common man

14:31 - February 15, 2018

అనంతపురం : జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లో యువకుడిపై ఆర్పీఎఫ్ పోలీసులు ప్రతాపం చూపారు. ట్రైన్ కదులుతున్న సమయంలో స్లీపర్ కోచ్ ఎక్కాడని యువకుడిని పోలీసులు చితకబాదారు. యువకుడు బెంగళూరు నుంచి కాచీగూడ వెళ్లే రైలులో యువకుడు అనంతపురంలో ఎక్కడానకి ప్రయత్నించాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:38 - December 31, 2017

సంగారెడ్డి : జిల్లా లోని సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయం... నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. 25 ఏళ్లుగా అద్దెభవనంలో ఈ కార్యాలయం నడుస్తోంది. ఇరుకైన గదుల్లో ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడికి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఉదయం వచ్చిన వారు తమ పని పూర్తవ్వాలంటే రాత్రి వరకూ వేచి ఉండాల్సిందే. ఇక టాయిలెట్లు, తాగునీరు, పార్కింగ్ ... సౌకర్యాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. కనీసం వచ్చినవారు కూర్చోవడానికి కూడా చోటు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తున్నా ఇక్కడ మాత్రం కనీస సదుపాయాలు కనిపించవు.

వచ్చిన వారికి నరకం...
హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న పటాన్ చెరు, కొల్లూరు, తెల్లాపూర్, అమీన్‌పూర్ లాంటి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తుంటారు. రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరుగుతున్నాయి. భవనం ఇరుకుగా ఉండటం.. వచ్చిన వారు క్రమ పద్ధతి పాటించకపోవడంతో తోపులాటలు జరుగుతూనే ఉంటాయి. అధికారులు పెద్ద బిల్డింగ్ తీసుకోవడంతో పాటు.. వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేస్తే బావుంటుందని మహిళలు అంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చిన వారంతా నరకం చూస్తున్నామని మరికొందరు వాపోతున్నారు. ఉదయం వస్తే.. ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతోందని చెబుతున్నారు. కార్యాలయంలో ఎదురౌతున్న ఇబ్బందులపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో మెసేజ్‌ పెట్టినా.. ఎమ్మెల్యేకు విన్నవించినా స్పందించలేదని హైదరాబాద్‌ నుంచి వచ్చిన శ్రీనివాస్‌గౌడ్ చెబుతున్నారు.

గత 25 ఏండ్ల నుండి ఇదే భవనంలో
గత 25 ఏండ్ల నుండి ఇదే భవనంలో కార్యాలయం నడుస్తోంది. గతంకంటే ఇటీవలకాలంలో రిజిస్ట్రేషన్లు పెరిగిపోయాయి. పెరిగిన అవసరాలకు అనుగుణంగా కార్యాలయంను మార్చుకోకపోతే .. ఇంత రుసుం చెల్లిస్తూ ఇబ్బందులు పడాల్సిందేనా? అని కార్యాలయానికి వచ్చినవారు ప్రశ్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మొత్తంలో పదిహేను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా వీటికి ఏడాదికి సుమారుగా 250 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఒక్క సంగారెడ్డి కార్యాలయానికి 150 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. మరి ఇంత ఆదాయం వచ్చే కార్యాలయంలో ప్రజలు ఇన్ని కష్టాలు ఎందుకు పడాల్సి వస్తోందని ప్రశ్నిస్తే రిజిస్ట్రార్ ఏం చెప్పారో చూడండి. రిజిస్ట్రార్ రమేష్ రెడ్డి చెప్పిన ప్రకారం త్వరితగతిన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలిస్తే అటు ప్రజలతో పాటు.. ఇటు సిబ్బందికి కూడా ఇబ్బందులు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. 

18:59 - November 20, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నానాజీ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా దార్లజగన్నాధపురంకు చెందిన నానాజీ అదే గ్రామానికి చెందిన సూరిబాబుపై ఫిర్యాదు చేయడానికి సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చాడు. అకస్మాత్తుగా కార్యాలయం ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్‌కు సమస్యను విన్నవించుకోక ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

07:47 - September 26, 2017

నోట్ల రద్దు తో జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని, కేవలం జీడీపీ కాదు జాతీయ ఆదాయం కూడా తగ్గిందని, మనం ఖర్చు పెడుతున్న విదేశి మారకద్రవ్యం మూడోంతులు చమురు పెట్టాలని కానీ చమురు ధర భారీగా తగ్గినా విదేశి మారకద్రవ్యం ఖర్చు ఇప్పటికి కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని, దేశా ఎకానమిక్ పరిస్థితి బాగాలేదని, దేశ ఆర్థిక పరిస్థితి నోట్ల రద్దు వల్ల దిగజారిందని, జీఎస్టీతో ప్రజలపై భారం తప్ప ఒరిగింది ఏమి లేదని దీ హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

17:56 - September 10, 2017

హైదరాబాద్ : దేశంలో 80 శాతం ఉన్న సామాన్య ప్రజలపై జీఎస్టీ భారం పడుతోందని సీపీఐ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నారాయణ అన్నారు. హైదరాబాద్‌ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జీఎస్టీ పై వామపక్షాలు సమావేశం నిర్వహించారు. కేవలం కార్పొరేట్‌ సంస్థలకు మాత్రమే జీఎస్టీ భారం లేదని నారాయణ అన్నారు. బీడీ, వస్త్ర పరిశ్రమ, చేనేత రంగాలపై జీఎస్టీ భారం సరైంది కాదన్నారు. జీఎస్టీ వలన కలిగే ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకురావడానికి అఖిలపక్షాన్ని పిలవాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. 

21:38 - September 4, 2017

అహ్మదబాద్: గుజరాత్‌ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోది సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల పేదలు, రైతులే నష్టపోయారని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ధ్వజమెత్తారు. గుజరాత్‌ మోడల్‌ తరహా అభివృద్ధి పనిచేయలేదని...దీనివల్ల యువత, రైతులు, చిన్న వ్యాపారులకు ఎలాంటి లబ్ది చేకూరలేదని చెప్పారు. మోది బడా వ్యాపారుల కోసమే పనిచేస్తున్నారని సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పార్టీని సమాయత్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికే టికెట్ కేటాయిస్తామని కార్యకర్తలకు తెలిపారు.

20:02 - September 4, 2017

తొమ్మిదినెలల క్రితం భారీ ప్రకటనలు చేశారు..దేశమంతటికీ క్యూలో నిలబెట్టారు..కారణాలు బహుభారీగా చూపెట్టారు..కానీ సీన్ రివర్సైంది. ఇప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మాటలతో విషయం స్పష్టంగా అర్ధమౌతోంది. ఏ నిర్ణయాల వెనుక ఏ ఉద్దేశాలున్నాయో? ఇంతా చేసి ఎందుకు నోరు మెదపటం లేదో అర్ధమౌతుంది. డీ మానిటైజేషన్ తెరవెనుక అంశాలేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టొరీ.. ఏం చెప్పారు? ఏం జరిగింది? నోట్లరద్దు దేశానికి ఏం మిగిల్చింది? సామాన్యుడికి ఏ అనుభవాలిచ్చింది? ఎంత నల్లధనం వెలికి తీశారు? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్తున్నాయి? జైట్లీ వాదనల్లో అసంబద్ధత ఎంత? మోడీ సర్కారు డీమానిటైజేషన్ తో తప్పులో కాలేసిందా? తగ్గిన జీడీపీ గణాంకాలేం చెప్తున్నాయి? ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఏం చెప్తున్నారు.. ?నల్లధనం ఎక్కడున్నా తీసుకొస్తాం..అందరి ఎకౌంట్లలో పంచేస్తాం.. మోడీ సర్కారు మూడేళ్ల క్రితం మీటింగుల్లో ఊదరగొట్టిన మాట. నల్లధనం అడ్రస్ ఆధారాలతో సహా వెల్లడైనా పట్టించుకోలేదు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:38 - July 1, 2017

ఢిల్లీ: జీఎస్టీ అమలుతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. జీఎస్టీపై పన్ను ఎగవేతదారులు తప్పా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త సంస్కరణలు ప్రారంభమైనపుడు ఒడిదుడుకులు తాత్కాలికమేనని.. దీర్ఘకాలికంగా సామాన్య జనానికి మంచి జరుగుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనేక అంశాలను '10టివి' తో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:39 - July 1, 2017

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌...కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి... మన రాష్ట్రానికి నష్టమయ్యే జీఎస్టీ విధానాన్ని సవరించే విధంగా కృషి చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ వల్ల టెక్స్‌టైల్స్‌, గ్రానైట్‌, బీడీ కార్మిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ... ఈ రంగాలపై పన్ను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వెంటనే ఈ రంగాలపై పన్ను టారిఫ్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ... సీపీఎం ఆధ్వర్యంలో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నట్టు తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

00:14 - July 1, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - common man