CM Yogi Adityanath

12:02 - January 6, 2018

లక్నో : యూపీ అసెంబ్లీ ఎదుట రైతులు వినూత్న ఆందోళనకు దిగారు. రైతులు అసెంబ్లీ ముందు అలుగడ్డలను పారబోసి నిరసన తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అలుగడ్డ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం యూపీ కిలో అలు కు రూ.4 పలుకుతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:54 - August 30, 2017

యూపీ : ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో పిల్లలను కూడా ప్రభుత్వమే చూసుకోవాలని అనేలా ఉన్నారని ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు. గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో పిల్లల మరణాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

21:55 - August 12, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ్‌ దాస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల వరుస మరణాలు గుండెల్ని పిండేస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కి చేరింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్‌ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. గడిచిన 48 గంటల్లోనే 33 మంది చిన్నారులు మృతిచెందారు. గురువారం ఒక్కరోజే 23 మంది చనిపోగా.. శుక్రవారం ఏడుగురు.. శనివారం ఉదయం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నవజాత శిశువులూ ఉన్నారు.ఈ ఘటనపై యోగి సర్కార్‌ విచారణకు ఆదేశించింది. ఆక్సిజన్‌ సప్లయ్‌ గణనీయంగా తగ్గడం వల్లే పిల్లలు చనిపోయారన్న వార్తలను ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎమర్జెన్సీ సిలిండర్లను వినియోగించినట్లు పేర్కొంది. పిల్లల మరణాలకు వేరే కారణాలున్నాయని చెబుతోంది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం బిఆర్‌డి ఆసుపత్రిని సందర్శించింది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆరోగ్యశాఖ మంత్రి సంబంధిత అధికారులు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్‌ సత్యార్థి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేని కారణంగా 30 మంది చిన్నారులు బలయ్యారు. ఇది విషాదం కాదు. నరమేధం. అంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. 70ఏళ్ల స్వాత్రంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా..? అని ప్రశ్నించారు. ఆసుపత్రికి ఆక్సిజన్‌ సిలిండర్లు సప్లయ్‌ చేస్తున్న ప్రయివేట్‌ సంస్థ పుష్పా సేల్స్‌ యజమాని ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత సంస్థ యజమాని మనీష్‌ భండారి ఇంటి నుంచి పారిపోయాడు. బిఆర్‌డి ఆసుపత్రి కొద్ది నెలలుగా ఈ సంస్థకు డబ్బులు చెల్లించకపోవడంతో 70 లక్షలు బకాయిలు పేరుకుపోయాయి. పుష్పా సేల్స్‌ పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆగస్టు 9 నుంచి ఆసుపత్రికి ఆక్సిజన్ల సరఫరా నిలిపివేసింది. ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్‌ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై యోగి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

12:39 - August 12, 2017

హైదరాబాద్: యూపీలో చిన్నారుల మృత్యుఘోష ఆగడంలేదు. ఘోరక్‌పూర్‌లోని బాబా రాందాస్‌ ఆస్పత్రిలో ఆరు రోజుల్లో 63 మంది చిన్నారులు మృతిచెందారు. చిన్నారుల మృతిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీరియస్‌ అయ్యారు. అధికారులతో అత్యవసరభేటీ నిర్వహించారు. మిరికొద్ద సేపట్లో ఆర్యోగ్యశాఖా మంత్రితో కలిసి సీఎం ఆదిత్యనాథ్‌ ఆస్పత్రిని సందర్శిస్తారు. అటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆస్పత్రిని సందర్శించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మందులు సమయానికి అందక పోవడంతోనే పిల్లలు చనిపోతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే కంపెనీకి బాకీలు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌దురు కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. బాబా రాఘ‌వ దాస్ మెడిక‌ల్ కాలేజీకి పుష్పా కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. అయితే బాకీలు చెల్లించ‌కుంటే స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తామ‌ని గ‌తంలో ఆ కంపెనీ హాస్ప‌ట‌ల్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆగ‌స్టు ఒక‌ట‌వ తేదీన ఆ కంపెనీ ఈ అంశంపై లేఖ కూడా రాసింది. పాత బిల్లులు చెల్లించ‌ని కార‌ణంగానే హాస్ప‌ట‌ల్‌కు ఆక్సిజ‌న్ అంద‌లేదా అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. బిల్లుల గురించి తెలిసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఢిల్లీకి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదిత్య‌నాథ్ ఆరోగ్య శాఖ అధికారుల‌కు ఆదేశించారు. 

11:32 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మృత్యుఘోష వినిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి మృత్యుకుహారాలుగా మారాయి. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా 32 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. శుక్రవారం 30 మంది పిల్లలు కన్నుమూయగా శనివారం మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. సీఎం సొంత నియోజకవర్గమైన గోరఖ్ పూర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. రూ. 70 లక్షలు ఆసుపత్రి బకాయి పడిందనే కారణంతో సిలిండర్ల సరఫరాను కాంట్రాక్టర్ నిలిపివేశారు. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. మెదడు వాపు వ్యాధితోనే చిన్నారులు మృతి చెందుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

09:38 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ రోజున యూపీ రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఎగురవేయాలని..జాతీయ గీతం పాడాలని..సమర యోధులకు శ్రద్ధాంజలి ఘటించాలని సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమౌతోంది. ఇప్పటికే ఆయన చేసిన ఆదేశాలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీటికి సంబంధించిన వీడియోలను రికార్డు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తమ దేశభక్తిని శంకించడం వల్లే ఇలాంటి ఆదేశాలు జారీ చేశారని మదర్సా నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. తమ దేశభక్తిని రుజువు చేయడానికి ఎవరూ సర్టిఫికేట్ అవసరం లేదని, ఫొటోలు..వీడియోలు తీయడం రాజకీయమే తప్ప మరొకటి కాదన్నారు. 

16:35 - May 15, 2017

ఉత్తరప్రదేశ్‌ : 17వ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ రామ్‌నాయక్‌ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. గవర్నర్‌పై పేపర్‌ బాల్స్‌ విసురుతూ ప్రతిపక్ష సభ్యులు హంగామా సృష్టించారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సభకు సహకరించాలని స్పీకర్‌ నారాయణ్‌ దీక్షిత్‌ చేసిన విజ్ఞప్తిని విపక్షాలు పట్టించుకోకపోవడంతో సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేపట్టిన పథకాలను గవర్నర్‌ వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో 14 ఏళ్ల తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది. జిఎస్‌టి బిల్లుపై రేపు చర్చ జరగనున్న నేపథ్యంలో యూపీలో శాంతి భద్రతల పరిస్థితిపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎస్పీ ఇదివరకే ప్రకటించింది.

18:43 - April 28, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి మహిళా ఎంపి ఓ పోలీసు అధికారిని బహిరంగంగా హెచ్చరించారు. ప్రవర్తన బాగా లేదన్న కారణంతో గ్యానాంజయ్‌సింగ్‌ అనే పోలీసు అధికారిపై బారాబాంకీ ఎంపి ప్రియాంకా సింగ్ రావత్ మండిపడ్డారు. బతికుండగానే చర్మం వలిచేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోది...యూపీలో యోగి ఉన్నారని...పనిచేసే వారే ఇక్కడ ఉండాలని...ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రియాంకసింగ్‌ చెప్పారు.

 

15:00 - April 17, 2017

లక్నో : ట్రిపుల్‌ తలాక్‌పై స్పందించకుండా మౌనం వహించేవాళ్లు కూడా నేరస్థుల కిందే వస్తారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశమంతా ఒకటే అయినప్పుడు వివాహానికి సంబంధించి ఒకే చట్టం ఎందుకు అమల చేయకూడదని ఆయన ప్రశ్నించారు. మహాభారతంలో ద్రౌపతి వస్త్రాపహరణం జరిగినపుడు సభలో అందరూ మౌనంగా ఉండడాన్ని ఉదహరిస్తూ ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో మౌనంగా ఉండడం నేరం కిందకే వస్తుందని యోగి పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ వల్ల ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ 91వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

06:57 - April 15, 2017

ఉత్తర్ ప్రదేశ్ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి రోజున ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మహనీయుల పేరిట ఉన్న సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై మహనీయుల జయంతి రోజుల్లో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ఉండబోవని సిఎం స్పష్టం చేశారు. అందుకు బదులుగా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను ఆ రోజు విద్యార్థులకు బోధించాలని సూచించారు. చాలా మంది దీన్ని తప్పుగా భావించే అవకాశం ఉందని...మహా పురుషుల కార్యక్రమాలు జరపడం ద్వారా వారి గురించి తెలుసుకునే అవకాశముంటుందని యోగి అభిప్రాయపడ్డారు. యూపీలో 365 రోజుల్లో 192 రోజులు ప్రభుత్వ సెలవుల కిందే పోతున్నాయి. ఆయా కులాలు, మతాల ప్రజలను సంతోషపరచేందుకు మహనీయుల పేరిట సెలవులు ప్రకటించారు. దళితులు, వెనకబడిన తరగతుల అభ్యున్నతికి పాటు పడతామని యోగి చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - CM Yogi Adityanath