comedy

21:15 - October 27, 2017

కమర్షియల్ సినిమాలు అంటూ పక్కదారి పట్టిన రామ్.. నేను శైలజాతో హిట్ ట్రాక్ లోకి తెచ్చాడు, డైరక్టర్ కిషోర్ తిరుమల. అందుకే అదే  నమ్మకంతో అతనికి ఫ్రీడమ్ ఇచ్చి, ప్రొడ్యూసర్ గా కూడా మారి. కిషోర్ తిరుమల డైరక్షన్ లో ఉన్నది ఒకటే జిందగీ సినిమా చేశాడు రామ్.. ఆడియో ఆల్బాం సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..  పైగా హిట్ కాంబినేషన్ కావడంతో, ఆ అంచనాలు మరింత పెరిగాయి..  అలా విడుదలకు ముందే మంచి బస్ క్రియేట్ చేసుకున్న ఉన్నది ఒక్కటే జిందగీ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది..  ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ 
కథ విషయానికి వస్తే... చిన్న తనంలోనే కొన్ని సంఘటనల వల్ల, అభి, వాసు ప్రాణ స్నేహితులుగా మారుతారు. ఫ్రెండ్ షిప్ తరువాతే ఏదైన అనేంత రేంజ్ లో వాళ్ళ ఫ్రెండ్ షింప్ ఉంటుంది.... అయితే అలా ఉన్న వాళ్ల లైఫ్ లోకి, అనుకోకుండా మహా ఎంట్రీ ఇస్తుంది.. ఇద్దరూ ఆమెను ఇష్టపడతారు.. ఇద్దరూ కలిసి ఆమెకు ప్రపోజ్ చేస్తారు... అయితే మహా మాత్రం వాసుని ఇష్టపడుతుంది.. దాంతో వాసు బిహేవియర్ లో ఛేంజ్ రావడంతో.. వాసు అభి విడిపోతారు.. అయితే వాళ్లిద్దరూ తిరిగి కలిసారా లేదా.. వాళ్ల మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయాయా లేదా..;ః? ఫ్రెండ్ షిప్ కి వీళ్ళిచ్చిన కొత్త నిర్వచనం ఏమిటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే...
నటీ నటులు
నటీ నటుల విషయానికి వస్తే.. ఈ సినమా కథను, డైరెక్టర్ ను పూర్తిగా నమ్మిన రామ్ అభి క్యారక్టర్ లో ఓదిగిపోయి నటించాడు. హీరోయిజం చూపించాలి అన్న తపన లేకుండా, సెటిల్ యాక్టింగ్ తో అలరించాడు. రామ్ తన గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాలో ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్స్ లో కూడా చాలా మెచ్యూరిటీ చూపించాడు.. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్.. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కొంచెం పెద్ద తరహా క్యారక్టర్ ఇది. స్వతహాగా మంచి పెర్ఫామర్ కావడంతో, చాలా ఈజీగా మహాపాత్రను ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది.. ఈ మధ్య పెద్దగా హిట్స్ లేని లావణ్య త్రిపాఠి. తనలోని గ్లామరస్ యాంగిల్ పైన ఫోకస్ పెట్టింది. సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి వాసు క్యారక్టర్ చేసిన శ్రీవిష్ణు, ఆ పాత్రలో చాలా నాచ్యూరల్ గా కనిపించాడు.. ఈ సినిమా అంతా ఒకే మూడ్ ను కారీ చేసాడు.. ప్రియదర్శ అక్కడక్కడా తన మార్క్ కామెడీతో నవ్వులు పూయించాడు.. ఇక మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిది మేరకు నటించారు.. 
టెక్నీషియన్స్  
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు రచయితా దర్శకుడైన కిషోర్ తిరుమల, కథ గ్రాఫ్ లో సినిమా టేకాఫ్ లో చాలా వరకు నేను శైలజాను ఫాలో అయ్యాడు అనిపిస్తుంది..  ఎమోషన్స్ ను పండించడంలో సక్సెస్ అయ్యాడు కాని, వాటిని బ్యాలన్స్ చేయడంలో కొంచెం తడబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ చాలా డీసెంట్ గా, క్యూట్ గా అందరికి కనెక్ట్ అయ్యేలా మలచిన డైరక్టర్, సెకండ్ ఆఫ్ లో కిచ్చే సరికి రొటీన్ పాట్రన్ ఫాలో అవ్వడం కాస్త నిరుత్సహ పరుస్తుంది.. డైలాగ్స్ బాగున్నాయి.. కెమేరా విషయానికి వస్తే.. సీనియర్ సినమాటోగ్రాఫర్ అయిన సమీర్ రెడ్డి పూర్తి న్యాయం చేశాడు.. సీన్ లో మూడ్ ను ఎక్కడా.. డీబియేట్ కాకుండా కాపాడాడు..  ఇక ఈ సిమాకు హిట్ ఆల్బమ్ ను అందించిన దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ లో కూడా తన మార్క్ చూపించాడు.. సీన్స్ లో ఫీల్ ను ఎలివేట్ చేయడంలో ప్రధాన్ పాత్ర వహించాడు దేశిశ్రీ.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే ప్రెండ్ షిప్ మూవీల లిస్ట్ లో.వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలవాల్సిన ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లేలో  కొన్ని లోపాల వల్ల పర్వాలేదు అనిపిస్తుంది.. సినిమాకు ఎమోషనల్ కంటెంట్ మల్టీప్లెక్స్ జనాలకు కనెక్ట్ అవుతుంది.. బిసీ సెంటర్స్ లో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.. 

ప్లస్ పాయింట్స్
మెయిన్ లీడ్స్ నటన
ఎమోషనల్ కంటెంట్ 
మ్యూజిక్
సినిమాటోగ్రాఫీ
డైలాగ్స్

మైనస్ పాయింట్స్
రొటీన్ క్లైమాక్స్
బాలెన్స్ లేని స్క్రీన్ ప్లే
స్లో నేరేషన్

రేటింగ్ 2.25/5

17:02 - October 20, 2017

ఎం.ఎఫ్‌ క్రియేషన్స్‌ పతాకంపై అచ్చివర్స్‌ సిగేచర్‌ బ్యానర్‌లో హీరోయిన్‌ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం 'శేఖరం గారి అబ్బాయి'. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు. ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:18 - October 19, 2017
17:04 - October 19, 2017
14:47 - October 8, 2017

టైం అయ్యిందంటే చాలు..టివిల ఎదుట వాలిపోతుంటాం. ఇంట్లో ఏం జరిగినా కొందరు పట్టించుకోరు..ఆ సమయంలో ఎవరైనా వచ్చినా..కరెంటు పోయినా తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంటారు. సీరియల్స్ కి ఆడవారికి..మధ్య విడదీయరాని బంధంగా మారిపోయిందని చెప్పవచ్చు. సీరియల్స్ వచ్చే సమయంలో ఇంట్లో వాళ్లని పట్టించుకోవడం మానేస్తున్నారు కొందరు. కానీ ప్రస్తుతం వస్తున్న సీరియల్స్ ఎంతో ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే ఉదయం నుండి రాత్రి వరకు వివిధ ఛానెల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో హింస..అశ్లీలత..ఇతరత్రా పెచ్చరిల్లుతున్నాయి. ఈ అంశంపై టిడిపి సీనియర్ నేత, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. ఏకంగా సెన్సార్ పెట్టాలంటూ డిమాండ్ చేశారు. దీనితో సీరియల్స్ పై చర్చ జరుగుతోంది. సీరియల్స్ ఒక వ్యసనంలా మారిపోయిందని, ఆదర్శంగా చూపించాల్సిన సీరియల్స్ ప్రస్తుతం లేవనే చెప్పవచ్చని పలువురు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలను క్రూరంగా చూపిస్తున్నారని, ఏకంగా మహిళలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అత్త ఆడపడుచుల వేధింపులు..కోడలికి కష్టాలతో సీరియల్స్ ఏకధాటిగా ప్రసారమౌతున్నాయి. చిన్న పిల్లలతో పగలు ప్రతీకారాలు సీరియల్స్ అవసరమా ? వీటిని బట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు ? ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒక సీరియల్ హిట్ కాగానే అదే కోవలో ఎన్నో సీరియల్స్ ప్రసారమౌతున్నాయి. జనం చూస్తున్నారని సమర్థించుకోవడం కరెక్టేనా ? కాలక్షేపం కోసం సీరియల్స్ చేసే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు. సీరియల్స్ వల్ల సమాజంపై పెను ప్రభావం చూపిస్తున్నాయని, సీరియల్స్ వల్ల పలు కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయని టాక్. ఇదిలా ఉంటే సీరియల్స్ క్రియేటివిటీ రాను రాను తగ్గుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం సినిమాకు పేరడీ పరిశ్రమగా మారిపోయింది. అత్తా కోడళ్ల గొడవలు..వయోలెన్స్ ని చూపిస్తున్నారు. ఒక విధంగా ఆడవాళ్లలో మానిసక అశాంతిని రేపుతున్నారనే చెప్పవచ్చు. పలు సీరియల్స్ లో సినిమా పాటలను వాడేస్తున్నారు. హిట్టైన సినిమాల్లోని పాటలను వీళ్లు మరోసారి వాడుకుంటూ ఆ రోజుకు సీరియల్ ను మమ అనిపిస్తున్నారు. నాణ్యత..నవ్యత లేని సీరియళ్లకు విలువ లేకుండా పోయింది. 

11:16 - September 21, 2017


హైదరాబాద్ : ప్రముఖ కార్టూనిస్టు మోహన్ (63) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గతకొంతకాలంగా యాన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఈనెల 7న కేర్ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని కాసేపట్లో ప్రెస్ క్లబ్ కు తీసుకురానున్నారు. 1952 డిసెంబర్ 21 న ఏలూరులో మోహన్ జన్మించారు. పలు దిన, వార పత్రికలలో మోహన్ పని చేశారు. పొలిటికల్ కార్టూనిస్టుగా పలు పత్రికల్లో పని చేశారు. పొలిటికల్ లో ప్రత్యేక శైలిని పరిచయం చేశారు. సిద్ధాంత నిబద్ధత కలిగినవాడిగా 
గుర్తింపు పొందారు. మోహన్ మృతిపై పలువురు సంతాపం తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
మోహన్ చాలా గొప్ప వ్యక్తి అని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి కొనియాడారు. 

 

14:55 - August 30, 2017

ఒకే ఒక సినిమాతో స్టార్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లిన డైరెక్టర్ మరో స్టోరీతో రాబోతున్నాడు. ఈ సారి మరో సినిమా స్క్రిప్ట్ ని లాక్ చేసుకున్నాడు. విశేషం ఏంటంటే ఈ సారి టోటల్ కామెడీ తో రాబోతున్నాడు. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు కూడా. కొత్త డైరెక్టర్ గా ఫస్ట్ స్టెప్ 'పెళ్లి చూపులు' సినిమాతో టాప్ లిస్ట్ లో చేరిపోయాడు తరుణ్ భాస్కర్. హీరోగా 'విజయ్ దేవరకొండ' కూడా 'పెళ్ళిచూపులతో' హిట్ హీరో జాబితాలో చేరిపోయాడు. రెగ్యులర్ మూస కథల్లా కాకుండా డిఫరెంట్ జోనర్ లో స్టోరీ సెలక్షన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తూ తరుణ్ భాస్కర్ మరో సినిమాతో రాబోతున్నాడు.

'పెళ్లి చూపుల్లో' కూడా మంచి లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీకి హాస్యాన్ని జోడించిన తరుణ్ ఈసారి మరో కామెడీ స్క్రిప్ట్ తో రాబోతున్నాడు. 'పెళ్లి చూపులు' మూవీతో దర్శకుడు తరుణ్ భాస్కర్ సాధించిన సక్సెస్ చిన్నదేమీ కాదు. చిన్న సినిమాలకు ఇది ట్రెండ్ సెట్టర్ అనాల్సిందే. తన రెండో సినిమా విషయంలో కూడా అంతా తన స్క్రిప్ట్ ప్రకారమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఈ దర్శకుడు ఇచ్చిన క్యాస్టింగ్ కాల్ కు 1100కు పైగా ప్రొఫైల్స్ వచ్చాయట. ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదని.. అయితే అక్టోబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించి.. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేస్తామని చెబుతున్నాడు తరుణ్ భాస్కర్.

17:16 - July 26, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన చిత్రాల్లో ఏదో ఒక స్టైల్ ను పరిచయం చేస్తుంటాడు. సినిమా..సినిమాకు వైవిధ్యంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. పాత్ర పాత్రకూ గెటప్ మారుస్తూ స్టైలిష్ స్టార్ అనిపించుకుంటున్న నటుడు 'బన్నీ'. ఇటీవలే ఆయన నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' సినిమాలో నటించాడు. ఇందులో బ్రాహ్మణ యువకుడిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన పాత్ర కోసం బన్నీ కొన్ని రోజుల పాటు బ్రాహ్మణుల దగ్గర శిక్షణ తీసుకున్నాడని టాక్.

ఈ చిత్ర సక్సెస్ అనంతరం మరో చిత్రం కోసం 'బన్నీ' ఇప్పటి నుండే వర్కవుట్ చేస్తున్నాడంట. వక్కంతం వంశీ దర్శకత్వంలో ' నా పేరు సూర్య'..నా ఇల్లు ఇండియా పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం తగ్గట్టు తన శరీరాన్ని మార్చుకోవడానికి..ఆహార్యం మార్పు కోసం శిక్షణ తీసుకోవాలని అనుకున్నాడంట. అందుకోసం అమెరికాకు బన్నీ వెళ్లనున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

13:54 - March 22, 2017

సినిమాల్లో 'ఎల్బీ శ్రీరాం' తెలియని వారుండరు. ఎందుకంటే ఆయా సినిమాల్లో తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. మరి ఆయన 'పక్షి' తీర్థం పుచ్చుకోవడం ఏంటీ ? పక్షి అని ఏదైనా పార్టీ పెట్టారా ? లేక దానిపేరు మీదున్న పార్టీలో చేరారా ? అని అనుకోకండి. రచయితగా పరిశ్రమలోకి వచ్చి, తరువాత 'చాలాబాగుంది' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యి పాతికేళ్లకు పైగా సినిమా పరిసమలో కొనసాగుతున్నాడు ఎల్బీ శ్రీరాం. ఇటీవలే ఆయన ఎల్ బి క్రియేషన్స్ బ్యానర్ పై షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ ఖాతా తెరిచారు. ‘పక్షి' తీర్థం అంటే ట్విట్టర్ ఖాతా తెరిచారని అర్థం. మార్చి 18న ట్విట్టర్ ఖాతా తెరిచిన ఎల్బీ శ్రీరామ్.. తనదైన రచనా శైలిలో ట్వీట్ చేశారు. ‘'ఇ-ప్పు-డే' కొత్త రెక్కలతో 'L'B-oard పెట్టుకుని ఈ 'పక్షి'తీర్థానికి ఒచ్చేను వసంతానికి ముందే ""కో"" అని కూస్తూ.....!!’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కొంతమంది ట్విట్టర్ యూజర్లు స్వాగతం పలికారు. మరికొంతమంది ఫన్నీగా ట్వీట్ చేశారు.

20:08 - May 15, 2016

చలాకీ చంటి...జబర్ధస్త్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కమెడియన్. ఇతనికి ఇటీవలే నిశ్చితార్థం అయ్యింది. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో అన్ని వర్గాలనూ ఆకట్టుకోవడంలో చలకీ చంటీ ఎప్పుడూ ముందుంటాడు.. ఆరోగ్యకరమైన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఆయన ఇంకా బేచిలర్ గా ఉండటంపై కూడా ఈ ప్రోగ్రామ్ లో అనేకసార్లు సెటైర్లు పేలాయి. ఈ సందర్భంగా టెన్ టివితో చలాకి చంటి ముచ్చటించాడు. పలు విషయాలు..అభిప్రాయాలు తెలిపాడు. అంతేగాక చంటితో పలువురు కమెడియన్లు కూడా మాట్లాడారు. ఆ విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - comedy