congress leader

10:25 - December 4, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. డిసెంబర్ 3వ తేదీ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈ తెల్లవారుజామున బలవంతంగా అరెస్ట్ చేయడం కొడంగల్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఏసీబీ దాడులు సమయంలోను..గతంలో నోటుకు నోటు కేసులోను  రేవంత్ అరెస్ట్ కాగా ఇప్పుడు తాజాగా కేసీఆర్ సభను అడ్డుకుంటామనీ..నేడు కోస్గిలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని, సభను జరగనివ్వబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కోస్గిలో కేసీఆర్ సభను  పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ తో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డిని, ఇతర ప్రధాన అనుచరులను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు. 
 

20:44 - November 3, 2018

సిద్ధిపేట : టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరతారనీ..దీని కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో వున్నారంటే కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించమని మంత్రి హరీశ్ రావు తనకు ఫోన్ చేశారంటూ వంటేరు చేసిన  వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు వంటేరు తనకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది ప్రతాప్ రెడ్డి అని నిప్పులు చెరిగారు. గోబెల్స్ ప్రచారాలతో రాజకీయాలు నడవవని, అసహనంతో జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image result for harishrao and vanteruగజ్వేల్ ప్రజలకు ప్రతాప్ రెడ్డి ఓటమి భయంతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటు మండిపడ్డారు.వంటేరుకు గజ్వేల్ లో డిపాజిట్లు కూడా దక్కవనీ..అప్పటి వరకూ తాను గజ్వేల్ లోనే ఉంటానని అన్నారు. తన పుట్టుక, చావు టీఆర్ఎస్ లోనే అని, బతికినంత కాలం తన జీవితం కేసీఆర్ కే అంకితమని హరీశ్ రావు మరోసారి స్పష్టం చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ది ముగిసన అధ్యాయమని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో వంద సీట్లు సాధించి తాము అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని, రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు.
 

07:52 - October 12, 2018

హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి నాగం జనార్ధనరెడ్డి కుమారుడు నాగం దినకర్ రెడ్డి (46) గురువారం రాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన అక్టోబరు 4న జూబ్లీ హిల్స్ లోని  అపోలో ఆసుపత్రిలో చికిత్సకొసం చేరారు. ఊపిరితిత్తుల మార్పిడికి ప్రయత్నాలు జరుగుతుండగానే దినకర్ రెడ్డి మరణించటంతో నాగం కుటుంబం విషాదంలో మునిగిపోయింది.  

 

14:08 - October 6, 2018

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత డీకే అరుణ ఫైర్ అయ్యారు. వనపర్తిలో తెరాస ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్‌ తనపై చేసిన ఆరోపణలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. కేసీఆర్‌ మాటల్లో ఓటమి భయం కనబడుతోందన్నారు. సమాధానం చెప్పలేకే కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఉద్యమ రోజులు అనుకుంటున్నారా? అని నిలదీశారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.

’నాలుగేళ్ల నుంచి నా గురించి ఏమీ మాట్లాడని మీరు ఇప్పడు నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? మీ ఇంట్లో మహిళలు లేరా? జోగులాంబ అమ్మవారు కేసీఆర్‌ను తప్పక శిక్షిస్తుంది అని అన్నారు. తెలంగాణలో పుట్టిన మీకు ఇంత నీచ సంస్కృతి ఎలా వచ్చిందని నిలదీశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని సూచించారు. బతుకుదెరువు, కుర్చీ కోసం ఉద్యమం పేరుతో ప్రజలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌ దొంగ దీక్ష గురించి నిమ్స్‌కు వెళితే తెలుస్తుందని అన్నారు.

 

10:12 - September 27, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు రేవంత్ రెడ్డి ఇళ్లపై గురువారం ఉదయం దాడులు జరపడం ఆయన వర్గీయుల్లో కలవరం మొదలైంది. తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్న రేవంత్ రెడ్డి గురువారం తన ప్రచారాన్ని ప్రారంభించాల్పి ఉంది. ఈ లోపే ఐటీ దాడులు జరగడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

12 మంది సభ్యుల ఐటీ బృందం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలోనూ.. కోడంగల్‌లోని నివాసంతో పాటు, బంధువుల ఇళ్లలోనూ డాడులు చేపట్టారు. ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదు. అయితే తన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసే అవకాశం ఉందని గతంలో అన్నట్టు ఆయన అనుచరులు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఇటీవలే ఆయన ఆరోపించిన విషయం విదితమే. దాడుల్లో ఏమి లభించిందీ ఇంకా తెలియరాలేదు. దీనిపై ఐటీ అధికారులు సాయంత్రం లోపు ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

17:40 - February 15, 2018

కామారెడ్డి : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ 61వ జన్మదినోత్సవాన్ని కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మకుంట కాలనీలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు చేయించుకున్నవారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. 

19:00 - February 3, 2018

కరీంనగర్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల్లో ఫార్మ డీ పట్టభద్రులకు అవకాశం కల్పించాలని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద ఫార్మ డీ విద్యార్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పొన్నం మద్దతు ప్రకటించి.. దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మ డీ పట్టభద్రులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

 

18:10 - January 20, 2018

హైదరాబాద్ : స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్‌ దక్కిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ తీవ్రంగా విమర్శించారు.  జడ్పీటీసీ మొదలు శాసనసభ, క్యాబినెట్‌ దేనికీ విలువలేకుండా పోయిందన్నారు. కేవలం ఆయన కుటుంబంలోని నలుగురి కనుసన్నల్లోనే అన్ని సాగుతున్నాయంటూ ఉత్తమ్ దుయ్యబట్టారు.

 

17:47 - January 20, 2018

హైదరాబాద్ : తెలంగాణలో చట్ట విరుద్ధంగా నియమించబడిన ఆరుగురు పార్లమెంటు సెక్రటరీలను అనర్హులుగా ప్రకటించాలని సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ న్యాయస్ధానాలను తప్పు దోవ పట్టించి తన పార్టీలోని నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించారని ఆయన విమర్శించారు. గతంలో చట్ట విరుద్ధంగా నియమించిన పార్లమెంటు సెక్రటరీలను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని కేసీఆర్ బేఖాతరు చేస్తూ మరో 21 మందికి క్యాబినెట్ హోదా ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

 

21:12 - January 12, 2018

హైదరాబాద్ : విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల అవినీతి ఆరోపణలపై సీబీఐ లేదా సీవీసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు వెనక్కతగ్గిన టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిపై కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి మండిప్డడారు. విద్యుత్‌ ప్రాజెక్టు టెండర్ల కాంట్రాక్టుల్లో ముఖ్యంత్రి కేసీఆర్‌కు భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరూపించకపోతే హైదరాబాద్‌ అబిడ్స్‌ చౌరాస్తాలో ముక్కు నేలకు రాస్తానని రేవంత్‌ మరోసారి సవాల్‌ విసిరారు. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణ టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు. దీనిని రేవంత్‌ స్వీకరించడంతో ఆత్మరక్షణలో పడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. రేవంత్‌కు విశ్వసనీయతలేదంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ చర్చకు రావాలని మెలిక పెట్టారు. అయినా రేవంత్‌రెడ్డి వెనక్కితగ్గకుండా బహిరంగ చర్చకు సిద్ధమై, తన అనుచరులతో కలిసి అసెంబ్లీ సమీపంలోని గన్‌ పార్క్‌ వద్దకు వచ్చారు. విద్యుత్‌ ప్రాజెక్టుల టెండర్లలో అవినీతి బయటపడుతుందనే భయంతోనే బహిరంగ చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ నేతలు తోక ముడిచారని రేవంత్‌ మండిపడ్డారు. టెండర్లు పిలువకుండా 30,400 కోట్ల పనులను బీహెచ్‌ఈఎల్‌కు ఎలా అప్పగించారాలో టీఆర్‌ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్న రేవంత్‌రెడ్డి, వీటిని ప్రజల ముందువుంచి, ముఖ్యమంత్రిని ప్రగతి భవన్‌ నుంచి చర్లపల్లి జైలుకు పంపిస్తాని హెచ్చరించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - congress leader