద్దు బిడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు  భారీ విగ్రహ స్మారకాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీంతో అమరావతిలోని నీరుకొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఎల్‌అండ్‌టీకి చెందిన డిజైన్స్‌ అసోసియేట్స్‌ రూపొందించిన డిజైన్లను చంద్రబాబు డిసెంబర్ 12న పరిశీలించారు. 
32 మీటర్ల ఎత్తు విగ్రహం..రూ.406 కోట్ల ఖర్చు..
32 మీటర్ల ఎత్తయిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుకు ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. విగ్రహ నిర్మాణానికే రూ.155 కోట్లు అవసరమని తేల్చారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్ స్మారకాన్ని ఏర్పాటుచేయనున్నారు. దీని కోసం మరో రూ.112.50 కోట్లు అవసరం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో ఎక్కువ శాతం విరాళాల రూపంలో సేకరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విరాళాల సేకరణ కోసం ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
విగ్రహంలోని ప్రత్యేకతలివే..
నీరుకొండపై నిర్మించనున్న ఎన్టీఆర్ విగ్రహానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. గుజరాత్ లోని సర్ధార్ పటేలవ్ విగ్రహంలో వలెనే విగ్రహం లోపల లిఫ్ట్‌లు అమర్చనున్నారు. ఈ లిఫ్టుల ద్వారా సందర్శకులు విగ్రహం పైవరకూ వెళ్లే అవకాశంతో పాటు రాజధాని అమరావతిని వీక్షించొచ్చు. విగ్రహం లోపలే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. చుట్టూ వాటర్‌ఫ్రంట్‌, ఆడిటోరియం, ఫెర్రీ, సెల్ఫీ పాయింట్‌, కేఫ్‌, యాంఫీ థియేటర్‌, మినీ ట్రైన్లతోపాటు స్టార్‌ హోటల్‌, షాపింగ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, రిసార్టులను కూడా నెలకొల్పుతామని..46 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. నీరుకొండను ఒక ద్వీపం మాదిరి అభివృద్ధి పరచాలని చంద్రబాబు సూచించారు. మొత్తం 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అద్భుత పర్యాటక ప్రాంతంగా మలచాలని సూచించారు.
 

 

14:14 - December 12, 2018

హైదరాబాద్ : రాష్ట్ర విభజన తరువాత ఏపీకి చెందిన కాంగ్రెస్ అగ్ర నేతలకు కనుమరుగైపోయారు. 2019 ఎన్నికల సమయంలో మరోసారి వారి రాజకీయ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.  కాంగ్రెస్ మాజీ ఎంపీ సబ్బం హరి రాజకీయ నేతగానే కాకుండా విశ్లేషకుడు అనే పేరుంది. అలాగే ఏవిషయాన్నైనా సూటిగా మాట్లాడటం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ సబ్బంహరి తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా వున్న టీడీపీ తరపున ఏపీ సీఎం ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలను గుప్పించారు. దీనిలో భాగంగా ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతు..తెలంగాణకు చంద్రబాబు మంచి గిఫ్ట్ ఇచ్చారనీ..ఈ నేప‌ధ్యంలో నా మిత్రుడు చంద్ర‌బాబుకు క‌చ్ఛితంగా రిట‌న్ గిఫ్ట్ ఇస్తాన‌ని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చి ప‌ని చేసినప్పడు.. తాము ఏపీకి వెళ్ళి ప‌నిచేయ‌క‌పోతే ఎలా.. మా మిత్రుడు చంద్ర‌బాబు ఫీల్ అవుతాడు.. ఎవ‌రైనా బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన‌ప్పుడు రిట‌న్ గిఫ్ట్ ఇవ్వ‌మా.. నేను కూడా చంద్ర‌బాబుకు రిట‌న్ గిఫ్ట్ ఇవ్వ‌క‌పోతే, మా తెలంగాణ ప్ర‌జ‌లు ఒప్పుకోరు. ఇప్ప‌టికే ఏపీ నుండి ల‌క్ష‌కు పైగానే ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని, తాము ఏపీ రాజ‌కీయాల్లో ఎంట‌ర్ అవ్వాల‌ని చాలా మంది కోరుతున్నార‌ని, ఈ క్ర‌మంలో తెలుగు ప్ర‌జ‌ల ఉన్న‌తి కోసం త్వ‌ర‌లోనే ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అవుతామ‌ని కేసీఆర్ ఇన్‌డైరెక్ట్‌గా సంకేతాలు ఇచ్చారు.
ఈ అంశంపై మాజీ ఎంపీ సబ్బం హరి స్పందిస్తు..చంద్రబాబు గిఫ్ట్ ఇస్తే కేసీఆర్ సీఎం అయ్యారు.. అలాగే కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే బాబు ఏపీలో ముఖ్యమంత్రి అవుతారని సబ్బం వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం ఎన్నికలు వస్తే చంద్రబాబే మరోసారి సీఎం అవుతారని సబ్బం అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల తర్వాత తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి రాబోతున్నట్లు సబ్బం తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది అతి త్వరలో ప్రకటిస్తానని సబ్బం హరి వెల్లడించారు. 
 

Pages

Don't Miss

Subscribe to RSS - cm